స్ర్కాప్ షాప్ లో అగ్నిప్రమాదం
Published Tue, Nov 1 2016 10:33 AM | Last Updated on Sat, Sep 15 2018 8:11 PM
హైదరాబాద్: నగరంలోని జిల్లెల గూడ శివసాయి కాలనీలోని ఓ స్ర్కాప్ దుకాణంలో మంగళవారం వేకువజామున అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా కాల్చడంతో ఆ నిప్పు రవ్వలు పడి దుకాణంలో మంటలు చెలరేగాయి. గమనించిన ఇరుగుపొరుగువారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని షాపు యజమానులు తెలిపారు.
Advertisement
Advertisement