bush
-
వ్యాక్సిన్: ఒబామా, బుష్, క్లింటన్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షులు ముగ్గురు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం లభించిన అనంతరం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తీసుకునే వాలంటీర్లుగా ఉండేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. టీకా భద్రత, ప్రభావంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యు బుష్, బిల్ క్లింటన్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. తమ ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఇదొక శక్తివంతమైన సందేశంగా ఉంటుందని వీరు భావిస్తున్నారు. (వ్యాక్సిన్ : లండన్‌కు క్యూ కట్టనున్న ఇండియన్స్) అమెరికన్ పబ్లిక్ హెల్త్ అధికారులు వ్యాక్సిన్ తీసుకోవటానికి ప్రజలను ఒప్పించటానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్, అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ వైట్ హౌస్ కరోనావైరస్ ప్రతిస్పందన సమన్వయకర్త డాక్టర్ డెబోరా బ్రిక్స్‌తో వీరు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కెమెరా సాక్షిగా వ్యాక్సిన్ డోస్‌లను తీసుకునేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు వాలంటీర్‌గా 43వ అధ్యక్షుడు బుష్ సిద్ధంగా ఉన్నారని ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫ్రెడ్డీ ఫోర్డ్ మీడియాకు వెల్లడించారు. అటు టీకాను ప్రోత్సహించడానికి బహిరంగ ప్రదేశంలో తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని క్లింటన్ చెప్పారని క్లింటన్ ప్రెస్ సెక్రటరీ ఏంజెల్ యురేనా ప్రకటించారు. ప్రజారోగ్య అధికారులు నిర్ణయించిన ప్రాధాన్యతల ఆధారంగా అధ్యక్షుడు క్లింటన్ టీకాను తీసుకుంటారన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ సురక్షితమని ఫౌసీ చెప్పినట్లయితే, తాను కూడా పూర్తిగా విశ్వసిస్తానని, కచ్చితంగా టీకా తీసుకుంటానని మరో మాజీ అధ్యక్షుడు ఒబామా తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో మరో మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ టీకాను బహిరంగంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది. కాగా సెప్టెంబర్ 11, 2001 ఉగ్రదాడి తరువాత ప్రజల విశ్వాసాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో బుష్ తల్లిదండ్రులు దివంగత మాజీ అధ్యక్షులు జార్జ్ హెచ్.డబ్ల్యు.బుష్, బార్బరా బుష్ ఒక వాణిజ్య విమానంలో ప్రయాణించారు. అలాగే 2005 లో కత్రినా హరికేన్ ప్రభావానికి భారీగా దెబ్బతిన్న ప్రాంతాల ప్రజల సహాయార్థం జార్జ్ హెచ్.డబ్ల్యు బుష్ క్లింటన్ నిధుల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. -
ముళ్ల పొదల్లో రూ.కోటి బంగారం స్వాధీనం
తమిళనాడు, అన్నానగర్: పారైయారు సమీపంలో గురువారం ముళ్ల పొదల్లో దాచి ఉంచిన రూ.కోటి విలువైన బంగారు బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎస్ఐతో సహా ముగ్గురు పోలీసులను అధికారులు శుక్రవారం ఆకస్మిక బదిలీ చేశారు. పుదుచ్చేరి జిల్లా కారైక్కాల్ నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలకు పారైయారు మార్గంగా సారా, మద్యం బాటిళ్లు అక్రమంగా తరలిస్తుంటారు. దీన్ని అరికట్టేందుకు నండలారు ప్రాంతంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి, ఆ మార్గంలో వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు. అలాగే గురువారం పారైయారు సబ్ ఇన్స్పెక్టర్ నటరాజన్ ఆధ్వర్యంలో నాగై జిల్లా మద్యం నిషేధ పోలీసులు చెక్‌పోస్టులో వాహన తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అక్కడున్న ముళ్లపొదల్లో ఓ బ్యాగ్ పడి ఉంది. పోలీసులు ఆ బ్యాగ్‌ను తీసి చూడగా అందులో 26 బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తెలిసింది. వీటి బరువు 3,075 గ్రాములు. దీని విలువ రూ.కోటి ఉంటుందని తెలిసింది. అనంతరం బంగారు బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఎస్ఐతో సహా ముగ్గురు పోలీసులు బంగారాన్ని ముళ్ల పొదల్లో దాచినట్టు తెలిసింది. దీంతో శుక్రవారం ఎస్పీ విజయకుమార్ ఉత్తర్వుల మేరకు ఎస్ఐ సహా ముగ్గురు పోలీసులను సాయుధ ధళానికి ఆకస్మిక బదిలీ చేశారు. -
భర్తా అధ్యక్షుడే..కొడుకూ అధ్యక్షుడే!
సీనియర్ జార్జిబుష్ భార్య బార్బారా బుష్ మంగళవారం యు.ఎస్.లోని హ్యూస్టన్‌లో తన 92వ యేట కన్ను మూశారు. బార్బారా కన్నా బుష్ ఏడాది మాత్రమే పెద్ద. ఇద్దరూ జూన్ నెలలోనే పుట్టారు. ప్రస్తుతం ఆయన భార్య పోయిన విషాదంలో ఉన్నారు. బార్బారా మరణించిన ఈ సమయంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు, విశేషాలు ఇవి. ►బార్బారాకు తన 16వ యేట ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో బుష్‌తో పరిచయం అయింది. ►బుష్‌తో పెళ్లి కాక మునుపు ఆమె పేరు బార్బారా పియర్స్. అమెరికా 14వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ పియర్స్.. బార్బారాకు దూరపు బంధువు అవుతారు. ►రెండో ప్రపంచ యుద్ధ కాలంలో 1943 వేసవిలో బార్బారా న్యూయార్క్‌లోని నట్టులు, బోల్టులు తయారుచేసే ఫ్యాక్టరీలో పని చేశారు. ►యు.ఎస్.లో అక్షరాస్యత కోసం కృషి చేసిన తొలి ప్రథమ మహిళ బార్బారా. ►అమెరికా చరిత్రలో భర్త, కొడుకు ఇద్దరూ అధ్యక్షులుగా పనిచేసిన రెండో మహిళ బార్బారా. మొదటి మహిళ అబిగెయల్ ఆడమ్స్. (భర్త జాన్ ఆడమ్స్ 2వ అమెరికా అధ్యక్షుడు. కొడుకు జాన్ క్విన్సీ 6వ అమెరికా అధ్యక్షుడు). ► బార్బారా భర్త సీనియర్ బుష్ 41వ అమెరికా అధ్యక్షుడు. బార్బారా కుమారుడు జూనియర్ బుష్ 43వ అమెరికా అధ్యక్షుడు. ►బార్బారా మృదుభాషి. బార్బారా అనగానే తెల్లజుట్టు, ముత్యాల హారం, చెవిదుద్దులు స్ఫురణకు వస్తాయి. ►భర్త అమెరికా అధ్యక్షుడయ్యాక రాజకీయంగా ఆమె ప్రాధాన్యం మరింత పెరిగింది. వైట్ హౌస్‌ను వదిలిపెట్టాక ఇద్దరు కుమారులకు (జూ‘‘ బుష్, జేబ్)లకు బార్బారా ప్రసంగ ప్రతినిధిగా ఉన్నారు. ►బార్బారా మహిళా హక్కుల కోసం ఉద్యమం నడిపారు. - బార్బారా బుష్ -
విశాఖజిల్లాలో దారుణం
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యలమంచిలి నెహ్రూనగర్‌లో రోడ్డు పక్కన చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలి వెళ్లారు. శిశువు ఏడుపు విన్న స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించి ఆస్పత్రిలో చేర్చారు. అప్పుడే పుట్టిన మగశిశువును గుర్తు తెలియని వ్యక్తుల చెట్లపొదల్లో వదిలి వెళ్లారని స్థానికులు పోలీసులకు తెలిపారు. -
ముళ్లపొదల్లో పసికూన
ఆడపిల్ల అని బయటపడేసిన వైనం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం లింగనిర్ధారణ కోసం ఆస్పత్రికి తరలింపు జగిత్యాల అర్బన్ : ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మీ జన్మించిందనే ఆనందంలో సంబరాలుచేసుకుంటారు. జగిత్యాలలో ఓ జంట ఆడపిల్ల పుట్టిందని ఆస్యహించుకుంది. ఆ పసికూనను బయటపడేసింది. మనసును కదిలించిన ఈ సంఘటన వివరాలు ఇవీ.. మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మికి చెందిన నాలుగో వార్డులో కళాశాల వెనుక వైపు ఓముళ్లపొదల్లో శనివారం పసికూన పడిఉంది. అక్కడే చిన్నారులు ఆడుకుంటున్నారు. పందులు ఆ పసికందును నొటకరుచుకువచ్చి చిందరవందర చేస్తున్నాయి. ఈ దృశ్యాన్ని చూసిన చిన్నారులు ఇంట్లోని తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పందులను వెళ్లగొట్టారు. వెంటనే చైర్పర్సన్ విజయలక్ష్మికి సమాచారం అందించారు. ఆమె సీఐ కరుణాకర్‌రావుకు ఫోన్లో సమాచారం అందించారు. పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని పసికూన మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆడపిల్లపై సంశయం విద్యానగర్‌లో ముళ్లపొదల్లో దొరికిన పసికందు ఆడపిల్లనా, మగపిల్లనా అని సంశయం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు మాత్రం ఆడపిల్ల అని చెప్పినప్పటికీ పందులు పూర్తిగా మార్మాలయాలను పీక్కు తినడంతో నిర్ధారణ కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్య సిబ్బంది అందుబాటులో లేక నిర్ధారణ కోసం మృతదేహాన్ని భద్రపరిచినట్లు ఎస్సై రాజేశ్వర్ తెలిపారు. స్థానికులు మాత్రం ఆడపిల్లనేనని మొదట్లో చూసినట్లు వారు వివరించారు. -
ముళ్లపొదల్లో ఆడ శిశువు
తిమ్మాపూర్ : మండలంలోని అల్గునూర్ శివారులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీవోఈ)కు వెళ్లే దారిలోని ముళ్లపొదల్లో మంగళవారం ఓ ఆడ శిశువును స్థానికులు గుర్తించారు. కాకతీయ కాలువకు సమీపంలో సీవోఈకి వెళ్లే రోడ్డుకు ఇరువైపులో వడ్డెర కులస్తులు కూలీ పని చేస్తున్నారు. మధ్యాహ్నం అన్నం తినేందుకు కూలీలు రాళ్ల సమీపంలో కూర్చున్నారు. అన్నం తింటూ రాళ్ల మధ్య ఉన్న పసికందును చూశారు. సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఎల్ఎండీ ఎస్సై జగదీష్, కానిస్టేబుల్ శ్రీవాణి సంఘటన స్థలానికి చేరుకుని పసికందును 108లో స్టార్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మంగళవారం వేకువజామున శిశువు జన్మించి ఉంటుందని, బొడ్డు పేగు కూడా కత్తిరించలేదని, పుట్టిన వెంటనే తీసుకొచ్చి వదిలేసి ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉందని తెలిపారు. -
పొదల్లో ఆడశిశువు
పటాన్చెరు: ఓ పసిగుడ్డును గుర్తుతెలియని వ్యక్తులు పొదల్లో వదిలి వెళ్లారు. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి చర్చి వద్ద గల పొదల్లో రెండు నెలల ఆడ శిశువు పడి ఉండగా గురువారం రాత్రి స్థానికులు చూశారు. సమాచారం అందుకున్న పోలీసులు శిశువును చేరదీసి సంగారెడ్డి స్త్రీశిశు సంక్షేమ శాఖ సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆడశిశువు కావడం వల్లే వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ముళ్ల పొదల్లో పసిపాప..
షాబాద్ (రంగారెడ్డి) : రెండు రోజుల క్రితం పుట్టిన ఓ చిన్నారిని ముళ్లపొదల్లో వదలి వెళ్లిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ ఫైల్వాన్ షాహి దర్గా దగ్గర గురువారం జరిగింది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసిబిడ్డను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దర్గా దగ్గర ఉన్న పొదల్లో వదలి వెళ్లారు. తల్లి కోసం గుక్కపెట్టి ఏడుస్తున్న రెండు రోజుల చిన్నారిని అటుగా వెళుతున్న అజీజ్ అనే వ్యక్తి గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఐటీడీసీ అధికారులతో సంఘటన స్థలానికి చేరుకుని పాపను రక్షించారు. చికిత్స కోసం నీలోఫర్ అసుపత్రికి తరలించారు. పాప ఆరోగ్యంగా ఉంది. చికిత్స అనంతరం అధికారులు శిశువిహార్‌కి తరలించనున్నారు. -
ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడశిశువు
గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ల పొదల్లో వదిలేసిన ఘటన గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... గుంటూరు జిల్లా పెడకూరపాడు మండలం కనిగండ్లలో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ల పొదల్లో వదిలి వెళ్లారు. అయితే అటుగా వెళ్లున్న స్థానికులు ఆ పసిపాప రోదనను విని, వెళ్లి చూడగా ప్లాస్టిక్ కవర్లో ఆడశిశువు కనిపించింది. దీంతో వారు ఆ శిశువును పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పడంతో పాటు సమాచారం అందించారు