చిత్తుతో చిత్తరువు
చిత్తుకాగితం అతడి చేయితగిలితే చిత్తరువుగా మారుతుంది.. జీవం ఉట్టిపడే శిల్పమవుతుంది. మహాత్ముడి ఆశ యానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. కాగితంతో కళాఖండాలు కొత్తేమీ కాకపోవచ్చు. కానీ, వాటికి ఓ అర్థాన్నిచ్చి.. స్ఫూర్తినిచ్చేలా తీర్చిదిద్దితే కచ్చితంగా అది వెలకట్టలేని ‘కళారూపం’ అవుతుంది...అచ్చంగా నరసింగరావు లక్ష్యం అవుతుంది.
సమస్త వృత్తులు... చిహ్నాలు... గ్రామీణాభివృద్ధికే అని బలంగా నమ్మిన బాపూజీ ఆశయాలను ఎందరో అనుసరించారు. మరెందరో అక్షరబద్ధం చేశారు. కానీ, నరసింగరావు మాత్రం తనకు అబ్బిన కళతో మహ్మాతుడి ఆశయాలకు రూపమిచ్చారు. గచ్చిబౌలిలోని ఫాంస్కూల్‌కు వెళితే ఆయున కళ... అందులో ఓ ఆశయుం కళ్లవుుందు ఆవిష్కృతవువుతారుు.
గ్రామీణం: ‘మహాత్ముడి సమతుల్య భారత్’ అంటూ అక్కడ ఓ చిన్న కుటీరం మనల్ని లోపలికి ఆహ్వానిస్తుంది. ఒక్కో శిల్పం గ్రామీణ వృత్తులను ప్రతిబింబించేలా.. మహాత్ముడి ఆశయానికి అద్దంపట్టేలా కనిపిస్తుంది. వల వేసే మత్స్యకారుడు, చెప్పులు కుట్టే మహిళ, మగ్గంపై నేతన్న... ఇలా పల్లెరూపం సాక్షాత్కరిస్తుంది.
కళకు ఆకృతి: విశాఖపట్నం జిల్లా బూరుగుపాలెంకు చెందిన న రసింగరావు బాల్యం నుంచే గాంధీజీ జీవితానికి ప్రభావితమయ్యారు. అలా తన కళలో కూడా ఆయన బాపు ఆశయాలు ప్రతిబింబించేలా కాగితాలతో కళాఖండాలను వులుస్తున్నారు. చిత్తుపేపర్‌ను ఒక్కో పొరగా చుడుతూ అద్భుత కళాకృతిని సృష్టిస్తారు. పనికిరాని చెత్తకు పరమార్థాన్నిస్తాడు. ఆయున శిల్పాలు జపాన్, అమెరికా దేశాలకూ వెళ్లాయి. హెచ్‌సీయూలో స్కల్ప్‌చర్ ఆర్‌టలో ఎంఏ చేసిన ఆయన... ప్రస్తుతం ఓ స్కూల్‌లో ఆర్‌ట టీచర్‌గా పనిచేస్తున్నారు.
సాక్షి, సిటీప్లస్