
అనకాపల్లి: బ్రాండిక్స్‌లో సీడ్స్ కంపెనీలో ప్రమాదకర వాయువు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై నిపుణుల కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది. 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే విషవాయువుల వ్యాప్తి జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ఈ వాయువుల్లో అమోనియం లేదని, ఉండి ఉంటే కళ్లకు మరింత ప్రమాదముంటుందని నిపుణుల బృందం భావిస్తోంది. సీడ్స్ కంపెనీలోని ఏసీ యూనిట్లన్నింటినీ కమిటీ పరిశీలించింది.
ఏసీ యూనిట్‌కు సంబం«ధించిన గ్యాస్, ఇతర డస్ట్‌లను పరిశీలించినట్టుగా సమాచారం. ఉద్యోగులను అస్వస్థతకు గురి చేసిన వాయువు ఎక్కడ నుంచి విడుదలైందన్న విషయం మాత్రం తేలాల్సి ఉంది. పొరుగున ఉన్న ఫార్మా కంపెనీల నుంచి విషవాయువు వస్తే ఆ కర్మాగారంలోని ఉద్యోగులు, మధ్యలో ఉన్న వివిధ వర్గాల వారికి ప్రమాదముండేది కాబట్టి దానిపై కూడా స్పష్టత రావడం లేదు. మరోవైపు బ్రాండిక్స్‌లో ఉన్న పలు యూనిట్లలో ప్రమాదకర రసాయనాలతో ఎటువంటి పనులు చేయరని ఇక్కడి యాజమాన్యం చెబుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే నిపుణుల బృందం స్పష్టమైన అంచనాకు రానుంది.
(చదవండి: ఇన్‌స్పెక్టర్ రాసలీలలు.. లవ్ యూ అంటూ ఆమెకు దగ్గరై.. ఆ తర్వాత..)
Comments
Please login to add a commentAdd a comment