‘అనుమతితోనే మైనింగ్ పనులు’
Published Thu, Jul 21 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
పెబ్బేరు: మండల పరిధిలోని వైశాఖాపూర్ పెద్దగుట్ట మైనింగ్ కు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని ఎస్వీఆర్ మినరల్స్ కంపెని యజమాని పద్మారావు అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దగుట్ట మైనింగ్ వ్యవహారం పై వైశాఖాపూర్ గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కేçసువేసినా కోర్టులో అన్ని అనుమతులు అందజేయడంతో కోర్టు కేసును కొట్టేసిందన్నారు.మైనింగ్ విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని గ్రామస్తులు మైనింగ్ ఏడీ కి లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారన్నారు. కాని కొందరు గ్రామస్తులు మాత్రమే తప్పుడు ఆరోపణలతో అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.మైనింగ్ వద్ద మృతి చెందిన బాలుడు ప్రశాంత్ తల్లిదండ్రులు చిన్నఓబులేష్, లక్ష్మిదేవమ్మ లు మాట్లాడుతూ తన కుమారుడికి అనారోగ్యంతోనే మృతి చెందాడని తెలిపారు. బ్లాస్టింగ్ వల్ల మృతి చెందినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు తెలిపారు.
Advertisement
Advertisement