‘ఇప్పట్లో చంద్రబాబు కోలుకోవడం కష్టమే’ | Deputy CM Narayanaswamy Slams On Chandrababu In Chittoor | Sakshi
Sakshi News home page

‘విమర్శించే అవకాశం లేదని బాధలో ఉన్నారు’

Published Fri, May 8 2020 7:43 PM | Last Updated on Fri, May 8 2020 7:59 PM

Deputy CM Narayanaswamy Slams On Chandrababu In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు: విశాఖ గ్యాస్‌ లీకేజీ‌ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌మెహన్‌రెడ్డి స్పందించిన తీరు దేశానికే ఆదర్శమని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటీ వరకు వైఎస్‌ జగన్‌లా స్పందించలేదన్నారు. ఆయన స్పందించిన తీరు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును వెంటిలేటర్‌పై పడేలా చేసిందని విమర్శించారు. ఇక ఇప్పట్లో చంద్రబాబు కోలుకోవడం కష్టమే అని ఆయన ఎద్దేవా చేశారు. గ్యాస్‌ లీకేజీ ఘటనపై సీఎం జగన్‌ వెంటనే స్పందించి ఆగమెఘలా మీద చర్యలు తీసుకున్నారన్నారు. దీంతో ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలపై విమర్శలు చేసే అవకాశం పోయిందని చంద్రబాబులో బాధ నెలకొందని ఆయన విమర్శించారు. (బాబు ఈ జన్మకు మారరు)

గ్యాస్‌ లీకేజీ ఘటన : హైపవర్‌ కమిటీ ఏర్పాటు

గ్యాస్ లీక్‌ ఘటన: ఎక్స్‌‌గ్రేషియా విడుదల

గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ ప్రారంభం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement