అభివృద్ధి కోసమే టీడీపీలోకి: ఎస్పీవై రెడ్డి | I am not a hardcore Politician, says spy reddy | Sakshi
Sakshi News home page

అభివృద్ధి కోసమే టీడీపీలోకి: ఎస్పీవై రెడ్డి

Published Mon, May 26 2014 2:35 AM | Last Updated on Tue, May 29 2018 2:55 PM

అభివృద్ధి కోసమే టీడీపీలోకి: ఎస్పీవై రెడ్డి - Sakshi

అభివృద్ధి కోసమే టీడీపీలోకి: ఎస్పీవై రెడ్డి

కేవలం తన ప్రాంత అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేవని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డి చెప్పారు.

సాక్షి, న్యూఢిల్లీ: కేవలం తన ప్రాంత అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేవని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తనకు సన్నిహితుడని, ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. తన ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. పార్టీ మారాలన్న ఆలోచనే తనకు లేదని, టీజీ వెంకటేశ్ సలహా మేరకు టీడీపీలో చేరినట్టు వెల్లడించారు.

ఆదివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీలోని ఏపీభవన్ సీఎం కాటేజీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు... ఎస్పీవై రెడ్డి మెడలో పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎస్పీవై రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నేను పార్టీని వీడడం వివాదాస్పదం అయినప్పటికీ.. ప్రజలు ముఖ్యమనుకున్నా. నేను హార్డ్‌కోర్ పొలిటిషియన్ కాదు. రాజకీయాలు నాకు వృత్తి కాదు ప్రవృత్తి మాత్రమే’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement