
ప్రతీకాత్మక చిత్రం
రాత్రి నొప్పులు రావడంతో ఇరుగుపొరుగు మహిళల సాయంతో ఇంట్లోనే ప్రసవం చేశారు. ఆడబిడ్డ పుట్టింది. కొద్ది సమయానికి ఇద్దరూ అస్వస్థతకు గురికావడంతో బంధువులు 108లో పెరంబలూరు ఆస్పత్రికి...
సాక్షి, చెన్నై: రాత్రి వేళ పురిటి నొప్పులు రావడంతో స్థానిక మహిళలు ప్రసవం చేశారు.. తల్లీ బిడ్డా అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఈ విషాదకర ఘటన పెరంబలూరు జిల్లాలో జరిగింది. వెప్పంతడై తాలూకా అంకూర్ గ్రామానికి చెందిన దిలీప్‌కుమార్ భార్య సెల్వరాణి (36) దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో సెల్వరాణి మూడో గర్భం దాల్చింది.
ఈ నెల 4వ తేదీ రాత్రి నొప్పులు రావడంతో ఇరుగుపొరుగు మహిళల సాయంతో ఇంట్లోనే ప్రసవం చేశారు. ఆడబిడ్డ పుట్టింది. కొద్ది సమయానికి ఇద్దరూ అస్వస్థతకు గురికావడంతో బంధువులు 108లో పెరంబలూరు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో ఇద్దరూ మృతి చెందారు. మంగళమేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
చదవండి: దొంగ అనుకుని చావబాదారు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి