తన కామెడీతో జనాలను పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు కమెడియన్ బాబూ మోహన్. సినిమాలతో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయ రంగంలోనూ అడుగుపెట్టాడు. అయినప్పటికీ ఆయనకు సినిమాల మీద ప్రేమ తగ్గలేదు. ప్రస్తుతం పలు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న బాబూ మోహన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'ఢిల్లీలో 'వన్స్‌మోర్' సినిమా షూటింగ్ చేస్తున్నాం. సెట్స్‌లో తనికెళ్ల భరణి పాన్ తింటున్నాడు. నన్ను రుచి చేయమన్నాడు. సరేనని ఒకటి నోట్లో పెట్టుకున్నా, కానీ ఛీఛీ అని దాన్ని ఊసేశా. విచిత్రంగా తర్వాతి రోజు నుంచి నేనే ఒక పాన్ ఇవ్వమని అడిగేవాడిని. అలా ఒకానొక దశలో రోజుకు 30 నుంచి 40 దాకా పాన్‌లు తినేవాడిని. సంగారెడ్డి వచ్చానంటే అక్కడ ఓ డబ్బాలో కచ్చితంగా పాన్ తినేవాడిని. నేను అక్కడ పాన్ కట్టించుకుంటానని తెలిసిన కొందరు ఓసారి అందులో విషాన్ని కలిపారు. నేను ఆ డబ్బా దగ్గరకు వెళ్లి పాన్ తీసుకుని కారులో వెళ్లాను. ఇక తిందామనుకునే సమయానికి ఫోన్ వచ్చింది. దయచేసి పాన్ తినకండి, అందులో విషం ఉందని చెప్పారు. వెంటనే పాన్ పక్కన పడేశాను. అంతలోనే మరో ఫోన్ కాల్ వచ్చింది. ఈసారి పాన్ కట్టే వ్యక్తి భార్య మాట్లాడుతూ.. తప్పయిపోయింది సార్, విషం కలిపిన పాన్ ఇవ్వమని మమ్మల్ని ఒత్తిడి చేశారంటూ ఏడ్చింది. రాజకీయాలు ఇంత ప్రమాదమా? అని అప్పుడు తెలిసొచ్చింది' అని చెప్పుకొచ్చాడు బాబూ మోహన్.
చదవండి: రాకెట్రీలో ఆ సీన్ మళ్లీ మళ్లీ చూశానన్న నెటిజన్, హీరో దెబ్బకు ట్వీట్ డిలీట్!
ప్రేయసితో హృతిక్ రోషన్ రోడ్ ట్రిప్, వీడియో చూశారా?
Comments
Please login to add a commentAdd a comment