కరాచీలో విషాదం.. నలుగురు మృతి | Inhaling Toxic Gases 4 Dead 15 Hospitalised In Karachi Pakistan | Sakshi
Sakshi News home page

విష వాయువులు పీల్చి నలుగురు మృతి

Feb 17 2020 8:04 AM | Updated on Feb 17 2020 12:10 PM

Inhaling Toxic Gases 4 Dead 15 Hospitalised In Karachi Pakistan - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

జాక్సన్‌ మార్కెట్‌ నుంచి పోర్టుకు చేరుకున్న కొంతమంది వ్యక్తులు షిప్‌ నుంచి కూరగాయల కంటెనర్లను దించేందుకు ప్రయత్నించారు.

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో విషాదం చోటుచేసుకుంది. విష వాయువులు పీల్చి నలుగురు మృతి చెందగా.. 15 మంది ఆస్పత్రి పాలయ్యారు. వివరాలు... కరాచీలోని కేమరీ పోర్టు నుంచి ఆదివారం రాత్రి ఓ కార్గో షిప్‌ కూరగాయల లోడ్‌తో ఒడ్డుకు వచ్చింది. ఈ క్రమంలో జాక్సన్‌ మార్కెట్‌ నుంచి పోర్టుకు చేరుకున్న కొంతమంది వ్యక్తులు షిప్‌ నుంచి కూరగాయల కంటెనర్లను దించేందుకు ప్రయత్నించారు. అన్‌లోడ్‌ చేస్తున్న సమయంలో ఓ కంటెనర్‌ నుంచి విష వాయువులు వెలువడటంతో వారంతా స్పృహ తప్పి పడిపోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. విష వాయువు పీల్చిన కారణంగా నలుగురు వ్యక్తులు మరణించినట్లు వెల్లడించారు. ఇంకో 15 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని.. పాకిస్తానీ నేవీ అధికారుల నుంచి కార్గో షిప్‌నకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. 

చదవండి: పాక్‌లో టర్కీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై భారత్‌ ఆగ్రహం

‘ముందు ఉగ్రమూకను ఖాళీ చేయించండి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement