Newborn girl
-
మహిళల సాయంతో ఇంట్లోనే ప్రసవం.. తల్లీబిడ్డా మృతి
సాక్షి, చెన్నై: రాత్రి వేళ పురిటి నొప్పులు రావడంతో స్థానిక మహిళలు ప్రసవం చేశారు.. తల్లీ బిడ్డా అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఈ విషాదకర ఘటన పెరంబలూరు జిల్లాలో జరిగింది. వెప్పంతడై తాలూకా అంకూర్ గ్రామానికి చెందిన దిలీప్‌కుమార్ భార్య సెల్వరాణి (36) దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో సెల్వరాణి మూడో గర్భం దాల్చింది. ఈ నెల 4వ తేదీ రాత్రి నొప్పులు రావడంతో ఇరుగుపొరుగు మహిళల సాయంతో ఇంట్లోనే ప్రసవం చేశారు. ఆడబిడ్డ పుట్టింది. కొద్ది సమయానికి ఇద్దరూ అస్వస్థతకు గురికావడంతో బంధువులు 108లో పెరంబలూరు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో ఇద్దరూ మృతి చెందారు. మంగళమేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: దొంగ అనుకుని చావబాదారు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి -
హృదయ విదారక ఘటన: నవజాత శిశువుని మెట్లపై వదిలేశారు
సిమ్లా: పిల్లలు కలగాలని కొందరు దంపతులు ఆసుపత్రుల చుట్టు తిరుగుతుంటే.. మరికొందరు గుళ్ల చుట్టు తిరుగుతూ దేవుడికి మొక్కులు చెల్లింస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. అయితే, దీనికి భిన్నంగా కొంత మంది మాత్రం.. తమకు పుట్టిన సంతానాన్ని వేర్వేరు కారణాలతో వదిలివేస్తున్న సంఘటనలను తరచుగా వార్తల్లో చూస్తుంటాం. నిన్న(సోమవారం) జరిగిన ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిమచల్ ప్రదేశ్‌లోని సోలాన్ అనే ప్రాంతంలో ఒక శివాలయం ఉంది. ప్రతిరోజు ఉదయాన్నే ఆలయం ముందు నుంచి స్థానికులు వాకింగ్‌కు వెళ్తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఒక చిన్నారి ఏడుపు వాకర్లకు వినిపించింది. దీంతో వారు అక్కడికి వెళ్లి చూశారు. ఆలయం మెట్లమీద ఒక నవజాత ఆడ శిశువు టవల్లో చుట్టి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆ చిన్నారి చలికి వణికిపోతుంది. వెంటనే స్థానికులు ఆలయ పూజారీ బ్రహ్మనంద్కు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి ఏవరో.. అని ఆరాతీస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నెలలు నిండకుండానే చిన్నారి పుట్టడం వలన వదిలేసుంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ పూజారీ బ్రహ్మనంద్ చిన్నారిని.. తాను దత్తత తీసుకుని పెంచుకుంటానని గ్రామస్తులకు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: బిడ్డ వేదనను చూడ లేక.. విషపు ఇంజెక్షన్ ఇచ్చి.. -
అరుదైన వ్యాధి: వృద్ధురాలిగా జన్మించిన చిన్నారి
డబ్లిన్: బిడ్డకు జన్మనివ్వడం తల్లికి ఎంతటి సంతోషాన్నిస్తుందో మాటల్లో వర్ణించడం కష్టం. అయితే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ తల్లి ఆనందిస్తుంది.. అలా కాక ఏదైనా అనారోగ్య సమస్యతో జన్మిస్తే.. తల్లి హృదయం తల్లడిల్లుతుంది. ఇదే పరిస్థితి ఎదురయ్యింది దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళకు. ఆమెకు జన్మించిన బిడ్డను చూసి జనాలు విచారం వ్యక్తం చేస్తున్నారు. కానీ సదరు మహిళ మాత్రం ఏం స్పందించడం లేదు. కారణం ఆమె మానసిక ఆరోగ్యం సరిగా లేదు. ఇక ఆమెకు జన్మించిన చిన్నారి పుట్టుకతోనే వృద్ధురాలిగా కనిపిస్తుంది. తల్లికంటే పెద్ద వయసు ఉన్న మహిళలా కనిపిస్తున్న ఆ చిన్నారి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. దక్షిణాఫ్రికాలోని తూర్పు కేప్‌లోని లిబోడ్కు చెందిన గ్రామంలో మానసిక వికలాంగురాలైన 20 ఏళ్ల మహిళ ఈ ఏడాది జూన్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కానీ దురదృష్టం కొద్ది ఆ చిన్నారి అత్యంత అరుదైన వైద్య సమస్యతో జన్మించింది. ఆ చిన్నారి ప్రొజీరియా (హచిన్సన్-గిల్ఫోర్డ్ సిండ్రోమ్ అని కూడా పిలువబడుతుంది) తో బాధపడుతోంది. (చదవండి: వయసు 18.. శరీరం 144 ఏళ్లు! పోరాడి ఓడిన అమ్మాయి) ఈ వ్యాధి వల్ల చిన్నారి పుట్టుకతోనే వృద్ధురాలిగా కనిపిస్తుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది చాలా అరుదైన, ప్రగతిశీల జన్యుపరమైన వ్యాధి. దీని వల్ల పిల్లలు వేగంగా వృద్ధాప్యం బారిన పడతారు. చిన్నారి పుట్టిన వెంటనే తనలో ఏదో లోపం ఉందని ఆమె అమ్మమ్మ గుర్తించింది. అప్పుడే జన్మించిన చిన్నారి ముఖం ముడతలు పడి.. వృద్ధురాలిలా కనిపించడం బాలిక అమ్మమ్మను కలవరపెట్టింది. దాంతో పాప అమ్మమ్మ బిడ్డను, తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చిన్నారిని, ఆమె తల్లిని పరిశీలించిన వైద్యులు.. తల్లి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల వల్లే చిన్నారికి ఈ వింత వ్యాధి సోకిందని తెలిపారు. ఇక ఈ చిన్నారి ఈ ఏడాది జూన్‌లో జన్మించింది. అయితే పాప ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ తర్వాతే చిన్నారి జననం, పాప ఎదుర్కొంటున్న అరుదైన పరిస్థితి గురించి ప్రపంచానికి తెలిసింది. (చదవండి: తగలబడుతున్న బంగారు నేల.. ఊళ్లోకి క్రూరమృగాలు?) ప్రస్తుతం తూర్పు కేప్ ప్రావిన్షియల్ లెజిస్లేచర్ సభ్యుడిగా ఉన్న సిఫోకాజి మణి లుసితి, ప్రొజిరియాతో జన్మించిన చిన్నారికి తగిన సాయం, మద్దతు అందించాలని.. నవజాత శిశువును ఎగతాళి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. నవజాత శిశువు పరిస్థితిని తెలుసుకోవడానికి సహాయం అందించడానికి సాంఘిక అభివృద్ధి శాఖ నుంచి అనేక మంది సీనియర్ అధికారులు చిన్నారి ఇంటిని సందర్శించారు. -
అమ్మా నన్ను ఎందు‘కని’ పడేశారు..?
‘‘అమ్మా నన్ను ఎందుకని పడేశారు..? ఆడపిల్లగా పుట్టినందుకా.? లేక ఆర్థికంగా భారమవుతున్నందుకా.? నీ ఒడిలో ఉండాల్సిన నేను.. ఇలా అరటితోటలో పడిఉన్నానే.. నా ఈ దుస్థితికి కారణం ఎవరమ్మా..? ఏంటమ్మా?’’అని ప్రశ్నించలేని పసి మనసు తనది. రైల్వేకోడూరు రూరల్: అరటి తోటలో పడిఉన్న పసికందును ఐసీడీఎస్ అధికారులు అక్కున చేర్చుకున్నారు. ఈ సంఘటన రైల్వేకోడూరు మండలంలోని వీవీ కండ్రిక దళితవాడ సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, ఐసీడీస్ సీడీపీఓ రాజమ్మ వివరాల మేరకు.. వీవీ కండ్రిక దళితవాడ సమీపంలో శనివారం తెల్లవారుజామున అరటి తోటలో చిన్నారి ఏడుపులు వినిపించాయి. దీంతో కౌలు రైతు చంద్ర పరుగున వెళ్లి చూడగా పసికందు కనిపించింది. చంద్ర స్థానిక అంగన్వాడీ వర్కరు లక్ష్మీదేవికి, గ్రామస్తులకు సమాచారం అందించాడు. వారు ఆ బిడ్డను తీసుకెళ్లి రైల్వేకోడూరు పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేయించారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఎస్ఐ పెద్ద ఓబన్నకు విషయం తెలిపారు. ఈ ఘటనపై ఎస్ఐ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డగా ఉందని, ఆడబిడ్డ కావడంతో ఎవరైనా పడేసి ఉంటారా? మరేమైనా జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తామన్నారు. శిశువును కడప రిమ్స్‌కు తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేయించి, ఐసీడీఎస్ తరుఫున శిశు గృహలో చేర్పిస్తామని ఎస్ఐ తెలిపారు. చదవండి: ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు.. -
ముళ్ల పొదల్లో పసిపాప..
షాబాద్ (రంగారెడ్డి) : రెండు రోజుల క్రితం పుట్టిన ఓ చిన్నారిని ముళ్లపొదల్లో వదలి వెళ్లిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఫైల్వాన్ షాహి దర్గా దగ్గర గురువారం జరిగింది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసిబిడ్డను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దర్గా దగ్గర ఉన్న పొదల్లో వదలి వెళ్లారు. తల్లి కోసం గుక్కపెట్టి ఏడుస్తున్న రెండు రోజుల చిన్నారిని అటుగా వెళుతున్న అజీజ్ అనే వ్యక్తి గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఐటీడీసీ అధికారులతో సంఘటన స్థలానికి చేరుకుని పాపను రక్షించారు. చికిత్స కోసం నీలోఫర్ అసుపత్రికి తరలించారు. పాప ఆరోగ్యంగా ఉంది. చికిత్స అనంతరం అధికారులు శిశువిహార్‌కి తరలించనున్నారు.