AQUA PLANT
-
ఎన్నాళ్లు కాపాడతారు
నరసాపురం : మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో ఐదుగురు కూలీల ఉసురు తీసింది విష వాయువులేనని తేలిపోయింది. ఆ ప్లాంట్‌లో మార్చి 30న చోటుచేసుకున్న ఈ ఘోరానికి విద్యుదాఘాతమే కారణమని.. అక్కడి ప్లాంట్ నుంచి ఎలాంటి విష వాయువులు వెలువడలేదని నమ్మించేందుకు ప్లాంట్ యాజమాన్యం, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు సహా మరికొంతమంది ప్రజాప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నిసూ్తనే ఉన్నారు. తద్వారా కేసును పక్కదారి పట్టించి.. యాజమాన్యాన్ని ఒడ్డున పడేయడంతోపాటు తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉధృతంగా సాగుతున్న ఉద్యమంపై నీళ్లు చల్లేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి ఆక్వా పార్క్ యాజమాన్యం తరఫున వకాల్తా పుచ్చుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక అభివృద్ధి ముసుగులో తరచూ ఆక్వా పార్క్‌కు అనుకూల ప్రకటనలు చేసూ్తనే ఉన్నారు. మొగల్తూరు ప్లాంట్‌లో కాలుష్యమే లేదని రాష్ట్ర మంత్రులు అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేశారు. కాలుష్యం కళ్లముందే కనబడుతున్నా.. అలాంటిదేమీ లేదని ఇప్పటికీ బొంకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ విభాగం వాస్తవాలను నిగ్గుతేల్చింది. అమోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువులే మరణా లకు కారణమైనట్టు ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. అయినా.. మౌనముద్రలోనే మొగల్తూరు ఆనంద ఆక్వా ప్లాంట్‌లోని వ్యర్థాలను శుభ్రం చేసేందుకు మార్చి 30న ఉదయం నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు (22), మొగల్తూరు కట్టుకాలువకు చెందిన తోట శ్రీనివాస్ (30), నల్లంవారి తోటకు చెందిన నల్లం ఏడుకొండలు (22), మొగల్తూరు మండలం కాళీపట్నంకు చెందిన జక్కంశెట్టి ప్రవీణ్ (21), మొగల్తూరు మండలం మెట్టిరేవుకు చెందిన బొడ్డు రాంబాబు (22) ట్యాంకులోకి దిగారు. ఒకరి తరువాత ఒకరు క్షణాల్లోనే ప్రాణాలు వదిలారు. ఇందుకు కారణమైన ట్యాంక్ నుంచి సుమారు వారం రోజులపాటు విష వాయువుల ఆనవాళ్లు కనిపించాయి. అయినప్పటికీ.. ఐదుగురి మరణానికి విషవాయువులు కారణం కాదనే వాదనను తెరమీదకు తెచ్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అందిన నివేదిక వాస్తవాన్ని వెల్లడి చేయడంతో ఆక్వా ప్లాంట్ యాజమాన్యమే ఇందుకు కారణమని తేలిపోయింది. నరసాపురం ప్రభుత్వాసుపత్రికి మూడు రోజుల క్రితమే ఫోరెన్సిక్ నివేదిక అందగా.. ఆసుపత్రి సూపరింటెండెంట్ దానిని డీఎస్పీ జి.పూర్ణచంద్రరావుకు అందజేశారు. ప్రమాదం జరిగిన రోజున విషవాయువులే ప్రమాదానికి కారణమని.. ఇందులో ఆనంద యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు రాష్ట్ర మంత్రులు సైతం ప్రకటించారు. యాజమాన్యంపై కేసు నమోదు చేశామని కూడా చెప్పారు. ఆ మరుసటి రోజునుంచి దర్యాప్తును గాలికొదిలేశారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తే తప్ప తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. ఆ నివేదిక అంది మూడురోజులు గడిచినా.. పోలీస్ యంత్రాంగం నేటికీ మీనమేషాలు లెక్కిస్తోంది. న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, అనంతరమే ముందుకు వెళతామని పోలీస్ అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. ఉద్యోగుల్ని బలిపెడతారా! ఐదుగురి ప్రాణాలు హరించిన పాపం నుంచి యాజమాన్యాన్ని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ప్లాంట్‌లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులపై కేసులు నమోదుచేసి యాజమాన్యాన్ని తప్పించేందుకు కుట్ర పన్నుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఘటన జరిగిన రోజున మంత్రులు దగ్గరుండి మరీ పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షించారు. అందువల్ల పోస్టుమార్టం నివేదిక తారుమారయ్యే అవకాశం ఉందనే విమర్శలు ఇంకా వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం అనంతరం పోలీసులు కాపలా ఉండిమరీ ఆ రోజు అర్ధరాత్రి హడావుడిగా అంత్యక్రియలు జరిపించడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇదిలావుంటే.. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఆక్వా ప్లాంట్ యాజమాన్యంపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వం కళ్లు తెరవాలి విష వాయువుల కారణంగానే మొగల్తూరు ఆక్వాప్లాంట్‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారనే విషయం వెల్లడైంది. ఫోరెన్సిక్ నివేదిక ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఇకనైనా పంతానికి పోకుండా ప్రభుత్వం కళ్లు తెరవాలి. 40 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న తుందుర్రు ఆక్వాపార్క్‌ను తీరానికి తరలించాలి. ఆక్వా ప్లాంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. – ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే మంత్రులూ.. ఇప్పుడేమంటారు ప్రమాదం సాధారణంగా జరిగిందని, అక్కడ ఎలాంటి కాలుష్యం లేదని అసెంబ్లీలో అప్పటి మంత్రులు బుకాయించారు. ఎంపీ గోకరాజు గంగరాజు అయితే ఇది కరెంట్ షాక్ వల్లే జరిగిందన్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన నేపథ్యంలో మంత్రులు ఏం చెబుతారు. ప్రజల రక్షణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా మంత్రులు కళ్లు తెరిచి వారి ప్రకటనల్ని వెనక్కి తీసుకోవాలి. – శిరిగినీడి నాగభూషణం, నాయకుడు, సర్వోదయ రైతు సంఘం హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి మొగల్తూరు ఆక్వా ప్లాంట్ యాజమాన్యంపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలి. ఇది ప్రభుత్వ నిర్ల క్ష్యం, యాజమాన్యం అలసత్వం వల్లే జరిగిందనేది ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తేలిపోయింది. అసలు ఇప్పటికే యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి. ఇప్పుడు కూడా యాజమాన్యాన్ని రక్షించాలనుకుంటే అంతకంటే దారుణం ఉండదు. – బి.బలరామ్, సీపీఎం జిల్లా కార్యదర్శి న్యాయ సలహాతో ముందుకెళ్తాం మొగల్తూరు ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక అందింది. దానిని పరిశీలిస్తున్నాం. దీనిపై న్యాయ సలహా తీసుకుని కేసు విషయంలో ముందుకు వెళ్తాం. ఐదుగురు మృత్యువాత పడిన ఘటనకు సంబంధించి అప్పట్లోనే కేసు నమోదైంది. ప్రత్యేకంగా మళ్లీ కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రస్తుతానికి ఇంతకుమించి వివరాలు చెప్పలేం. – జి.పూర్ణచంద్రరావు, డీఎస్పీ, నరసాపురం -
ప్రాణాలకు వెల.. న్యాయం డీలా..
మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో వెలువడిన విష వాయువులు ఐదుగురు కూలీల ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. మనుషుల ప్రాణాలకు వెల కట్టేసి.. న్యాయానికి పాతరేసేందుకు దిగువ స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు తమవంతు సహాయం అందిస్తున్నారు. మరణాలకు కారణ మైన యాజమాన్యంపై ఈగ కూడా వాలనివ్వడం లేదు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని.. సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని జిల్లా ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ తదితరులు వేలాది ప్రజల సమక్షంలో ప్రకటించినా.. తెరవెనుక మాత్రం వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : మనుషుల ప్రాణాలకు డబ్బుతో విలువ కట్టేస్తే సరిపోతుందనుకున్నంత కాలం మొగల్తూరు ఘటన లాంటి దారుణాలు పునరావృతమవుతూనే ఉంటాయి. నల్లంవారి తోటలోని అనంద ఆక్వా ప్లాంట్ ట్యాంక్ నుంచి గతనెల 30న విష వాయువులు వెలువడి ఐదుగురు కూలీలు మృత్యువాతపడిన విషాద ఘటన విదితమే. ఆ తరువాత మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం జరుగుతోంది. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై ఈగ వాలకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డుపడుతుండటంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆనంద ఆక్వా యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ఘోర ఘటనకు కారణమని మంత్రులు ప్రకటించినా ఇప్పటివరకూ ఆ కేసులో పురోగతి లేదు. కనీసం యాజమాన్య ప్రతినిధులను పిలిచి విచారణ జరిపిన దాఖలాలు కూడా లేవు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుండగా.. మరణాలు విషవాయువుల వల్ల సంభవించలేదని.. విద్యుదాఘాతమే కారణమని ఆక్వా ప్లాంట్ యాజమాన్యం కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు ఇదే యాజమాన్యం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా అక్వా ఫుడ్ పార్క్‌కు ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు మద్దతుగా నిలవడం విశేషం. అన్నీ అతిక్రమణలే.. గొంతేరు కాలువ నీటినే తాగునీరుగా వినియోగిస్తున్నామని, మొగల్తూరు ఆక్వా ప్లాంట్ గొంతేరులో వదులు తున్న కాలుష్యం వల్ల తామంతా ఇబ్బంది పడుతున్నామ ని 25 గ్రామాల ప్రజలు కాలుష్య నియంత్రణ బోర్డుకు ఫిర్యాదు చేశారు. ప్లాంట్ యాజమాన్యం పైప్లైన్ల ద్వారా కాలుష్యాన్ని నేరుగా గొంతేరు కాలువలోకి వదిలిపెడుతోందని ముత్యాలపల్లి, మొగల్తూరు, గరువుపల్లవ పాలెం, గుంటపల్లిపాలెం ప్రజలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్‌లో కాలుష్య నియంత్రణ బోర్డు టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలకు వచ్చింది. ప్లాంట్‌లో అన్నీ అతిక్రమణలే కనిపించాయని నిర్థారించింది. రెండు నెలల్లోగా అతిక్రమణలను యాజ మాన్యం సవరించుకోవాలని స్పష్టం చేసింది. ప్లాంట్‌నుంచి వస్తున్న వ్యర్థాలను గొంతేరు కాలువలో కలుపుతున్నట్టు టాస్క్‌ఫోర్స్ సభ్యులు గుర్తించారు. ఈ ప్లాంట్ అవసరాలకు రోజుకు 59 వేల లీటర్ల నీటిని ఉపయోగిస్తామని యాజమాన్యం చెప్పిన్పటికీ.. 1.12 లక్షల లీటర్ల వినియోగిస్తున్నట్టు గుర్తించారు. నీటి మీటర్లను ఏర్పాటు చేయలేదని తప్పుపట్టారు. రోజుకు 40 వేల లీటర్ల నీరు మాత్రమే బయటకు విడుదల చేస్తున్నట్టు ప్లాంట్ యాజ మాన్యం పేర్కొనగా.. అంతకుమించి వస్తున్నట్టు తనిఖీలలో తేలింది. కేవలం 10 టన్నుల రొయ్యల సామర్థ్యంతో ప్లాంట్‌ను నెలకొల్పుతున్నట్టు పేర్కొన్న యాజమాన్యం 30 టన్నుల సామర్థ్యంతో దీనిని నిర్మించినట్టు టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించింది. గొంతేరులో కలుస్తున్న రెండు పైపులైన్లను వెంటనే తొలగించాలని అదేశించింది. ఎట్టిపరిస్థితుల్లో వ్యర్థాలను ప్లాంట్‌నుంచి బయటకు రాకుండా చూడాలని ఆదేశించింది. ప్రతిరోజూ ఎంత సరుకు ప్రాసెస్ చేస్తున్నారనే దానిపై రికార్డులు నిర్వహిం చాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేస్తున్నది, లేనిది రెండు నెలల్లో పరిశీలించి నివేదిక ఇవ్వాలని పర్యావరణ ఇంజినీరుకు జనవరి 12న ఆదేశాలిచ్చింది. వ్యర్థాలను, కాలుష్యాన్ని నేరుగా గొంతేరులో కలుపుతున్న పైప్లైన్లను నేటికీ అలాగే ఉంచేసినా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించలేదు. రెండు నెలల తర్వాత తాము ఫ్యాక్టరీని సందర్శించామని, ఇంకా నివేదిక ఇవ్వలేదని, ఇంతలోనే ఘటన జరిగిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. పర్యావరణ ఇంజినీరు సక్రమంగా తనిఖీ చేసినా వాస్తవాలు బయటపడేవి. ఐదుగురి ప్రాణాలు నిలిచేవి. పర్యావరణ ఇంజినీర్ ఆ పని చేయకపోవడం, జిల్లా అధికారులు పరిశ్రమ యాజమాన్యానికి కొమ్ముకాయడంతో ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్లు తెరిచి తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా పార్క్ పనులను నిలిపివేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. -
అనుమతి ఒకటి.. చేసేది వేరొకటి
భీమవరం : మొగల్తూరు నల్లంవారి తోటలో ఐదుగురు యువకుల మరణానికి కారణమైన ఆనంద గ్రూప్ సంస్థల యాజమాన్యం అడుగడుగునా నిబంధనల్ని ఉల్లంఘించినట్టు స్పష్టమవుతోంది. ఇక్కడి ప్లాంట్‌లో కేవలం రొయ్య తలలను తొలగించి శుభ్రం చేయడానికి మాత్రమే అనుమతి తీసుకుంది. వీటిని రొయ్యల షెడ్లుగా పిలుస్తారు. రొయ్యల షెడ్లు వేరుగా, ప్రాసెసింగ్ ప్లాంట్లు వేరుగా ఉంటాయి. అయితే, ఆనంద యాజమాన్యం మొగల్తూరు ప్లాంట్ నుంచి రొయ్యలను ప్రాసెసింగ్ యూనిట్లకు పంపించకుండా ఇక్కడే ప్రాసెసింగ్ చేయిస్తోంది. వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకున్న రెండు యంత్రాల సాయంతో ఐస్‌తో కూడిన శ్లాబ్లుగా మార్చి ప్యాకింగ్ సైతం చేయిస్తోంది. వాటిని కోల్డ్ స్టోరేజీలకు తరలించకుండా నేరుగా ఎగుమతి చేస్తున్నట్టు సమాచారం. ఈ తతంగమంతా ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు లేకుం డానే నిర్వహిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ సాగుతున్న వ్యవహారమంతా అక్రమమేనని ఆక్వా వర్గాలు చెబుతున్నాయి. రొయ్యల షెడ్ ముసుగులో ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేస్తూ ప్రభుత్వానికి పన్నులను సైతం ఎగవేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. యాజమాన్యం స్వార్థమే ప్రాణాలు తీసింది నల్లంవారి తోటలోని షెడ్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన రొయ్యలను ముందుగా శుభ్రం చేస్తారు. అనంతరం వాటి తలలను తొలగిస్తారు. ఈ సమయంలో రొయ్య తలల నుంచి పసుపు, తెలుపు రంగులతో కూడిన జిగురు లాంటి పదార్థం బయటకొస్తుంది. దానిని ఎఫిలెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ) లోకి పంపించాలి. ఈటీపీకి ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేసి.. దానిని ప్రతిరోజు బ్లీచింగ్‌తో శుభ్రం చేయాలి. ఈటీపీకి గ్రిల్స్ ఏర్పాటు చేస్తే సమీపంలోనే ఉన్న జనావాసాల్లోకి దుర్గంధం వెదజల్లుతుంది. దీనివల్ల ప్రజలు ఆందోళన చేపడతారనే ఉద్దేశంతో ఈటీపీని రేకులతో మూసివేసి దుర్గంధం బయటకు రాకుండా చేశారు. ఈటీపీని మూసివేయడం వల్ల వ్యర్థాలు అందులో కుళ్లిపోయి విషవాయువులు వెలువడ్డాయి. అవే ఐదుగురు కూలీలను పొట్టన పెట్టుకున్నాయి. పన్నులు ఎగ్గొడుతున్న సంస్థకు సర్కారు అండ ఆనంద గ్రూపు సంస్థలు కృష్ణాజిల్లా కృత్తివెన్ను, మొగల్తూరులోని నల్లంవారి తోటలో రొయ్యల షెడ్ల ఏర్పాటుకు మాత్రమే ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. ఆ రెండుచోట్లా అక్రమంగా రొయ్యల ప్రాసెసింగ్ నిర్వహిస్తోంది. తద్వారా ప్రభుత్వానికి చెల్లించాలి్సన పన్నులు ఎగ్గొడుతోంది. దీంతోపాటు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఆనంద యాజమాన్యానికి ప్రభుత్వం అండగా నిలవడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి యాజమాన్యానికి ఆక్వా ఫుడ్‌పార్క్ కేటాయించడం, కోట్లాది రూపాయలను సబ్సిడీగా చెల్లించడం, ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మృతుల నివాసాల వద్ద కొనసాగుతున్న పికెట్లు మృత్యువాత పడిన యువకుల ఇళ్లకు సమీపంలో ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్లు సోమవారం కూడా కొనసాగాయి. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చివెళ్లే వారి వివరాలను పోలీసులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. పోలీస్ పికెట్లు కొనసాగుతుండటంతో మృతుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఇదిలావుండగా, నిత్యం కూలీల రాకతో హడావుడిగా ఉండే ఆనంద రొయ్యల ప్లాంట్ వద్ద గంభీర వాతావరణం నెలకొంది. ఘటన జరిగి ఆరు రోజులైనా విషవాయువులు వెదజల్లిన ట్యాంక్ నుంచి నేటికీ దుర్వాసన వసూ్తనే ఉంది. ఖాకీల నీడలోనే మొగల్తూరు మొగల్తూరు : మొగల్తూరు ఇంకా పోలీసుల నీడలోనే ఉంది. నల్లంవారి తోటలోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లోని ట్యాంక్ నుంచి విషవాయువులు వెదజల్లి ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ రోజున గ్రామస్తులు ఆందోళనలు, ధర్నాలకు దిగడంతో పోలీసులను మోహరించారు. అక్కడ శాంతిభద్రతలు ఘటన జరిగిన రోజు మధ్యాహ్నానికే అదుపులోకి వచ్చాయి. అయితే, ఇప్పటికీ ఫ్యాక్టరీ వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. ఇక్కడ స్పెషల్ పార్టీ పోలీసులు షిప్టుల వారీగా బందోబస్తు కొనసాగిస్తున్నారు. బయట వ్యక్తులు ఎవరూ రాకుండా పరిశ్రమ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సినీ స్టార్స్ ఎక్కడ! మొగల్తూరులు విషవాయువుల కారణంగా ఐదుగురు యువకులు మృత్యువాత పడిన ఉదంతంపై మొగల్తూరు హీరోలు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కాగా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అదే రోజు సాయంత్రం వచ్చి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మూడవ రోజున పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి, సీఐటీయూ, సీపీఎం ముఖ్యనాయకులు వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు వచ్చారు. తమ సొంత గడ్డపై దారుణ ఘటన చోటుచేసుకున్నా.. మెగాస్టార్ చిరంజీవి, రెబల్‌స్టార్ యూవీ కృష్ణంరాజు ఈ ఛాయలకు రాలేదు. కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆక్వా ప్లాంట్ ఘటనపై చర్యలు చేపట్టండి
అధికారులకు కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరు పంచాయతీ పరిధిలోని ఆనంద ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఐదుగురు యువకులు మరణించిన సంఘటనపై కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలని చీఫ్ లేబర్ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. స్థానిక అధికారులు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశాలివ్వాలని, ఘటనలో మరణించినవారి కుటుంబాలకు ఉపశమనం కలిగేలా సహాయ చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. తన ఆదేశాల అమలుకు అనుగుణంగా చేపట్టిన చర్యలపై 24 గంటల్లోగా నివేదిక అందజేయాలన్నారు. కాగా ఈ ఘటనను కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణిస్తోందని, స్థానిక అధికారుల నుంచి నివేదికలు అందాక తదుపరి చర్యలను చేపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
మొగల్తూరు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం
ఆక్వా ప్లాంట్ యాజమాన్యం కొత్త ఎత్తుగడ సాక్షి ప్రతినిధి, ఏలూరు/నరసాపురం: మొగల్తూరులోని ఆనంద ఆక్వాప్లాంట్‌లోని ట్యాంకు నుంచి విషవాయువులు వెలువడి ఐదుగురు యువకులు మృత్యువాత పడిన కేసును ఆనంద గ్రూపు సంస్థల యాజమాన్యం తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఘటన విషవాయువు వల్ల జరగలేదని, విద్యుదాఘాతం వల్ల మరణాలు సంభవించాయని చెప్పేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం కంపెనీ ఉద్యోగి ఒకరిని గురువారం రాత్రి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించింది. అతనితో ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంగా చెప్పించే ప్రయత్నం చేపట్టింది. ఫ్యాక్టరీకి సమీపంలోనే నివసించే నల్లం సత్యనారాయణ ఘటన జరిగిన సమయంలో ప్లాంటులో ఉన్నాడు. కానీ అతను ప్రమాదం జరిగిన ట్యాంకు వద్దకు చేరుకోలేదు. అయితే యాజమాన్యం గురువారం రాత్రి అతన్ని నరసాపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి, అస్వస్థతకు గురైనట్టు పేర్కొంది. శుక్రవారం అతనితో విలేకరుల సమావేశం పెట్టి.. ఇది కరెంట్ షాక్ వల్లే జరిగిందని, తాను ఆ సమయంలో వైర్లు కట్ చేసే ప్రయత్నం కూడా చేశానని చెప్పించింది. -
మొగల్తూరు ఘటనపై దద్దరిల్లిన అసెంబ్లీ
-
ఐదుగురిని మింగిన ఆక్వా ప్లాంట్
- మొగల్తూరులో ఘోరం - రొయ్యల ఫ్యాక్టరీలో విరజిమ్మిన విష వాయువులు - ఐదుగురి దుర్మరణం సాక్షి ప్రతినిధి, ఏలూరు/నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో గురువారం పెనువిషాదం చోటుచేసుకుంది. మొగల్తూరు పంచాయతీ పరిధిలోని నల్లంవారి తోట గ్రామంలోని ఆనంద ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు. ప్లాంట్‌కు సంబంధించిన వ్యర్థాలు నిల్వ ఉండే ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. చనిపోయిన వారంతా 30 ఏళ్లలోపు వారే. కుటుంబాలకు వారే ఆధారం. ఈ ఘోరం జరిగిన వెంటనే ప్లాంట్ నిర్వాహకులు, కీలక ఉద్యోగులు ఉడాయించారు. ఐదుగురు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నా పోలీసులు పట్టించుకోక పోవడంతో గ్రామస్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్లాంట్‌పై దాడికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఫ్యాక్టరీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. ఆనంద ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్‌లో వ్యర్థాలను నిల్వ ఉంచే ట్యాంకును శుభ్రం చేసేందుకు గురువారం ఉదయం 8 గంటలకు దినసరి కూలీలుగా పని చేస్తున్న యువకులు సిద్ధమయ్యారు. తొలుత నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు (22) ట్యాంకులోకి దిగాడు. ఒక్కసారిగా విషవాయువు వెదజల్లడంతో ట్యాంకులోనే కుప్పకూలిపోయాడు. లోపల ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో మొగల్తూరుకి చెందిన తోట శ్రీనివాస్ (30), నల్లంవారి తోటకు చెందిన నల్లం ఏడుకొండలు (22) లోపలకు దిగారు. వాళ్లిద్దరూ కూడా బయటకు రాకపోవడంతో మొగల్తూరు మండలం కాళీపట్నంకు చెందిన జక్కంశెట్టి ప్రవీణ్ (23), మొగల్తూరు మండలం మెట్టిరేవుకు చెందిన బొడ్డు రాంబాబు (22) ట్యాంకులోకి దిగి క్షణాల్లోనే ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది యాజమాన్యానికి తెలియజేయగా.. మేనేజర్‌తో పాటు కీలక ఉద్యోగులు అక్కడి నుంచి పారిపోయారు. ఐదుగురు యువకులు మృతి చెందిన విషయం తెలిసి గ్రామస్తులు, మృతుల బంధువులు ఘటన స్థలికి పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళనకు దిగారు. అప్పటికే పెద్దఎత్తున అక్కడకు చేరుకున్న పోలీసులు గ్రామస్తుల్ని అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేయగా.. వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీపై రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. రోజుల తరబడి నిల్వ చేయడం వల్లే.. ఇక్కడికి సమీపంలోని తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సమీప 40 గ్రామాల్లో పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ ఉద్యమాల నేపథ్యంలో ఆనంద అక్వా ప్లాంట్ వ్యర్థాలను నేరుగా గొంతేరు డ్రెయిన్‌లో వదలటాన్ని నిలుపుదల చేసి తాత్కాలికంగా నిర్మించిన ట్యాంకులోకి వదులుతున్నారు. ట్యాంకులోకి చేరిన వ్యర్థాలను ప్రతిరోజు రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ పనులేవీ చేయడం లేదు. ట్యాంక్‌లోని వ్యర్థాలను బయటకు వదిలి నెల రోజులు దాటిందని చెబుతున్నారు.దీని వల్ల విష వాయువులు వెలువడ్డాయి.