చిచ్చా.. జర పాన్‌ మానేయ్‌: కేటీఆర్ | Dattatreya, 3 Telangana Ministers get relief in rail roko case | Sakshi
Sakshi News home page

చిచ్చా.. జర పాన్‌ మానేయ్‌: కేటీఆర్

Published Thu, Nov 24 2016 11:36 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

చిచ్చా.. జర పాన్‌ మానేయ్‌: కేటీఆర్

చిచ్చా.. జర పాన్‌ మానేయ్‌: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం నాటి కేసుకు సంబంధించి బుధవారం బోయిగూడ రైల్వే కోర్టులో హాజరయ్యేందుకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు పద్మారావు, కేటీఆర్‌ సహా పలువురు వచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. పద్మారావును కేటీఆర్‌ చిచ్చా అని పిలుస్తున్నారు. కేటీఆర్‌ను పద్మారావు రామ్‌ అని సంబోధిస్తారు.
 
వీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నా ‘చిచ్చా.. జర పాన్‌ , జర్ధాలు తినడం మానేయ్‌’ అని కేటీఆర్‌.. పద్మారావుకు సలహా ఇస్తారట. కోర్టు ఆవరణలోనూ కేటీఆర్‌ ఇదే విధంగా పద్మారావుకు సూచించారు. దీనికి స్పందించిన పద్మారావు ‘రామ్‌.. నీకు ఏ అలవాటు లేకే గదా! నన్ను పాన్‌  మానేయ్‌ అంటున్నావ్‌. నువ్వు కూడా ఈ చాక్లెట్లు తినూ..’ అంటూ కేటీఆర్‌కు ఇవ్వబోయారు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement