ఆక్వా ప్లాంట్ యాజమాన్యం కొత్త ఎత్తుగడ
సాక్షి ప్రతినిధి, ఏలూరు/నరసాపురం: మొగల్తూరులోని ఆనంద ఆక్వాప్లాంట్‌లోని ట్యాంకు నుంచి విషవాయువులు వెలువడి ఐదుగురు యువకులు మృత్యువాత పడిన కేసును ఆనంద గ్రూపు సంస్థల యాజమాన్యం తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఘటన విషవాయువు వల్ల జరగలేదని, విద్యుదాఘాతం వల్ల మరణాలు సంభవించాయని చెప్పేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం కంపెనీ ఉద్యోగి ఒకరిని గురువారం రాత్రి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించింది.
అతనితో ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంగా చెప్పించే ప్రయత్నం చేపట్టింది. ఫ్యాక్టరీకి సమీపంలోనే నివసించే నల్లం సత్యనారాయణ ఘటన జరిగిన సమయంలో ప్లాంటులో ఉన్నాడు. కానీ అతను ప్రమాదం జరిగిన ట్యాంకు వద్దకు చేరుకోలేదు. అయితే యాజమాన్యం గురువారం రాత్రి అతన్ని నరసాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి, అస్వస్థతకు గురైనట్టు పేర్కొంది. శుక్రవారం అతనితో విలేకరుల సమావేశం పెట్టి.. ఇది కరెంట్ షాక్ వల్లే జరిగిందని, తాను ఆ సమయంలో వైర్లు కట్ చేసే ప్రయత్నం కూడా చేశానని చెప్పించింది.
మొగల్తూరు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం
Published Sat, Apr 1 2017 2:23 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM
Advertisement
Advertisement