
తార్నాక : సికింద్రాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి చివరి దాకా పోరాడారు. అయితే, వివిధ కారణాలతో ఆ సీటుమరొకరికి వెళ్లిపోయింది. అలిగి కూర్చున్న ఆమెను ‘హస్తం’ పెదలు బుజ్జగించి కూటమి అభ్యర్థికి సహకరించాలని కోరగా.. అందుకామె ఓకే అన్నారు. అయితే, శుక్రవారం ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావు తార్నాకలో పర్యటించారు. ఇదే సమయంలో చంద్రారెడ్డి బర్త్‌డే విషయం తెలుసుకున్న పద్మారావు ఆయన ఇంటికి వెళ్లారు. శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ‘తమ్ముడూ.. మహాకూటమి ఎలాగూ హ్యాండిచ్చింది కదా! నాకు సపోర్టు చేసేందుకు చేయి కలపరాదే’.. అంటూ చంద్రారెడ్డిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment