Toxic gases
-
ఏడుగురిని బలిగొన్న విష వాయువులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, పాడేరు/పెదబయలు: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి. రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఆయిల్స్‌లో విష వాయువులు ఏడు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. వంట నూనెల కర్మాగారానికి చెందిన ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ట్యాంక్‌లోకి దిగిన కార్మికులు ఒకరి తర్వాత ఒకరుగా అరగంట వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. మృతులలో ఐదుగురు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లోని పెదబయలు మండలానికి చెందిన వారు కాగా, ఇద్దరు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు వాసులు. మృతులంతా రోజు వారి కూలీలే. అంతా 45 ఏళ్ల లోపు వారే.. గురువారం ఉదయం 7 – 7.30 గంటల మధ్య ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్దాపురం పరిసర గ్రామాల నుంచి స్థానికులు బాధిత కుటుంబాలకు మద్ధతుగా ఫ్యాక్టరీ వద్దకు తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా తోడ్పాటు అందివ్వాలని కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కుంటుంబానికి రూ.25 లక్షలు వంతున పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, ప్రత్యక్ష సాకు‡్ష్యలు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉక్కిరి బిక్కిరి.. జి రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఆయిల్స్ ఫ్యాక్టరీ ఆవరణలోని ఏడు ఆయిల్ ట్యాంకర్లలో ఐదో నంబర్ ట్యాంక్‌ను గురువారం శుభ్రం చేయాలనుకున్నారు. 24 అడుగుల లోతున్న ఈ ట్యాంక్‌లో అడుగున ఉండే వంట నూనె మడ్డిని తొలగించేందుకు వీరు ట్యాంక్‌లోకి దిగారు. ట్యాంకులో నిల్వ చేసిన నూనెను ప్యాకింగ్‌కు తరలించిన తర్వాత క్లీన్ చేశాకే తిరిగి మరోసారి ఆయిల్‌తో నింపుతుంటారు. అలా ఖాళీ అయిన ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు ఎనిమిది మంది కార్మికులను ప్లాంట్ సూపర్వైజర్ రాజు పురమాయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరూ ట్యాంక్‌లోకి దిగారు. తొలుత ట్యాంక్‌లోకి దిగాక, కళ్లు తిరిగి ఊపిరాడక పోవడంతో బయటకు వచ్చిన వెచ్చంగి కిరణ్ మాత్రమే ప్రాణాలతో బయట పడ్డాడు. ఇతని పరిస్థితి గమనించి కూడా, మిగతా వారిని లోపలకు దింపడం దారుణం అని మిగతా కార్మికులు మండిపడుతున్నారు. ట్యాంక్‌లో ఆక్సిజన్ 20 శాతం లోపు ఉండటంతోనే కార్బన్ డయాక్సైడ్, మోనాక్సైడ్‌తో కూడిన విష వాయువులు కమ్మేసి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ ‘సాక్షి ప్రతినిధి’కి చెప్పారు. ఈ ఫ్యాక్టరీలో ట్యాంకుల్లో నిల్వ చేసుకునేందుకు అనుమతి ఉందా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇక్కడున్న ఏడు ట్యాంకులన్నీ 18 నుంచి 24 అడుగుల లోతున ఉన్నాయి. మృతులను బయటకు తీసుకువచ్చేందుకు ట్యాంకర్‌ను కట్ చేయాల్సి వచ్చింది. ఫ్యాక్టరీ సీజ్.. దర్యాప్తునకు ఆదేశం కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కృతికా శుక్లా, ఎం రవీంద్రనాథ్‌బాబు రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఫ్యాక్టరీని సీజ్ చేసి, కార్యకలాపాలను నిలిపివేశారు. యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ మొత్తం ఘటనపై విచారణకు జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ఫ్యాక్టరీస్, కార్మిక శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేశారు. త్వరగా విచారణ పూర్తి చేసి, నివేదిక అందజేయాలని ఆదేశించారు. కాగా, పెద్దాపురం వద్ద కూడా ఇదే యాజమాన్యం ఏఎస్ ఆయిల్స్ పేరుతో మరో ఫాక్టరీని నడుపుతోంది. అందరూ రెక్కాడితే కానీ డొక్కాడని వారే.. మృతులంతా పొట్టకూటి కోసం వలస వచ్చిన వారే. రోజువారీ రూ.650 చొప్పున పని చేస్తున్నారు. ప్యాకింగ్ సెక్షన్లో పని చేసే వారిని ట్యాంక్‌లు శుభ్రంచేసే పనికి పురమాయించడం వల్లే అవగాహన లేక చనిపోయారని మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఇక తమకు ఎవరు దిక్కంటూ జగదీష్, ప్రసాద్ కుటుంబ సభ్యులు మృతదేహాల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం కోసం ఇద్దరి మృతదేహాలను పెద్దాపురం ఆస్పత్రికి, ఐదుగురి మృతదేహాలను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పారు. బాధితులకు అండగా సీఎం జగన్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి మరో రూ.25 లక్షలు వంతున ఇచ్చేలా ఒప్పించారు. మొత్తంగా ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబంలో అర్హులైన వారికి పింఛన్ సహా ఇతర ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్మికుల మృతి విచారకరం : గవర్నర్ సాక్షి, అమరావతి : కాకినాడ జిల్లా జి.రాగంపేటలోని అంబటి ఆయిల్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందడంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారని రాజ్‌భవన్ వర్గాలు గురువారం ఓ ప్రకటరలో పేర్కొన్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నలుగురికి 20 మంది పిల్లలు పెదబయలు మండలానికి చెందిన దగ్గరి బంధువులు ఐదుగురి మృతితో మన్యంలో విషాదం నెలకొంది వీరంతా సంక్రాంతి పండగకు స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడిపారు. రెండు వారాల క్రితమే ఫ్యాక్టరీకి తిరిగి వెళ్లారు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొర్రా రామారావుకు భార్య కొమాలమ్మ, ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ చిన్న వయసు వారే. వెచ్చంగి కృష్ణారావుకు భార్య లక్ష్మితో పాటు నలుగురు పిల్లలు. కుర్తాడి బొంజన్నకు భార్య నీలమ్మతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. వెచ్చంగి సాగర్‌కు వివాహం కాలేదు. తల్లిదండ్రులు సీతారామ్, సత్యవతి, చెల్లెళ్లు ఇతనిపైనే ఆధారపడి ఉన్నారు. నర్సింగరావుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. మృతులు వీరే.. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పెదబయలు మండలం పరేడ∙ గ్రామ పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన వెచ్చంగి కృష్ణారావు (36), వెచ్చంగి నరసింగరావు (40), వెచ్చంగి సాగర్ (23), ఉంచేడుపుట్టు గ్రామం కురుతాడుకు చెందిన కుర్తాడి బొంజుబాబు(35), బాండపల్లి గ్రామ పంచాయతీ సంపాపుట్టు గ్రామం కొర్రా రామారావు (45), పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన కట్టమూరి జగదేష్ (25), యల్లమిల్లి ప్రసాద్ (27). పెదబయలు మండలానికి చెందిన ఐదుగురూ దగ్గర బంధువులు. ఒక్కొక్కరం లోపలకు దిగేశాము. ఏదోలా అనిపించింది. వెంటనే ఊపిరాడక కళ్లు బైర్లు కమ్మేశాయి. ట్యాంక్ లోపల అరస్తూ పడిపోతున్న కృష్ణారావును పైకి లాగుదామనుకున్నా. అయితే అప్పటికే నాలో శక్తి సన్నగిల్లింది. ఎలాగోలా మిచ్చెన పట్టుకుని బయటికొచ్చి పడిపోయాను. – ప్రత్యక్ష సాక్షి కిరణ్ -
పదో గనిలో విషవాయువులు
రామగిరి(మంథని): సింగరేణి సంస్థ అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా(ఏపీఏ)లోని పదో గనిలో సోమవారంరాత్రి నైట్‌షిఫ్టు నుంచి విషవాయువులు వెలువడుతున్నాయి. ఆ సమయంలో గని లోపల కార్మికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. బొగ్గునిల్వలు పూర్తిగా వెలికితీయడంతో ఆ గనిని ఇటీవలే మూసివేశారు. సింగరేణి సంస్థ ఆర్జీ–3 పరిధిలోని ఓసీపీ–1 విస్తరణకు అనుసంధానం చేసేందుకు గని లోపల డ్యాం నిర్మాణ పనులు చేపట్టారు. అయితే అత్యవసర విధుల నిమిత్తం కొద్దిమంది కార్మికులు మాత్రమే హాజరవుతున్నారు. ఈ క్రమంలో గనిలోని 4 సీమ్, 27 డిప్, 51 లెవెల్ ప్రాంతంలో విషవాయువులు వెలువడడాన్ని వారు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. సంబంధిత గని అధికారులు ఈ విషయాన్ని డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, జీఎం సేఫ్టీ (కార్పొరేట్) కె.గురవయ్య, ఏపీఏ జీఎం ఎన్.వి.కె. శ్రీనివాస్, జీఎం సేఫ్టీ(రామగుండం రీజియన్)కు వివరించారు. -
నాచు.. భయపెడుతోంది!
కరీబియన్ దీవులు.. ప్రకృతి అందాలకు మారుపేరు. భువిలో స్వర్గంగా పేరుగాంచాయి. అలాంటి కరీబియన్ తీర ప్రాంతాలను ఇప్పుడు సముద్రపు నాచు తీవ్రంగా కలవరపెడుతోంది. సర్గాసమ్ అనే రకం నాచు విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి కరీబియన్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, సెంట్రల్ వెస్ట్, ఈస్ట్ అట్లాంటిక్‌లో 24.2 మిలియన్ టన్నుల నాచు పేరుకుపోయినట్లు అంచనా. ప్రమాదకరమైన ఈ నాచు జీవజాలానికి, పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తోంది. తీర ప్రాంతాల నుంచి విషపూరిత వాయువులు వెలువడుతున్నాయి. అంతేకాదు పర్యాటకం సైతం దెబ్బతింటోంది. పర్యాటకుల సంఖ్య నానాటికీ పడిపోతోంది. ఫలితంగా ఉపాధి కోల్పోతున్నామని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం కరీబియన్ తీరంలోని నాచును పక్కపక్కనే పేరిస్తే అది ఫ్లోరిడా గల్ఫ్ తీరంలోని టాంపా బే వైశాల్యం కంటే ఆరు రెట్లు అధికంగా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకు చెందిన పరిశోధకుడు చువాన్మిన్ హూ చెప్పారు. ఒకప్పుడు జనంతో కళకళలాడిన బీచ్‌లు నాచు కారణంగా వెలవెలబోతున్నాయని, అక్కడ వ్యాపారాలు దారుణంగా పడిపోతున్నాయని యూఎస్ వర్జిన్ ఐలాండ్స్ గవర్నర్ ఆల్బర్ట్ బ్రియాన్ చెప్పారు. తమ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని వాపోయారు. కరీబియన్ బీచ్‌లను నాచురహితంగా మార్చాలని, ఇందుకు సమయం పడుతుందన్నారు. మెక్సికోలో 18 బీచ్‌ల్లో నాచు తిష్ట సముద్ర ఉపరితలంపై నాచు దట్టంగా పేరుకుపోతుండడంతో నౌకలు, పడవల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. చేపల వేట సైతం ఆగిపోతోంది. సర్గాసమ్ నాచు వల్ల అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్లో ముక్కుపుటలు అదిరిపోయే దుర్గంధం వెలువడుతుండడంతో అటువైపు వెళ్లేందుకు సాధారణ జనంతోపాటు మత్స్యకారులు కూడా జంకుతున్నారు. ఈ వాసనను పీలిస్తే తల తిరగడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, గుండె కొట్టుకోవడంలో హెచ్చతగ్గులు వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నాచు నిర్జీవమైపోయిన తర్వాత సముద్రంలో అడుగు భాగానికి చేరుకుంటుంది. దీనివల్ల విలువైన పగడపు దిబ్బలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. మెక్సికోలో 18 బీచ్‌లు నాచుతో నిండిపోయినట్లు గుర్తించారు. గత నెలలో యూఎస్ వర్జిన్ ఐలాండ్స్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారంటే నాచు ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్గాసమ్ నాచు ఇంతలా వ్యాప్తి చెందడానికి కారణం ఏమిటంటే.. బలంగా వీస్తున్న ఈదురు గాలులు, సముద్రపు అలల ఉధృతి. దక్షిణ అట్లాంటిక్ వాతావరణం నాచు పెరుగుదలకు అనుకూలంగా ఉందని అంటున్నారు. నాచు వల్ల కేవలం నష్టాలే కాదు, లాభాలూ ఉన్నాయి. పీతలు, డాల్ఫిన్లు, సీల్స్, చేపలు వంటి సముద్ర జీవులకు ఇది ఆహారంగా ఉపయోగడుతోంది. సంక్షోభంలోనూ అవకాశం అంటే ఇదే. నాచును సేకరించి, ఎరువు తయారు చేయొచ్చు. కొన్ని దేశాల్లో నాచును సలాడ్ల తయారీకి ఉపగియోస్తారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఆయువు తీసిన వాయువు.. తోటి కార్మికుడు ఎంతకూ బయటకు రాకపోవడంతో..
పరవాడ (పెందుర్తి): విశాఖ జిల్లా పరవాడ మండలంలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో రాంకీ ఇంటర్మీడియట్ పంప్ హౌస్ వద్ద ఆదివారం రాత్రి విష వాయువులు లీకై ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. పాయకరావుపేటకు చెందిన మణికంఠ(22), తూర్పు గోదావరి జిల్లా తునికి చెందిన అన్నంరెడ్డి దుర్గాప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. రాత్రి 10.05 గంటల సమయంలో దుర్గాప్రసాద్ పంప్ హౌస్ లోపలికి వెళ్లి మ్యాన్ హోల్ తెరవగా.. వాల్వ్ నుంచి అధిక మొత్తంలో విష వాయువులు లీకై గది నిండా వ్యాపించాయి. దీంతో దుర్గాప్రసాద్ ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు. అతడు ఎంతకీ బయటకు రాకపోవడంతో మణికంఠ గది లోపలికి వెళ్లాడు. అతను కూడా విష వాయువులను పీల్చడంతో ఊపిరాడక పడిపోయాడు. ఇద్దర్నీ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మరణించారు. రాంకీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.27 లక్షల చొప్పున పరిహారం, దహన సంస్కారాల నిమిత్తం రూ.50 వేల చొప్పున చెల్లించేందుకు రాంకీ యాజమాన్యం అంగీకరించింది. -
బాబోయ్.. మేం భరించలేం..ఊపిరాడట్లే!
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 51 కాలనీల్లో రాత్రివేళల్లో శివారు పరిశ్రమలు వెదజల్లుతున్న విష వాయువులతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రిపూట ఊపిరి తీసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఆయా పరిశ్రమల ఆగడాలపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తక్షణం సదరు పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులను వేడుకుంటున్నారు. ప్రధానంగా బాచుపల్లి, నిజాంపేట్, మియాపూర్, హఫీజ్‌పేట్, కొండాపూర్, మదీనాగూడ, లింగంపల్లి, గచ్చిబౌలి, బీహెచ్ఈఎల్, అమీన్పూర్ ప్రాంతాలవాసుల అవస్థలు అన్నీఇన్నీ కావు. కొంత కాలంగా కేవలం రాత్రి వేళల్లోనే ఇలాంటి విషవాయువుల వాసనతో తలనొప్పి, వాంతులు, శ్వాసకోశ సమస్యలతో అవస్థలు పడుతున్నట్లు పీసీబీ దృష్టికి తీసుకురావడం గమనార్హం. చదవండి: Huzurabad Bypoll: ఈ ఎన్నిక చాలా ఖరీదు గురూ! పారిశ్రామిక వాడలకు సమీప ప్రాంతాల్లోనే.. గ్రేటర్‌తో పాటు శివార్లలోని పలు ప్రాంతాలు వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ప్రధానంగా కాటేదాన్, జీడిమెట్ల, పటాన్చెరు, కుత్బుల్లాపూర్, మల్లాపూర్, బాలానగర్, భోలక్‌పూర్ తదితర ప్రాంతాల్లో బల్క్‌డ్రగ్, ఫార్మా, ప్లాస్టిక్, ఆయిల్, లెడ్, బ్యాటరీ, ట్యానింగ్, బ్లీచింగ్ అండ్ డైయింగ్, పొగాకు, పెయింట్స్, మీట్ ప్రాసెసింగ్, పెస్టిసైడ్స్, క్రాఫ్ట్ పేపర్ తదితర పరిశ్రమలున్నాయి. ఆయా పారిశ్రామిక వాడల నుంచి రాత్రివేళల్లో విష వాయువులను వెదజల్లుతుండడంతో ఈ ప్రాంతాలకు దగ్గరున్న కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నగరానికి ఆనుకొని ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డుకు ఆవల 30 కి.మీ దూరం తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడకపోవడంతో పీసీబీకి ఫిర్యాదులు తరచూ వెల్లువెత్తుతున్నాయి. చదవండి: డెలివరీ బాయ్ నిర్వాకం.. ప్రేమించడం లేదని ఇంట్లో ఎవరూ లేని టైంలో పరిశ్రమల ఆగడాలిలా.. ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకరమైన ఘన, ద్రవ, రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఇందులో తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టిపుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్లు (ఎంఈఈ), ఆర్ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాంటి ఏర్పాట్లు మృగ్యం. గాఢత అధికంగా ఉన్న వ్యర్థ జలాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టంచేస్తున్నా..పలు పరిశ్రమలకు ఈ ఊసే పట్టడంలేదు. ఆయా పరిశ్రమల్లో వెలువడే ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని డంపింగ్ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని పలు పరిశ్రమల యాజమాన్యాలు గాలికొదిలేశాయి. ఘన,ద్రవ వ్యర్థాలను శుద్ధికేంద్రాలకు తరలించేందుకు భారీగా వ్యయం చేయాల్సి రావడంతో అక్రమార్కులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. -
ఎల్జీకి అనుమతులు టీడీపీ నిర్వాకమే
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లోని ఇంద్రభవనంలో సేద తీరుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆయనకు అలవాటైన రీతిలో దగాకోరు, దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ సలహాదారు( ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. విశాఖలో జరిగిన ప్రమాదంపై రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతూ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎల్జీ పాలిమర్స్‌కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటూ నిస్సిగ్గుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏమన్నారంటే.. 7 ఏళ్ల పాటు అనుమతులిచ్చిన టీడీపీ సర్కారు ► ఎల్జీ పాలిమర్స్ సంస్థ విస్తరణ, ఉత్పత్తి ప్రారంభించడానికి 2018లో చంద్రబాబు సర్కారే అనుమతులు ఇచ్చింది. కంపెనీ విస్తరణ కోసం కన్సెంట్ ఆఫ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ఎల్జీ పాలిమర్స్ 2018, నవంబర్ 29న దరఖాస్తు చేయగా అదే ఏడాది డిసెంబర్ 7న తనిఖీలు నిర్వహించారు. 2018 డిసెంబర్ 21న కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో మొక్కుబడిగా చర్చించి డిసెంబర్ 27నే అనుమతులు జారీ చేసేశారు. ► ఏకంగా ఏడేళ్లపాటు అనుమతులు ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2018, డిసెంబర్ 27న ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పర్యావరణశాఖ అనుమతులు లేకుండానే టీడీపీ ప్రభుత్వమే అనుమతులిచ్చేసింది. దీంతోనే ఆ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించింది. ఇవన్నీ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రికార్డుల్లో ఉన్న వాస్తవాలే. సింహాచలం భూములు కట్టబెట్టిన బాబు ► సింహాచలం దేవస్థానానికి చెందిన 162 ఎకరాలను ఎల్జీ పాలిమర్స్‌కు కట్టబెడుతూ 2015లో చంద్రబాబు ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చింది. ఆమేరకు ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు వీలుగా డీ నోటిఫై చేస్తూ 2015 ఆగస్టు 17న టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో తాము ఆ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. ఎల్జీ పాలిమర్స్ ఆ భూములకు సంబంధించి వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందిస్తూ తగిన నిర్ణయం తీసుకోమని మాత్రమే చెప్పింది. ఆ సాకుతో చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఆ భూములను ఎల్జీ పాలిమర్స్‌కు కట్టబెట్టేసింది. ► సింహాచలం దేవస్థానం భూములకు సంబంధించి వేలాది మంది సామాన్యులకు ప్రయోజనం కల్పించేలా పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తానని 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నా పట్టించుకోలేదు. ఎల్జీ పాలిమర్స్‌కు మాత్రం ఆగమేఘాల మీద 162 ఎకరాలను ధారాదత్తం చేశారు. -
ఆపదలో ఆదుకుంది
మహారాణిపేట/ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): విష వాయువు లీకేజీ ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలుత సోమవారం 8 కుటుంబాలకు బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగాయి. రూ.కోటి చొప్పున పరిహారాన్ని జమ చేసినట్లు గోపాలపట్నం తహసీల్దార్ బి.వి.రాణి తెలిపారు. నలుగురు మృతుల కుటుంబ సభ్యులకు కేజీహెచ్‌లో మంత్రులు పరిహారానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. ప్రభుత్వం ఆదుకుంది.. కష్టాల్లో ఉన్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంది. ఘటన జరిగిన ఐదు రోజుల లోపే పరిహారం చెల్లించింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె చనిపోవడం బాధగా ఉంది. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. మమ్మల్ని అన్ని వి«ధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం. ఇలాంటి సీఎం నిండు నూరేళ్లు జీవించి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలి. – గండబోయిన శ్రీనివాస్ (శ్రియ తండ్రి) ఏ ప్రభుత్వమూ ఇలా స్పందించలేదు... గతంలో ఏ ప్రభుత్వాలూ మాలాంటి పేదలను ఇంతగా ఆదుకోలేదు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన తీరు చాలా బాగుంది. ప్రభుత్వం అందించిన భరోసాతో కుదుటపడ్డాం. భర్తను కోల్పోయానన్న బాధ ఉంది. కుటుంబంతో సుఖంగా జీవిస్తున్న మాకు ఈ ఘటన చేదు అనుభవాన్ని మిగిల్చింది. భర్త లేని లోటు తీర్చలేనిది. ముఖ్యమంత్రి జగన్ మమ్మల్ని ఆదుకున్న తీరు అభినందనీయం. – పిట్టా యల్లమ్మ (మృతుడు శంకరరావు భార్య) జనావాసాల్లో వద్దు.. మాది పెందుర్తి మండలం నరవ. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో నా భర్త మృతిచెందాడు. నా భర్త కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. కుటుంబ పోషణ కష్టంగా మారుతుందని బాధపడుతున్న సమయంలో ప్రభుత్వం ఆదుకుంది. మాకు ఆర్థిక సహాయం చేసిన సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నా. అదే చేతులతో జనావాసాల్లో ఇలాంటి కంపెనీలు వద్దని వేడుకుంటున్నా. – చిన్న నాగమణి (మృతుడి చిన్న గంగరాజు భార్య), నరవ పెందుర్తి మండలం ఐదు ఊళ్లు ఊపిరి పీల్చుకున్నాయి... నా భర్త సింహాచలం ఆర్టీసీ డిపోలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. 15 ఏళ్లుగా వెంకటాపురంలో నివాసం ఉంటున్నాం. మాకు ఇద్దరు పిల్లలు. బాబు పార్ధు (13) ఏడో తరగతి చదువుతున్నాడు. ఐదో తరగతి చదివే మా పాప గ్రీష్మ (10) ఈ దుర్ఘటనతో మాకు శాశ్వతంగా దూరమైంది. నిత్యం ఇంట్లో చలాకీగా తిరిగే పాప ఇక లేదనే సంగతి మమ్మల్ని కలచివేస్తోంది. డబ్బు కంటే ప్రాణం ముఖ్యమే అయినా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. అధికారులు, మంత్రులు తక్షణం స్పందించి తగిన చర్యలు తీసుకోవడం వల్ల ఐదు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. – నాగులాపల్లి లత (గ్రీష్మ తల్లి) పిల్లలను బాగా చదివిస్తా ఈ ఘటనలో నా భర్త గోవిందరాజు చనిపోవడం చాలా బాధగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన సహాయంతో పిల్లలను చదివించి మంచి ప్రయోజకులను చేస్తా. గ్యాస్ లీకేజీతో ఐదు ఊళ్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. అన్ని రకాలుగా ప్రభుత్వం స్పందించడం వల్ల కష్టాల నుంచి బయట పడ్డాం. తరలించిన వారికి షెల్టర్లలో అన్ని వసతులు కల్పించడం. చాలా బాగుంది. కంపెనీకి అనుకుని ఉన్న మా ఇళ్లను కూడా శుభ్రం చేస్తున్నారు. ఆర్ధికంగా కూడా చేయూతనిచ్చారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల వంతున ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించడం గొప్ప విషయం. ప్రభుత్వం ప్రజలను ఆదుకున్న తీరు బాగుంది. – శివకోటి వెంకట లక్ష్మి (మృతుడు శివకోటి గోవిందరాజుల భార్య) కూలి పనుల కోసం వచ్చాం... మాది విజయనగరం జిల్లా, ఎల్ కోట మండలం, కల్లేపల్లి రేగ .కూలి పనుల కోసం వెంకటాపురం వచ్చాం. గ్యాస్ లీక్ దుర్ఘటనలో నా భార్య ప్రాణాలు కోల్పోయింది. పోయిన ప్రాణాలను తీసుకురాలేకపోయినా ముఖ్యమంత్రి రూ.కోటి చొప్పున ఆర్ధిక సాయం అందించడం ఊరటనిచ్చింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. – రావాడ సత్యమంతుడు (మృతురాలు రావాడ నారాయణమ్మ భర్త ఊరటనిచ్చినా.. మాది పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామం. గ్యాస్ లీకేజీ ప్రమాదంలో నా భర్త మేకా కృష్ణమూర్తి మృతిచెందాడు. ప్రభుత్వం అందించిన రూ.కోటి సహాయం ఊరటనిచ్చినా నా భర్త లేరనే విషయం మనసును తొలిచివేస్తోంది. – మేకా సుశీల (మృతుడు మేకా కృష్ణమూర్తి భార్య) అందివచ్చే సమయంలో అకాల మరణం అందివస్తున్న నా కుమారుడు అకాల మరణం చెందడం బాధగా ఉంది. చిన్నతనం నుంచి కష్టపడి చదివే అన్నెపు చంద్రమౌళి (19) పేదలకు మరింత సేవ చేసేందుకు డాక్టర్ కావాలని కోరుకున్నాం. విశాఖ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఎంతో బాగా చదువుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మా కుమారుడు లేడనే బాధ మర్చిపోలేనిది. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారాన్ని ప్రకటించడం మంచి నిర్ణయం. – అన్నెపు ఈశ్వరరావు, వెంకటాపురం (వైద్య విద్యార్థి అన్నెపు చంద్రమౌళి తండ్రి) (గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు.. ఫొటో గ్యాలరీ) -
బాధిత కుటుంబాలకు రూ. కోటి బాసట
పరిహారం కోసం పడిగాపులు లేవు..కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే దుస్థితి లేదు..ప్రజా ప్రతినిధుల రికమండేషన్లతో పనిలేదు..ప్రాణాలకు వెలకట్టే వ్యాపారిలా కాకుండా.. కుటుంబానికి పెద్ద దిక్కుగా ప్రభుత్వం నిలబడింది! మానిపోని గాయానికి మానసిక స్థైర్యాన్ని అందిస్తూ..బాధితులకు భరోసా కల్పిస్తూ బాసటగా నిలిచింది. ఘటన జరిగిన రోజే ప్రకటించిన పరిహారాన్ని కేవలం ఐదంటే ఐదు రోజుల్లోనే అందించి ఆదుకుంది. కన్నీటి సుడులు తిరుగుతున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ కొండంత అండగా నిలబడ్డారు. సాక్షి, విశాఖపట్నం: విష వాయువు లీకైన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు దేశంలో ఏ ప్రభుత్వమూ ఆదుకోనంత సాయాన్ని అందచేసి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన దానికంటే రెట్టింపు పరిహారం ఇస్తామని విశాఖలో దుర్ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేవలం ఐదు రోజుల్లోనే బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందేలా చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి ఆదివారమే మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల సోమవారం అందచేశారు. బాధిత కుటుంబాలకు భరోసా.. విశాఖ కేజీహెచ్‌లో జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబుతోపాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ వి.వినయ్‌చంద్ కలిసి మృతుల కుటుంబాలకు అకౌంట్లల్లో నగదు జమ చేశారు. పరిహారానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. సంబంధిత పత్రాలతోపాటు ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖను కూడా అందించారు. తొలి విడతగా మృతుల చట్టబద్థ వారసులుగా నిర్థారించిన 8 మందికి ఒకొక్కరికి రూ.కోటి చొప్పున పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశారు. బాధితులందరినీ ఆదుకుంటామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రులు అన్ని విధాలా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ మాటగా భరోసా ఇచ్చారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అదనపు డీజీపీ రాజీవ్‌కుమార్ మీనా, ఏఎంపీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే విజయప్రసాద్ పాల్గొన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు: మంత్రి బొత్స ► ఎల్జీ పాలిమర్స్ సమీప గ్రామాల్లో నీటి నమూనాలను పరీక్షల కోసం పుణె ల్యాబ్‌కు పంపాం. సుమారు 500 మంది సిబ్బందితో గ్రామాల్లో శానిటైజేషన్ నిర్వహిస్తున్నాం. ► గ్యాస్ లీకేజీ ఘటనపై నిజానిజాలు తెలుసుకునేందుకు నిపుణులతోపాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో 6 కమిటీలను నియమించాం. కమిటీలు ఇచ్చే నివేదికల ఆధారంగా యాజమాన్యంపై చర్యలు ఉంటాయి. ► ఈ ప్రభుత్వానికి ప్రజలపైనే ప్రేమ ఉంటుంది. కంపెనీలపై కాదు. ► గత సర్కారు చేసిన తప్పిదాలను మా ప్రభుత్వం సరిదిద్దుతోంది. ► టీడీపీ సర్కారు ఇచ్చిన అనుమతుల కారణంగానే ఆ కంపెనీ పనిచేస్తోంది. గ్రామాల్లో మెడికల్ క్యాంప్ : మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ► స్టైరీన్ గ్యాస్ పూర్తిగా అదుపులో ఉంది. ఇప్పటికే ఐదు గ్రామాలను మేమంతా పరిశీలించాం. జీవీఎంసీ 500 మంది సిబ్బందితో అణువణువు శుభ్రం చేస్తోంది. ► సాయంత్రం గ్రామాల్లోకి వచ్చిన ప్రజలందరికీ భోజన వసతి కల్పిస్తున్నాం. ► ప్రజల భద్రత విషయంలో ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ► గ్రామాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తాం. అనుమతులిచ్చింది గత సర్కారే: మంత్రి కన్నబాబు ► గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల కారణంగానే ఎల్జీ పాలిమర్స్‌లో లీకేజీ ఘటన సంభవించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ► రూ.కోటితో మృతి చెందిన వారి ప్రాణాలు తీసుకురాలేం కానీ బాధిత కుటుంబాలకు భరోసా కల్పించాలనే గొప్ప మనసుతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ► అస్వస్థతకు గురైన వారందరిని మంగళవారం డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. డిశ్చార్జి అయిన వారికి గ్రామ వలంటీర్లే నేరుగా ఇంటికి వెళ్లి పరిహారం అందజేస్తారు. ► నిపుణుల సలహా మేరకు ఐదు గ్రామాల్లో శానిటైజేషన్ చేయించాం. ట్యాంక్‌లో విషవాయువులు సాధారణ స్థితికి వచ్చాయి. ప్రజలెవరూ అధైర్యపడొద్దు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. బాధిత గ్రామాల్లో మంత్రుల బస విషవాయువు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ధైర్యం చెప్పేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి గ్రామాల్లోనే బస చేశారు. మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాసు, ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, బి. సత్యవతి బాధిత గ్రామాల్లో రాత్రంతా ప్రజలతో పాటునిద్రపోయారు. అంతకుముందు బాధిత గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో చేపడుతున్న చర్యలను పరిశీలించి, అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పారు. కాగా,ఎల్జీ పాలిమర్స్ ఘటన నుంచి కోలుకొని గ్రామాలకు వచ్చిన ప్రజలకు ప్రభుత్వం సోమవారం రాత్రి భోజన సౌకర్యం ఏర్పాటు చేసింది. మంత్రుల నేతృత్వంలో నాణ్యమైన భోజనాన్ని అందించారు. వెజ్, నాన్‌వెజ్ వంటకాలతో ఐదు గ్రామాల్లోనూ ప్రజలకు భోజనం పెట్టారు. ప్రజలతో కలిసే మంత్రులు కూడా భోజనం చేశారు. (గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు.. ఫొటో గ్యాలరీ) -
పునర్జన్మనిచ్చారు!
‘ఆ రోజు రాత్రి అమ్మ దగ్గర పడుకున్నాను. మధ్య రాత్రిలో ఏదో వాసనకు మెలకువొచ్చింది. ఊపిరాడలేదు. ఒళ్లంతా మంటలు.. నోట్లోంచి నురగలొచ్చేస్తున్నాయి. తమ్ముడికీ అంతే. చచ్చిపోతున్నామా అమ్మా? అని ఏడ్చాను. అంతా బయటకొచ్చేశాం. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. స్పృహ వచ్చాక హాస్పిటల్ బెడ్‌మీద ఉన్నాం. డాక్టర్లు మమ్మల్ని బతికించారు’ కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న పదేళ్ల పీతల లాస్య సంతోషంతో చెప్పిన మాటలివి. ‘గ్యాస్ పీల్చడం వల్ల నాకు, నా భర్త, ఇద్దరు పిల్లలు చేతన (14), చిన్మయి (9)లకు వాంతులయ్యాయి. కాసేపటికి స్పృహ కోల్పోయాం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తీసుకొచ్చారంట. స్పృహలోకి వచ్చాక మేం బతికినా.. చావుకు దగ్గర్లో ఉన్నామనిపించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన వైద్యం అందేలా చేసింది. డాక్టర్లు పగలూ, రాత్రి ప్రత్యేక చికిత్స చేయడంతో మా బిడ్డలు బతికారు’ అని పేడాడ నారాయణమ్మ చెమర్చిన కళ్లతో చెప్పింది. కోలుకున్న ఇద్దరు కూతుళ్లతో నారాయణమ్మ సాక్షి, విశాఖపట్నం: లాస్య, నారాయణమ్మే కాదు.. విషవాయువు బారినపడి విశాఖ కేజీహెచ్ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులందరిదీ ఒకే మాట. మా బిడ్డలకు వైద్యులు పునర్జన్మనిచ్చారంటూ ఆనందంతో చెబుతున్నారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రికి వచ్చిన చిన్నారుల్లో ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకుండా చికిత్స చేయడంతో వీరంతా వైద్యులను దేవుళ్లతో పోలుస్తున్నారు. ఈ దుర్ఘటన జరిగిన వెనువెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారంటూ నిండైన హృదయాలతో కృతజ్ఞతలు చెబుతున్నారు. 17 మంది డిశ్చార్జ్ ► స్టైరీన్ గ్యాస్ లీకేజీ కారణంగా ఆర్.ఆర్. వెంకటాపురానికి చెందిన 585 మంది క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 54 మంది చిన్నారులకు కేజీహెచ్ పిల్లల వార్డులో వైద్యం అందిస్తున్నారు. ► ఇందులో ఆదివారం నాటికి 17 మంది పిల్లలను డిశ్చార్జ్ చేశారు. నలుగురికి న్యుమోనియా లక్షణాలుండడంతో వారిని ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్యం చేస్తున్నారు. ► ఏ ఒక్కరి ప్రాణం పోకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో కేజీహెచ్ వైద్యులు అన్ని అత్యవసర చర్యలు చేపట్టారు. రేయింబవళ్లు వారి ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి మూడు బెడ్లకు ఒక వైద్యుడు, ఒక నర్సు చొప్పున నియమించారు. ► ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచారు. బాధిత పిల్లలందరికీ నిరంతరం మూత్ర, రక్త పరీక్షలను నిర్వహించారు. అవసరమైన మందులను అందిస్తూ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ వచ్చారు. ► ఫలితంగా రెండు మూడు రోజులకే చిన్నారులంతా కోలుకున్నారు. మిగిలిన పిల్లలనూ రెండు మూడు రోజుల్లోనే ఇంటికి పంపించి వేస్తామని వైద్యులు చెబుతున్నారు. ► ఆస్పత్రిలో తమ బిడ్డలకు మంచి వైద్యంతోపాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు చెప్పారు. మూడు రోజుల్లోనే కోలుకున్నారు నేను.. నా ఇద్దరు పిల్లలు దీపు (12), భవ్య (9) గ్యాస్ పీల్చి వాంతులు చేసుకుని, నురగలు కక్కుతూ పడిపోయాం. ఆ రోజు ఉదయాన్నే 108లో కేజీహెచ్‌కు తీసుకొచ్చారంట. పిల్లల పరిస్థితి చూస్తే బతుకుతారన్న ఆశ కనిపించలేదు. మంచి వైద్యం అందించడంతో మూడు రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారు. ఈ రోజు డిశ్చార్జి ఇచ్చారు. సంతోషంగా వెళ్తున్నాం. వైద్యులకు, తక్షణమే స్పందించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – ఈసంశెట్టి భారతి, ఆర్.ఆర్. వెంకటాపురం పిల్లలంతా సేఫ్ స్టైరీన్ గ్యాస్ పీల్చడం వల్ల ప్రాణాపాయ స్థితిలో కొందరు, ఆపస్మారక స్థితిలో మరికొందరు ఆస్పత్రిలో చేరారు. 24 గంటలూ నిపుణులైన పిల్లల వైద్యులతో చికిత్స అందించాం. మూడు బెడ్లకు ఒక వైద్యుడు, ఒక నర్సును నియమించాం. తక్షణమే ప్రత్యేక వైద్యం అందించడంతో పిల్లలంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ముందుజాగ్రత్త చర్యగా వెంటిలేటర్లను సిద్ధం చేసినా వాటి అవసరం పిల్లలెవరికీ రాలేదు. పిల్లలు ఇంటికి వెళ్లాక న్యుమోనియా రాకుండా మందులిస్తున్నాం. ఎవరికైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే ఆస్పత్రి తీసుకు రావాలని తల్లిదండ్రులకు చెబుతున్నాం. – డాక్టర్ జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్ -
ఆ ఊళ్లకు ఊరట
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విషవాయువు మిగిల్చిన భయానక జ్ఞాపకాల నుంచి విశాఖలోని ఐదు గ్రామాలు క్రమంగా తేరుకుంటున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు శ్రమించడంతో మూడు రోజుల్లోనే కాలుష్య మేఘాలు తొలగిపోయాయి. రసాయనాలతో కూడిన వాయువులు ఆవిరవుతున్నాయి. గ్రామస్తుల్లో భయాలను తొలగించేందుకు జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థ (నీరి) నుంచి ఐదుగురితో కూడిన నిపుణుల బృందాన్ని ప్రభుత్వం రంగంలోకి దించింది. గ్రామాల్లో గాలి, నీరు, నేలపై స్టైరీన్ అవశేషాల కోసం పరీక్షలు నిర్వహిస్తోంది. విషపూరిత వాయువులు లేవని నిపుణులు నిర్ధారించిన తరువాతే గ్రామస్తులను సురక్షితంగా ఇళ్లకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిపుణుల బృందం మరో 24 గంటల్లో నివేదిక ఇవ్వనుంది. ప్రాథమిక అంచనా ప్రకారం అక్కడ వాతావరణం దాదాపుగా సాధారణ పరిస్థితికి వచ్చినట్లు తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎల్జీ పాలిమర్స్‌కు సమీపంలోని ఐదు గ్రామాలైన వెంకటాపురం, నందమూరి నగర్, పద్మనాభనగర్, ఎస్సీబీసీ కాలనీ, కంపరపాలెంలలో తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రతినిధి ఆదివారం అక్కడ పర్యటించారు. గురు, శుక్రవారాల్లో బాధిత గ్రామాల్లో కనిపించిన మూగజీవాల కళేబరాలను తొలగించడంతో పాటు పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో చేపట్టారు. ప్రతి గ్రామంలో గాలి కాలుష్యాన్ని సైతం పరిశీలిస్తున్నారు. గాలిలో స్టైరీన్ గ్యాస్ దాదాపుగా తొలగిపోయినట్లు అధికారులు గుర్తించారు. నిరంతరం పోలీస్ నిఘా దుర్ఘటన అనంతరం గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు ఇళ్లకు తాళాలు వేయలేదు. దీంతో పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు. కొన్ని ఇళ్లకు పోలీసులే తాళాలు కొనుగోలు చేసి వేశారు. డీసీపీ–2 ఉదయ్ భాస్కర్ బిల్లా ఆధ్వర్యంలో సిబ్బంది ప్రతి గ్రామంలోనూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. డీసీపీ నిరంతరం ఈ గ్రామాల్లోనే మకాం వేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జీవీఎంసీ కమిషనర్ సృజన కూడా స్థానికంగా పర్యటించారు. మూగ జీవాలకు సపర్యలు.. ఎల్జీ పాలిమర్స్‌కు అతి సమీపంలోని వెంకటాపురానికి చెందిన ఇల్లపు తాతారావు పాడిరైతు. కొద్దిపాటి పొలం మీద వచ్చే ఆదాయంతో జీవిస్తున్నాడు. గ్యాస్ లీకేజీ ప్రమాదంలో తాతారావుకు చెందిన ఒక గేదె, మూడు పెయ్యలు, ఒక ఆవు, లేగదూడ అక్కడిక్కకడే మృత్యువాత పడ్డాయి. ఒక గేదె చూపు కోల్పోయింది. మూడు రోజులు వేరే చోట తలదాచుకున్న ఆయన ఆదివారం సాయంత్రం పశువులశాలకు చేరుకుని గేదెకు సపర్యలు చేస్తూ కనిపించారు. అంతా సర్దుకున్నాక ఇంటికి వస్తానని తాతారావు చెప్పారు. చూపు కోల్పోయిన గేదెకు సపర్యలు చేస్తున్న తాతారావు తొలగిన భయం.. కంపరపాలెనికి చెందిన కంచిపాటి శంకర్రావు కుటుంబం ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిన రోజు సబ్బవరంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం కుటుంబం అంతా తిరిగి వచ్చేసింది. ఇళ్లంతా శుభ్రం చేసుకుని వంట చేసుకుని భోజనం చేశారు. కుటుంబ సమేతంగా ఇంట్లో కూర్చోని టీవీ చూశారు. వెంకటాపురంలో.. ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి ఆనుకుని సుమారుగా 200 మీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి చెందిన వారే ఎక్కువగా విష వాయువుతో ప్రభావితమయ్యారు. గ్రామంలో సుమారు 1,250 ఇళ్లు, 5 వేల జనాభా ఉంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా గ్రామానికి చేరుకుని ఇళ్లను చూసి శుభ్రం చేసుకుని తిరిగి వెళుతున్నారు. జీవీఎంసీ సిబ్బంది ప్రతి అరగంటకు ఒకసారి ఇక్కడ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని చల్లుతున్నారు. నందమూరినగర్‌లో.. కంపెనీకి కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ గ్రామంలో 600 పైచిలుకు ఇళ్లు, 2,250 మంది జనాభా ఉన్నారు. నీరి (నేషనల్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) నిపుణుల బృందం ఇక్కడ నీరు, మట్టి పరీక్షలు నిర్వహిస్తోంది. గ్రామం నుంచి కొన్ని నమూనాలను సేకరించారు. గాలి కాలుష్యాన్ని పరిశీలించగా 0.1గా నమోదైనట్లు చూపించింది. పద్మనాభనగర్‌లో.. కంపెనీకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సుమారుగా 500 ఇళ్లు ఉండగా 2,200 మంది వరకు ఉంటున్నారు. తిరిగి వస్తున్న వారికి పోలీసులు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జీవీఎంసీ సిబ్బంది పారిశుద్ధ్య పనులతో పాటు ఎప్పటికప్పుడు బ్లీచింగ్, స్ప్రేయింగ్ చేస్తున్నారు. ఎస్సీబీసీ కాలనీలో.. కంపెనీకి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామంలో సుమారుగా 480 ఇళ్లు ఉండగా 2 వేల మంది వరకు నివసిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసులు నిత్యం ఇక్కడ పహారా కాస్తున్నారు. గ్రామానికి తిరిగి వస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నారు. కంపరపాలెంలో.. కంపెనీకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 250 ఇళ్లు ఉండగా 1,200 మంది నివసిస్తున్నారు. ఇళ్లకు చేరుకున్న కొందరు స్థానికులు ఆసక్తిగా టీవీలు చూస్తూ కనిపించారు. నిపుణుల బృందం ఇక్కడ కూడా నమూనాలను సేకరించింది. జీవీఎంసీ సిబ్బంది బ్లీచింగ్, స్ప్రేయింగ్ చేస్తున్నారు. నెల రోజులు ఉచిత వైద్య శిబిరాలు: మంత్రి ముత్తంశెట్టి ఆదివారం ఆయా గ్రామాల్లో పర్యటించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గ్రామస్తులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అధికారులు చెప్పే వరకు ఇళ్లల్లో నివసించవద్దని సూచించారు. ఐదు గ్రామాల్లో నెల రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని హామీనిచ్చారు. కంపెనీని తరలించాలి.. ‘ఎల్జీ పాలిమర్స్‌లో గతంలో ప్రమాదాలు జరిగినా పెద్దగా నష్టం జరిగేది కాదు. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే లక్షలాది మంది ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడింది. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కంపెనీని తరలించాలి. – ఎన్.శ్రీనివాసరెడ్డి, ఎస్సీబీసీ కాలనీ నిపుణుల సూచనలు ► విష వాయువు ప్రభావిత గ్రామాల్లోని ఇళ్లలోకి వెళ్లే ముందు కొద్ది గంటల పాటు తలుపులు తీసి ఉంచాలి. ► బహిరంగంగా వదిలేసిన ఆహార దినుసులు, పదార్థాలు వాడకూడదు. ► ప్యాకింగ్ చేసిన పదార్థాలను వినియోగించుకోవచ్చు. ► ట్యాంకుల్లో నీటిని ఖాళీ చేయాలి. పూర్తిగా శుభ్రం చేసిన తరువాతే మళ్లీ పట్టుకోవాలి. పోలీసులు వచ్చి మమ్మల్ని ఇళ్లు ఖాళీ చేయించారు. పునరావాస కేంద్రానికి తరలించారు. మూడు రోజుల పాటు అధికారులు చాలా బాగా చూసుకున్నారు. మా గ్రామంలో పరిస్థితి మెరుగుపడిందని తెలియడంతో ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేశాం. – డి.లక్ష్మి, కంపరపాలెం ‘చాలాకాలంగా కంపెనీలో క్యాజువల్ కార్మికుడిగా పనిచేస్తున్నా. 1998లో జరిగిన అగ్ని ప్రమాదం తరువాత ఇదే పెద్ద ఘటన. గురువారం నేను డ్యూటికి వెళ్లలేదు. గ్యాస్ వాసన రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశాం. వెంటనే అధికారులు వచ్చి మమ్మల్ని పునరావాసానికి తరలించారు. అక్కడ అంతా బాగా చూసుకున్నారు. ఈ రోజు ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూద్దామని వచ్చా’ – పి.శ్రీనివాసరెడ్డి, వెంకటాపురం,ఎల్జీ పాలిమర్స్ క్యాజువల్ కార్మికుడు -
బాబు నిర్వాకం.. విశాఖకు శాపం
విష వాయువు లీకేజీతో 12 మందిని పొట్టన పెట్టుకున్న ఎల్జీ పాలిమర్స్‌కు ఊపిరి పోసిందెవరు? అసలు ఆ సంస్థకు మొదటి నుంచి అండగా నిలిచిందెవరు? కంపెనీ విస్తరణకు సహకారాలు అందించిన వారెవరు? అడ్డగోలుగా ఆ సంస్థకు వెన్నుదన్నుగా ఉన్నదెవరు? ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పూర్వాపరాలు, భూభాగోతాలు పరిశీలిస్తే.. పై ప్రశ్నలన్నింటికీ పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టమవుతోంది. జనావాసాల మధ్య ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఈ ఫ్యాక్టరీ విస్తరణ, కార్యకలాపాలు ప్రారంభించడానికి నిబంధనలకు విరుద్ధంగా గత చంద్రబాబు ప్రభుత్వం 2017లో ఏకపక్షంగా అనుమతులు ఇచ్చింది. ప్రమాదకరమైన ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిద్దామని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచించినా, నిపుణులు హెచ్చరించినా పట్టించుకోలేదు. సాక్షి, అమరావతి/విశాఖపట్నం: విశాఖలో జనావాసాల మధ్య ఉన్న ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ విస్తరణకు గతంలో చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా పలు అనుమతులు ఇచ్చింది. గ్రేటర్ విశాఖ పరిధిలోని పెందుర్తి మండలం ఆర్ ఆర్ వెంకటాపురంలో 213 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ ఉంది. 415 టీపీడీ సామర్థ్యంతో ఉన్న ఫ్యాక్టరీని రూ.168 కోట్ల వ్యయంతో 655 టీపీడీ సామర్థ్యానికి విస్తరించాలని యాజమాన్యం 2016లో నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు చేసింది. కాగా ప్రమాదకరమైన రసాయన వాయువులతో ముడి పడిన ఈ పరిశ్రమ విస్తరణ అంశాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు నివేదించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అభిప్రాయపడింది. జనావాసాల మధ్యలో ఉన్న ఈ పరిశ్రమ విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వం తానుగా నిర్ణయం తీసుకోవడం సరికాదని ఉన్నతాధికారులు భావించారు. ఆ విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి భేటీ మినిట్స్‌లోనూ నమోదు చేశారు. ఫ్యాక్టరీని తరలించాలని నిపుణుల డిమాండ్ ► ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు సన్నద్ధమవుతుండటంతో విశాఖలోని నిపుణులు అభ్యంతరం తెలిపారు. పరిశ్రమ జనావాసాలకు సమీపంలో ఉండటం పట్ల భయాందోళనలు వ్యక్తం చేశారు. ► ఈ ఫ్యాక్టరీని 40 ఏళ్ల క్రితం ప్రభుత్వ మిగులు భూముల్లో నెలకొల్పిన విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు. కాబట్టి ఆ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, బదులుగా వేరే చోట భూములు కేటాయించి తరలించాలని డిమాండ్ చేశారు. విస్తరణకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కూడా పట్టుబట్టారు. ఈ మేరకు కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ప్రభుత్వాన్ని అప్పట్లో డిమాండ్ చేశారు. మనమే అనుమతి ఇచ్చేద్దాం.. చంద్రబాబు ప్రభుత్వ ఒత్తిడితో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు, కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్(సీఎఫ్‌ఇ), కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్(సీఎఫ్‌వో)కు తాజాగా 2018 డిసెంబర్ 27న అనుమతులు జారీ చేసింది. ఇవి 2025 డిసెంబర్ 26 వరకు అమలులో ఉండేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతరం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమాచారమిచ్చి చేతులు దులిపేసుకుంది. ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రమాదకరమైన వ్యర్థాల నిర్వహణకు 2023 ఏప్రిల్ వరకు అనుమతి ఇస్తూ టీడీపీ ప్రభుత్వం 2018 జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేవని ఒప్పుకున్న ఎల్జీ పాలిమర్స్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం దరఖాస్తు చేశామని, ఇంకా తమకు మంజూరు కాలేదని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యమే స్వయంగా పేర్కొంది. ఈ మేరకు 2019 మే 8న (అప్పటికి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది) ఆ కంపెనీ ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. ► ఈ పరిస్థితిలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తుది ఆదేశాలకు లోబడి వ్యవహరిస్తామని, ఎలాంటి అపరాధ రుసుము అయినా చెల్లిస్తామని కూడా పేర్కొనడం గమనార్హం. టీడీపీ హయాంలో తూతూమంత్రంగా తనిఖీలు ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి భూ పందేరం చేయడమే కాకుండా.. దాని విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గత టీడీపీ ప్రభుత్వం ఏనాడూ ఆ కంపెనీలో లోటుపాట్లను కనీస మాత్రంగానైనా పట్టించుకోలేదు. పర్యావరణ అనుమతులు లేకుండానే విస్తరణకు అనుమతులిచ్చిన టీడీపీ సర్కారు.. సదరు సంస్థ ఉత్పత్తిని పెంచుకునేలా అడ్డగోలు అనుమతులిచ్చింది. అప్పటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తనిఖీలను సైతం తూతూమంత్రంగా నిర్వహించి, మొక్కుబడి నివేదికలు సమర్పించింది. 2016 సెప్టెంబర్ 16న, 2017 మార్చి 21న, 2017 అక్టోబర్ 27న, 2018 ఏప్రిల్ 23న, 2018 అక్టోబర్ 12వ తేదీన.. ఇలా ప్రతి 6 నెలలకు ఒకసారి నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి ఎటువంటి సూచనలు, ఆదేశాలు గానీ జారీ చేయలేదు. బాబుకు ఆది నుంచి ప్రత్యేక ఆసక్తి ► ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ అని పిలుస్తున్న ఈ ఫ్యాక్టరీని 1961లో ‘హిందుస్థాన్ పాలిమర్స్’ పేరుతో స్థాపించారు. అప్పట్లో విశాఖకు దూరంగా ఉన్న ఆర్.ఆర్.వెంకటాపురంలో నెలకొల్పారు. హిందుస్థాన్ పాలిమర్స్‌ను 1978లో యూబీ గ్రూప్‌నకు చెందిన మెక్‌డోనాల్డ్స్ కంపెనీ టేకోవర్ చేసింది. ► 1997లో చంద్రబాబు తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీని యూబీ గ్రూప్ నుంచి దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కొనుగోలు చేసింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు యూబీ గ్రూప్‌నకు డీలర్‌గా ఉండేవారు. ఆ గ్రూప్ చైర్మన్ విజయ మాల్యాకు ఆదికేశవులు వ్యాపార భాగస్వామి. ► ఎల్జీ కంపెనీ ప్రమోటర్లు 1997లో అప్పటి సీఎం చంద్రబాబు, డీకే ఆది కేశవుల ద్వారానే కథ నడిపించి యూబీ గ్రూప్ నుంచి ఈ ఫ్యాక్టరీని కొనుగోలు చేసినట్టు సమాచారం. అందుకే చంద్రబాబు ఎల్జీ కంపెనీ పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరిచేవారు. ► 1961లో ఆ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం విశాఖపట్నం నగరానికి దూరంగా ఉండేది. కానీ 2017 నాటికి జనావాసాల మధ్య ఉన్న ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌లో 1998లో జరిగిన అగ్ని ప్రమాదంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. నేను అప్పుడు ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నాను. కంపెనీని తరలించాలని పర్యావరణ వేత్త ప్రొఫెసర్ శివాజీ రావు నాకు లేఖ రాశారు. నేను ఆ లేఖ విషయాన్ని, ప్రజల అభిప్రాయాన్ని చంద్రబాబుకు వివరించాను. ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక కంపెనీ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుందని ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు. – మానం ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి అప్పన్న భూములను కట్టబెట్టిన బాబు ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ ఉన్న భూముల్లో 162.75 ఎకరాలు సింహాచలం దేవస్థానానికి చెందినవి. ఈ భూములను స్వాధీనం చేసుకోడానికి దేవస్థానం ఎన్నో ఏళ్లుగా పోరాడుతోంది. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని సూచించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఈ 162.75 ఎకరాల్లోని 128.24 ఎకరాలను డీ నోటిఫై చేస్తూ ఎల్జీ పాలిమర్స్‌కు అనుకూలంగా 2015 ఆగస్టు 17న ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా 34.51 ఎకరాల గురించి కూడా నెలరోజుల్లో తేల్చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఆ ప్రాంతంలో ఎకరా మార్కెట్ విలువ రూ.10 కోట్ల పైమాటే. అంటే రూ.1,620 కోట్ల విలువైన భూమిని ఎల్జీ పాలిమర్స్ పరమయ్యాయన్నమాట. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇంతటి ప్రమాదకరమైన పరిశ్రమ జనావాసాలకు సమీపంలో ఉండటం ప్రమాదకరం. ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు 2017లో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ పొందలేదు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇంతటి ప్రమాదానికి కారణమైన కంపెనీ ప్రమోటర్లపై కేసు నమోదు చేయాలి. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి -
అప్రమత్తతతోనే ముప్పు తప్పింది
సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/విశాఖపట్నం/ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ)/పాత పోస్టాఫీసు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తమై తక్షణ చర్యలు తీసుకున్న కారణంగానే ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుంచి బయటపడగలిగామని మంత్రులు.. ఆళ్ల నాని, ముత్తంశెట్టి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఆళ్ల నాని శుక్రవారం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 554 మందిలో 128 మందిని డిశ్చార్జి చేశామని తెలిపారు. 305 మంది కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా, మరో 121 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని స్పష్టం చేశారు. సీఎం ప్రకటించిన పరిహారాన్ని త్వరలోనే అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు.. బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్, గుమ్మనూరు జయరాం, ఎంపీ భీశెట్టి సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, జేసీ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. పరిశీలించాకే అనుమతులు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంఘటన జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం విషవాయువు ప్రమాద స్థాయి తగ్గిందని.. మరో 48 గంటల నుంచి 72 గంటల్లో సాధారణ స్థితికి రావచ్చని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు వచ్చిన ఆయన సంస్థ అధికారులతో మాట్లాడారు. తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి.. పరిస్థితిని సాధారణ స్థితికి తేవడానికి అవసరమైన మెటీరియల్ వచ్చిందన్నారు. బాధ్యులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్జీ పాలిమర్స్ లాంటి 86 కంపెనీలను గుర్తించామని, వీటన్నింటిలో భద్రతా ప్రమాణాలు పరిశీలించాకే పున:ప్రారంభానికి అనుమతిస్తామన్నారు. కాగా ప్రజలెవ్వరూ ఆందోళన చెందవద్దని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబూ.. చౌకబారు రాజకీయాలు మానుకో: మంత్రి బొత్స ఆగ్రహం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారంపై ప్రతిపక్షాలతో సహా అన్ని వర్గాలు హర్షిస్తున్నాయని, చంద్రబాబు అండ్ కో మాత్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి తాము అనుమతులు ఇచ్చినట్లు రుజువు చేయాలని సవాల్ విసిరారు. -
బాధితులకు.. సర్కారు ఆపన్నహస్తం
విశాఖ సిటీ: విశాఖలో గురువారం విషవాయువు లీకేజీ ప్రమాదంతో భయాందోళనలకు గురైన స్థానిక గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. మొత్తం 29 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. పెందుర్తి, సింహాచలం, గోశాల ప్రాంతాల్లో పలు కల్యాణ మండపాల్లో 20 వేల మందికి సరిపడ సౌకర్యాలను కల్పించింది. ఓ పక్క కరోనా పొంచి ఉండటంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు ప్రజల యోగక్షేమాలు చూస్తున్నారు. ప్రమాదం తర్వాత వెంకటాపురంలో ఉన్న 1,250 ఇళ్లలో సుమారు 8వేల మందిని, నందమూరినగర్‌లో చెందిన 2,250 మందిని, కంపరపాలెంలో 250 ఇళ్ల నుంచి 1,200 మందిని, పద్మనాభ నగర్లో 500 కుటుంబాల నుంచి 2,500 మందిని, ఎస్సీ, బీసీ కాలనీలో 480 ఇళ్ల నుంచి 2 వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. మెనూ ప్రకారం భోజనం పునరావాస కేంద్రాల్లో ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పండ్లు, రాత్రికి మళ్లీ భోజనం లేదా టిఫిన్ పెడుతున్నారు. గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వారికి అవసరమైన మందులు, ఇతర సామగ్రిని పంపిణీ చేస్తున్నారు. మరోవైపు యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు అల్పాహారం, మజ్జిగ, అరటి పండ్లు అందిస్తున్నాయి. ప్రభుత్వం తమకు అన్నివిధాల అండగా ఉందని బాధితులు చెబుతున్నారు. మరో రెండు, మూడు రోజులు ఆయా గ్రామాల ప్రజలకు పునరావాస కేంద్రాల్లోనే భోజనం అందిస్తారు. ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు మాది పాలిమర్స్ కంపెనీకి సమీపంలో ఉన్న కృష్ణానగర్. గురువారం వేకువజామున విడుదలైన విషవాయువు కారణంగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. తను నిండు గర్భిణి కావడంతో నాకు కాళ్లు చేతులూ ఆడలేదు. కాసేపటికే అధికారులు వచ్చి మమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించి గోశాలలో ఆశ్రయం కల్పించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. – భారతి, శ్రీను దంపతులు ప్రభుత్వం బాగా చూసుకుంటోంది గ్యాస్ బయటకు రావడంతో ఊపిరి ఆడక అందరం పరుగులు తీశాం. ఇంతలో స్థానిక యువకులు మమ్మల్ని ఆటోలో బయటకు పంపేశారు. అధికారులు బస్సులో ఇక్కడికి తీసుకొచ్చారు. ప్రభుత్వం సమయానికి భోజనం, పిల్లలకు కావల్సిన పదార్థాలు అందిస్తూ బాగా చూసుకుంటోంది. – రాములమ్మ, వెంకటాపురం మాకు ఎలాంటి ఇబ్బందీలేదు గ్యాస్ లీకైన కొద్దిసేపటికే రోడ్డు మీద ఉన్న మమ్మల్ని వెంటనే గోశాలకు తరలించారు. పిల్లాపాపలతో వచ్చినా మాకు ఇక్కడ ఏ ఇబ్బందీ లేదు. అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆహారం అందిస్తున్నాయి. – సింహాచలం, వెంకటాపురం ప్రభుత్వ చేయూత మరిచిపోలేం రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, పోలీసులు, సహాయక బృందాలు సకాలంలో స్పందించడం వల్లే బతికి బట్టకట్టామని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులు చెప్పారు. కేజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, వైద్యులు, ఇతర సిబ్బంది తమను కంటికి రెప్పలా కాపాడుతున్నారని వివరించారు. ప్రస్తుతం తామంతా తేరుకున్నామని, సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చి ధైర్యం చెప్పడం మర్చిపోలేమన్నారు. బాధితుల మనోగతం వారి మాటల్లోనే.. పాప ఆరోగ్యం కుదుటపడింది ఆస్పత్రిలో చేర్చిన వెంటనే వైద్యులు మెరుగైన చికిత్స అందించడం వల్ల ఆరోగ్యంగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం, వైద్యులు సకాలంలో స్పందించడం వల్ల అందరూ బతికారు. – పిల్లి రామలక్ష్మి, అఖిలప్రియ తల్లి వైద్యుల సేవలు మరువలేం నా ఇద్దరు పిల్లలకు కేజీహెచ్‌లో అందిస్తున్న వైద్య సేవలు మరువలేనివి. ప్రభుత్వం, రెస్క్యూ టీమ్‌లు సకాలంలో స్పందించడం వల్ల మరణాలు తగ్గాయి. –భారతి, ఇద్దరు చిన్నారుల తల్లి బతుకుతా అనుకోలేదు ప్రమాదం జరిగిన 8 గంటల తరువాత ఆస్పత్రిలో కళ్లు తెరిచాను. అసలు బతుకుతాననుకోలేదు. – అంబటి సిద్ధేశ్వరరావు, బాధితుడు సీఎం కృషి వల్లే.. ఆస్పత్రిలో చేర్చిన వారందరికీ మంచి వైద్యం అందిస్తున్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి కృషి వల్లనే ఇదంతా సాధ్యపడుతోంది. ఆయనకు మా కృతజ్ఞతలు. – దాసరి బిందు, బాధితురాలు -
అప్పుడలా.. ఇప్పుడిలా
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు కేవలం తన షూటింగ్ వ్యామోహం, సర్కారు వైఫల్యం వల్ల గోదావరి పుష్కరాల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించేందుకు సైతం మనస్కరించని చంద్రబాబు ఇప్పుడు విశాఖలో గ్యాస్ లీకేజీ మృతుల కుటుంబాలకు సీఎం జగన్ ప్రకటించిన కోటి రూపాయల పరిహారం చాలదని వ్యాఖ్యానించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ ఇప్పటివరకు ప్రమాదాలు, విపత్తుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇంత భారీగా పరిహారాన్ని ప్రకటించిన దాఖలాలు లేవని, సీఎం జగన్ మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరని అన్ని వర్గాలు పేర్కొంటుండగా చంద్రబాబు దాన్ని స్వాగతించకపోగా విమర్శలకు దిగడంపై సొంత పార్టీ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన నివాసానికి కూతవేటు దూరంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అనుమతించడంతో కృష్ణా నదిలో పడవ మునిగి మృత్యువాత పడ్ద వారి కుటుంబాలకు రూ.ఐదు లక్షల పరిహారంతో సరిపుచ్చారు. కానీ ఇప్పుడు విశాఖలో ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం, ప్రమేయం లేకుండా జరిగిన ఘటనలో మృతుల కుటుంబాలకు సీఎం జగన్ కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తే విమర్శలకు దిగడం, దీన్ని చిన్నదిగా చేసి చూపడానికి ప్రయత్నించడం ద్వారా చంద్రబాబు తనకు రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రాణాలు, ప్రయోజనాలు ఏమాత్రం పట్టవని నిరూపించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రజల మన్ననలు పొందలేని చంద్రబాబు ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం చేసిన మంచి పనులను స్వాగతించకపోగా విమర్శించడం విపక్ష నేత రెండు నాల్కల ధోరణికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. నిజానికి చంద్రబాబు విమర్శల వెనుక ఒకింత అసూయ కూడా ఉందనే వాదన వినిపిస్తోంది. సుదీర్ఘకాలం సీఎంగా పనిచేశానని చెప్పుకునే ఆయన ఎప్పుడూ బాధితుల పట్ల ఈ స్థాయిలో ఉదారం చూపలేదు. బాబు హయాంలో బాధితులకు తూతూ మంత్రమే ► చంద్రబాబు సీఎంగా ఉండగా 2014 అక్టోబర్ లో హుద్‌హుద్ తుపాను విశాఖపట్నాన్ని అతలా కుతలం చేయగా 46 మంది మృత్యువాతపడ్డారు. అప్పుడు వారి కుటుం బాలకు కేవలం రూ.ఐదు లక్షలే ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. ► 2015 జులైలో గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు తన షూటింగ్ కోసం భక్తుల్ని ఆపివేయడంతో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోతే వారికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కేవలం తన పబ్లిసిటీ పిచ్చి, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయినా వారిపై కనికరం చూపలేదు. ► 2017 నవంబర్‌లో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదిలో బోటు మునిగి 21 మంది చనిపోతే రూ.పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. ఘటన జరిగిన ప్రాంతం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోనే ఉండటం, వరద ఉధృతి ఉన్నా బోటును అనుమ తించిన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్పష్టమైనా బాధిత కుటుంబాలకు తూతూమం త్రంగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. ► 2018 అక్టోబర్‌లో తిత్లీ తుపాను ప్రభావానికి శ్రీకాకుళం జిల్లా లో ఎనిమిది మంది చని పోగా కేవలం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి గొప్ప గా ప్రచారం చేసుకున్నారు. ► 2018 మే నెలలో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం వాడపల్లి–మంటూరు వద్ద గోదావరి లో బోటు మునిగి 22 మంది చనిపోగా రూ.పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ► 2017లో గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద జరిగిన ఆటో ప్రమాదంలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు, డ్రైవర్ చనిపోతే రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించినా చాలారోజులు దాన్ని వారికి ఇవ్వలేదు. 2018లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ ప్రాంతం లో పాదయాత్ర చేసినప్పుడు బాధిత కుటుంబాలు ఆయన దృష్టికి ఈ విష యాన్ని తీసుకెళ్లడంతో చంద్ర బాబు వైఖరిని ఎండగట్టారు. దీంతో ఉలిక్కి పడ్డ చంద్రబాబు కేవలం రూ. రెండు లక్షలు చొప్పున పరిహారం ఇచ్చి మిగి లిన రూ.మూడు లక్షలు ఎగ్గొట్టారు. ► 2014 జూన్‌లో తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ పేలి పలువురు మృత్యువాత పడగా చంద్రబాబు రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గెయిల్ రూ.20 లక్షలు, కేంద్రం రూ.2 లక్షలు చొప్పున బాధితులకు ఇచ్చింది. -
ఐఏఎస్‌లకు ఏం తెలుసు?
విశాఖలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేస్తే వాళ్లేం చేస్తారు? ఐఏఎస్ అధికారులకు సబ్జెక్ట్ తెలుసా? సైంటిఫిక్, టెక్నికల్ అంశాలు వాళ్లకి తెలియవు. వాళ్ల గురించి నాకు తెలియదా? ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న నాకే స్టైరీన్ అంటే ఏంటో తెలియదు. ఇక ఐఏఎస్‌లకు ఏం తెలుస్తుంది. నేను ఉండిఉంటే నేరుగా ఫ్యాక్టరీలోకే వెళ్లేవాడిని. – చంద్రబాబు, ప్రతిపక్ష నేత సాక్షి, అమరావతి: విశాఖలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై ఐదుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేస్తే వాళ్లేం చేస్తారని ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఐఏఎస్ అధికారులకు సబ్జెక్ట్ తెలుసా? అని ప్రశ్నించారు. సైంటిఫిక్, టెక్నికల్ అంశాలు వాళ్లకి తెలియవన్నారు. వాళ్ల గురించి తనకు తెలియదా? అని ప్రశ్నించారు. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న తనకే స్టైరీన్ అంటే ఏంటో తెలియదని, ఇక ఐఏఎస్‌లకు ఏం తెలుస్తుందన్నారు. మేధావులు దీనిపై అధ్యయనం చేయాలన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఏపీలో ఎంపిక చేసిన మీడియాతో ఆయన ఆన్లైన్లో మాట్లాడారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే.. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు.. ► కోటి రూపాయలతో మనిషి మళ్లీ బతికివస్తాడా? రూ.కోటి సరిపోతాయా? డబ్బులివ్వమని ఎవరైనా అడిగారా? ► గ్యాస్ లీకేజీ ఘటనను సీఎం చాలా లైట్‌గా తీసుకున్నారు. ఆయనది అవగాహనా లోపం. తూతూమంత్రంగా ఒక కమిటీ వేస్తే ఎలా? నిపుణులతో అధ్యయనం చేయించాలి. బాధితుల ఆరోగ్య సంరక్షణను కొద్దికాలం పరిశీలించి చూడాలి. ► ఘటనపై నిజ నిర్ధారణ కోసం టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, చినరాజప్ప, నిమ్మల రామానాయుడితో త్రిసభ్య కమిటీని నియమిస్తున్నాం. ► ఇది మామూలు ప్రమాదం కాదు. ఇంతవరకూ ఇలాంటి ప్రమాదం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. దీన్ని ప్రభుత్వం హ్యాండిల్ చేసిన విధానం చూసి చాలా బాధేసింది. ► ఒక నేరం జరిగినప్పుడు బాధితులను దృష్టిలో పెట్టుకుని చూడాలి తప్ప ఫ్యాక్టరీని దృష్టిలో పెట్టుకోకూడదు. అవగాహనా రాహిత్యం ఉంది. అందుకే హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుంది. ఎన్జీటీ కూడా సుమోటోగా తీసుకుని రూ.50 కోట్లు డిపాజిట్ చేయమంది. వెంటనే ఫ్యాక్టరీని మూసివేయాలి. అవసరమైతే వేరేచోటకి మార్చాలి. నిపుణులతో మాట్లాడా.. ► ఈ సీఎం ఎవరు చెప్పినా వినరు. ఇలాంటప్పుడు పదిమందితో మాట్లా డాలి. నేను ఉండుంటే నేరుగా ఫ్యాక్ట రీలోకే వెళ్లేవాడిని. ఒకవేళ గ్యాస్ ప్రభా వం ఉంటే తగ్గాకే వెళ్లాలి. ఎవరితోనూ మాట్లాడ కుండా కలెక్టర్ చెప్పాడని ఏదో చెప్పేస్తే ఎలా? ► ఇందులో మీ సొంత పాండిత్యం ఏమిటి? సబ్జెక్ట్ నిపుణులతో కమిటీ వేయాలి. ► సీఎంలు అన్నింటిలో నిపుణులు కాదు. ఇది అధికార, పరిపాలనా యంత్రాంగం వైఫల్యం. ► గ్యాస్ లీకేజీపై నేను చాలామంది సబ్జెక్ట్ నిపుణులతో మాట్లాడా. ఇది మానవ తప్పిదమా? సాంకేతిక ప్రమాదమా అనేది తేల్చాలి. ► లాక్డౌన్ తర్వాత ప్రమాదకరమైన ఇలాంటి ఫ్యాక్టరీని తెరిచేటప్పుడు తనిఖీ చేసి అనుమతి ఇవ్వాల్సింది. ► ఈ ఘటన తర్వాత రాత్రి నాకు నిద్ర రాలేదు. అక్కడికి ఎందుకు వెళ్లలేకపోయానా అని బాధపడ్డా. వెళ్లేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నా. కేంద్రం అనుమతి కోరా. అనుమతి ఎప్పుడు వస్తే అప్పుడు వెళతా. -
గ్యాస్ లీక్‌పై విచారణకు హైపవర్ కమిటీ
సాక్షి, అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై కారణాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి (హై పవర్) కమిటీని నియమించింది. కారణాలను అన్వేషించడంతోపాటు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిఫార్సులు చేయాలని కమిటీని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీకి నీరబ్‌కుమార్ ప్రసాద్ నేతృత్వం అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా సభ్యులుగా ఉండే ఈ కమిటీలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ సభ్య కన్వీనరుగా వ్యవహరిస్తారు. అధ్యయనం చేయాల్సిన అంశాలివీ.. ► గ్యాస్ లీకేజీకి కారణాలతోపాటు భద్రతా ప్రమాణాలను కర్మాగారం పాటించిందా లేదా? అనే అంశాలను కమిటీ విచారించాలి. ► పరిసర గ్రామాలపై గ్యాస్ లీకేజీ ప్రభావం దీర్ఘకాలం ఉంటే నివారణ చర్యలపై కూడా సిఫార్సు చేయాలి. ► యాజమాన్యం నిర్లక్ష్యమే గ్యాస్ లీక్‌కు కారణమైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కమిటీ సిఫార్సు చేయాలి. ► నివారణ చర్యలు, భద్రతా తనిఖీలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయాలి. ► ఈ తరహా పరిశ్రమలకు సంబంధించి కమిటీ పరిశీలించిన ఇతర ముఖ్యమైన అంశాలను కూడా నివేదికలో పేర్కొనవచ్చు. ► కమిటీ నెల రోజుల్లోగా ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలి. ► నివారణ చర్యలపై సూచనల కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలు/ నిపుణులను కమిటీ సహాయకులుగా హైపవర్ కమిటీ చైర్మన్ ఎంపిక చేసుకోవచ్చు. ► కమిటీకి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిని ప్రభుత్వం ఆదేశించింది. రూ.30 కోట్లు విడుదల ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో బాధితులకు నష్టపరిహారం చెల్లించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం జగన్ మోహన్‌రెడ్డి విశాఖపట్నం వెళ్లి బాధితులను పరామర్శించి నష్టపరిహారం ప్రకటించారు. సీఎం ఆదేశం మేరకు ప్రమాదం జరిగిన మరుసటి రోజునే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.30 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తక్షణమే చెల్లించాలని ఆదేశం ► ఒక్కో మృతుని కుటుంబానికి రూ.కోటి చొప్పున తక్షణమే పరిహారం చెల్లించాలని ఉత్తర్వులు. ► వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లింపు. ► రెండు, మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి రూ.లక్ష, ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స పొందిన వారికి రూ. 25 వేల చొప్పున చెల్లిస్తారు. ► గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చెల్లిస్తారు. ► ప్రమాదం జరిగిన మరుసటి రోజే బాధితులందరికీ నష్టపరిహారం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై అధికార వర్గాల హర్షం. ► ఆపన్నులకు, బాధితులకు సహాయం అందించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు తానే సాటి అని ఈ చర్య ద్వారా నిరూపించుకున్నారన్న పలువురు ఐఏఎస్‌లు. ప్రతి అంశంలోనూ సీఎం జగన్ ఇదే రకమైన వేగాన్ని ప్రదర్శిస్తున్నారని, నిర్ణయాల్లోనూ, అమల్లోనూ అదే తీరు కనబరుస్తున్నారని ప్రశంస. -
కోటి సాయానికి ‘నగరమే’ నాంది
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: విశాఖపట్నం గ్యాస్ దుర్ఘటన మృతులకు రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రీతిలో పరిహారం ప్రకటించడానికి 2014 జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా నగరంలో జరిగిన గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటం ఘటనే కారణమైందని చెప్పవచ్చు. అప్పట్లో ఈ దుర్ఘటన జరిగిన మరుక్షణమే ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాటి ఘటనలో 22 మంది అగ్నికి ఆహుతైపోవడాన్ని చూసి చలించిపోయారు. అప్పటి పాలకుల తీరును ఆక్షేపించారు. ఆ సందర్భంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ► చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేం.. వారికి ఎంత సాయం చేసినా అది స్వల్పమే అవుతుంది. మృతుల కుటుంబాల పరిస్థితిని ప్రభుత్వాలు మానవీయ కోణంలో పరిశీలించి ఆదుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక కోణంలో చూడరాదు. మృతుల కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి. ► శరీరమంతా పూర్తిగా కాలిపోయి.. ముందు ముందు ఏ పనీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న వారికి రూ.25 లక్షలు (ఇందులో బాబు సర్కారు ఇచ్చింది రూ.3 లక్షలే) ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. బాధితుల పరిస్థితి గురించి చంద్రబాబునాయుడు, కేంద్ర ప్రభుత్వం, గెయిల్, ఓఎన్జీసీ ఆలోచించాలి. ► ఈ నష్ట పరిహారం సరిపోదు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఇతర దేశాల్లో ఎలాంటి నష్టపరిహారం ఇస్తున్నారో వెళ్లి చూడండి. ఆ కంపెనీలకు భయం కలిగించేలా ఆ పరిహారం ఉంటుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలి. -
విశాఖ గ్యాస్‌లీక్: ప్రమాద స్థలిలో ఇదీ పరిస్థితి!
మొన్నటి వరకూ ప్రశాంతంగా కనిపించిన ఆ ప్రాంతం.. ఇప్పుడు విషవాయువు కారణంగా నిర్జీవంగా మారిపోయింది.. ప్రాణాలతో పాటు పర్యావరణాన్నీ కాటేసింది..ఇంతలా విశాఖని వణికించిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఏం జరిగింది? విషాదానికి కారణమైన ట్యాంక్ వద్ద ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? షికార్లు చేస్తున్న పుకార్లు చెప్పేవి నిజమేనా?మళ్లీ ఆ ట్యాంక్ నుంచి ప్రాణాలు పిండేసేలా విషవాయువు లీకవుతోందా.. ప్రభుత్వం చెప్పినట్లుగా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులో ఉందా? ఎల్జీ పాలిమర్స్‌లో వాస్తవ పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. మళ్లీ గ్యాస్ లీకవుతోంది.. ప్రజలు భయపడుతున్నారు.. పేలిపోయే ప్రమాదం ఉందని అక్కడి పోలీసులు, అధికారులు చెబుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో గురువారం అర్ధరాత్రి ప్రజల్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన వదంతులు వచ్చిన నేపథ్యంలో.. ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్‌ని ‘సాక్షి ప్రతినిధి బృందం’ శుక్రవారం ఉ.10.30 గంటలకు పరిశీలించింది. ఆ సమయంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డీసీపీ–2 ఉదయ్‌భాస్కర్.. సంస్థ ప్రతినిధులు, ఎన్డీఆర్ఎఫ్ బృంద ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. బయట వినిపిస్తున్న వదంతుల మాదిరిగా అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా లేదని నిర్థారించారు. సాక్షి పరిశీలనలో అక్కడ కనిపించిన వాస్తవాలివీ.. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, విశాఖపట్నం ఈ ట్యాంక్‌తోనే అసలు సమస్య.. ఇక ప్రమాదం జరిగిన ట్యాంకర్ పక్కనే కొత్తగా ఏర్పాటుచేసిన మరో ట్యాంక్ ఉంది. ఇందులో 3 వేల టన్నుల స్టైరీన్ మోనోమర్ నిల్వలున్నాయి. ఈ ట్యాంక్‌ని చూసే అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే.. లీకవుతున్న సమయంలో ఏ చిన్నపాటి పేలుడు సంభవించినా మొదటి ట్యాంక్‌లో కన్నా రెండో ట్యాంక్‌లో పెద్ద మొత్తంలో స్టైరీన్ ఉంది కాబట్టి.. తీవ్రత 10 కిలోమీటర్ల వరకూ వ్యాపించే ప్రమాదం ఉందని భయాందోళనలు నెలకొన్నాయి. అయితే.. మొదటి ట్యాంక్‌లో ప్రమాదం జరిగిన వెంటనే రెండో ట్యాంక్ ఉష్ణోగ్రతలపై దృష్టిసారించారు. దీంతో ప్రస్తుతం ఈ ట్యాంక్ సేఫ్జోన్లో ఉంది. ప్రభావం కొంత ఎత్తు వరకే.. స్టైరీన్ మోనోమర్ వాయువు బరువైనది. ఈ కారణంగా ప్రమాద తీవ్రత కొంత ఎత్తు వరకూ మాత్రమే ఉంది. పైకి వెళ్లేకొద్దీ.. వాయువు ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుందనేది సమీపంలో ఉన్న చెట్లు చూస్తే స్పష్టమవుతోంది. కంపెనీలో కింద ఉన్న పచ్చని పచ్చిక మొత్తం మాడిపోయింది. చిన్నచిన్న మొక్కల పరిస్థితీ అంతే. కానీ.. పెద్దపెద్ద చెట్ల పైభాగంలో ప్రభావం మాత్రం తక్కువగానే ఉంది. నాలుగు నుంచి 5 మీటర్ల వరకు మాత్రమే చెట్లు ఆకులు రంగు మారాయి. పైభాగంలో పచ్చగానే కనిపిస్తున్నాయి. యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు ఎల్జీ పాలిమర్స్‌లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అగ్నిమాపక దళం, పోలీసులు చమటోడుస్తున్నారు. ప్రమాద తీవ్రత తెలిసినా ఏమాత్రం లెక్క చేయకుండా పరిస్థితిని పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టారు. కార్బన్ డై ఆక్సైడ్ ఫోమ్ చల్లుతూ పరిసరాల్లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే వదంతులని సృష్టించొద్దనీ.. రెండ్రోజుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది. ఇదే ఆ ట్యాంక్.. 12 మందిని పొట్టన పెట్టుకుని.. వందల మందిని ఆస్పత్రి పాల్జేసిన దుర్ఘటనకు కారణమైన స్టైరీన్ మోనోమర్ విషవాయువు లీకైంది ఈ ట్యాంక్ నుంచే. 2,500 టన్నుల సామర్థ్యం ఉన్న ఈ ట్యాంక్‌లో ప్రమాదానికి ముందు 2 వేల టన్నుల స్టైరీన్ గ్యాస్ ఉంది. 25 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో దీన్ని నిల్వ ఉంచాలి. కానీ.. లాక్డౌన్ కారణంగా నిల్వలు పెరిగిపోవడంతో.. లోపల ఉపరితల ఉష్ణోగ్రత క్రమంగా పెరిగింది. ఫలితంగా పీడనం పెరిగి వాయు రూపంలో లీకైంది. ప్రమాదం జరిగిన రాత్రే దీన్నుంచి స్టైరీన్‌ని వేరే ట్యాంక్‌లోకి మళ్లించాలని ప్రయత్నించినా విఫలమయ్యారు. అది పెను ప్రమాదానికి దారితీస్తుందనే భయంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం ఇందులోకి హైడ్రాలిక్ ఫైర్ టెండర్స్ ద్వారా యాంటీ డోస్ పంపించారు. ఫలితంగా.. ఒత్తిడి 90 శాతం వరకూ తగ్గింది. ప్రస్తుతం అతి స్వల్పంగా మాత్రమే లీకేజీ జరుగుతోంది. అయితే.. ఇలాంటి లీకేజీలు అప్పుడప్పుడు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పక్షులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.. గురువారం నాటి ప్రమాద తీవ్రతకు పశుపక్ష్యాదులు మృత్యువాత పడ్డాయి. కానీ.. శుక్రవారం మాత్రం విషవాయువు లీకైన ట్యాంక్ పక్కనే పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అంటే.. ప్రమాద తీవ్రత లేదని స్పష్టంగా కనిపిస్తోంది. పేలుడు సంభవించే పరిస్థితిలేదు ట్యాంక్‌లో ఉన్న స్టైరీన్ మోనోమర్.. పరిమాణం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడు ఎలాంటి పేలుడూ సంభవించే పరిస్థితులు కనిపించడంలేదు. ట్యాంక్‌లో రియాక్షన్ కూడా తగ్గుతూ వస్తోంది. శనివారం ఉదయానికల్లా పరిస్థితి పూర్తి అదుపులోకి వస్తుందని భావిస్తున్నాం. – డా. జార్జ్, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి హైడ్రాలిక్ ఫైర్ టెండర్స్ ద్వారా యాంటీ డోస్ ప్రమాదం జరిగిన వెంటనే గ్యాస్ ట్యాంక్‌ల వద్దకు మా ఫైర్ సేఫ్టీ బృందం వెళ్లింది. అయితే.. అప్పటికే లీకైన వాయువు గేట్ వరకూ వ్యాపించింది. దీంతో వారు అక్కడికి వెళ్లలేకపోయారు. వెంటనే స్ప్రింక్లర్ సిస్టమ్‌ని 4 గంటలకు ఓపెన్ చేశాం. ఇందులో యాంటీ డోస్‌ని 4.30 గంటల నుంచి యాడ్ చేసి నీటిని స్ప్రింక్ చేశాం. హైడ్రాలిక్ ఫైర్ టెండర్స్ ద్వారా ట్యాంక్‌లోకి యాంటీ డోస్ సరఫరా చేశాం. ప్రస్తుతం వాతావరణంలో లీకైన విషవాయువు ప్రభావంలేదు. – రమేష్ పట్నాయక్, ఎల్జీ పాలిమర్స్ సేఫ్టీ ఏజీఎం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం... ప్రస్తుతం ప్లాంట్‌లో పరిస్థితి అదుపులో ఉంది. ఎలాంటి ప్రమాద సూచనలూ కనిపించడంలేదు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా.. 9 నుంచి 10 గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాం. ప్రమాద స్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు.. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుంటున్నాం. – ఉదయ్‌భాస్కర్, డీసీపీ–2 -
మళ్లీ జరగకూడదు : సీఎం వైఎస్ జగన్
కాలుష్య నివారణ మండలి క్రియాశీలకంగా ఉండాలి. కాలుష్యకారక అంశాలపై ఫిర్యాదులు, వాటి నివారణ, పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్‌ను సిద్ధం చేయాలి. విశాఖపట్నంలో ఇలాంటి విష వాయువులు ఉన్న పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి.. అందులో జనావాసాల మధ్య ఉన్నవి ఎన్నో గుర్తించాలి. విదేశాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి వ్యవస్థలు ఏరకంగా స్పందిస్తాయో, ఏ రకంగా వ్యవహరిస్తాయో, అలాంటి స్పందనే ఇక్కడా కచ్చితంగా చూపాల్సి ఉంటుంది. అందుకనే మంచి మనసుతో.. ఉదారంగా స్పందించి పరిహారం ఇస్తున్నాం. – సీఎం వైఎస్ జగన్ విశాఖలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఫ్యాక్టరీ ట్యాంక్‌లోని రసాయనంలో 60 శాతం పాలిమరైజ్ అయ్యింది. మిగిలిన 40 శాతం కూడా పాలిమరైజ్ అవుతోంది. ఇందుకు 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలోని మిగతా ట్యాంకులు భద్రంగా ఉన్నాయి. – సీఎంతో సీఎస్, విశాఖ కలెక్టర్ సాక్షి, అమరావతి: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తగిన కార్యాచరణ ప్రణాళికతో రావాలని.. గ్యాస్ లీక్ వెనుక కారణాలను నిగ్గుతేల్చేందుకు ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గ్యాస్ లీక్ దుర్ఘటన, అనంతరం తీసుకున్నచర్యలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. గట్టి చర్యలు తీసుకోవాలి ► ఈ తరహా దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై దృష్టి పెట్టాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విష వాయువులున్న పరిశ్రమలను జనావాసాల నుంచి తరలించడంపై కూడా విధానపరమైన ఆలోచనలు చేయాలి. ► ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఉన్న రసాయనాలను తరలించే అవకాశాలను పరిశీలించి, వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదా ఉన్న ముడి పదార్థాలను పూర్తిగా వినియోగించేలా ఇంజినీర్లతో మాట్లాడాలి. ► మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల చొప్పున పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలి. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష, సీఎస్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఉదారంగా స్పందించాలి ► బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించడం పట్ల అధికారులు సీఎంను ప్రశంసించారు. దేశంలో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై ఆదర్శంగా నిలిచారన్నారు. ► గతంలో తూర్పుగోదావరి జిల్లా నగరంలో గ్యాస్ పైప్‌లైన్ పేలిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించానని సీఎం గుర్తు చేశారు. ► ఆ సందర్భంలో.. ఇతర దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కంపెనీలు ఎలా వ్యవహరిస్తాయో.. అదేరకంగా సహాయం చేయాలని డిమాండ్ చేశానన్నారు. మరణించిన కుటుంబాల వారికి భారీగా పరిహారం ఇవ్వాలని ఆరోజు తాను డిమాండ్ చేశానని చెప్పారు. ► ఈ సమయంలో ప్రభుత్వం బాధితులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. దేశంలో ఎక్కడోచోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని, అలాంటప్పుడు విదేశాల తరహా స్పందన కచ్చితంగా చూపాల్సి ఉంటుందన్నారు. ► ఈ సమీక్షలో ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్, అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్.. విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, కలెక్టర్ వినయ్‌చంద్, పోలీసు కమిషనర్ ఆర్.కె.మీనా పాల్గొన్నారు. కాగా, నీరబ్ కుమార్ ప్రసాద్, వివేక్ యాదవ్ విశాఖకు బయలుదేరనున్నారు. -
ఉక్కునగరికి ఊపిరి
సాక్షి, విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్‌లో గురువారం వేకువజామున విషవాయువు లీకేజీతో ఉక్కిరిబిక్కిరైన విశాఖ ఉక్కునగరం రాష్ట్ర ప్రభుత్వ సత్వర చర్యలతో రెండో రోజునే ఊపిరిపీల్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ఇక్కడి పరిస్థితిపై ఆరా తీస్తూ తగిన ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో ఒక్కరోజులోనే ఇక్కడి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.బాధితులకు సీఎం ప్రకటించిన నష్టపరిహారం కింద ప్రభుత్వం 24 గంటల్లోనే రూ.30 కోట్లను విడుదల చేసింది. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.కోటి చొప్పున.. వెంటిలేటర్లపై ఉన్న వారికి రూ.10 లక్షల చొప్పున తక్షణమే పరిహారం అందజేయాలని ఉత్తర్వులు జారీచేసింది. గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై కారణాలను నిగ్గుతేల్చేందుకు ఉన్నతస్థాయి (హైపవర్) కమిటీని కూడా నియమించింది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించడంతోపాటు ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిఫార్సు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీ నెలరోజుల్లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించింది. సూచనల కోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థలు లేదా నిపుణులను సహాయకులుగా కమిటీ చైర్మన్ నియమించుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మరోవైపు.. విషవాయువు కారణంగా గురువారం తీవ్ర అస్వస్థతకు గురైన వారు క్రమంగా కోలుకుంటున్నారని.. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం హుటాహుటిన చర్యలు తీసుకోవడంతో రెండోరోజునే నగరంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని మంత్రులు ఆళ్ల నాని, ముత్తంశెట్టి శ్రీనివాస్, మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మొత్తం 554 మందిలో 128 మంది శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారని.. మిగిలిన వారెవరికీ ప్రాణాపాయం లేదన్నారు. ఇక ప్రమాదం జరిగిన స్థానిక గ్రామాల ప్రజలకు ఎటువంటి లోటు రానీయకుండా ప్రభుత్వం పెద్దఎత్తున ఆపన్న హస్తం అందిస్తోంది. పునరావాస కేంద్రాల్లో దాదాపు 15 వేల మందికి వసతి, నాణ్యమైన భోజనం ఏర్పాటుచేస్తున్నారు. జీవిఎంసీ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. గ్యాస్ లీకేజి వల్ల జరిగిన నష్టానికి మధ్యంతర పరిహారంగా రూ.50 కోట్లను విశాఖ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేయాలని ఎల్జీ పాలిమర్స్‌ను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. కంపెనీ నుంచి లీక్ అవుతున్న గ్యాస్‌లో గాఢతను, విష ప్రభావాన్ని దాదాపుగా తగ్గించడంలో నిపుణుల బృందం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఖాళీచేసిన కంపెనీ పరిసర ఐదు గ్రామాల్లోకి ప్రజలను మరో రెండు రోజుల వరకూ ముందుజాగ్రత్త చర్యగా అనుమతించవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఆదేశించారు. నిపుణుల బృందం, పీటీబీసీ రాక కాగా, సీఎం వైఎస్ జగన్ కృషితో విషవాయువులను నియంత్రించేందుకు అవసరమైన కెమికల్స్ గుజరాత్ నుంచి ప్రత్యేక కార్గో విమానంలో గురువారం అర్ధరాత్రి విశాఖ చేరుకున్నాయి. వీటితోపాటు పుణే, నాగపూర్ నుంచి తొమ్మిది మంది ప్రత్యేక నిపుణుల బృందం కూడా వచ్చింది. వీరు తీసుకొచ్చిన పారాటెరిటరీ బ్యూటెల్ కాటెకాల్ (పీటీబీసీ) అనే రసాయనిక పదార్థాన్ని గ్యాస్‌లో గాఢతను తగ్గించేందుకు వినియోగిస్తున్నారు. గురువారం ఉదయం 9.30గంటల ప్రాంతంలో 122.5టీపీఎం స్థాయిలో విషవాయువు గాలిలో ఉంది. శుక్రవారం ఇది చాలావరకు తగ్గిందని.. జీరో స్థాయికి రావడానికి మరో 24గంటలు పడుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, గ్యాస్ లీకేజీ ప్రదేశంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి 20 అగ్నిమాపక శకటాల ద్వారా నీటిని వెదజల్లుతున్నారు. (అప్పుడలా.. ఇప్పుడిలా) కాలుష్యంపై ఎప్పటికప్పుడు తనిఖీ.. గాలిలో విషవాయువులు జీరో స్థాయికి చేరాయని, వాతావరణం పూర్తిగా సురక్షితమని తేలిన తర్వాతే గ్రామాల్లోకి ప్రజలను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. గాలిలో గ్యాస్ విష ప్రభావాన్ని పరిశీలించేందుకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)కి చెందిన మొబైల్ తనిఖీ యంత్రాన్ని ఎల్జీ కంపెనీ ప్రాంగణంలోనే ఉంచారు. కంపెనీ పరిసర గ్రామాల్లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో జీరోగా నమోదైందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని చెప్పారు. కంపెనీ ప్రధాన ద్వారం, వెంకటాపురం గ్రామంలో మాత్రమే విషవాయువు జాడ ఉందని, దీన్ని కూడా మరో 24 గంటల్లో జీరోకి తీసుకురాగలమని జిల్లా కలెక్టరు వి.వినయ్‌చంద్, కంపెనీ సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ఆర్ఆర్ వెంకటాపురం గ్రామం వ్యూ మంత్రుల నిరంతర పర్యవేక్షణ గ్యాస్ లీకేజీ బాధితులకు, ప్రభావిత గ్రామాల్లోని వారి ఆస్తులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. నీలం సాహ్ని విశాఖలోనే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. చోరీలు జరుగుతున్నాయనే వదంతులు నమ్మవద్దని, ఎలాంటి ఆందోళన చెందవద్దని విశాఖ నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా ప్రజలకు విన్నవించారు. మరోవైపు.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, ధర్మాన కృష్ణదాస్, మేకపాటి గౌతంరెడ్డి, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ తదితరులు స్వయంగా ఎల్జీ కంపెనీకి వచ్చి లోపలంతా పరిశీలించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్ తదితర నాయకులు కూడా కంపెనీని సందర్శించారు. నీలం సాహ్ని, గౌతంరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కంపెనీ ప్రాంగణంలో సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. 12కు చేరుకున్న మృతులు ఇదిలా ఉంటే.. గ్యాస్ లీకేజీతో అస్వస్థతకు గురైన 554 మందికి విశాఖ నగరంలోని కేజీహెచ్‌తో పాటు అపోలో, కిమ్స్ ఐకాన్ తదితర ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వారిలో శుక్రవారానికి 128 మంది కోలుకోవడంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో 305 మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వారిలో 52 మంది పిల్లలు ఉన్నారు. వైద్యం అందిస్తున్న తీరుతెన్నులను ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శుక్రవారం సమీక్షించారు. ఇక ఈ çఘటనలో మృతుల సంఖ్య 12కి చేరుకుందని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. గురువారం నాటికి 10 మంది చనిపోయారని, శుక్రవారం ఉదయం మరో రెండు మృతదేహాలను గుర్తించి పోస్ట్‌మార్టం నిర్వహించామని చెప్పారు. దుర్ఘటన కారణాలపై హైపవర్ కమిటీ విచారణ దుర్ఘటనకు కారణాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ హైపవర్ కమిటీని నియమించారు. ఈ కమిటీ శుక్రవారం ఘటన స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించింది. కమిటీలో సభ్యుడైన పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లీకేజీలో పలు తప్పిదాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. అలారం మోగకపోవడంపైనా విచారిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ప్రమాదానికి కారణాలపై శోధించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా శుక్రవారం వచ్చింది. (మళ్లీ జరగకూడదు : సీఎం వైఎస్ జగన్) -
కరాచీలో విషాదం.. నలుగురు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో విషాదం చోటుచేసుకుంది. విష వాయువులు పీల్చి నలుగురు మృతి చెందగా.. 15 మంది ఆస్పత్రి పాలయ్యారు. వివరాలు... కరాచీలోని కేమరీ పోర్టు నుంచి ఆదివారం రాత్రి ఓ కార్గో షిప్ కూరగాయల లోడ్‌తో ఒడ్డుకు వచ్చింది. ఈ క్రమంలో జాక్సన్ మార్కెట్ నుంచి పోర్టుకు చేరుకున్న కొంతమంది వ్యక్తులు షిప్ నుంచి కూరగాయల కంటెనర్లను దించేందుకు ప్రయత్నించారు. అన్లోడ్ చేస్తున్న సమయంలో ఓ కంటెనర్ నుంచి విష వాయువులు వెలువడటంతో వారంతా స్పృహ తప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విష వాయువు పీల్చిన కారణంగా నలుగురు వ్యక్తులు మరణించినట్లు వెల్లడించారు. ఇంకో 15 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని.. పాకిస్తానీ నేవీ అధికారుల నుంచి కార్గో షిప్‌నకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. చదవండి: పాక్‌లో టర్కీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం ‘ముందు ఉగ్రమూకను ఖాళీ చేయించండి’ -
విషవాయువులు ఊపిరి తీశాయి
పలమనేరు: సంపు శుభ్రం చేయడానికి దిగిన కార్మికులను విషవాయువులు మింగేశాయి. ఏడుగురు మృత్యువొడిలోకి చేరారు. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలోని వేంకటేశ్వర హేచరీలో శుక్రవారం జరిగింది. అసలేం జరిగిందంటే.. మొరంలోని వేంకటేశ్వర హేచరీలో దాదాపు 150 మంది పనిచేస్తారు. అందులో పరికరా లను శుభ్రం చేయడానికి, బ్యాక్టీరియాను నిర్మూలించడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను వాడతారు. తర్వాత వ్యర్థాలను పైపుల ద్వారా 15 అడుగుల లోతైన సంపులోకి పంపుతారు. సంపులో నీటిని వారానికోసారి బకెట్లతో తోడేవారు. కానీ ఈ మధ్య సంపు శుభ్రం చేయక ఎక్కువ రోజులు కావడంతో అందులో కార్బన్‌మోనాక్సైడ్ భారీగా చేరింది. శుక్రవారం హేచరీకి వెళ్లగానే సూపర్వైజర్ శివకుమార్‌రెడ్డి అక్కడి సంపును శుభ్రం చేయాలని కార్మికులకు సూచించారు. దీంతో రెడ్డెప్ప, కేశవులు నిచ్చెనతో లోనికి దిగారు. వారు ఎంతకీ పైకి రాకపోవడంతో మిగిలినవారు ఒకరొకరిగా సంపులోకి దిగి పైకి రాలేదు. స్థానికులు వీరందరినీ పలమనేరు ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ఏడుగురు మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు వెంటనే రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించారు. రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న బీమా కింద రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ప్రకాశం జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ట్విట్టర్లో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ నాయకుల ద్వారా వివరాలు తెలుసుకుని బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. -
ఫోరెన్సిక్ నివేదికతో బట్టబయలైన నిజాలు
-
ఫోరెన్సిక్ నివేదికతో బట్టబయలైన నిజాలు
మొగల్తూరు: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఫ్యాక్టరీ ప్రమాద ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక జిల్లా పోలీస్ శాఖకు చేరింది. హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి విషవాయుడు కారణంగానే అయిదుగురు మృతి చెందినట్లు నిర్థారణ అయింది. ఈ ఏడాది మార్చి 30న మొగల్తూరు ఆనంద ఆక్వా పార్క్‌లో ఐదుగురి మరణానికి విషవాయువులు కారణం కాదని.. విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందని నమ్మించే డ్రామాకు ఆనంద గ్రూపు సంస్థల యాజమాన్యం తెరలేపింది. ఇందుకోసం దళారులను రంగంలోకి దింపింది. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో నిజాలు బట్టబయలు అయ్యాయి. 37 రోజులుగా ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలకు అధికారులు మీనమేషాలు లెక్కబెడుతున్నారు. ప్రమాద ఘటనపై ఇప్పటికీ పోలీసులుతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఇప్పటికీ విచారణ చేయలేదు. కాగా ఫోరెన్సిక్ నివేదిక రావడంతో ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా విషవాయువులు కారణం ఈగ ఏడుకొండలు (22), తోట శ్రీనివాస్ (30), నల్లం ఏడుకొండలు (22), జక్కంశెట్టి ప్రవీణ్ (23), బొడ్డు రాంబాబు (22) ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. -
మొగల్తూరు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం
ఆక్వా ప్లాంట్ యాజమాన్యం కొత్త ఎత్తుగడ సాక్షి ప్రతినిధి, ఏలూరు/నరసాపురం: మొగల్తూరులోని ఆనంద ఆక్వాప్లాంట్‌లోని ట్యాంకు నుంచి విషవాయువులు వెలువడి ఐదుగురు యువకులు మృత్యువాత పడిన కేసును ఆనంద గ్రూపు సంస్థల యాజమాన్యం తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఘటన విషవాయువు వల్ల జరగలేదని, విద్యుదాఘాతం వల్ల మరణాలు సంభవించాయని చెప్పేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం కంపెనీ ఉద్యోగి ఒకరిని గురువారం రాత్రి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించింది. అతనితో ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంగా చెప్పించే ప్రయత్నం చేపట్టింది. ఫ్యాక్టరీకి సమీపంలోనే నివసించే నల్లం సత్యనారాయణ ఘటన జరిగిన సమయంలో ప్లాంటులో ఉన్నాడు. కానీ అతను ప్రమాదం జరిగిన ట్యాంకు వద్దకు చేరుకోలేదు. అయితే యాజమాన్యం గురువారం రాత్రి అతన్ని నరసాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి, అస్వస్థతకు గురైనట్టు పేర్కొంది. శుక్రవారం అతనితో విలేకరుల సమావేశం పెట్టి.. ఇది కరెంట్ షాక్ వల్లే జరిగిందని, తాను ఆ సమయంలో వైర్లు కట్ చేసే ప్రయత్నం కూడా చేశానని చెప్పించింది.