శ్రీవారిని దర్శించుకున్న టీ మంత్రి పద్మారావు, డీఎస్
Published Sun, Dec 4 2016 11:45 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
తిరుమల: తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఆదివారం ఉదయం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి పద్మారావు మాట్లాడుతూ శ్రీనివాసుని కృపతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు.
Advertisement
Advertisement