రామగిరి(మంథని): సింగరేణి సంస్థ అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా(ఏపీఏ)లోని పదో గనిలో సోమవారంరాత్రి నైట్‌షిఫ్టు నుంచి విషవాయువులు వెలువడుతున్నాయి. ఆ సమయంలో గని లోపల కార్మికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. బొగ్గునిల్వలు పూర్తిగా వెలికితీయడంతో ఆ గనిని ఇటీవలే మూసివేశారు. సింగరేణి సంస్థ ఆర్జీ–3 పరిధిలోని ఓసీపీ–1 విస్తరణకు అనుసంధానం చేసేందుకు గని లోపల డ్యాం నిర్మాణ పనులు చేపట్టారు. అయితే అత్యవసర విధుల నిమిత్తం కొద్దిమంది కార్మికులు మాత్రమే హాజరవుతున్నారు.
ఈ క్రమంలో గనిలోని 4 సీమ్, 27 డిప్, 51 లెవెల్ ప్రాంతంలో విషవాయువులు వెలువడడాన్ని వారు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. సంబంధిత గని అధికారులు ఈ విషయాన్ని డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, జీఎం సేఫ్టీ (కార్పొరేట్) కె.గురవయ్య, ఏపీఏ జీఎం ఎన్.వి.కె. శ్రీనివాస్, జీఎం సేఫ్టీ(రామగుండం రీజియన్)కు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment