![Vijaya Sai Reddy Criticizes Chandrababu Naidu - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/13/vsr.jpg.webp?itok=bRzz_w3y)
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గ్యాస్ లీక్ ప్రమాదంపై చంద్రబాబు తన పార్టీ తరపున కమిటీ వేసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. '40 ఇయర్స్ ఇండస్ట్రీని ఆ గ్యాస్ ఏమిటో నాకే అంతుబట్టలేదు. ఐఏఎస్ అధికారులకేం సబ్జెక్ట్ నాలెడ్జి ఉంటుంది' అనే వంకర కామెంట్లు చేయడమే అచ్చెన్న కమిటీని నవ్వులాటగా మార్చింది' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. కాగా.. ఏపీ ప్రభుత్వం ఐఏఎస్‌లతో వేసిన కమిటీని కాదని చంద్రబాబు తమ పార్టీ నాయకులైన కింజరపు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడుతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే.
చదవండి: 'బాబు ఆ రోజైనా రాజకీయ సన్యాసం ప్రకటించు'
Comments
Please login to add a commentAdd a comment