
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి (పీఏసీ) సభ్యుడు డీఏ సోమయాజులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన మూడేళ్లుగా దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. పది రోజుల నుంచి ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడంతో శుక్రవారం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చేర్చారు.
శనివారం బీపీ పూర్తిగా పడిపోయి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ శేషగిరిరావు తెలిపారు. సోమయాజులు పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న విషయం తెలిసిన వెంటనే ‘సాక్షి’చైర్‌పర్సన్ వైఎస్ భారతీరెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, టీసీఎల్పీ నేత జానారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వాసిరెడ్డి పద్మ, డాక్టర్ ప్రఫుల్లారెడ్డి తదితరులు ఆస్పత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment