కోటి సాయానికి ‘నగరమే’ నాంది | People prises CM YS Jagan About compensation of Rs 1 crore | Sakshi
Sakshi News home page

కోటి సాయానికి ‘నగరమే’ నాంది

Published Sat, May 9 2020 3:40 AM | Last Updated on Sat, May 9 2020 3:40 AM

People prises CM YS Jagan About compensation of Rs 1 crore - Sakshi

నగరంలో గ్యాస్‌ విస్ఫోటం (ఫైల్‌)

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: విశాఖపట్నం గ్యాస్‌ దుర్ఘటన మృతులకు రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రీతిలో పరిహారం ప్రకటించడానికి 2014 జూన్‌ 27న తూర్పుగోదావరి జిల్లా నగరంలో జరిగిన గ్యాస్‌ పైప్‌లైన్‌ విస్ఫోటం ఘటనే కారణమైందని చెప్పవచ్చు. అప్పట్లో ఈ దుర్ఘటన జరిగిన మరుక్షణమే ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాటి ఘటనలో 22 మంది అగ్నికి ఆహుతైపోవడాన్ని చూసి చలించిపోయారు. అప్పటి పాలకుల తీరును ఆక్షేపించారు. 

ఆ సందర్భంలో వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..
► చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేం.. వారికి ఎంత సాయం చేసినా అది స్వల్పమే అవుతుంది. మృతుల కుటుంబాల పరిస్థితిని ప్రభుత్వాలు మానవీయ కోణంలో పరిశీలించి ఆదుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక కోణంలో చూడరాదు. మృతుల కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి. 
► శరీరమంతా పూర్తిగా కాలిపోయి.. ముందు ముందు ఏ పనీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి రూ.25 లక్షలు (ఇందులో బాబు సర్కారు ఇచ్చింది రూ.3 లక్షలే) ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. బాధితుల పరిస్థితి గురించి చంద్రబాబునాయుడు, కేంద్ర ప్రభుత్వం, గెయిల్, ఓఎన్‌జీసీ ఆలోచించాలి. 
► ఈ నష్ట పరిహారం సరిపోదు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఇతర దేశాల్లో ఎలాంటి నష్టపరిహారం ఇస్తున్నారో వెళ్లి చూడండి. ఆ కంపెనీలకు భయం కలిగించేలా ఆ పరిహారం ఉంటుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement