వాహన పరిశ్రమకు ’స్క్రాప్’ బూస్ట్
* వినూత్న పాలసీకి కేంద్రం కసరత్తు
* కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడి
న్యూఢిల్లీ: దేశ ఆటో పరిశ్రమకు ఊపునిచ్చే వినూత్న పథక ప్రకటనకు కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ ఆదివారం తెలిపిన సమాచారం ప్రకారం- కాలుష్య కారకమైన పాతవాహనాలను అప్పగిస్తే- ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఉద్దేశించిన కొత్త ‘స్క్రాప్’ పథకం ముసాయిదా సిద్ధమయ్యింది. సంబంధిత వర్గాల సలహాలు, సూచనల కోసం ఈ ముసాయిదాను మరో వారం రోజుల్లో మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఉంచుతున్నట్లు మంత్రి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆయా అంశాల ప్రాతిపదికన ముసాయిదాను ఆమోదం నిమిత్తం ఆర్థిక మంత్రిత్వశాఖ ముందు ఉంచుతామని తెలిపారు. ఇక్కడ ఆమోదం లభించిన వెంటనే ఈ విధానం కేబినెట్ ముందుకు వెళుతుంన్నారు. రానున్న ఐదేళ్లలో ఆటో పరిశ్రమ 4 రెట్లు పెరిగి రూ.20 లక్షల కోట్ల స్థాయికి చేరుకునేలా ముసాయిదా రూపకల్పన జరిగినట్లు వెల్లడించారు.
ప్రపంచ అత్యుత్తమ కార్ల ఎగుమతుల విషయంలో భారత్ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకునే శక్తిసామర్థ్యాలను సముపార్జించుకుంటున్నట్లు వెల్లడించారు. కాలుష్య కారక తమ పాతవాహనాన్ని అప్పగించి కొత్త వాహన కొనుగోలుపై ఎక్సైజ్ సుంకంపై 50% రిబేట్ ఇచ్చే అంశం ముసాయిదాలో ఉన్నట్లు తెలిపారు.