విష వాయువు లీకేజీ | Seven workers fall ill after gas leak in Chhattisgarh | Sakshi
Sakshi News home page

విష వాయువు లీకేజీ

Published Fri, May 8 2020 5:18 AM | Last Updated on Fri, May 8 2020 5:18 AM

Seven workers fall ill after gas leak in Chhattisgarh - Sakshi

రాయ్‌పూర్‌: లాక్‌డౌన్‌ కారణంగా కొంతకాలంగా మూతబడి ఉన్న కాగితం తయారీ ఫ్యాక్టరీని     తిరిగి ప్రారంభించే క్రమంలో విషవాయువు లీక్‌ అయి ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. టెట్లా గ్రామానికి సమీపంలోని శక్తి పేపర్‌ మిల్‌ లాక్‌డౌన్‌ కారణంగా కొంతకాలంగా మూతబడి ఉంది. కర్మాగారాన్ని మళ్లీ ప్రారంభించేందుకు గాను బుధవారం సాయంత్రం కార్మికులు ట్యాంకు శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఏడుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారడంతో రాయ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement