
వైఎస్ జగన్ తో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి భేటి!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కర్పూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి శుక్రవారం సాయంత్రం కలువనున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై గత కొంతకాలంగా ఎస్పీవై రెడ్డి ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు వైఎస్ జగన్ తో భేటి కానున్నారు.
అయితే వైఎస్ జగన్ తో ఎస్పీవైరెడ్డి భేటి రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశానంతరం ఎస్పీవై రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.