
షాబాద్(చేవెళ్ల): షాబాద్ మండలంలో బీజేపీకి పూర్వవైభవం తీసుకొస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘనందన్‌రావు అన్నారు. ఆదివారం షాబాద్‌లో వివిధ పార్టీల నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన యువకులు బీజేపీ చేరారు. వారికి రఘనందన్‌రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్రంలో రోజురోజు బలపడుతూ టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని అన్నారు. పార్టీకి కార్యకర్తలే అధిష్టానమని కార్యకర్తల బలమే బీజేపీ బలమన్నారు. నగరానికి ఇంత సమీపంలో ఉన్న మండలంలో కనీస వైద్య సదుపాయాలు, ఉన్నత విద్యనభ్యసించేందుకు కళాశాలలు లేకపోవడం బాధాకరమని అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన నాయకులు గత మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించినా, ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాష్, మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, నాయకులు జంగారెడ్డి, రవీందర్‌రెడ్డి, రాము, కిరణ్, రాజేందర్‌రెడ్డి, మాణయ్య, నవీన్, విష్ణు, రవీందర్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్, నరేందర్‌రెడ్డి, రంగయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment