దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో ఒక యువకుడు మృతి చెందాడు.
షాబాద్ (రంగారెడ్డి) : దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో ఒక యువకుడు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తాళ్లపల్లిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి నర్సింహులు(25) మంగళవారం ఇంటి వద్ద తీగపై దుస్తులు ఆరేస్తుండగా షాక్‌కు గురై మృతి చెందాడు. అతనికి భార్య, ఆరు నెలల కుమారుడు ఉన్నారు.
కాగా నర్సింహులు మృతదేహంతో గ్రామస్తులు స్థానిక విద్యుత్ ఉపకేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. అతని మృతికి అధికారులే కారణమని ఆరోపించారు. గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమస్య ఉందని తాము ఎన్నిసార్లు చెప్పినా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.