
ఎస్పీవై రెడ్డి
కర్నూలు: సమైక్యాంధ్ర ఛాంపియన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అని ఆ పార్టీ నేత, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అన్నారు. జగన్ చెప్పినట్లుగా సీఎం, మంత్రులు రాజీనామా చేసి ఉంటే, రాజకీయ సంక్షోభంతో తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చేది కాదని ఆయన చెప్పారు.
తమ ప్రాంత రైతులకు సాగునీటి కేటాయింపుల్లో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని కోరడం కోసం తాను సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిస్తే, దానిపై కొన్ని వార్తా చానెళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయని ఆయన నిన్న ఖండించిన విషయం తెలిసిందే. ఆ రకంగా ప్రసారం చేయడం బాధకలిగించిందని కూడా ఆయన చెప్పారు.