ఆధార్‌తో 7 కోట్ల పాన్‌ నంబర్లు అనుసంధానం | Link your Aadhaar with PAN using SMS or Income Tax E-filing portal | Sakshi
Sakshi News home page

ఆధార్‌తో 7 కోట్ల పాన్‌ నంబర్లు అనుసంధానం

Published Wed, Jul 5 2017 1:00 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

ఆధార్‌తో 7 కోట్ల పాన్‌ నంబర్లు అనుసంధానం

ఆధార్‌తో 7 కోట్ల పాన్‌ నంబర్లు అనుసంధానం

గత నెలలో కోటికి పైగా అనుసంధానం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 7.36 కోట్ల మంది పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (పాన్‌) హోల్డర్లు తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. గత నెలలోనే ఏకంగా ఒక కోటి మంది పైగా అనుసంధానం చేసుకున్నట్లు ఆదాయ పన్ను విభాగం అధికారి వివరించారు.

ఆదాయ పన్ను రిటర్న్‌ల ఈ–ఫైలింగ్‌ కోసం జూలై 1 నుంచి ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం చేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మొత్తం 30 కోట్ల పైచిలుకు పాన్‌ హోల్డర్లు ఉండగా,  దాదాపు 115 కోట్ల మంది ప్రజానీకానికి ఆధార్‌ నంబర్లు కేటాయించడం జరిగింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement