
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి(పాత చిత్రం)
అమరావతి: వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి జంప్ అయిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. బాబూ మాకు ఒక ఎంపీ సీటు ఇవ్వండని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యం సహకరించకపోయినా ఎంపీ సీటు కోసం రాజధాని అమరావతి చుట్టూ ప్రదిక్షణలు చేయాల్సి వస్తోంది. ఇదే విషయమై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితోనే తేల్చుకునేందుకు ఎస్పీవై రెడ్డి మంగళవారం కలిశారు. అనంతరం ఎస్పీవై రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
తాము ఎమ్మెల్యే సీటు అడగటం లేదని, కేవలం ఎంపీ సీటు మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా తన పేరు, మాండ్ర శివానందరెడ్డి పరిశీలిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఇప్పటి వరకు ఎవరి పేరు ఖరారు చేయలేదని బాబు చెప్పారని, అలాగే నంద్యాల ఎంపీ సీటు మా కుమార్తెకు అడిగినట్లు ఎస్పీవై తెలిపారు. రేపు మరోసారి సీఎం చంద్రబాబును కలిసి ఎంపీ సీటు అడుగుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment