
అగ్నికి ఆహుతి అయిన 800 టన్నుల...
బర్మింగ్ హోమ్ : అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి... ఆకాశంలో దట్టంగా పొగ కమ్ముకుంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు 17 ఫైరింజన్లు... 100 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వారంతం నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. కానీ మంటలు అదుపులోకి రాలేదు. ఆ ప్రాంతంలోని ఆకాశమంతా దట్టంగా పొగ ఆవరించి ఉంది. ఇదేదో భారీ భవనంలోనో... మరెక్కడో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందంటే పొరపాటే.
బర్మింగ్హమ్లో చెత్తను నిల్వ ఉంచిన యార్డ్లో మంగళవారం ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటల్లో దాదాపు 800 టన్నుల ప్లాస్టిక్, మెటల్, రబ్బర్ ఆహుతి అయింది. అగ్నిమాపక సిబ్బంది ఎన్నో గంటలు పాటు శ్రమించి ... ఈ మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.