పద్మారావుకు అన్ని పార్టీల మద్దతు  | Padmarao To Be New Deputy Speaker Of Telangana Assembly | Sakshi
Sakshi News home page

పద్మారావుకు అన్ని పార్టీల మద్దతు 

Published Sun, Feb 24 2019 3:13 AM | Last Updated on Sun, Feb 24 2019 3:13 AM

Padmarao To Be New Deputy Speaker Of Telangana Assembly - Sakshi

నామినేషన్‌ పత్రాలిస్తున్న పద్మారావు, కేటీఆర్, మంత్రులు, వివిధ పార్టీల నేతలు

సాక్షి, హైదరాబాద్‌: శాసససభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికను సోమవారం నిర్వహించనున్నారు. సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో డిప్యూటీ స్పీకర్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. డిప్యూటీ స్పీకర్‌ నామినేషన్ల దాఖలు గడువు శనివారంతో ముగియగా, పద్మారావు ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. పద్మారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలను కోరారు. ఆయన ఎన్నికకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. పద్మారావు నామినేషన్‌ దాఖలు ప్రక్రియలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంత్రులు దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement