Gas lekage
-
ప్రమాదానికి కారణం అమోనియం కాదా...?
అనకాపల్లి: బ్రాండిక్స్‌లో సీడ్స్ కంపెనీలో ప్రమాదకర వాయువు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై నిపుణుల కమిటీ దర్యాప్తు మొదలుపెట్టింది. 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే విషవాయువుల వ్యాప్తి జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. ఈ వాయువుల్లో అమోనియం లేదని, ఉండి ఉంటే కళ్లకు మరింత ప్రమాదముంటుందని నిపుణుల బృందం భావిస్తోంది. సీడ్స్ కంపెనీలోని ఏసీ యూనిట్లన్నింటినీ కమిటీ పరిశీలించింది. ఏసీ యూనిట్‌కు సంబం«ధించిన గ్యాస్, ఇతర డస్ట్‌లను పరిశీలించినట్టుగా సమాచారం. ఉద్యోగులను అస్వస్థతకు గురి చేసిన వాయువు ఎక్కడ నుంచి విడుదలైందన్న విషయం మాత్రం తేలాల్సి ఉంది. పొరుగున ఉన్న ఫార్మా కంపెనీల నుంచి విషవాయువు వస్తే ఆ కర్మాగారంలోని ఉద్యోగులు, మధ్యలో ఉన్న వివిధ వర్గాల వారికి ప్రమాదముండేది కాబట్టి దానిపై కూడా స్పష్టత రావడం లేదు. మరోవైపు బ్రాండిక్స్‌లో ఉన్న పలు యూనిట్లలో ప్రమాదకర రసాయనాలతో ఎటువంటి పనులు చేయరని ఇక్కడి యాజమాన్యం చెబుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే నిపుణుల బృందం స్పష్టమైన అంచనాకు రానుంది. (చదవండి: ఇన్స్పెక్టర్ రాసలీలలు.. లవ్ యూ అంటూ ఆమెకు దగ్గరై.. ఆ తర్వాత..) -
Atchutapuram Gas Leak: '124 మంది చికిత్స పొందుతున్నారు.. ఎవరికీ ప్రాణాపాయం లేదు'
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం సెజ్ గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను అనకాపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి పరామర్శించారు. 124 మంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుండగా.. వారిలో ఎవ్వరికీ ప్రాణాపాయం లేదన్నారు. మెరుగైన వైద్యం కోసం ఎనిమిది మందిని విశాఖ కేజీహెచ్‌కు తరలించామన్నారు. జరిగిన ప్రమాదంపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ముత్యాలనాయుడు, ఎంపీ సత్యవతి అన్నారు. చదవండి: (అనకాపల్లి గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం జగన్ ఆరా) ఈ మేరకు ఘటనపై మంత్రి ముత్యాలనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన సంఘటన దురదృష్టం. జరిగిన సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. వెంటనే అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి అస్వస్థతకు గురైన వారిని ఎన్టీఆర్ హాస్పిటల్‌కు తరలించాము. ప్రస్తుతం ఎన్టీఆర్ హాస్పిటల్లో 124 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. వారిలో ఎనిమిది మందికి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు పంపించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 50 బెడ్స్ కేజీహెచ్‌లో అదనంగా ఏర్పాటు చేశాము. జరిగిన ఘటనపై ఒక కమిటీ ఏర్పాటు చేశాము. జరిగిన ప్రమాదంపై విచారణ జరుగుతుంది. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం బాధితులకు అందుతోంది. ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదు. మెరుగైన వైద్యం కోసం ఎనిమిది మందిని కేజీహెచ్‌కు తరలించారు. పరిస్థితిని కలెక్టర్ అధికారులు దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎంపీ సత్యవతి తెలిపారు. చదవండి: (అచ్యుతాపురంలోని సెజ్‌లో గ్యాస్ లీక్! పలువురికి అస్వస్థత) -
కర్ణాటకలో విషవాయువు లీకేజీ... ఐదుగురి దుర్మరణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో చేపల ప్రాసెసింగ్ పరిశ్రమలో విషవాయువు లీకై ఐదుగురు కార్మికులు మరణించారు. శ్రీ ఉల్కా మత్స్య సంస్కరణ కర్మాగారంలో ఈ ప్రమాదం జరిగింది. 20 అడుగుల లోతున్న ట్యాంకు నుంచి చేపలను బయటకు తీసేందుకు ఆదివారం రాత్రి 8 మంది కార్మికులు దిగారు. చేపల వ్యర్థాలను తొలగించేందుకు వాడే విష వాయువు లీకవడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
గ్యాస్ లీక్ అవ్వడంతో.... దంపతులు మృతి!!
సత్తుపల్లిటౌన్: వంట చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి తీవ్రంగా గాయపడిన దంపతులు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన దంపతులు అడపా శ్రీరామమూర్తి (50), అడపా ఇంద్రకుమారి(44) నవంబర్ 30న ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఇంద్రకుమారికి మంటలు అంటుకోవడంతో ఆర్పేందుకు యత్నించిన భర్త శ్రీరామమూర్తి కూడా తీవ్రంగా గాయపడ్డారు. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) వారికి సత్తుపల్లిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా భర్త శ్రీరామమూర్తి మృతి చెందాడు. సాయంత్రం ఇంద్ర కుమారి మృతి చెందింది. చికిత్స పొందుతూ ఒకేరోజు దంపతులు మృతి చెందటంతో హనుమాన్‌నగర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడు శ్రీరామమూర్తి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి సతీశ్, రాజేశ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబానికి మున్నూరుకాపు సంఘం నియోజకవర్గ కోఆర్డినేటర్ మాధురి మధు, రామిశెట్టి సుబ్బారావు, రామిశెట్టి కృష్ణ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, తోట గణేశ్ సంతాపం తెలిపారు. (చదవండి: డాక్యుమెంట్ రైటర్లదే హవా..) -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘాటైన గ్యాస్ లీక్
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రైనేజీ పైపులకు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఎయిర్‌పోర్టు ఔట్‌పోస్ట్ సమీపంలో ఉన్న భవనంలో డ్రైనేజీ పైపులకు లీకేజీ రావడంతో ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ప్లంబర్లు నాగన్నగారి నరసింహారెడ్డి(42), జకీర్, ఇలియాస్ మరమ్మతులకోసం వచ్చారు. లీకేజీ భవనం పైఅంతస్తు నుంచి వస్తున్న పైపులో ఉండడంతో నిచ్చెన సాయంతో ఎక్కి ఫాల్స్ సీలింగ్ కొంతభాగం తొలగించి పైపులో యాసిడ్ పోశారు. దాంతో డ్రైనేజీ పైపు నుంచి ఘాటైన గ్యాస్ లీక్ కావడంతో నరసింహారెడ్డికి ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందగా జకీర్, ఇలియాస్‌లు అక్కడే పడిపోయారు. అధికారులు వారిని ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. -
సీఎం జగన్‌కు నివేదిక ఇచ్చిన హైపవర్ కమిటీ
-
ఎల్జీ గ్యాస్ లీకేజీపై హైపర్ కమిటీ నివేదిక
సాక్షి, తాడేపల్లి : విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తుది నివేదికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సమర్పించింది. సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రిని కలిసిన కమిటీ సభ్యులు, గ్యాస్ లీకేజీ ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యాయనం చేసి నివేదికను సమర్పించారు. అటవీ పర్యావరణం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ సభ్యులుగా హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మే 7న ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ ప్రమాదం జరిగిన తీరు, భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు మరోసారి పునరావృత్తం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు, సలహాలను కమిటీ తన నివేదికలో పొందుపరిచింది. (ప్రభుత్వం గొప్పగా వ్యవహరించింది) అలాగే ప్రభావిత గ్రామాల బాధిత ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, సీనియర్ జర్నలిస్ట్‌లు, అధికారులతో హైపవర్ కమిటీ చర్చించింది. నివేదిక సమర్పన సందర్భంగా విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వినయ్ చంద్, నగర కమిషనర్ ఆర్కే మీనా పాల్గొన్నారు. కాగా విశాఖ నగరంలోని గోపాలపట్నం శివారు ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలోని బహుళజాతి కంపెనీ ఎల్జీ పాలిమర్స్‌లో మే 7 వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో పెద్దఎత్తున విషవాయువు లీకై 12 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ వారాంత ప్రభుత్వ సహాయంతో చికిత్స పొంది కోలుకున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి బాధితులను ఆదుకుంది. -
ఇరాన్లో గ్యాస్ లీకేజీ: 19 మంది మృతి
టెహ్రాన్: ఇరాన్ రాజధానిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. టెహ్రాన్‌లోని ఓ మెడికల్ క్లినిక్‌లో మంగళవారం గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో క్లినిక్‌లో 25 మంది సిబ్బంది ఉన్నట్లు టెహ్రాన్ డిప్యూటీ గవర్నర్ రెజా గౌదర్జీ తెలిపారు. రెండు గంటలపాటు అగ్నిమాపక సిబ్బంది కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. (విశాఖలో విషాదం.. మరో గ్యాస్ లీక్..) కాగా ఇరాన్లో ఇది రెండవ ఘటన అని గతవారం కూడా టెహ్రాన్ సమీపంలో గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్కడి సైనిక ప్రదేశానికి సమీపంలో ఉన్న గ్యాస్ నిల్వ కేంద్రం వద్ద ట్యాంకర్ పేలీ మంటలు చెలరేగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగిందన్న దానిపై సమాచారం లేదు. -
గ్యాస్ లీక్ : సీఎం జగన్ సహాయం ఓ నిదర్శనం
సాక్షి, విశాఖపట్నం : ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతి చెందినవారికి సంబంధించి ఎనిమిది కుటుంబాలకు మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్య నారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్‌లు చెక్కులు అందించారు. మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. మొత్తం ఎనిమిది కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి కురసాల కన్నబాబు మాట్లడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విధంగా మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందించామన్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకులో జమచేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, సీఎం జగన్ వారికి రాసిన లేఖతో పాటు అందించామని తెలిపారు. ప్రస్తుతం ఎనిమిది కుటుంబాలకు చట్టపరమైన వారసులను గుర్తించామని, మిగిలిన నాలుగు కుటుంబాల వారసులు గుర్తించిన వెంటనే పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. (విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు చెక్కుల పంపిణీ) చెక్కల పంపిణీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ‘బాధితులను తక్షణమే ఆదుకోవాలని, వారికి అండగా నిలవాలని భావించి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటిరూపాయల పరిహారం ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆదివారం రాత్రి విశాఖపట్నంలో మంత్రులు, అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సోమవారం ఉదయమే మృతుల కుటుంబాలకు సహాయం అందించాలని ఆదేశించారు. మనస్సున్న మనిషిగా ఆయన స్పందించిన తీరుకు ఈ సహాయం ఓ నిదర్శనంగా చెబుతున్నాం. ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి గురించి సమీక్షించాం. డిశ్ఛార్జ్ చేయాల్సిన వారిని గుర్తించి వారిని సురక్షిత ప్రాంతానికి పంపిస్తాం. రేపు ఎక్కువ మందిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుందని వైద్య అధికారులు తెలియచేశారు. ఎవరైతే పూర్తిగా కోలుకుని ఇకపై ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యాధికారులు ధృవీకరిస్తారో వారిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ చేసిన అనంతరం వారికి కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారాన్ని అందిస్తాం. ఐదు గ్రామాలలో బాధితులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం అందిస్తామని సీఎం చెప్పారు. ఆ ప్రకారం గ్రామాలలోకి ప్రజలు తిరిగి వెళ్లిన వెంటనే వాలంటీర్లను ఇంటికి పంపించి పెన్షన్ మాదిరిగా ఇస్తున్నారో అదే విధంగా ఇంటివద్దకే పంపిస్తాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తప్పకుండా సహాయం అందించడం వైఎస్ జగన్ మార్క్. అందుకే వారందరికీ సేవలు తక్షణం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. సంఘటన ఏడో తేదీ జరిగితే కేవలం మూడురోజుల వ్యవధిలో బాధిత కుటుంబాలకు కోటిరూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన దృష్ట్యా పారిశ్రామిక భద్రతకు సంబంధించి నూతన విధానాన్ని తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని అన్నారు. బాధితులకు అండగా ఉంటాం : అవంతి శ్రీనివాస్ ‘ప్రజలు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టరీలో ఉన్న స్టైరిన్ గ్యాస్ పూర్తి అదుపులో ఉంది. దయచేసి సోషల్ మీడియా రూమర్స్ గాని, వదంతులు గాని ఎవ్వరూ కూడా నమ్మద్దు.ఐదు గ్రామాలలో రసాయనాలతో క్లీన్ చేసే కార్యక్రమం మున్సిపల్ సిబ్బంది ద్వారా జరుగుతోంది. సోమవారం రాత్రికి ప్రజలకు ఇబ్బంది లేకుండా భోజన వసతి కూడా ఏర్పాటు చేశాం. ప్రజలందరూ కూడ గ్రామాలలోకి వచ్చిన తర్వాత మెడికల్ క్యాంపులు కూడా పెట్టమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. అన్నిరకాల హెల్త్ చెకప్‌లు చేయించి వారికి పూర్తి అండగా ఉంటాం’ అని అన్నారు. ప్రగాఢసానుభూతి : మంత్రి ధర్మాన కృష్ణదాస్ ‘ఎల్జీ పాలిమర్స్ ప్రమాద సంఘటన చాలా దురదృష్టకరం. బాధితులు, చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాం.ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల చిత్తశుద్దితో పనిచేస్తున్న ప్రభుత్వం మాది. రాష్ర్టంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అనేకమంది నిపుణులతో కమిటీలు వేసి నివేదికలు తెప్పించుకున్న తర్వాత తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాధిత ఐదు గ్రామాల ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారుల అండగా ఉంటారు’ అని పేర్కొన్నారు. కంపెనీపైన మాకు ప్రేమలేదు: బొత్స సత్యన్నారాయణ ‘నిపుణుల సూచనల మేరకే ఐదు గ్రామాలలో శానిటైజ్ చేస్తున్నాం. సాయంత్రం నాలుగు గంటల తర్వాత మేం కూడా గ్రామాలకు వెళ్లి గ్రామస్తులను ఇళ్లల్లోకి తీసుకువెళ్తాం. కంపెనీ మెయింటెనెన్స్‌కు జిల్లా కలెక్టర్ మూడుషిఫ్ట్ లలో 15 మంది చొప్పున 45 పాసులు జారీచేశారు. ప్రమాదం జరిగినప్పుడు 15 మంది ఉన్నారు. కంపెనీపైన మాకు ప్రేమలేదు. ఇక్కడ ఉన్న ప్రజలపైన, వారి సంక్షేమం, ఈ ప్రాంతం భద్రత పైన మాత్రమే మాకు ప్రేమ ఉంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దాలనే ధ్యేయంగా పెట్టుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఎల్జీ పాలిమర్స్ కు ఎటువంటి నూతన అనుమతులు ఇవ్వలేదు. పాత అనుమతులతోనే పనిచేస్తోంది.’ అని స్పష్టం చేశారు. -
‘విచారణలో వాస్తవాలు వెలుగు చూస్తాయి’
సాక్షి, పశ్చిమగోదావరి : విశాఖలో స్టెరైన్ గ్యాస్ లీకేజ్ ఘటనపై మంత్రులు రంగనాథ రాజు, తానేటి వనిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై మంత్రులు మాట్లాడుతూ.. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఘటనపై అధికారులు, పోలీసులు తక్షణమే స్పందించి, బాధితులను ఆసుపత్రికి తరలించారన్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారని, స్టెరైన్ గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం వెంటనే విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. (విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం) బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో కలిసి విశాఖపట్నం వెళ్లారని, ఇలాంటి క్లిష్ట సమయంలో అందరూ బాధితులకు అండగా ఉండాలని కోరారు. లాక్డౌన్ సమయంలో ఎల్జి పాలిమర్స్ కంపెనీకి 45 డ్యూటీ పాసులు ఇచ్చామని, 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలో నిలువ ఉంచాల్సిన స్టెరైన్ గ్యాస్ నిర్వహణ లోపం వల్ల లీక్ అయినట్లుగా భావిస్తున్నామన్నారు. విచారణలో పూర్తి వాస్తవాలు వెలుగు చూస్తాయని తెలిపారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని, బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని మంత్రులు పేర్కొన్నారు. (గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన సీఎం జగన్ ) -
గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, కెమికల్ మినిస్ట్రీ కార్యదర్శిలతో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. గ్యాస్ లీకేజీ ఘటనపై గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ , మంత్రులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, కిషన్ రెడ్డి, కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్యాస్ లీకేజీ ఘటనకు దారి తీసిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ ఘటనపై ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్యాస్ ప్రభావం తగ్గింపు, బాధితులకు సహాయంపై ఈ కమిటీ చర్యలు తీసుకోనుంది. (చదవండి : విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం) మరోవైపు గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా అధికారులతో మాట్లాడానని మోదీ తెలిపారు. బాధితులను ఆదుకునేలా వెంటనే సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు ప్రధాని పేర్కొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామన్నారు. గ్యాస్ లీకేజీ ఘటనలో అస్వస్థకు గురైన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. (చదవండి : గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించిన సీఎం జగన్) -
విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. దాదాపు 200 మంది అస్వస్థతకు గురయ్యారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు. వారిలో ఇద్దరు వృద్దులు, ఎనిమిదేళ్ల చిన్నారి కూడా ఉన్నారు. మరోవైపు విషవాయువు ప్రభావంతో వెంకటాపురంలో బావిలో పడి గంగరాజు అనే వ్యక్తి మృతిచెందగా, మేడపై నుంచి పడి మరోకరు ప్రాణాలు కోల్పోయారు. గురువారం తెల్లవారు జామున గంటల సమయంలో పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు దాదాపు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. కాగా లీకైన రసాయన గాలి పీల్చడంతో అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో పాటు చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ నాయుడు తోట పరిసరాల్లో ఇల్లు ఖాళీ చేసి మేఘాద్రి గడ్డ డ్యామ్ వైపు పరుగులు తీశారు. కాగా రసాయన గాలి పీల్చడంతో కొంతమంది అస్వస్థతకు గురై అపస్మారకస్థితిలో రహదారిపైనే పడిపోయారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు లాక్డౌన్లో ఉన్న ఈ కంపెనీని తెరిపించే క్రమంలో తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా పరిశ్రమ నుంచి స్టెరైన్ అనే విష వాయువు లీకైనట్లు తెలుస్తుంది. అయితే గ్యాస్ లీకేజీ ఘటనపై అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో పాటు గ్యాస్ లీకేజీపై పోలీసులకు సమాచారమందించారు. తక్షణమై స్పందించిన అధికార యంత్రాంగం.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని భయంతో తలుపులు వేసుకొని ఉండిపోయిన ప్రజలను ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించి వేరే చోటికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన 15 మందిని ఆంబులెన్స్‌లో విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించగా, మరికొందరిని వేర్వేరు ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎక్కువగా చిన్నారులు, మహిళలు ఉన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌తో పాటు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కాగా ఎల్జి పాలిమర్స్‌లో రసాయన గ్యాస్ లీకైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్ వినయ్‌చంద్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రసాయన వాయువు విడుదలైన బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ.. ఎల్జీ పరిశ్రమలో స్టెరైన్ అనే రసాయన వాయువు లీకైందన్నారు. ఈ రసాయన వాయువు పీల్చి పలువురు అస్వస్థతకు గురవ్వగా వారిని హుటాహుటిన కేజిహెచ్ సహా ఇతర ఆస్పత్రులకు తరలించామన్నారు. వైద్య సేవలందించేందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. మరో 48 గంటలపాటు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ.. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందన్నారు. అధికారులు అప్రమత్తమై వెంటనే సహాయకచర్యలు చేపట్టారు.. బాధితులకు అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వాయువు పీల్చడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. బాధితులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అధిక సంఖ్యలోనే ఉన్నారన్నారు. కాగా తెల్లవారుజామున గ్యాస్ లీకేజీ కావడంతో ఎక్కువమంది అస్వస్థతకు గురయ్యారు. వాయువు లీకైన ప్రదేశాల నుంచి ప్రజల దూరంగా వెళితే బాగుంటుదని సూపరింటెండెంట్ వెల్లడించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విషాదం; గ్యాస్ లీకై ఏడుగురి మృతి
-
విషాదం; గ్యాస్ లీకై ఏడుగురి మృతి
సీతాపూర్ : కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ పైప్‌లైన్ లీకవడంతో పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందిన ఘటన గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలోని చోటుచేసుకుంది.కాగా మృతి చెందినవారిలో ముగ్గరు పిల్లలు ఉన్నట్లు తేలింది. స్థానికులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని తమ పరిధిలోకి తీసుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. జిల్లా ఎస్పీ ఎల్ఆర్ కుమార్ మాట్లాడుతూ.. బిస్వాన్ ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ పైప్‌లైన్ లీకై పేలుడు సంభవించిందని తెలిపారు. అయితే పేలుడు జరిగిన ప్రదేశం పక్కనే కార్పెట్ తయారీ కంపెనీ ఉండడంతో వాటికి మంటలు అందుకొని దట్టంగా పొగలు అలుముకున్నాయి. కాగా కార్పెట్ కంపెనీని ఆనుకొని ఏడుగురు పడుకొని ఉన్నారని , మంటలు వేగంగా వ్యాపించడంతో వారికి మంటలు అంటుకున్నాయని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న తాము లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పొగలు కమ్ముకొని దుర్వాసన రావడంతో మృతదేహాలను బయటికి తీయడంలో ఇబ్బందులకు గురయ్యామని ఎస్పీ వెల్లడించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు నష్ట పరిహారం కింద రూ. 4లక్షలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. -
కేశవదాసుపాలెంలో గ్యాస్ లీక్
సఖినేటిపల్లి : కేశవదాసుపాలెంలో ఉన్న నంబర్–11 ఓఎన్జీసీ బావికి సంబంధించిన గ్యాస్ పైపు సోమవారం ఉదయం లీకైంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక జీసీఎస్ నుంచి ఓఎన్జీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. లీకేజీ అదుపు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామంలోని చెల్లంకొండ పుత్రయ్య, నానికి చెందిన కొబ్బరితోటల సమీపంలో ఈ లీకేజీ ఏర్పడింది.