padmarao
-
అవకాశవాది, అబద్దాలకోరు, కుట్రదారు చంద్రబాబే
పొన్నూరు: సీఎం వైఎస్ జగన్ ఐదేళ్ల కిందట ప్రవేశపెట్టిన మేనిఫెస్టో బడుగు, బలహీన వర్గాలకు ఆరి్థకంగా తోడ్పాటునందించిందని, ఎన్నికలకు ముందు బూటకపు మేనిఫెస్టోలు ప్రకటించడంలో చంద్రబాబు ఘనత సాధించాడని దళిత ఉద్యమకారుడు, కవి డాక్టర్ కత్తి పద్మారావు అన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలన, 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పాలనలో ఉన్న వ్యత్యాసంపై పొన్నూరులోని ఆయన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడారు. అధికార దాహంతో చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు.అంతటి కుట్రపూరితమైన వ్యక్తి దేశంలో మరొకరు ఉండడని చంద్రబాబు అవలంబిస్తున్న వైఖరే నిరూపిస్తోందన్నారు. నీచ నామవాచకాలలో (విషయుక్తమైన మనిషి, అవకాశవాది, కుతంత్రుడు, అబద్ధాలకోరు, ద్వేషం మూర్తీభవించిన రూపం)లో ఘనత సాధించిన నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమంతో వృద్ధుల్లో మరణాలు తగ్గాయని అభిప్రాయపడ్డారు. ప్రతినెలా 1న ఇంటికి పింఛన్ అందించడం గొప్ప విషయమన్నారు. పచ్చ మీడియా, పెత్తందార్లు కలసి ఉచిత పథకాలపై విష ప్రచారం చేసి వాటిని ఆపాలని చూశారని విమర్శించారు.14 ఏళ్లు పాలన సాగించిన చంద్రబాబు ఏమీ చేయలేని స్థితిలో, జగన్ పథకాలనే అనుసరిస్తున్నాడనడంలో ఆశ్చర్యం లేదన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులైన పేదలను గుర్తించి మంజూరు చేసిన సంక్షేమ పథకాలను లబి్ధదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్న ప్రభుత్వ చర్యలతో పేదలు హర్షిస్తున్నారని తెలిపారు. వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం ఏపీకి శుభపరిణామమని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు.ప్రభుత్వ వైద్యశాలలను అభివృద్ధి చేయడంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో నాణ్యత ప్రమాణాలతో కూడిన వైద్యం ఇంటి వద్దనే అందించడంలో జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రజలకు ఆరోగ్య భరోసా లభించిందన్నారు. పేదల మనుగడకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చంద్రబాబు ఉచితమని చెప్పడం అవివేకమని విమర్శించారు. ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో చంద్రబాబు కూటమి రెట్టింపు ఉచితాలతో ప్రవేశపెట్టిన మేనిఫెస్టో సరైంది కాదని పేర్కొన్నారు.జనరంజక పాలనతో ప్రజలను మెప్పించి సీఎం కుర్చీ సొంతం చేసుకోవాలిగానీ, సీఎం జగన్‌ను నెట్టేసి చంద్రబాబు ఆ కుర్చీలో కూర్చోవాలనుకోవడం కక్ష పూరిత వైఖరిని ప్రతిబింబిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రవర్తన కారణంగా తెలుగువారి జీవన విధానం దెబ్బతింటోందని అన్నారు. సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని తెలిపారు. -
పేదల అక్షరంపై కక్ష
నిరుపేదల చదువుపై ఇంకా పెత్తందార్ల కక్ష తీరడం లేదు. జగన్ ప్రభుత్వంలో వారికి ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోనూ ఏపీ విధానాలపై ప్రశంసలు కురిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సైతం ఇక్కడి విద్యా విధానంలో తెచ్చిన సంస్కరణలను వేనోళ్ల పొగుడుతుంటే వీరికి గిట్టడం లేదు.ఉన్న పళంగా వారికి మాతృభాషపై ప్రేమ పుట్టుకొచ్చేసింది. దానిని జగన్ తొక్కేస్తున్నారంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏదోలా జగన్‌ను ఇరుకున పెట్టాలని వారు లేనిపోని కుట్రలు చేస్తున్నారు. బీజేపీ అగ్రనేత అమిత్ షా సైతం ఇక్కడి పచ్చనేతల స్క్రిప్టునే వల్లె వేస్తూ నిరుపేదల చదువుపై కుట్రకు పన్నాగం పన్నుతున్నారు. –సాక్షి, అమరావతి బడుగులు ఎదుగుతున్నారనే బాబు భయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన విద్యా సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తుండటంతో బడుగులు ప్రపంచ మానవులుగా ఎదుగుతుండటంతో చంద్రబాబుకు భయం పట్టుకుంది. అందుకే కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెద్దలు రాష్ట్రానికి వచ్చినప్పుడు మన రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు అడగడం మానేసి ఇంగ్లిష్‌పై విషం నూరిపోశారు.చంద్రబాబు మొదట్నుంచి కులవాది, తన కుల ఆధిపత్యం కోరుకునే వ్యక్తి. అందుకే తన సామాజికవర్గం వారే ఇంగ్లిష్ చదువులతో విదేశాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. పేద పిల్లలు మాత్రం ఇక్కడే అరకొర వేతనాలతో ఉండిపోవాలన్నది ఆయన దురుద్దేశం. విభజనాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఐదేళ్లపాటు నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించి, వారి ఆర్థిక సహకారంతో రాజకీయం నడిపారు. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విద్యా వ్యవస్థను కులతత్వ పూరితంగా మార్చేశారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇంగ్లిష్ చదువులను దూరం చేసే కుట్ర చేశారు. సీఎం వైఎస్ జగన్ మాత్రం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారిగా బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు అందించారు. ఇంగ్లిష్ మీడియంను ప్రోత్సహించారు. ఖరీదైన బైజూస్ కంటెంట్‌ను ఉచితంగా అందించారు. ట్యాబ్‌లు ఇచ్చారు. విశ్వవిజ్ఞానాన్ని అందుకునేలా పేద పిల్లలను తీర్చిదిద్దారు. దీనిపై పెత్తందార్లు కుయుక్తులు పన్నడం సరికాదు. ఇంగ్లిష్ మీడియం పెత్తందారులకే పరిమితమా? పేదలకు ఇంగ్లిష్ వస్తే ఎదుగుతారని భయమా..తెలుగు కోసం కాదు విద్యా వెలుగు అడ్డుకోవాలనే.. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కి దీటుగా జగన్ అభివృద్ధి చేస్తున్నారు. డిజిటల్ విద్యా బోధన కూడా అందుబాటులోకి తెచ్చారు. అదే క్రమంలో నిరుపేద విద్యార్థులు కెరీర్లో ఉన్నత స్థాయికి వెళ్లేందుకు వీలుగా ఇంగ్లిష్ మీడియం కూడా తీసుకువచ్చారు. వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఇది ఇంకా పెరిగి దేశం మొత్తం అనుసరిస్తే విద్యా వ్యాపారానికి నూకలు చెల్లుతాయనే కేంద్రంలోని పెద్దల భయం. అయినా ప్రస్తుతం ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ప్రభుత్వ ఉన్నతోద్యోగులు ఏ భాషలో చదివారు? తెలుగు మీడియంలో చదువుకున్నవారిలో అత్యధికులు నిరుద్యోగులుగా, లేదా చిరుద్యోగులుగా ఎందుకు మిగిలారు? అమిత్ షా పిల్లలు ఎక్కడ చదివారు? మన రాష్ట్రంలో తెలుగు భాషకు కంకణం కట్టుకున్నామని చెబుతున్న భాజాపా నేత వెంకయ్యనాయుడు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు... వాళ్ల పిల్లలు, మనవళ్లను ఏ మీడియంలో చదివించారు? అదే చదువు బడుగు బలహీన వర్గాల వారికి వద్దని ఎలా చెబుతారు? అయినా ఇక్కడ తెలుగు భాషనేమీ తీసేయడం లేదు కదా. ఇంగ్లిష్ మీడియం అదనంగా తెచ్చారు. అందరూ విద్యావంతులైతే హెచ్చుతగ్గులుండవన్నది అంబేడ్కర్ మాట. అందుకు తగ్గట్టుగా ఏపీలో అడుగులు పడుతున్నాయి. ఇది చూసి తమ ఆధిపత్యం ఎక్కడపోతుందోనని కొందరు భయపడుతూ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. – జస్టిస్ ఈశ్వరయ్య అమిత్ షా ఇంట పిల్లలు ఏ మీడియం చదువుతున్నారు అమిత్‌షా పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలి. డబ్బున్నవారంతా తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారు. కూటమిలో ఉన్న నాయకుల మాట విని తెలుగు భాష గురించి అమిత్‌షా మాట్లాడటం బాధగా ఉంది. చంద్రబాబు కొడుకు ఎక్కడ చదివాడు? ఏం మీడియంలో చదివాడు? పేద ప్రజల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివితే తప్పేంటి? విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన నాయకుడు సీఎం జగన్. ఓటుకి ఇంగ్లిష్ మీడియానికి ముడిపెట్టడం సరికాదు. ఇంగ్లిష్ మీడియం తీసుకు రాను అని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా? – యార్లగడ్డ వెంకటరమణ, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కో–ఆర్డినేటర్ అమిత్ షా,చంద్రబాబు పిల్లలు మాతృభాషలోనే చదివారా? మాతృభాషకు మద్దతు సాకుతో జరుగుతున్న ప్రచారం వెనుక పేదల చదువులను దెబ్బతీసే కుట్ర దాగి ఉంది. మాతృభాషను చంపేస్తున్నారంటూ విమర్శలు చేస్తున్న అమిత్ షా, చంద్రబాబు, రామోజీరావు వంటి పెద్దల వారసులు, మనుమలు మాతృభాషలోనే చదివారా? మాతృభాషపై ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తున్న వారి పిల్లలు మాత్రం ఇంగ్లిష్‌లో చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు చెందిన పేదోళ్లు మాత్రం మాతృభాషను బతికించాలనే నిబంధనతో ప్యూన్లు, క్లర్కులు, గుమాస్తాలు, కూలీలుగా మిగిలిపోవాలా? ఇదెక్కడి ఆటవిక న్యాయం. పేద పిల్లలు ఇంగ్లిష్ చదువులు చదవకూడదా? పెత్తందార్లకు మాత్రమే ఇంగ్లిష్ చదువులు రాసిపెట్టారా? ఏ బిడ్డ అయినా పుట్టినప్పటి నుంచి మాతృభాషలోనే అక్షరాభ్యాసం చేస్తారు కదా. అలాంటి మాతృభాషను ఎవరో చంపేస్తే చచ్చిపోతుందా? చంద్రబాబు చెబితే మాత్రం అమిత్ షాకు అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేద బిడ్డలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఎం జగన్ ఇంగ్లిష్‌కు అధిక ప్రాధాన్యమిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఆయన కృషివల్లే ఈ రోజు మన పేద బిడ్డలు అమెరికాలోని శ్వేతసౌధం, ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, కొలంబియా యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ వేదికలపై ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడి సత్తా చూపారు. ఇక్కడి తల్లిదండ్రులు కూడా ఇంగ్లిష్ మీడియంనే కోరుకుంటున్నారు. ఎన్నికల వేళ దీనిపై రాజకీయం తగదు. –ఆర్.కృష్ణయ్య, రాజ్యసభ సభ్యుడుబాబోస్తే ఇంగ్లిష్ మీడియం తీసేయడం తథ్యం భవిష్యత్తులో చంద్రబాబు తీసుకోబోయే చర్యలకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. మోదీ, అమిత్ షాల మాటను బాబు తూచా తప్పరు కాబట్టి.. టీడీపీ అధికారంలోకి వస్తే ఇంగ్లిష్ మీడియం తీసేయడం తథ్యం. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే పిల్లలకు మంచి స్కూళ్లు, మౌలిక సదుపాయాలు, భోజన వసతి, బైలింగ్వల్ బుక్స్ అందుబాటులోకి తెచ్చారు. దీని వల్ల రానున్న రోజుల్లో పెట్టుబడి దారుల పిల్లలకు పోటీపడే స్థాయిలో పేద వర్గాల పిల్లలు ఎదుగుతారు. ప్రాంతీయ భాషలోనే చదువు అంటున్న అమిత్ షా కొడుకు జయ్ షా పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని చిన్న వయసులోనే నేషనల్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ అయ్యాడు.మరి తన కొడుకుని అమిత్ షా గుజరాతీలో ఎందుకు చదివించలేదు? అంబానీకి ధీరూబాయ్ అంబానీ పేరుతో ముంబయిలో పెద్ద ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ ఉంది. అక్కడ గుజరాతీ, మరాఠీ సబ్జెక్టే లేదు. మరి వాటిని మరాఠీ లోకో, గుజరాతీ భాషలోకో అమిత్ షా ఎందుకు మార్పించలేదు? గుజరాత్‌లోనే అదానీ స్కూల్ ఉంది అది కూడా పూర్తిగా ఇంగ్లిష్ మీడియం స్కూల్. బిర్లా కూడా ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు నడుపుతున్నారు.మరి వీటన్నింటినీ కేంద్రంలోని పెద్దలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్లంతా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా చందాలు ఇస్తున్నారనా? గ్రామీణులు, వ్యవసాయదారుల పిల్లలు అంబానీ అదానీ పిల్లలతో సమానమైపోతారేమోననే భయంతోనే ఇంగ్లిష్ వద్దంటున్నారా? ఏ మీడియంలో చదివితే పిల్లలు బాగా రాణించగలరో అదే మీడియంలో చదివించాలి కదా. తాజాగా వచ్చిన పదోతరగతి ఫలితాల్లో కూడా ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారు 91శాతం పాసైతే తెలుగు మీడియంలో చదువుకున్నవారు 81 శాతమే పాసయ్యారు.అంటే దీనర్థం ఏమిటి? ఇంగ్లిష్‌లో పిల్లలు మరింత సులభంగా చదువుకోగలుగుతున్నారనే కదా. ఇంగ్లిష్ మీడియంలో చదివినంత మాత్రాన తెలుగు రాకుండా ఎలా పోతుంది? పల్లెల్లో వ్యవసాయ కూలీలు, చెప్పులు కుట్టేవారు, కుండలు చేసుకునేవారికి ఇంగ్లిష్ చదువులు వస్తే తమ పిల్లలతో పోటీ పడతారని వీరి భయం. కూటమి అధికారంలోకి వస్తే విద్యావ్యవస్థను కుక్కలు చింపిన విస్తరి చేద్దామని చూస్తున్నారు. జగన్ ప్రభుత్వం, ఆయన చేపట్టిన విద్యా సంస్కరణలు ఇలాగే కొనసాగితే మరో పదేళ్లలో నిరుపేదలు ఆదివాసీలు, దళితులు దేశం గుర్తించే విజయాలు సాధిస్తారు. –కంచ ఐలయ్య, విద్యావేత్త ఎన్డీఏ ప్రభుత్వంలోనే తెలుగు భాష నిర్వీర్యంరాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే తెలుగు భాషను భ్రష్టు పట్టించారు. అయినా ధర్మవరం సభలో అమిత్‌షా తెలుగును పరిరక్షిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ‘క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు రాసిచ్చిన అబద్ధాలను అమిత్‌షా వల్లెవేయడం సిగ్గుచేటు. చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయకుండా, తెలుగు భాష ప్రోత్సాహానికి ఎలాంటి చర్యలు చేపట్టకుండా భాషా స్ఫూర్తిని నిర్వీర్యం చేశారు.ఐదేళ్లపాటు అధికారంలో ఉండి కనీసం భాషా సంఘాన్ని పెట్టలేని చంద్రబాబు తెలుగు భాషను పరిరక్షిస్తామని చెప్పడం హాస్యాస్పదం. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార భాషా సంఘాన్ని పూర్తిస్థాయిలో నియమించి తెలుగు వికాసానికి బాటలువేశారు. ఎన్నడూ లేనివిధంగా గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాలను వారంరోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నాం. వేమన శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇంగ్లిష్ మీడియం విద్యార్థులతో వేమన పద్యాలను చదివించి ఉభయ భాషా ప్రావీణ్యాన్ని ప్రోత్సహించారు.అల్లూరి సీతారామరాజు శత జయంతి, జాషువా వంటి మహోన్నత కవుల జయంతులను అధికారికంగా నిర్వహిస్తూ తెలుగు ఖ్యాతిని వెలుగెత్తి చాటారు. అందువల్లే ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే స్థాయికి తెలుగు విద్యార్థులు ఎదిగారు. తెలుగుభాషా పరిరక్షణ కంటే ముందుగా లోకేశ్‌కు మంచి తెలుగు నేర్పించాలి..’ అని విజయబాబు అన్నారు. –విజయబాబు, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు -
‘మూల’ సంస్కృతికి రక్ష అంబేడ్కరిజం
ప్రకృతి నుంచి నేర్చుకొంటూ ఎక్కడికక్కడ మానవ సమూహాలు తమవైన సంస్కృతులను అభివృద్ధి చేసుకున్నాయి. సాధారణంగా ఆహారావసరాలు తీర్చగలిగే నదీలోయల్లో విభిన్న సాంస్కృతిక విశిష్టతలతో కూడిన నాగరికతలు రూపుదిద్దుకొంటాయి. మన గోదావరి, కృష్ణా వంటి నదీలోయల్లో విలసిల్లిన ‘మూల సంస్కృతి’ ఇలా అభివృద్ధి చెందినదే. ఇక్కడి మూలవాసులు ఏ ప్రకృతి వనరులను ఉపయోగించుకుని వ్యవసాయం, టెక్నాలజీలను అభివృద్ధి చేసుకున్నారో... అవే ప్రకృతి శక్తులను దేవుళ్లుగా పూజించారు దేశం బయటి నుంచి వచ్చిన ఆర్యులు. వారే ఇక్కడివారిపై ‘రాక్షసులు’ అని ముద్రవేశారు. ఆ వైదిక సంస్కృతీ వాహకులు ఇప్పటికీ మూలవాసుల సంస్కృతిని కబళించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. భారతదేశం ఈనాడు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ఘర్షణల్లో ఉంది. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించే శక్తుల విజృంభణే ఇందుకు కారణం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ వంటి మతతత్త్వ శక్తులు రాజ్యాంగేతర జీవనాన్ని కొనసాగిస్తూ... దానిని దేశం మీద రుద్దాలనే తాపత్ర యంలో ఉన్నాయి. కారణం వారు స్వాతంత్య్రానికి ముందు నుంచీ భారతదేశ సాంస్కృతిక, సాంకేతిక వ్యవస్థలకు విరోధులు కావడమే. నిజానికి భారతదేశ మూలాలు భౌతికవాద, హేతువాద, తాత్వికవాద భావజాలంలో ఉన్నాయి. భౌతిక వాదం, జీవశాస్త్రం, మానవ పరిణా మవాదాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సమన్వయించి హిందూ ప్రత్యా మ్నాయ వాదాన్ని రూపొందించారు. అందులో తత్త్వ శాస్త్రానికి ప్రాధాన్యమిచ్చి ఆధ్యాత్మిక వాదం ఒక ఊహాత్మక వైయక్తిక భావ జాలం నుండి రూపొందిందేననీ, అందుకే వేలకొద్ది దేవుళ్ళు భారత దేశంలో సృష్టించబడ్డారనీ ఆయన చెప్పారు. ఎంఎన్ రాయ్ తన ‘మెటీరియలిజం’ గ్రంథంలో శాస్త్రీయ భావ జాల చారిత్రక దృక్పథం గురించి వివరిస్తూ... భారతదేశమే భౌతిక తత్త్వ శాస్త్రాన్ని ప్రపంచానికి అందించిందని నొక్కి వక్కాణించారు. భారతీయ మూలవాసులు భౌతికవాద జీవులనీ; వారు నిçప్పునూ, నీరునూ, గాలినీ, శూన్యాన్నీ జీవితానికి అన్వయించుకున్న మహోన్నత శాస్త్రవేత్తలనీ ఆయన శాస్త్రీయంగా నిరూపించారు. మరీ ముఖ్యంగా సింధు నాగరికతలో వచ్చిన నదీ నాగరికత సంస్కృతి నుండి నదులకు కాలువలు నిర్మించే బృహత్తరమైనటువంటి ఇంజనీరింగ్‌ను దళితులు కనిపెట్టారు. అంబేడ్కర్ దళిత బహుజనులు ‘మొదటి ఇరిగేషన్ ఇంజ నీర్లు’ అని చెప్పారు. అందుకే భారతదేశ వ్యాప్తంగా సింధు, గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి, కృష్ణా, కావేరి, సువర్ణ రేఖ, మహానది, పెన్నా, మహి, సబర్మతి, నర్మదా, తపతి వంటి ఎన్నో నదులకు ఆనకట్టలు కట్టి నదీ నాగరికతలనూ, వ్యవసాయ సంస్కృతినీ నిర్మించారు. ఈ నదులన్నింటినీ వైజ్ఞానిక దృష్టితో చూడకుండా దిగజార్చింది మత వ్యవస్థ. భారతదేశంలో అత్యుత్తమమైన నదుల్లో గోదావరి చాలా గొప్పది. ఈ నది ప్రవహించే ప్రాంతం ఎక్కువగా గుట్టలు, పర్వతాలు, లోయలు; ఎగువ, దిగువ ప్రాంతాలు; చిన్న చిన్న గుట్టలతో కూడి ఉంది. ఈ నది అంచుల్లో నివసించే వాళ్ళు గిరిజనులు, దళితులే. వారే ఈ నదీ వ్యవస్థను ఇప్పటికీ రక్షిస్తున్నారు. ఈ గోదావరి సంస్కృతికీ, హిందూ మత సంస్కృతికి సంబంధమే లేదు. సుమారు 1600 సంవత్సరాలు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో బౌద్ధ సంస్కృతి విలసిల్లింది. ఈ హిందూ వాద సంస్కృతి వచ్చిన తర్వాత ఈ నదీ నాగరికత మీద గొడ్డలి వేటు పడింది. గోదావరి తర్వాత గొప్ప సంస్కృతులు సృష్టించింది కృష్ణా నదీ పరివాహక ప్రాంతం. దీని పరీవాహక ప్రాతంలోనూ దళితులు, గిరిజ నులే అధికంగా జీవిస్తున్నారు. వీరే ఇక్కడ విలసిల్లిన సంస్కృతికి సృష్టికర్తలు. హిందూ సంస్కృతికీ, ఇక్కడి సంస్కృతికి కూడా ఎటువంటి సంబంధం లేదు. హిందూ సామ్రాజ్యవాదం నదీ సంస్కృతులను ధ్వంసం చేయాలనే పెద్ద ప్రయత్నంలో ఉంది. అంబేడ్కర్ అందుకే నదుల అనుసంధానానికి సంబంధించి ఉద్గ్రంథాలను రచించారు. ఆదివాసీల నుండీ, దళితుల నుండీ ఆయుధాలు ఉన్న అగ్ర వర్ణాల వారే భూమిని కొల్లగొట్టారని నిరూపించారు. అంబేడ్కర్ దళితుల, ఆదివాసీల జీవన సంస్కృతులన్నీ నదీ పరీవాహక వ్యవ సాయక అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. దీనికి తోడు సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతంలో జీవిస్తున్న బెస్తలు, కొండల మీద గొర్రెలను మేపుకొని జీవిస్తున్న యాదవులు, తాటాకు కొట్టి గృహ నిర్మాణ సంస్కృతికి పునాదులు వేసిన గౌడలు, శెట్టి బలిజలు; వస్త్రాలు నేసి మానవ నాగరికతను కాపాడిన పద్మశాలీలు, దేవాంగులు, దళితులు... వీళ్లంతా కూడా నదీ నాగరికత సృష్టికర్తలే అని అంబేడ్కర్ చెప్పారు. మైనార్టీలపైనా, దళితులపైనా... ద్వేషం, మాత్సర్యం, క్రోధం కలిగి ఉండటం ఆర్ఎస్ఎస్ భావజాలంలో ప్రధానమైన అంశం. నిజానికి మైనారిటీలుగా చెప్పబడుతున్న ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ పరాయివారు కారు. హిందూమత అస్పృశ్యతను వారు భరించలేక ఇస్లాం మతాన్నీ, క్రైస్తవ మతాన్నీ తీసుకున్నవారే. ఆర్యులు మధ్య ఆసియా నుండి వచ్చారని రొమిల్లా థాపర్, డీడీ కోశాంబి, ఆర్ఎస్ శర్మ, బిపిన్ చంద్ర వంటి వారు తేల్చారు. ఆర్యులు మూల వాసులకు శత్రువులని అంబేడ్కర్ చెప్పారు. ఇకపోతే బౌద్ధం భారత ఉపఖండంలో జన్మించింది. సిక్కుమతం భారతదేశంలో పుట్టింది. ఆయా సందర్భాలలో చారిత్రకంగా వివిధ మతాలు స్వీకరించిన దళిత బహుజన మైనారిటీలను శత్రువులుగా చూడటం అశాస్త్రీయ విషయం. నిజానికి మూలవాసులైన దళితులు ఏవైతే ఉత్పత్తి సాధనాలుగా శాస్త్రీయ పరికరాలు కనిపెట్టారో వాటిని ఆర్యులు పూజించారు. అంటే మూలవాసుల కంటే వారు ఎంత వెనుక బడి ఉన్నారో మనకు అర్థం అవుతుంది. నాగరికతలో, మానవతలో, సౌజన్యంలో, ప్రేమలో, కరుణలో మూల వాసులది అద్వితీయమైన పాత్ర. ఆర్యులు మూలవాసుల సుగుణాలను అధ్యయనం చేయలేక పోయారు. మూలవాసులు ప్రకృతి వనరులను ఉపయోగించి నాగరి కతా నిర్మాణం చేస్తే... ఆర్యులు ఆ ప్రకృతి శక్తులను దేవుళ్లుగా కొలి చారు. వేదాల్లో ఉన్న దేవుళ్ళు అందరూ ఇందుకు ఉదాహరణ. మనిషి దేవుణ్ణి సృష్టించుకున్నాడు. కానీ ఆ దేవుడు మనిషి మీద ఆధిపత్యం వహిస్తున్నాడు. చివరకు మనిషిని బలిచ్చేవరకు ఈ మూఢ భక్తి పరిఢవిల్లింది. సాటి మనిషిలో ఉన్న జ్ఞానాన్నీ, హేతుభావాన్నీ నిరాకరించి దైవాధీన భావాన్ని అలవాటు చేసుకున్నాడు మానవుడు. తన తోటి మనిషిని ప్రేమించడం మానేసి, తను పూజించే దేవుణ్ణి కొనియాడమని బలవంతం చేశాడు. పూజించకపోతే వధించాడు. ఒక్కొక్క దేవుణ్ణి పూజించేవారు ఒక్కో సమూహంగా ఏర్పడ్డారు. ఇతర దేవుళ్లను పూజించే వారిని చంపడం ప్రారంభించారు. దీన్ని ‘దుష్ట శిక్షణ’ అన్నారు. వేదాల్లో తమ శత్రువులను చంపమని వాళ్ళ దేవత లను వేడుకొన్నారు ఆర్యులు. చివరకు దేవుళ్ళనే అవతార పురుషు లుగా కిందకు దించారు. మూలవాసులకు ‘రాక్షసులని’ పేరు పెట్టి వారిని హతమార్చటానికే ‘దశావతారాలు’ ఆవిర్భవించాయని ప్రచారం చేశారు. వేద కాలం నుంచే ఈ హననం, హత్యాకాండ, అణచివేత, దౌర్జన్యం, విధ్వంసం ప్రారంభమయ్యాయి. సంస్కృతిని, సంపదను మూలవాసులు సృష్టిస్తూ వెళ్లారు. ఆర్యుల వారసులు వీరిని వధిస్తూ, సంపదను ధ్వంసిస్తూ వెళ్లారు. ఈ చరిత్రను వక్రీకరించాలనే ఉద్దేశ్యంతోనే హిందూ మతవాద శక్తులు విద్యావ్యవస్థలో సిలబస్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ‘ద ఆరెస్సెస్: రోడ్‌మ్యాప్స్ ఫర్ ద 21సెంచరీ’ వంటి పుస్త కాలు విశ్వవిద్యాలయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఇకపోతే ఎన్నో విలువైన గ్రంథాలను హిందూత్వ శక్తులు నిరాక రించాలనీ, ధ్వంసం చేయాలనీ ప్రయత్నిస్తున్నాయి. కమ్యూనిస్టు భావాలకూ, సోషలిస్టు భావాలకూ, అంబేడ్కరిస్టు భావాలకూ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మూలవాసుల జీవన సంస్కృతులకు మూలమైన నదీ నాగరికతా సాంస్కృతిక విప్లవానికీ, రాజ్యాంగ మూల సూత్రాలకూ భిన్నంగా ఆ శక్తులు జీవిస్తున్నాయి. రాస్తున్నాయి. ప్రచారం చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అంబేడ్కర్ ఆలోచనలతో పునరుజ్జీవన ఉద్యమం, ప్రత్యామ్నాయ భావజాల ఉద్యమం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ మార్గమే ఈనాటి సామాజిక జీవన సూత్రం కావాలి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 9849741695 -
రాజ్యాంగమే కరదీపిక!
గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి డెబ్భైయ్యేళ్లు పూర్తయిన వేళ దేశం మొత్తం ఒక రకమైన సంక్షోభాన్ని ఎదు ర్కొంటున్నది. వ్యక్తిగత విశ్వాసంగా ఉండాల్సిన మతం ప్రభుత్వ విశ్వా సంగా మారినప్పుడు, ఆ క్రమంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి కూడా సిద్ధపడుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడటంలో ఆశ్చర్యం లేదు. ఈ ధోరణులను వ్యతిరేకించేవారు రాజ్యాంగంలోని స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం గురించి మాట్లాడుతుంటే అది పాలకులకు మింగుడు పడటం లేదు. కేంద్ర పాలకులకు మన దేశం పౌరాణికంగా అర్థమవుతోంది తప్ప భౌగోళికంగా, సామాజికంగా అర్థం కావడం లేదు. రాజకీయ నాయకులు నెత్తుటి తిలకాలు దిద్దుకోవటానికి వెనకాడటం లేదు. ఈ దేశంలో మొదటినుంచీ వున్న పరమత సహనాన్ని తుంచేం దుకు వారు ప్రయత్నిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర నమోదు చిట్టా(ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)లను అమలు చేయొద్దంటూ దేశ వ్యాప్తంగా నిరసన ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి హిందువులు, సిక్కులు, పారశీకులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులకు అవ కాశం ఇస్తూ, కేవలం ముస్లింలకు మాత్రం అనుమతి నిరా కరించడం వివక్ష కాదా? వారిపై వివక్ష ప్రదర్శించడం మన దేశ సంస్కృతి కాదు, మన రాజ్యాంగానికి అనుగుణమైనది కాదు. ముస్లింలు ఈ దేశ సంస్కృతిని, సాంకేతిక రంగాన్ని ఉన్నతీ కరించడంలో ప్రధాన పాత్ర పోషించారు. వారు తీసుకొచ్చిన వాస్తు శాస్త్రం ఆధారంగా రూపొందిన అనేక చారిత్రక కట్టడాలు మన దేశానికి వన్నె తెస్తున్నాయి. ఆటోమొబైల్ రంగాన్ని కూడా వారు ఎంతో ప్రభావితం చేశారు. ముస్లింలు పరాయివారు కాదు. వారు ఈ దేశ చరిత్రలో భాగం. దేశ స్వాతంత్య్రో ద్యమంలో వారు కీలక పాత్ర పోషించారు. ఈ దేశ విముక్తికి తమ ప్రాణాలు అర్పించారు. 130 కోట్ల దేశ జనాభాలో ముస్లింల జనాభా 20 కోట్లు. ఈ దేశ జనాభా మొత్తం తాము ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం అడుగుతోంది. అందుకవసరమైన పత్రాలు చూపని వారిని ప్రత్యేక శిబిరాల్లో నిర్బంధిస్తామంటున్నారు. ఈ దేశంలో నిరక్షరాస్యులు 60 శాతం ఉన్నారు. ముస్లింలతోపాటు దళి తులు, ఆదివాసీలు, బహుజనులు ఈ నిరక్షరాస్యుల్లో అధికం. ఎన్ఆర్సీ, సీఏఏలకు వివరాలివ్వలేకపోతే నేరంగా పరిగణించే టట్టయితే ఈ వర్గాలవారంతా ఇబ్బందుల్లో పడతారు. అసలు అక్షరాలు, అంకెలు రాని ప్రజలను తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు కావాలని, మీకు సంబంధించిన సర్టిఫికెట్లు కావాలని ఒత్తిడి తెస్తే వారేం చెప్పగలుగుతారు? చూపగలుగు తారు? ఈ దుర్మార్గమైన చర్యను అడ్డుకోవాల్సిన అవసరం లేదా? ఇక నుంచి రైల్వే స్టేషన్లలో ఉండే బోర్డులపై ఉర్దూ బదులు సంస్కృత భాషలో రాస్తామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించింది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పాటించడం మొదలు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. రైల్వే స్టేషన్లలో సైన్ బోర్డులను ఆయా రాష్ట్రాల ద్వితీయ భాషలో రాయాలనే నిబంధన ప్రకారం ఉత్తరాఖండ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. దీన్నిబట్టి చూస్తుంటే సంస్కృతీకరణ ద్వారా వారు దేశాన్ని విభజించాలని చూస్తున్నట్టు అర్థమవు తుంది. దేశంలోని అన్ని సామాజిక శ్రేణులు, ముస్లింలు రాజ్యాంగ పీఠికే శిరోధార్యమని నమ్ముతున్నారు. ఇది గొప్ప పరిణామం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ దేశాల రాజ్యాంగాలనూ అధ్యయనం చేసి మన దేశానికి ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించి దానిద్వారా పటిష్టమైన లౌకికవాద సౌధాన్ని నిర్మించారు. ఈ రాజ్యాంగం అసమగ్రమైనది, పెటీ బూర్జు వాలది అని ఒకప్పుడు ప్రచారం చేసిన వామపక్షాలు ఈరోజు దాన్ని సమున్నతమైనదని గుర్తించడం శుభ పరిణామం. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ దేశం మా సొంతమని కుల, మతా లకు అతీతంగా అన్ని వర్గాలవారూ గొంతెత్తుతున్నారు. రాజ్యాంగ ప్రతిని చేతబూనుతున్నారు. దాన్ని కరదీపికగా భావిస్తున్నారు. ఇది మరో స్వాతంత్య్ర పోరాటం. ఇందులో అంతిమ విజేతలు ప్రజలే. డాక్టర్ కత్తిపద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్రపార్టీ, వ్యవస్థాపక అధ్యక్షులు మొబైల్ : 98497 41695 -
ఈ అసమానతలు ఇంకా ఎన్నాళ్లు?
భారతదేశం నానాటికీ ఆర్ధికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా దిగజారడానికి కారణం అవిద్య, అరాచకత్వం, మతతత్వం, స్త్రీ అణచివేత, కులతత్వం, అస్పృశ్యతాచరణ కొనసాగడమే. మోదీ మాటల్లో అంకెలు కనబడుతున్నంత పెద్దగా అభివృద్ధి లేదు. విపరీతమైన ముస్లిం ద్వేషం, అస్పృశ్యుల మీద తీవ్రమైన దాడులు, రాజ్యాంగ నిరసన, ప్రజాస్వామ్య లౌకికవాద భావజాలానికి గొడ్డలి పెట్టుగా మారాయి. భారతదేశంలో మానవ వనరులకు, ప్రకృతి వనరులకు, వ్యవసాయ భూములకు, విద్యావేత్తలకు, విద్యార్జనాపరులకు కొదవలేదు. వృత్తికారులు, దళితులు, ఆదివాసీయులు, ముస్లింలు, ఉత్పత్తి కారకులు వీరిని కులమత భావాలతో నిర్లక్ష్యం చేయడం వల్ల రాను రాను నిరాశా నిస్పృహలు కలుగుతున్నాయి. అలా కలిగించడమే ప్రభుత్వ ధ్యేయంగా మనకు కనిపిస్తుంది. ఆది భారతీయులైన ఆదివాసులు భారతదేశ ఉత్పత్తి రంగానికి పట్టుగొమ్మలు. అయితే భారత ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవన వ్యవస్థల మీద గొడ్డలి వేటు వేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో మల్టీనేషనల్ కంపెనీలకు ఆదివాసీలు తరాలుగా చేసుకుంటున్న భూములను, ఆవాసాలను ధారాదత్తం చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్లు భారతదేశానికి రాకపూర్వం ఆదివాసీలు స్వతంత్రులుగా ఉండే వారు. వారి భూములను, ఆవాసాలను బ్రిటిష్ వాళ్ళు ఆ తరువాత నల్లదొరలు కొల్లగొట్టడం ప్రారంభించారు. కొండలను, నదులను రక్షించే సంస్కృతి వారిది. కొండలను తవ్వి పడేసి, నదులను కల్మషం చేసే సంస్కృతి పాలక సంస్కృతి, ఈనాడు గంగా, యమునా నదులన్నీ కల్మషమైపోయి వున్నాయి. డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ ప్రధానంగా రాజ్యాంగ నిర్మాణ సభ్యుడయిన జైపాల్ సింగ్ ముండా కృషివలన ఆదివాసుల హక్కులు, వాటి రక్షణకు సంబంధించిన నిబంధనలన్నింటిని రాజ్యాంగంలోని 5వ షెడ్యూలులో చేర్చి, కట్టుదిట్టం చేశారు. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటికీ 1965–66 వరకు భారత పాలక వర్గాలు ఈ విషయాన్ని పట్టించుకోకపోగా, ఆదివాసుల పట్ల బాధ్యతా రాహిత్యాన్ని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. పర్యావరణ పరిరక్షణలో అద్వితీయమైన కార్యాచరణ రూపొందించిన ఆది వాసుల్ని మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత మరిం తగా అణగదొక్కడమే గాక వారిని హిందుత్వీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం భారతదేశంలో ఉపాధి కూలీలుగా వున్న దళితులకు భూమి హక్కు ఇవ్వడం లేదు. మోదీ ప్రభుత్వంలో దళితులకు ఒక్క ఎకరం భూమి కూడా పంచకపోగా, లక్షలాది ఎకరాల దళితుల భూమిని భూస్వాములు, పారిశ్రామిక వేత్తలు కొల్లగొట్టారు. ఇకపోతే అన్ని విశ్వవిద్యాలయాల్లో దళిత, ఆదివాసీ, ముస్లిం విద్యార్థుల మీద తీవ్రమైన దమనకాండ జరుగుతుంది. భావజాల పరంగా, భౌతి కంగా విశ్వహిందూ పరిషత్ వారు దళిత విద్యార్థులను హింసిస్తున్నారు. దళితుల హక్కుల్ని కాలరాసే క్రమంలో హిందువులు కాని వారు భారతీయులు కాదని రెచ్చగొట్టి అగ్రవర్ణ విద్యార్థుల్లో హింసా ప్రవృత్తిని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల దళిత విద్యార్థులు సివిల్స్ రాత పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించినా వారిని ఇంటర్వూ్యల్లో తప్పించే అగ్రవర్ణ ప్యానల్స్‌ని రూపొందిస్తున్నారు. దళిత విద్యార్థులను ఇంటర్వూ్యల్లో తప్పించి, మీరు అత్యున్నత అధికార పదవులకు పనికి రారు అనే మనుస్మృతి సూత్రాలను ఆచరణలో పెడుతున్నారు. ఈ విషయాన్ని అఖిల భారతీయ దళిత్ అండ్ ముస్లిం ఫ్రంట్ యు.పి.యస్.సి. అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది. అత్యధిక మార్కులు సంపాదించిన ఎస్సీ, ఎస్టీ, ముస్లిం విద్యార్థులను కుల ద్వేషంతో వర్ణ ద్వేషంతో ఎలా తప్పించిందో ఆ వివరాలన్నీ సమాజం ముందుకు తెచ్చింది. భారత్‌లో ప్రజలందరిని, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక విద్యారంగాల్లో సమపాళ్ళతో చూడవలసిన అవసరం వుంది. ఉత్పత్తి శక్తులపైన బహుజనులను నిర్లక్ష్యం చేయడం వలన దేశం అభివృద్ధి చెందదు. నిన్నటి వరకు సుజనా చౌదరి, రమేష్‌ల మీద సీబీఐ దాడులు నిర్వహించి, ఈ రోజున వారిని బీజేపీలోకి తీసుకోవడంతో బీజేపీ అవినీతి రాజకీయాలకు పతాకలెత్తుతున్నట్టు అర్థం అవుతోంది. అవినీతి కులాధిపత్య కోణంలో ఫిరాయింపుల ప్రోత్సాహంలో కూరుకుపోయిన చంద్రబాబు పరిస్ధితి ఈనాడు ఏమైందో.. అదే రేపు అవినీతి దళిత వ్యతిరేక పాలక వర్గాలకు గుణపాఠం అవుతుంది. నిరక్షరాస్యత దళితుల్లో నేటికీ 70% ఉంది. అనేక గ్రామాల్లో వారిని నీళ్లకోసం చెరువుల్లోకి రానివ్వడం లేదు. దళితులపై అత్యాచారాలు ముమ్మరం అవుతున్నాయి. లౌకిక, సామాజిక శక్తులన్నీ ఏకమై తమ హక్కుల కోసం దేశ ఆర్థిక అభివృద్ధి కోసం పోరాడాల్సిన సందర్భమిది. అప్పుడే అంబేడ్కర్ ఆశయాలు నెరవేరతాయి. వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మొబైల్ : 98497 41695 డా: కత్తి పద్మారావు -
పద్మారావుకు అన్ని పార్టీల మద్దతు
సాక్షి, హైదరాబాద్: శాసససభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికను సోమవారం నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో డిప్యూటీ స్పీకర్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. డిప్యూటీ స్పీకర్ నామినేషన్ల దాఖలు గడువు శనివారంతో ముగియగా, పద్మారావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. పద్మారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలను కోరారు. ఆయన ఎన్నికకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. పద్మారావు నామినేషన్ దాఖలు ప్రక్రియలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రులు దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాల, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ పాల్గొన్నారు. -
పద్మారావు మనస్తాపం!
సాక్షి, సిటీబ్యూరో: కేసీఆర్ కేబినెట్లో జంట జిల్లాల నుంచి మరో ఇద్దరు నేతలు మంత్రి పదవులు చేపట్టనున్నారు. ఇందులో హైదరాబాద్ జిల్లా కోటాలోసనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మంగళవారం రాష్ట్ర మంత్రులుగాబాధ్యతలు చేపట్టనున్నారు.ఈ మేరకు సోమవారం సాయంత్రంఇద్దరు నేతలకు సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందింది. ఇప్పటికే నగరం నుంచి ఎమ్మెల్సీ మహమూద్ అలీ కేబినెట్లో కీలకమైన హోంశాఖను నిర్వహిస్తుండగా...కొత్తగా మరో ఇద్దరికి స్థానం కల్పించాలని నిర్ణయించారు. కేసీఆర్ గత కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన నాయిని నర్సింహారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావులకు ఈమారు చోటు దక్కలేదని తెలుస్తోంది. పద్మారావుకు కేబినెట్ హోదా కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెడతారని సమాచారం. విధేయత, సమర్థతలకు చోటు రాష్ట్ర మంత్రివర్గంలో విధేయతతో పాటు సమర్థత, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. సనత్‌నగర్ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన శ్రీనివాస యాదవ్‌ను వరుసగా రెండవ మారు కేబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. అందరూ ఊహించినట్లుగా జరగడంతో తలసాని స్థానంపై పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి చామకూర మల్లారెడ్డి పేరు సాయంత్రానికి అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. మల్లారెడ్డి సైతం సోమవారం ఉదయం అర్కల్‌గూడలో విలేకరులతో మాట్లాడుతూ, తనకు రెండవ విడతలో మంత్రి పదవి లభిస్తుందని చెప్పుకొచ్చారు. సాయంత్రానికి మాత్రం ప్రగతిభవన్ నుంచి పిలుపు రావటంతో హుటాహుటిన సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. వాస్తవానికి ఎంపీగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించిన మల్లారెడ్డికి ఏదో ఒక కీలక పదవి అప్పగిస్తారని భావించారు. ఐతే నగరం నుండి నాయిని నర్సింహారెడ్డికి స్థానం లేకపోవటంతో సామాజిక కోణంలో ఈ స్థానాన్ని మల్లారెడ్డితో భర్తీ చేసేందుకు నిర్ణయించి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పద్మారావు మనస్తాపం! రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కలేదని తెలిసి సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న తనకు కాకుండా టీడీపీ అభ్యర్థిగా తనతో పలుమార్లు తలపడిన శ్రీనివాసయాదవ్‌కు స్థానం కల్పించటంపై పద్మారావు ఒకింత నొచ్చుకున్నట్లు తెలిసింది. తలసానికి ఇవ్వటంపై తనకు అభ్యంతరం లేదని, అదే సమయంలో తనకు కూడా ఇస్తే సరైన గౌరవం ఉంటుందన్న అభిప్రాయాన్ని పద్మారావు పార్టీ ముఖ్యనేతల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఎవరు..ఎక్కడ? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటే...
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుదీరక పోవటం, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఇంకా కొత్తవేవీ లేకపోవటంతో నగర ఎమ్మెల్యే ఫుల్లుగా కాలక్షేపం చేస్తున్నారు. కొందరు అత్యధిక సమయం ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. సన్నిహితుల శుభకార్యాలు, విందు భోజనాలకు హాజరవుతున్నారు. మరి కొందరు మాత్రం ఆరోగ్య కారణాలతో గెలిచిన కొన్ని రోజుల తర్వాత మాయమైపోయారు. గతంలో కేసీఆర్ కేబినెట్లో కీలక శాఖలు నిర్వహించిన సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావులు గడిచిన వారం క్రితం వరకు పార్టీ విజయోత్సవ సభల్లో పాలుపంచుకుని ప్రస్తుతం ఇళ్లు, క్యాంప్ కార్యాలయాలకే పరిమితమయ్యారు. నగరంలో పంచాయతీ ఎన్నికల సందడి కూడా లేకపోవటంతో రాజకీయ సందడి తగ్గిపోవటంతో వారు కుటుంబసభ్యులకు అధిక సమయాన్ని కేటాయిస్తున్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే హన్మంతరావు తాజాగా పుణ్యక్షేత్రాల సందర్శనలతో బిజీగా ఉండగా..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ శుభకార్యాలతో బిజీ అయ్యారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఎన్నికలకు ముందు..తర్వాత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడి కొంత కాలం విశ్రాంతి తీసుకుని ఇంటి నుండే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎల్బీనగర్, మహేశ్వరం ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు సైతం ఇళ్లు, క్యాంప్ కార్యాలయాల్లోనే అధిక సమయం గడుపుతున్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ ఇంకా విజయోత్సవ కార్యక్రమాల్లోనే బిజీగా ఉంటూ, మిగిలిన సమయాన్ని కుటుంబసభ్యులతో గడిపేస్తున్నారు.. సాయన్న ఎక్కడ.. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి విజయం సాధించిన సాయన్న ఎన్నికల తర్వాత..మాయమైపోయారు. విజయానికి సంబంధించిన సర్టిఫికెట్ అందుకున్న తర్వాత ముఖ్య నాయకులకు సైతం అందుబాటులో లేకుండాపోయారు. ఆరోగ్య సమస్యలతోనే సాయన్న ఇతర ప్రాంతాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని, అందుకే ఇటీవల కంటోన్మెంట్ బోర్డు సమావేశానికి కూడా హాజరు కాలేదని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. సంక్రాంతి తర్వాతే సాయన్న ప్రజల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.. చెన్నైలో దానం.. చివరి నిమిషంలో ఖైరతాబాద్ టికెట్ దక్కించుకుని విజయం సాధించిన దానం నాగేందర్ చెన్నైలో ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. ఎన్నికల్లో విరామం లేకుండా ప్రచారం చేసిన దానం, ఎన్నికల అనంతరం ఆరోగ్యసమస్యలతో ఇబ్బంది పడ్డారు. డిసెంబర్ చివరి వారమంతా ఇంటికే పరిమితమైన దానం, మూడు రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి, తిరిగి మెరుగైన ఫిజియోథెరపీ కోసం చెన్నై చేరారు. పూర్తిగా ఫిట్ అయి సంక్రాంతి తర్వాతే విస్తృత కార్యక్రమాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. -
‘చేయి’ కలపరాదె!
తార్నాక : సికింద్రాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి చివరి దాకా పోరాడారు. అయితే, వివిధ కారణాలతో ఆ సీటుమరొకరికి వెళ్లిపోయింది. అలిగి కూర్చున్న ఆమెను ‘హస్తం’ పెదలు బుజ్జగించి కూటమి అభ్యర్థికి సహకరించాలని కోరగా.. అందుకామె ఓకే అన్నారు. అయితే, శుక్రవారం ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు తార్నాకలో పర్యటించారు. ఇదే సమయంలో చంద్రారెడ్డి బర్త్‌డే విషయం తెలుసుకున్న పద్మారావు ఆయన ఇంటికి వెళ్లారు. శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ‘తమ్ముడూ.. మహాకూటమి ఎలాగూ హ్యాండిచ్చింది కదా! నాకు సపోర్టు చేసేందుకు చేయి కలపరాదే’.. అంటూ చంద్రారెడ్డిని కోరారు. -
చాయ్ బాగుంది
రాజేంద్రనగర్ : చాయ్ ప్రియుడు ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు శుక్రవారం తన కాన్వాయ్‌ని ఆపి టీ తాగి ఆస్వాదించారు. హిమాయత్‌సాగర్ ప్రధాన రహదారి వద్ద ఉన్న ఎౖMð్సజ్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరిగి నగరానికి వెళ్తూ మార్గంమధ్యలో ఆరెమైసమ్మ దేవాలయం ప్రధాన రహదారిపై ఉన్న చాయ్ దుకాణాన్ని చూసి తన కాన్వాయ్‌ని ఆపారు. మంత్రి తన వాహనం నుంచి నేరుగా దిగి చాయ్ బండి వద్దకు వెళ్లారు. చాయ్ ఉందా.. అంటూ అడిగిగారు. మంత్రి వాహనం వెనకే ఉన్న స్థానిక నాయకులు అక్కడికి చేరుకొని మంత్రికి టీ అందించారు. స్వయంగా మంత్రి తన దుకాణానికి వచ్చి చాయ్ తాగడంతో నిర్వాహకుడు సైతం ఆశ్చర్యపోయాడు. చాయ్ బాగుందని కితాబిచ్చిన మంత్రి తిరిగి కాన్వాయ్‌లో వెళ్లిపోయారు. -
సార్లకు చికెన్ బిర్యానీ.. పిల్లలకు నీళ్లచారు
సాక్షి, నర్సాపూర్ : ఆదర్శంగా ఉంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు తప్పుదారి పడుతున్నారు. ఇందుకు తాము పని చేస్తున్న పాఠశాలనే అడ్డాగా చేసుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలకు నీళ్ల చారు వడ్డిస్తూ.. తాము మాత్రం చికెన్ బిర్యానీ వండుకు తింటున్న విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం వండిపెడుతున్న ఏజెన్సీ నిర్వాహకులతో, అదే పథకానికి చెందిన బియ్యంతో వారానికి రెండు సార్లు చికెన్ బిర్యానీ వండించుకుంటున్నారని తెలుస్తోంది. అప్పుడప్పుడు మద్యం సేవిస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం విద్యా కమిటీ చైర్మన్ పద్మారావు పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులకు నీళ్ల చారు వడ్డించిన విషయం బయటపడింది. ఉపాధ్యాయుల కోసం బిర్యానీ తయారు చేసేందుకు మసాలా కలిపి సిద్ధం చేసిన చికెన్ ముక్కలు, బియ్యం ఉడికించేందుకు పెట్టిన ఎసరు కూడా కనిపించడంతో ఆయన ఆశ్చర్యపోయారు. పాఠశాలలోని ఒక గదిలో ఖాళీ బీరు సీసాలు లభించడంతో వారు మద్యం కూడా తాగుతున్నారనే అనుమానాలకు బలం చేకూరుతోంది. పాఠశాలకు ప్రహరీ లేనందున రాత్రి పూట మైదానంలో గుర్తు తెలియని వ్యక్తులు తాగి పడవేసిన బీరు సీసాలను మధ్యాహ్న భోజనం వండి పెట్టె మహిళ తెచ్చుకుని ఒక గదిలో దాచి పెట్టిందని ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్ చెబుతున్నారు. బిర్యానీ వండించిన సంగతి తనకు తెలియదని అంటున్నారు. ఈ విషయాలను ఉన్నతాధికారులకు నివేదిస్తానన్నారు. చర్యలకు డిమాండ్ పాఠశాలలో పర్యవేక్షణ సరిగా లేనందునే పలువురు ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విద్యా కమిటీ చైర్మన్ పద్మారావు ఆరోపించారు. వారు మధ్యాహ్న భోజన బియ్యంతో బిర్యానీ వండించుకోవడంతోపాటు, తరగతి గదులలో మద్యం సేవిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు పనులకు పాల్పడుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని అధికారులను కోరారు. -
డ్రగ్స్ కేసులో ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు
-
రైల్వే కోర్టుకు హాజరైన మంత్రులు
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని రైల్వే కోర్టుకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు బుధవారం ఉదయం హాజరయ్యారు. మౌలాలిలో తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో నిర్వహించిన కేసులో మంత్రులు కోర్టుకు హాజరయ్యారు. 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలిలో టీఆర్ఎస్ నేతలు రైల్ రోకో చేపట్టిన విషయం విదితమే. -
మంత్రి కుమారుడి అరెస్ట్
హైదరాబాద్ : తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు కుమారుడు రామేశ్వర్‌ను మెండా మార్కెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పచ్చల వ్యాపారిపై దాడి కేసులో గురువారం రామేశ్వర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న టీ మంత్రి పద్మారావు, డీఎస్
తిరుమల: తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఆదివారం ఉదయం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి పద్మారావు మాట్లాడుతూ శ్రీనివాసుని కృపతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. -
చిచ్చా.. జర పాన్ మానేయ్: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం నాటి కేసుకు సంబంధించి బుధవారం బోయిగూడ రైల్వే కోర్టులో హాజరయ్యేందుకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు పద్మారావు, కేటీఆర్ సహా పలువురు వచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. పద్మారావును కేటీఆర్ చిచ్చా అని పిలుస్తున్నారు. కేటీఆర్‌ను పద్మారావు రామ్ అని సంబోధిస్తారు. వీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నా ‘చిచ్చా.. జర పాన్ , జర్ధాలు తినడం మానేయ్’ అని కేటీఆర్.. పద్మారావుకు సలహా ఇస్తారట. కోర్టు ఆవరణలోనూ కేటీఆర్ ఇదే విధంగా పద్మారావుకు సూచించారు. దీనికి స్పందించిన పద్మారావు ‘రామ్.. నీకు ఏ అలవాటు లేకే గదా! నన్ను పాన్ మానేయ్ అంటున్నావ్. నువ్వు కూడా ఈ చాక్లెట్లు తినూ..’ అంటూ కేటీఆర్‌కు ఇవ్వబోయారు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వారు. -
‘అనుమతితోనే మైనింగ్ పనులు’
పెబ్బేరు: మండల పరిధిలోని వైశాఖాపూర్ పెద్దగుట్ట మైనింగ్ కు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని ఎస్వీఆర్ మినరల్స్ కంపెని యజమాని పద్మారావు అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దగుట్ట మైనింగ్ వ్యవహారం పై వైశాఖాపూర్ గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కేçసువేసినా కోర్టులో అన్ని అనుమతులు అందజేయడంతో కోర్టు కేసును కొట్టేసిందన్నారు.మైనింగ్ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని గ్రామస్తులు మైనింగ్ ఏడీ కి లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారన్నారు. కాని కొందరు గ్రామస్తులు మాత్రమే తప్పుడు ఆరోపణలతో అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.మైనింగ్ వద్ద మృతి చెందిన బాలుడు ప్రశాంత్ తల్లిదండ్రులు చిన్నఓబులేష్, లక్ష్మిదేవమ్మ లు మాట్లాడుతూ తన కుమారుడికి అనారోగ్యంతోనే మృతి చెందాడని తెలిపారు. బ్లాస్టింగ్ వల్ల మృతి చెందినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు తెలిపారు. -
'అన్ని దేవాలయాలకు రంగులు వేయిస్తాం'
హైదరాబాద్: ఏ ఒక్క శాఖనో కాకుండా అన్ని డిపార్ట్ మెంట్ల ఉద్యోగులు బోనాల నిర్వహణలో పాలుపంచుకుంటారని, ఏ ఏడాది ఉత్సవాల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నదని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులు చెప్పారు. ఆషాఢ బోనాల నిర్వహణకు ప్రభుత్వం చేస్తోన్న ఏర్పాట్లను సోమవారం హైదరాబాద్ లో మీడియాకు వివరించారు. సీఎం కేసీఆర్ బోనాలకు రూ.10 కోట్లు కేటాయించారని, ఈ నిధుల నుంచి హైదరాబాద్ నగరంలోని అన్ని దేశాలయాలకు రంగులు వేయించడంతోపాటు ఫ్లోరింగ్ ఇతరత్రా పనులు చేయిస్తామన్నారు. -
కొలువైన కేసీఆర్ మంత్రివర్గం
హైదరాబాద్ : తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కల సాకారమైంది. కేసీఆర్ మంత్రివర్గంలో తొలిగా 11మంది టీఆర్ఎస్ నేతలకు చోటు దక్కింది. గవర్నర్ నరసింహన్ సోమవారం 11మంది టీఆర్ఎస్ నేతలతో మంత్రులగా ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్ మంత్రివర్గం వివరాలు.... మహముద్ అలీ (ఎమ్మెల్సీ) తొలి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. మైనార్టీ వర్గానికి చెందిన అలీ.....రాజకీయ రంగప్రవేశానికి ముందే కేసీఆర్‌కు సన్నిహితుడు. 2001లో గులాబీ దళంలో చేరారు. మైనార్టీ వర్గాలను ఉద్యమం వైపు ఆకర్షించడంలో కీలకపాత్ర వహించారు. 2009లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2011లోనూ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. గతేడాది పార్టీ తరపున మండలికి ఎన్నికయ్యారు. ఇప్పుడు మైనార్టీ కోటా కింద క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. డా. తాటికొండ రాజయ్య (స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే) వరంగల్ జిల్లాకి చెందిన తాటికొండ రాజయ్య చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్. రాజకీయాల మీద ఉన్న ఆసక్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అలా కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజయ్య 1999 ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో టీడీపీ అభ్యర్థి అయిన కడియం శ్రీహరిపై గెలుపొందారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ లక్షణాలు నచ్చి 2001లో కాంగ్రెస్ పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాసలో చేరారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. తాజాగా జరిగిన 2014 ఎన్నికల్లో కూడా వరంగల్ జిల్లా స్టేషన్ ఘనాపూర్ నుంచి 58,862 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.- 1965, జూలై 12న జన్మించారు. స్వస్థలం - వరంగల్ జిల్లా తాటికొండ. విద్యార్హత - ఎంబీబీఎస్, 2009, 2011, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం. నాయిని నర్సింహారెడ్డి తొలి విడతలో పార్టీ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డికి చోటు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన నాయిని.. 1978లో తొలిసారిగా జనతాపార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్లో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచారు. తిరిగి 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌పై ముషీరాబాద్ నుంచి విజయకేతనం ఎగరవేశారు. అయితే 2009 సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొన్నాళ్లుగా పార్టీ పొలిట్‌బ్యూరో మెంబర్‌గా కొనసాగుతున్న నాయిని...మాస్ లీడర్‌గా మంచి గుర్తింపు పొందారు. పార్టీ సంక్షోభ సమయాల్లో అండగా నిలిచారు. సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. ఈటెల రాజేందర్ (హుజురాబాద్ ఎమ్మెల్యే) తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఈటెల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటెల.... ఉస్మానియా యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. విద్యార్థి నేతగా మంచి పేరున్న ఈటెల.... 2002లో టీఆర్ఎస్లో చేరారు. 2004లో కమలాపూర్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నియ్యారు. తర్వాత హుజూరాబాద్ నుంచి 2009 సాధారణ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ తిరుగులేని మెజార్టీతో గెలుపొందారు. ఆది నుంచి పార్టీలో కీలకపాత్ర వహిస్తున్న ఈటెల...పార్టీ శాసనసభాపక్షనేతగా కూడా పనిచేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ ఎమ్మెల్యే) తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పోచారం.....కాంగ్రెస్ కార్యకర్తగా రాజకీయ రంగప్రవేశం చేశారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చక 1984లో పార్టీని వీడి టీడీపీలో చేరారు. 1994లో తొలిసారిగా బాన్సువాడ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999లోనూ టీడీపీ టికెట్‌పై గెలుపొందిన పోచారం.... 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి 2009 ఎన్నికల్లో విజయబావుట ఎగరవేశారు. అయితే తెలంగాణ అంశం పట్ల పార్టీ తీరును వ్యతిరేకిస్తూ.... టీడీపీకి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2011లో టీఆర్ఎస్లో చేరారు. వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2014లోనూ సూపర్ విక్టరీ కొట్టిన పోచారం...కొన్నాళ్లుగా టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో మెంబర్‌గా కొనసాగుతున్నారు. ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గ పరిధిలో మాస్‌లీడర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. తన్నీరు హరీష్ రావు(సిద్దిపేట ఎమ్మెల్యే) తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తన్నీరు హరీష్‌రావు ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు స్వయాన మేనల్లుడైన హరీష్...1991 నుంచి మేనమామకు అండాదండాగా నిలిచారు. హరీష్ 2004లో తొలిసారిగా సిద్ధిపేట నుంచి అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికయ్యారు. జననం : 1972, జూన్ 3. స్వస్థలం : కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి. 2004, 2008, 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004 లో తొలిసారిగా వైఎస్సార్ కేబినెట్లో యువజన సర్వీసులు మంత్రిగా పనిచేశారు. పద్మారావు(సికింద్రాబాద్ ఎమ్మెల్యే) తెలంగాణ తొలి రాష్ట్ర మంత్రిగా టీ పద్మారావు ప్రమాణ స్వీకారం చేశారు. సికింద్రాబాద్‌కు చెందిన పద్మారావు..టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు. 2004లో సికింద్రాబాద్ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. అయితే 2009 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి జయసుధపై పోటి చేసి ఓడిపోయారు. తిరిగి 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ మాస్ లీడర్‌గా పద్మారావు మంచి పేరు తెచ్చుకున్నారు. పట్నం మహేందర్‌రెడ్డి (తాండూరు ఎమ్మెల్యే) తొలి తెలంగాణ రాష్ట్ర మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మహేందర్‌రెడ్డి...టీడీపీతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1994 సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా తాండూర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికయ్యారు. తర్వాత 2009, 2004 ఎన్నికల్లోనూ వరుసగా విజయబావుట ఎరగవేశారు. అయితే 2009 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. తెలంగాణపై పార్టీ అధినేత తీరును వ్యతిరేకిస్తూ టీడీపీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. 2014 ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. నియోజకవర్గంలోనే కాక జిల్లా స్థాయిలోనూ పట్నం మహేందర్‌రెడ్డి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కె. తారక రామరావు (సిరిసిల్ల ఎమ్మెల్యే) కల్వకుంట్ల తారకరామారావు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ అధినేత కుమారుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన కేటీఆర్...2009 ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల స్థానం నుండి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. 2014లో సిరిసిల్ల స్థానం నుంచి మరోసారి గెలుపొందారు. పార్టీలో చేరిక నుంచి యువతను ఆకర్షించడంలో కీలకపాత్ర వహించారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివినా కేటీఆర్..మంచి వాగ్ధాటి కలిగిన వ్యక్తి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు, ఉర్ధూ బాషాలను అనర్గలంగా మాట్లాడగలరు. జననం : 1976, జూలై 26. స్వస్థలం : మెదక్ జిల్లా చింతమడక. విద్యార్హత : ఎమ్మెస్సీ, ఎంబీఏ. 2009, 2010, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు. అమెరికాలో ఉద్యోగం వదిలి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. జోగు రామన్న (ఆదిలాబాద్ ఎమ్మెల్యే) తొలి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లో జోగు రామన్న చోటు దక్కించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రామన్న... 1984లో టీడీపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. జిల్లా వ్యాప్తంగా మంచి పేరున్న జోగు...2004 సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా ఓటమి పాలయ్యారు. తిరిగి 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే తెలంగాణ పట్ల అధినేత తీరును వ్యతిరేకిస్తూ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా 2011లో టీఆర్ఎస్లో చేరారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, 2014 సాధారణ ఎన్నికల్లోనూ కారు గుర్తుపై విజయం సాధించారు. జగదీశ్వర్ రెడ్డి (సూర్యాపేట ఎమ్మెల్యే) నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి జగదీశ్వర్ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా జగదీశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. 2001 పార్టీ ఏర్పాటులో కీలకపాత్ర వహించారు. 2009లో తొలిసారిగా హుజురాబాద్ అసెంబ్లీకి పోటీ చేసి ఓటిమి పాలయ్యారు. తిరిగి 2014 ఎన్నికల్లో సూర్యపేట స్థానం నుంచి పోటీ చేసి విజయబావుట ఎగరవేశారు. తెలంగాణ న్యాయవాదుల సంఘం ఏర్పాటులోనూ జగదీశ్వర్‌రెడ్డి కీ రోల్ పోషించారు. జిల్లాలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న జగదీశ్వర్‌రెడ్డి... కేసీఆర్ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు.