సాక్షి, గుంటూరు: విశాఖ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'ఇప్పటికే ఎల్‌జీ కంపెనీపై కేసులు నమోదు చేశాం. బాధితులకు ఎవరూ ఊహించనంతగా నష్టపరిహారాన్ని ఇచ్చాము. అయినప్పటికీ ప్రభుత్వంపై బురద జల్లడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు.
అదేవిధంగా.. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేదం అమలుకు కృషి చేస్తున్నాం. పేదవాళ్లకు మద్యం అందుబాటులో లేకుండా చేస్తున్నాం. ఈ సందర్భంగా మద్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మహిళలు అభినందిస్తున్నారని' మంత్రి సుచరిత పేర్కొన్నారు. చదవండి: కోవిడ్: 75శాతం కేసులు అలాంటివే..!
Comments
Please login to add a commentAdd a comment