మనం చేసే కొన్ని రెసిపీలు ఎంత బాగా చేసినే ఏదో లోపంతో సరిగా రావు. ఒక్కోసారి బాగా వచ్చిన వంటకం కూడా దెబ్బేస్తుంది. అలాంటప్పుడూ పెద్దలు చెప్పే కొన్ని చిట్కాలు ఫాలో అయితే మన కుటుంబసభ్యులకు ఎలాంటి ఢోకా లేకుండా మంచి రుచికరంగా వండిపెట్టొచ్చు. ఆ వంటింటి చిట్కాలు ఏంటో చూద్దాం!.
ఇలా చేయండి..
- గోరు వెచ్చని పాలల్లో రెండు టీస్పూన్ల పెరుగు వేసి కలపాలి. పాలల్లో ఈ మిశ్రమం వేసి, వడలను వేసి ఐదారుగంటలు నానపెడితే పెరుగు చక్కగా తోడుకుంటుంది. ఇప్పుడు ఈ వడలకు తాలింపు వేసి తింటే పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి. పెరుగు లేనప్పుడు ఇలా చేస్తే పెరుగు పులవకుండా పెరుగు వడలు రుచిగా వస్తాయి.
- వేడినీళ్లలో బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో టూత్ బ్రష్‌ను మునిగేలా వేస్టి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత సాధారణ నీటితో కడిగితే బ్రష్‌లో ఉన్న మురికి, బ్యాక్టీరియా పోతుంది. పదిరోజులకొకసారి బ్రష్‌లను ఇలా శుభ్రం చేసుకుంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
- రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను, తరువాత గుడ్లసొనలో ముంచి డీప్‌ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది.
- అప్పడాలు, వడియాలు, పల్లీలు, కరివేపాకు వంటివి నూనె ఎక్కువ పీల్చకుండా డీప్‌ఫ్రై చేయాలంటే.. ముందుగా వాటిని ఇనుప జాలీ గరిటలో వేసి గరిటను కాగిన నూనెలో ముంచుతూ పైకి లేపుతూ ఫ్రై చేయాలి. ఇలా చేస్తే నూనె తక్కువగా పీల్చడంతో పాటు క్రిస్పీగా, రుచిగా వస్తాయి.
- పకోడి, బజ్జీల పిండి కలిపేటప్పుడు పదార్ధాలన్నివేసి కలుపుకున్నాక... చివరల్లో వంటసోడా కలపాలి. ఇలా కలపడం వల్ల బజ్జీలు నూనె తక్కువగా పీల్చడంతోపాటు మంచి రంగులో కనిపిస్తాయి.
(చదవండి: పచ్చసొన తినకపోతే ఏం జరుగతుందో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment