విషవాయువులు పీల్చి..అనంతలోకాలకు.. | three members are dead by breathing of toxic gases | Sakshi
Sakshi News home page

విషవాయువులు పీల్చి..అనంతలోకాలకు..

Published Sat, Oct 4 2014 11:52 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM

విషవాయువులు పీల్చి..అనంతలోకాలకు.. - Sakshi

విషవాయువులు పీల్చి..అనంతలోకాలకు..

ఆయిల్ కంపెనీలో ముగ్గురి మృత్యువాత

విషవాయువులు పీల్చి ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. రాజేంద్రనగర్ సర్కిల్ గగన్‌పహాడ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. ఓ ఆయిల్ తయారీ కంపెనీలో వ్యర్థాలను తొలగిస్తున్న కార్మికులు విషవాయువుల కారణంగా మృత్యుఒడికి చేరిన విషయం తెలియడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వివరాలు తెలుసుకునేందుకు కంపెనీ వద్దకు భారీగా తరలివచ్చారు. ఇదే ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన అన్నదమ్ములిద్దరూ ఉండగా మరొకరు బీహార్‌కు చెందిన వ్యక్తి. ఇంత విషాదం చోటుచేసుకున్నా కంపెనీ యాజమాన్యం అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 - శంషాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement