సింక్‌ వద్ద దోమలు, బొద్దింకలు వస్తున్నాయా? ఇలా చేయండి | Simple Kitchen Tips To Follow That Make Ur Work Easy | Sakshi
Sakshi News home page

Kitchen Tips: సింక్‌ వద్ద దోమలు, బొద్దింకలు వస్తున్నాయా? ఇలా చేయండి

Published Fri, Oct 27 2023 10:11 AM | Last Updated on Fri, Oct 27 2023 10:11 AM

Simple Kitchen Tips To Follow That Make Ur Work Easy - Sakshi

ఇంటిప్స్‌ 

గ్లాసు నీళ్లల్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కను ముక్కలుగా తుంచి వేయాలి. దీనిలో బోరిక్‌ యాసిడ్‌ రెండు టీ స్పూన్లు వేసి మూడు గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ నీటిని సింక్‌లో పోస్తే బొద్దింకలు రావు.
► నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తుడవాలి. వీటికి కొద్దిగా నూనె రాసి టిష్యూపేపర్‌ వేసిన బాక్స్‌లో పెట్టి రిఫ్రిజిరేటర్‌లో పెడితే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి.
► గ్లాసు నీళ్లలో కొద్దిగా వెనిగర్‌ వేసి టూత్‌బ్రష్‌లను నానబెట్టాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే టూత్‌ బ్రష్‌లు శుభ్రపడతాయి.
► నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు, వెనిగర్‌ను సమపాళ్లల్లో తీసుకుని ఐస్‌క్యూబ్‌ ట్రేలో పోసి రాత్రంతా రిఫ్రిజిరేటర్‌ లో పెట్టాలి. ఉదయం ఈ ఐస్‌క్యూబ్‌ను తీసి దుర్వాసన వస్తోన్న సింక్‌లో వేస్తే దుర్వాసన తొలగిపోతుంది. 
► టొమాటో చుట్టూ  గాటు పెట్టి మరుగుతున్న నీటిలో వేయాలి. నిమిషం తరువాత తీసేసి ఐస్‌వాటర్‌లో వేయాలి. తరువాత టొమాటోను పట్టుకుని లాగితే తొక్క సులభంగా వచ్చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement