ముళ్ల పొదల్లో పసిపాప.. | New born girl found in bush | Sakshi
Sakshi News home page

ముళ్ల పొదల్లో పసిపాప..

Sep 24 2015 2:50 PM | Updated on Mar 28 2018 11:11 AM

ముళ్ల పొదల్లో పసిపాప.. - Sakshi

ముళ్ల పొదల్లో పసిపాప..

రెండు రోజుల క్రితం పుట్టిన ఓ చిన్నారిని ముళ్లపొదల్లో వదలి వెళ్లిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఫైల్వాన్ షాహి దర్గా దగ్గర గురువారం జరిగింది.

షాబాద్ (రంగారెడ్డి) : రెండు రోజుల క్రితం పుట్టిన ఓ చిన్నారిని ముళ్లపొదల్లో వదలి వెళ్లిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఫైల్వాన్ షాహి దర్గా దగ్గర గురువారం జరిగింది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసిబిడ్డను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దర్గా దగ్గర ఉన్న పొదల్లో వదలి వెళ్లారు. తల్లి కోసం గుక్కపెట్టి ఏడుస్తున్న రెండు రోజుల చిన్నారిని అటుగా వెళుతున్న అజీజ్ అనే వ్యక్తి గమనించాడు.

వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఐటీడీసీ అధికారులతో సంఘటన స్థలానికి చేరుకుని పాపను రక్షించారు. చికిత్స కోసం నీలోఫర్ అసుపత్రికి తరలించారు. పాప ఆరోగ్యంగా ఉంది. చికిత్స అనంతరం అధికారులు శిశువిహార్‌కి తరలించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement