హైదరాబాద్: నంద్యాల లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ఘనవిజయం సాధించారు. ఎస్పీవై రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూఖ్ను ఓడించారు. నంద్యాల నుంచి ఎస్పీవై రెడ్డి ఎంపీగా గెలవడమిది వరుసగా మూడోసారి. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఎస్పీవై రెడ్డి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు.