narasimharao
-
రైతు పాత్రలో...
దర్శకుడు వీవీ వినాయక్ యాక్టర్ వినాయక్‌గా మారబోతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చేయబోతున్న పాత్ర కోసం బరువు కూడా తగ్గుతున్నారు. నరసింహారావు దర్శకత్వంలో వినాయక్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘దిల్’ రాజు నిర్మాత. 1940ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రకథ సాగనుందని, వినాయక్ రైతు పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 9న ప్రారంభం కానుంది. -
జానపాడుకు చేరిన నరసింహారావు
సాక్షి, పిడుగురాళ్ల/గురజాల: తండ్రి కష్టాలు చూసి తట్టుకోలేక కుటుంబాన్ని అప్పుల బాధ నుంచి విడిపించాలనే తపనతో మలేషియా వెళ్లి చిన్నతనంలోనే నరకం చూసిన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన బత్తుల నరసింహారావు కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. మలేషియా నుంచి తెలుగు అసోసియేషన్ సభ్యులు టిక్కెట్ బుక్ చేయడంతో నరసింహారావు గురువారం జానపాడులోని తన స్వగృహానికి క్షేమంగా చేరుకున్నాడు. ఐదు నెలల కిందట నరసింహారావు తన స్నేహితుడు సైదారావు, భీమవరానికి చెందిన ఏజెంట్ అయ్యప్పకు మలేషియా వెళ్లేందుకు రూ.లక్ష అప్పు చేసి ఇచ్చాడు. ఆ ఏజెంటు వర్కింగ్ వీసా బదులు విజిటింగ్ వీసాపై నరసింహారావును మలేషియాకు పంపించాడు. మలేషియాలో ఓ కొరియర్ కంపెనీలో పనిచేస్తున్న అతన్ని పోలీసులు విజిటింగ్ వీసాపై వచ్చినట్లు గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపించారు. మలేషియాలో తను పడుతున్న బాధలను నరసింహారావు తండ్రికి ఉత్తరం ద్వారా తెలిపాడు. కొడుకును జైల్లో వేశారని, చిత్ర హింసలు పెడుతున్నారని నరసింహరావు తండ్రి బత్తుల గురూజీకి తెలిసి తల్లడిల్లాడు. ‘నేను చచ్చి పోతున్నా. ఇక బతకను’ అంటూ కొడుకు రాసిన లేఖను మీడియా దృష్టికి తీసుకెళ్లడంతో పాటు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డికి తెలిపాడు. స్పందించిన ఎమ్మెల్యే మలేషియాలో తెలుగు అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదించి నరసింహరావు ఇండియా వచ్చేందుకు కృషి చేశారు. వారందరి కృషితో గురువారానికి స్వగ్రామమైన జానపాడుకు వచ్చాడు. తల్లిదండ్రులు గురూజీ, పద్మ కుమారుడిని చూసి ఉద్వేగానికి లోనయ్యారు. పోలీసులు తనను అరెస్టు చేశాక నరకం చూపించారని, జ్వరంతో బాధపడుతున్నా కనీసం ఒక్క మాత్ర కూడా ఇవ్వలేదని నరసింహారావు వాపోయాడు. తన తండ్రి ,అధికారుల చేసిన ప్రయత్నాల వల్లే స్వదేశం చేరుకోగలిగానని హర్షం వ్యక్తం చేశాడు. మొదలైన మరో మలేషియా బాధితుడి కథ బత్తుల నరసింహారావు మలేషియా పోలీసుల నుంచి విడుదలై ఇండియాకు వస్తుండటంతో.. పోలీసులకు చిక్కిన మరో మలేషియా బాధితుడు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన లావేటి రమేష్ తనకు టిక్కెట్ వేయమని తల్లిదండ్రులకు లెటర్ ఇచ్చి పంపించాడు. రమేష్ గత ఏడు నెలల నుంచి మలేషియా జైల్లో మగ్గుతున్నాడు. ఒక బాధితుడి కథ సుఖాంతమయ్యే సరికి మరో బాధితుడి కథ వెలుగు చూసింది. -
వైఎస్ఆర్సీపీలో చేరిన వెంకటనరసింహరావు
-
నటస్థానం
బాపట్ల అమెరికన్ మిషనరీ వారి ఉపాధ్యాయ శిక్షణ సంస్థకి ఆ పెద్దాయన సైకిల్ మీద వచ్చాడు, ఓ విద్యార్థిని వెతుక్కుంటూ. పేరు– చోరగుడి హనుమంతరావు. ఆనాడు ప్లీడరు గుమస్తాలంతా కలసి నిర్వహిస్తున్న నాటక సంస్థలో హరిశ్చంద్రుడి పాత్ర ధరించేవాడు. మొత్తానికి చిత్రలేఖనం తరగతిలో ఉన్న ఆ అబ్బాయిని పట్టుకుని బయటకు తీసుకొచ్చి ఆ రాత్రి ప్రదర్శించబోయే ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం పాసులు నాలుగు చేతిలో పెట్టాడు. ఆపై చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్పాడు, కొన్ని గంటలలో ప్రదర్శించబోయే ఆ నాటకంలో ఒక వేషం కూడా వెయ్యాలని! ‘ఏ పాత్ర? మాతంగ కన్యా?’ అన్నాడా కుర్రాడు. అదో చిన్న పాత్ర. ‘కాదు, చంద్రమతి’ అన్నాడు హనుమంతరావు. హడలిపోయాడా కుర్రాడు. ఒక్కసారి కూడా ముఖానికి రంగు పూసుకోలేదు. పోర్షన్ కూడా రాదు. ఎలా? వణికిపోయాడు.‘ఏం ఫర్వాలేదు. నీకు పద్యాలన్నీ వచ్చు, అది నాకు తెలుసు. అదే చాలు. మిగతా నేను చూసుకుంటా!’ అని చేతులు పట్టుకున్నంత పని చేశాడాయన. సరేననక తప్పలేదు. వెళ్లిపోతూ ఇంకోమాట కూడా చెప్పారు హనుమంతరావు, ‘ఒరేయ్ నాయనా! నువ్వు రాకపోతే ఊరి పరువుపోతుంది. ఇంక మేం తలెత్తుకోలేం. పైగా ముఖ్యఅతిథులు ఎవరో తెలుసు కదా! తిరుపతి వేంకటకవులు. వారు ప్రతి కళాకారుడినీ ఆశుకవిత్వంతో దీవిస్తారు!’ భయం భయంగా చంద్రమతి పాత్ర వేయడానికి కృత్యాద్యవస్థ మీద ఒప్పుకున్న ఆ కుర్రాడు స్థానం నరసింహారావు. అత్యంత నాటకీయంగా రంగస్థల ప్రవేశం చేసిన స్థానం నరసింహారావు (23.9.1902–21.2.1971) తరువాత మహా నటుడయ్యారు. పద్మశ్రీ బిరుదు అందుకున్నారు. ఆయనకు అందమైన ఆకారం గాని, అవయవ సౌష్టవం గాని లేవు. అలా అని అందవికారి మాత్రం కాదు. సన్నగా పొడుగ్గా ఉండేవారు. పెద్ద పెద్ద చెవులు. పొడుగు ముక్కు. కోలముఖం. కానీ మంచి పలువరస. చామనచాయ శరీరం. తనకూ అందం ఉందని తృప్తి పడేవారు, అద్దంలో చూసుకుని. ఆకాలంలో ఫిట్స్ (చిన్నబిడ్డ గుణం అనేవారు) వచ్చిన పిల్లలకి పొగచుట్టతో నుదిటి మీద వాత పెట్టేవారు. అలాంటి మచ్చ జీవితాంతం ఉండిపోయేది. అది కూడా ఉండేది. అలాగే చెవికి పోగు. అది వంశ పారంపర్యంగా వచ్చింది. తాత తగిలించుకున్నదే తరువాత తండ్రి ఇంకొంత బంగారం వేయించి, బాగు చేయించి నరసింహారావుగారి చెవికి పెట్టారట. దీనికి తోడు ‘ముక్కునాదం’. అంటే మాట్లాడితే ముక్కుతో మాట్లాడినట్టు ఉంటుంది. కురచగా కత్తిరించిన జుట్టు, వెనకాల పిలకతో ఉండే ఆ పిల్లవాడిని తోటి పిల్లలు ఆటపట్టించేవారు. అలాంటి ఒక కుర్రవాడు స్త్రీ పాత్ర పోషణకి విఖ్యాతి గాంచాడు. తన ఆకృతితో పాటు ప్రవృత్తితో కూడా పొసగే ఒక బృందం కోసం ఆయన అన్వేషించారు. స్థానం వారికి చిన్నతనం నుంచీ భక్తి మెండు. ఆ క్రమంలో దొరికింది ఒక భజన బృందం. నరాలశెట్టి వెంకయ్య అని ఒక తోటమాలి కొడుకు అందులో ఉండేవాడు. ఊరికి దూరంగా వారి పూలతోటలు ఉండేవి. అందులో కూలిపోతున్న ఓ పాక ఉండేది. ఈ భజన బృందం వెళ్లి ఆ పాకలో భజన చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆ తోటమాలిని కోరారు. అంతా కలసి బాగు చేశారు. ప్రతి శనివారం జరిగే ఆ భజనకే సీతారాం బావాజీ అనే ఒక సాధువు తంబురాతో వచ్చేవాడు. అతడి సమక్షంలోనే మొదట రాగయుక్తంగా పాడడానికి, శాస్త్రీయంగా పాడడానికి స్థానం వారి జీవితంలో బీజం పడింది. స్త్రీ పాత్ర విషయంలోనూ అలాగే జరిగింది. ఆయన చిన్నతనంలో కూచిపూడి భాగవతులు వచ్చి బాపట్లలో ప్రదర్శనలు ఇచ్చేవారు. అందులో వెంపటి వెంకటనారాయణ అనే ఆయన భామ వేషం అద్భుతంగా కట్టేవారట. ఆ స్త్రీ వేషం తన మనసులో ఎంతో ఆదరంతో మనసులో నిలిచి పోయి ఉండేదని చెప్పారు. ఈ దృశ్యాలన్నీ అంతిమంగా హఠాత్తుగా రంగస్థల ప్రవేశం చేయడానికి దోహదం చేశాయి. 1921లో బాపట్లలోనే తిరుపతి వేంకటకవులకీ, కొప్పరపు కవులకీ శతావధానం పోటీ జరిగింది. నెగ్గిన తిరుపతి వేంకటకవులని సత్కరించాలని భావించారు. ఆ సందర్భంగా ప్లీడరు గుమస్తాల బృందం చేత సత్య హరిశ్చంద్ర నాటకం వేయించాలని నిర్ణయించారు. ఆహ్వానాలు వెళ్లిపోయాయి. కానీ చంద్రమతి వేషధారి అస్వస్థుడై రాలేకపోతున్నట్టు చివరి నిమిషంలో తెలిసింది. ప్రత్యామ్నాయం ఏదీ సా«ధ్యం కాలేదు. చంద్రమతి పాత్రధారి మరొకరు దొరకలేదు. మరో నాటకం వేద్దామంటే పాత్రధారులంతా లేరు. గుండెల్లో రాయి పడింది. అప్పుడే ఆపద్బాంధవుడిలా స్థానం దొరికాడు చోరగుడి హనుమంతరావుకి. వారి నాటకం రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు వెళ్లి కూర్చోవడంతో పద్యాలన్నీ వచ్చేశాయి. ఒకసారి ఎవరూ లేనప్పుడు పాడుకుంటూ ఉంటే హనుమంతరావుగారు విన్నారు. ఆ ధైర్యంతోనే చంద్రమతి వేషం వేయించారు. స్థానం వారికి చిన్నతనంలోనే చిత్రలేఖనం కూడా అబ్బింది. ఆ కళతోనే, వేరే ఒకరి ఇంట రహస్యంగా తన వేషం తనే వేసుకున్నారాయన. చిన్న చిన్న లోపాలు ఉన్నా అరంగేట్రంలోనే తిరుపతి కవుల ఆశీస్సులు అందుకున్నారు స్థానం. కానీ ఇవేమీ తెలియని తల్లి, తండ్రిపోయాకా (తల్లి ఆదెమ్మ, తండ్రి హనుమంతరావు) ఇవేమి ‘అపరబుద్ధులు’ అంటూ కొడుకుని చీదరించుకుంది. చెవులు వెనుక మిగిలిపోయిన రంగు మరింత ఆగ్రహం తెప్పించిందామెకు. దానితో ఇంకెప్పుడూ ముఖానికి రంగు పూసుకోనని హామీ కూడా ఇచ్చేశారాయన. కానీ, ఆ విష్కంభం స్వాతంత్య్రోద్యమ ఘట్టంతో తొలగిపోయింది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి రామదండుకు ఆర్థికసాయం అందించాలనీ, అందుకు మళ్లీ సత్యహరిశ్చంద్ర ప్రదర్శించాలనీ అంతా నిర్ణయించారు. ప్రదర్శన చీరాలలో. కానీ స్థానం వారి తల్లి కొడుకు వేషం వేయడానికి ససేమిరా అన్నారు. చివరికి పెద్ద వకీలును రాయబారిగా పంపించి ఒప్పించారు. ఈసారి పోర్షన్ అంతా చదివి నటించారు. వెయ్యి రూపాయలు వచ్చాయి. గోపాలకృష్ణయ్యగారు కూడా ఎంతో మెచ్చుకున్నారు. కొన్ని మెలకువలు కూడా చెప్పారు. ఈ పరిణామంతో కాబోలు ఇంకొన్ని ప్రదర్శనలు ఇవ్వడానికి స్థానం వారి మాతృమూర్తి కూడా అంగీకరించారు. కొద్దినెలలకే తెలుగు ప్రాంతమంతా తిరిగి నాటకాలు వేయడం మొదలైంది. వరంగల్‌లో ‘కృష్ణలీల’ నాటకంలో యశోద వేషం వేసినందుకు బంగారు పతకం వచ్చింది. ఆయన జీవితంలో పొందిన తొలి స్వర్ణ పతకం ఇదే. అనతికాలంలోనే ఆయన పేరు మారుమోగిపోయింది. కాపురం బాపట్ల నుంచి తెనాలికి మారింది. శ్రీరామవిలాస సభ అనే నాటక సమాజాన్ని స్థాపించి నటననే జీవికగా చేసుకున్నారు. రోషనార (రోషనార నాటకం), తామీనా (రుస్తుం సొహరాబ్ నాటకంలో), సంయుక్త (రాణీ సంయుక్త), శకుంతల (అభిజ్ఞాన శాకుంతలం), సత్యభామ (శ్రీకృష్ణ తులాభారం), చిత్రాంగి (సారంగధర), దేవదేవి (విప్రనారాయణ), కోకిల (కోకిల నాటకం), మల్లమ్మ (బొబ్బిలి), మధురవాణి (కన్యాశుల్కం), అనసూయ (అనసూయ నాటకం), మురాదేవి (చంద్రగుప్త), చింతామణి (చింతామణి), సుభద్ర (వీరాభిమన్య), సరళ (ఛత్రపతి శివాజీ), విద్యాధరి (కాళిదాసు), చండిక (చండిక నాటకం) వంటి పాత్రలు వేశారు. కానీ స్థానం వారంటే రంగస్థలం మీద సత్యభామకు మారురూపమయ్యారు. స్థానం నరసింహారావుగారు నటనను ఒక తపస్సులా భావించారు. ఇదంతా ఆయన స్వీయచరిత్ర ‘నటస్థానం’లో అద్భుతంగా ఆవిష్కరించారు (స్థానం వారి అల్లుడు నేలకంటి వేంకటరమణమూర్తి 1974లో ఈ పుస్తకం ప్రచురించారు). నటులకు ఉండవలసిన లక్షణాలు, దర్శకునికి ఉండవలసిన ప్రత్యేకతలు, రంగస్థల కళాకారులకు ఉండవలసిన నిబద్ధత గురించి ఎన్నో విషయాలు ఆ పుస్తకంలో అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే స్త్రీపాత్రతో ఆయనకు ఎదురైన నమ్మశక్యం కానట్టు ఉండే అనుభవాలు, కొన్ని చేదు అనుభవాలను కూడా ఆయన నమోదు చేశారు. ఇవే కాకుండా తన జీవితంలో తారసిల్లిన అనేక మంది కళాకారుల గురించి స్థానం వివరించారు. ఒకరకంగా 1920వ దశకం నాటి తెలుగు నాటక రంగ చరిత్ర ఆ పుస్తకంలో కనిపిస్తుంది. ముత్తరాజు వెంకటసుబ్బారావుగారు రాసిన శ్రీకృష్ణ తులాభారం నాటకం స్థానం వారి కీర్తిని అజరామరం చేసింది. మాధవపెద్ది వెంకటరామయ్య (కృష్ణుడు), పిల్లలమర్రి సుందరరామయ్య (నారదుడు), వంగర వెంకటసుబ్బయ్య (వసంతకుడు) పాత్రలు వేసేవారు. కృష్ణుడు తన స్వాధీనుడేనని చెప్పే ఒక సందర్భాన్నీ, అందుకు తగిన పాటనీ సత్యభామకు కూర్చడానికి స్థానం చేసిన ఆలోచన ఒక అద్భుతం. మొత్తానికి ఒక పాట ఆయన మనసుకు తట్టింది. ఒకసారి కడప దగ్గర ఈ నాటక బృందం చిన్న ఏరు దాటుతూ ఉండగా, ఒక ఎద్దుల బండి ఇసకలో కూరుకుపోయింది. నటులంతా గెంటుతున్నారు. ఒకరు మాత్రం బద్ధకంగా కూర్చున్నారు. మరొక నటుడు దీనిని స్థానం వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ క్షణంలోనే ఆయన సరదాగా ‘మిరజాల గలడా నా యానతి’ అన్నారట. అదే గొప్ప పాటకు ప్రాణం పోసింది. ‘మిరజాలగలడా నా యానతి, వ్రతవిధాన మహిమన్ సత్యాపతి!’ అన్నదే ఆ పాట. విశాఖజిల్లా మాడుగలలో ఒకసారి నాటకం వేశారు– శ్రీకృష్ణ తులాభారం. స్థానం వారు స్టార్ నటులు కాబట్టి ఒక ధనికుల ఇంట వేరే గది ఇచ్చి, అక్కడే వేషధారణ చేసుకుని రావడానికి ఏర్పాట్లు జరిగాయి. వేషం పూర్తయ్యాక ఇక బయలుదేరదామని అనుకుంటూ ఉండగా కరెంటు పోయింది. లోపల ఫ్యాను ఆగిపోయింది. గాలి కోసం అక్కడే ఉన్న పెరట్లో కుర్చీ వేయించుకుని కూర్చున్నారు స్థానం. అప్పుడే కొందరు ముత్తయిదువలు పేరంటం పిలుపుకోసం వచ్చారు. ఇల్లాలికి బొట్టు పెట్టి, అక్కడే కుర్చీలో కూర్చున్న సత్యభామకు కూడా బొట్టు పెట్టి పేరంటానికి పిలిచారు. ఎంతో హాస్యాన్ని పండించే వాస్తవాలను కూడా ఆయన రాశారు. ఒకసారి సురభి వారి బృందంలో సత్యభామ పాత్రధారిణికి ఇబ్బంది రావడంతో స్థానం వారిని తీసుకుని వెళ్లారు. ప్రదర్శన మొదలైంది. సత్యభామ వెళ్లి కృష్ణుడిని కౌగిలించుకోబోతే, కృష్ణుడు అమాంతం తప్పుకుంటున్నాడు. ఇందుకు కారణం ఒక్కటే– ఆ కృష్ణ పాత్రధారి స్త్రీ. కాబట్టి స్థానం వారు వెళ్లి కౌగిలించుకున్నా బెదిరిపొయింది. అలాగే, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రోషనార నాటక ప్రదర్శనకు కలెక్టర్ అనుమతి నిరాకరించాడు. అందుకు కారణం– ఆ నాటక ప్రదర్శనకు కొందరు ముస్లింలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీనితో గోదావరి దాటి తూర్పుగోదావరిలోని లంకలలో ఆ నాటకం ప్రదర్శించారు. స్థానం వారికి జరిగిన సత్కారాలకు లెక్కలేదు. 1956లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ఇచ్చింది. రంగూన్లో బంగారు కిరీటంతో అలంకరించారు. ఆనాటి మహా కవులు, రచయితలు అంతా ఆయనను అక్షరాలతో సత్కరించారు. స్థానం వారి ప్రత్యేకతను చరిత్ర విస్మరించలేదు. కన్నతల్లి ఆయనకు పురుష జన్మనిచ్చింది. కళామతల్లి స్త్రీ జన్మనిచ్చింది. - డా. గోపరాజు నారాయణరావు -
నరసింహారావు మృతికి సీపీఐ సంతాపం
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర సమరయోధుడు, వరంగల్ జిల్లా నాయకుడు నార నరసింహారావు (92) మృతికి సీపీఐ జాతీయ ప్రదాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, నేతలు డా.కె.నారాయణ, చాడ, పల్లా వెంకటరెడ్డి తదితరులు సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఆయన తుదిశ్వాస విడిచారు. -
నన్నయ రిజిస్ట్రార్‌గా నరసింహారావు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఎ.నరసింహారావు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వాణిజ్య నిర్వహణ విభాగంలో విధులు నిర్వర్తిస్తూ బదిలీపై ఆయన ఇక్కడకు వస్తున్న సంగతి విదితమే. ఎంకాం, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, పీహెచ్డీ విద్యార్హతలు కలిగిన ఆయన ఏయూ ఆర్ట్స్ కళాశాల వార్డెన్‌గా, దూర విద్యలో ఎంబీఏ కోర్సు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, ఏఐసీటీఈ తనిఖీ బృందం సభ్యునిగా, ఏయూ సీపీసీ సభ్యునిగా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అసోసియేట్ సభ్యునిగా వ్యవహరించారు. ఫైనాన్స్, అకౌంటింగ్, అపరేషన్స్ మేనేజ్మెంట్లో నిపుణుడైన ఆయన ‘ఐసెట్’ ప్రాంతీయ సమన్వయకర్తగా కూడా పనిచేశారు. -
కారు-బైక్ ఢీ.. వ్యక్తి మృతి
నందిగామ(కృష్ణాజిల్లా): రాంగ్రూట్లో వస్తున్న బైక్‌ను వేగంగా వెళ్తున్న కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజ్లిలా నందిగామ మండలం మునగచర్ల గ్రామంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామానికి చెందిన నరసింహరావు బైక్‌పై మునగచర్ల వెళ్తున్న సమయంలో కారు ఢీకొట్టింది. దీంతో నరసింహరావు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మనగచర్ల వద్ద సిగ్నల్ ఏర్పాటు చేయకపోవడంతో పాటు ఫైఓవర్ సదుపాయం లేకపోవడంతో చాలా మంది రాంగ్రూట్లో వాహనాలు నడుపుతున్నారు. దీంతోటే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. -
పోకిరీ పోలీస్ అరెస్ట్...
సికింద్రాబాద్ : పీకలదాకా మద్యం తాగిన ఓ కానిస్టేబుల్ తనిఖీల పేరుతో హల్చల్ చేశాడు. నేనే రా పోలీస్ అంటూ... సినిమా డైలాగ్‌లు చెప్పి ఓ యువకుడిని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇంతలో అటువైపు వాహనంలో వచ్చిన పోలీసులు... ఈ పోకిరీ కానిస్టేబుల్ ఆటకట్టించారు. గోపాలపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సైదాబాద్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నరసింహారావు (37) సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఓ యువతితో బైక్‌పై వెళుతున్న వ్యక్తిని ఆపి... తాను కమిషనర్ స్పెషల్ టీంలో పనిచేసే కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకుని, తన ఫోన్లో వారి ఫోటో తీసుకుని...'నీవు అమ్మాయిలను సరఫరా చేస్తున్నావని, వ్యభిచారం నిర్వహిస్తున్నావని మాకు సమాచారం అందింది'...అంటూ సదరు యువకుడిని బెదిరిస్తూ డబ్బులు గుంజే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న గోపాలపురం పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి పోకిరీ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మూడేళ్ల క్రితం సహ కానిస్టేబుల్ భార్యను లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో జైలు పాలైన నరసింహారావు శిక్ష అనభవించి బయటకు వచ్చాడు. విధుల నుంచి తొలగించిన ఇతడు కోర్టు తీర్పుతో ఏడాది క్రితమే డ్యూటీలో చేరాడు. -
‘మధుకాన్’ ముట్టడి ఉద్రిక్తం
రాజేశ్వరపురం (నేలకొండపల్లి): మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. రైతుల ఆందోళనకు యూజమాన్యం తలొగ్గింది. చర్చలకు ఆహ్వానించింది. మద్దతు ధరగా 3000 రూపాయలు ఇవ్వాలన్న డిమాండుపై నిర్ణయం తీసుకునేందుకు 20 రోజుల గడువు కావాలని యూజమాన్యం కోరింది. దీనికి రైతు సంఘాల నాయకులు అంగీకరించారు. చెరకు టన్నుకు 3000 రూపాయలు చెల్లించాలన్న డిమాండుతో ఐదు రోజులుగా చెరకు రైతులు ఆందోళన సాగిస్తున్నారు. రైతు సంఘాల అఖిలప క్షం పిలుపుతో వారు ఆదివారం రాజేశ్వరపురంలోని మధుకాన్ షుగర్స్ ఫ్యాక్టరీని ముట్టడించారు. ఫ్యాక్టరీలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. రైతులతో చర్చించేందు కు యాజమాన్యం ససేమిరా అనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో, ఖమ్మం డీఎస్పీ దక్షిణమూర్తి చొరవ తీసుకున్నారు. ఆయన ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ ఎం.శ్రీనివాసరావుతో మాట్లాడి, రైతులతో చర్చలకు అంగీకరింపచేశారు. రైతు ప్రతినిధులు రచ్చా నరసింహారావు, మానుకొండ శ్రీనివాసరావు, నర్రా పూర్ణచందర్రావు, తోటకూరి రాజు, సురేందర్‌రెడ్డి, చావా లెనిన్తో కూడిన 11 మంది ప్రతినిధుల బృందంతో జీఎం తన చాంబర్లో చర్చలు జరిపారు. ఇవి ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఆగ్రహోదగ్రులయ్యూరు. వారు పోలీసు వలయూన్ని నెట్టుకుంటూ ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్దకు వచ్చారు. అక్కడ వీరిని కూసుమంచి, ఖమ్మం రూరల్, ఖమ్మం మహిళ పోలీస్‌స్టేషన్ సీఐలు రవీందర్‌రెడ్డి, తిరపతిరెడ్డి, అంజలి ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ దశలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. తమ డిమాండుపై యాజమాన్యం ప్రకటన చేయూలని ఆందోళనకారులు నినదించారు. ఫ్యాక్టరీ జీఎం శ్రీనివాసరావు వద్దకు కూసుమంచి సీఐ రవీందర్‌రెడ్డి వెళ్లి మాట్లాడారు. ఆ తరువాత ఆయన ఆందోళనకారుల వద్దకు వచ్చి.. ‘‘మీ డిమాండుపై చర్చించేందుకు 20 రోజుల్లోగా ప్రత్యేక సమావేశాన్ని యూజమాన్యం నిర్వహిస్తుందని జీఎం చెప్పారు’’ అని తెలిపారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. మాట తప్పితే ప్రత్యక్ష ఆందోళన మధుకాన్ మాజమాన్యం మాట తప్పితే ప్రత్యక్ష ఆం దోళన మళ్లీ మొదలవుతుందని టీఆర్ఎస్ రైతు వి భాగం రాష్ట్ర నాయకుడు నల్లమల వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఆందోళన విరమణ అనంతరం రైతులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. మధుకాన్ యూజమాన్యం మొండి వైఖరి విడనాడి, రైతులకు గిట్టుబాటు ధర నిర్ణరుుంచాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో చెరకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొంతు రాంబాబు, నాయకుడు నున్నా నా గేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, నాయకుడు బత్తుల లెనిన్, వైఎస్ఆర్ సీపీ నాయకులు నంబూరి ప్రసాద్, మానుకొండ శ్రీనివాసరావు, బొల్లినేని వెంకటేశ్వరరావు, న్యూడెమెక్రసీ నాయకుడు టి.హనుమంతరావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొరివి వెంకటరత్నం, నాయకుడు జొగుపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
చిత్తుతో చిత్తరువు
చిత్తుకాగితం అతడి చేయితగిలితే చిత్తరువుగా మారుతుంది.. జీవం ఉట్టిపడే శిల్పమవుతుంది. మహాత్ముడి ఆశ యానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. కాగితంతో కళాఖండాలు కొత్తేమీ కాకపోవచ్చు. కానీ, వాటికి ఓ అర్థాన్నిచ్చి.. స్ఫూర్తినిచ్చేలా తీర్చిదిద్దితే కచ్చితంగా అది వెలకట్టలేని ‘కళారూపం’ అవుతుంది...అచ్చంగా నరసింగరావు లక్ష్యం అవుతుంది. సమస్త వృత్తులు... చిహ్నాలు... గ్రామీణాభివృద్ధికే అని బలంగా నమ్మిన బాపూజీ ఆశయాలను ఎందరో అనుసరించారు. మరెందరో అక్షరబద్ధం చేశారు. కానీ, నరసింగరావు మాత్రం తనకు అబ్బిన కళతో మహ్మాతుడి ఆశయాలకు రూపమిచ్చారు. గచ్చిబౌలిలోని ఫాంస్కూల్‌కు వెళితే ఆయున కళ... అందులో ఓ ఆశయుం కళ్లవుుందు ఆవిష్కృతవువుతారుు. గ్రామీణం: ‘మహాత్ముడి సమతుల్య భారత్’ అంటూ అక్కడ ఓ చిన్న కుటీరం మనల్ని లోపలికి ఆహ్వానిస్తుంది. ఒక్కో శిల్పం గ్రామీణ వృత్తులను ప్రతిబింబించేలా.. మహాత్ముడి ఆశయానికి అద్దంపట్టేలా కనిపిస్తుంది. వల వేసే మత్స్యకారుడు, చెప్పులు కుట్టే మహిళ, మగ్గంపై నేతన్న... ఇలా పల్లెరూపం సాక్షాత్కరిస్తుంది. కళకు ఆకృతి: విశాఖపట్నం జిల్లా బూరుగుపాలెంకు చెందిన న రసింగరావు బాల్యం నుంచే గాంధీజీ జీవితానికి ప్రభావితమయ్యారు. అలా తన కళలో కూడా ఆయన బాపు ఆశయాలు ప్రతిబింబించేలా కాగితాలతో కళాఖండాలను వులుస్తున్నారు. చిత్తుపేపర్‌ను ఒక్కో పొరగా చుడుతూ అద్భుత కళాకృతిని సృష్టిస్తారు. పనికిరాని చెత్తకు పరమార్థాన్నిస్తాడు. ఆయున శిల్పాలు జపాన్, అమెరికా దేశాలకూ వెళ్లాయి. హెచ్‌సీయూలో స్కల్ప్చర్ ఆర్‌టలో ఎంఏ చేసిన ఆయన... ప్రస్తుతం ఓ స్కూల్లో ఆర్ట టీచర్‌గా పనిచేస్తున్నారు. సాక్షి, సిటీప్లస్ -
శోకమే మిగిలింది
ఖమ్మం క్రైం: గత 15 రోజులుగా తీవ్ర ఆవేదనతో నిరీక్షిస్తున్న ఆ తల్లిదండ్రులకు చివరికి శోకమే మిగిలింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఈనెల 8న గల్లంతైన ఖమ్మం నగరానికి చెందిన ముప్పిడి కిరణ్‌కుమార్ మృతదేహం ఆదివారం లభ్యమైంది. కుమారుడి మృతదేహం లభించిందని తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా తిరిగిరాని లోకాలకు చేరాడని గుండెలవిసేలా రోదిస్తున్నారు. కిరణ్‌కుమార్ గల్లంతైన నాటినుంచి తమ కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడని వారు ఆశగా ఎదురుచూశారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారిలో ఆందోళన పెరిగింది. ఇక తమ కుమారుడు బతికే అవకాశం లేదని, కనీసం కడసారి చూపు అయినా దక్కుతుందో లేదోనని ఆవేదనకు గురయ్యారు. కిరణ్ గల్లంతయ్యాడని తెలుసుకున్న వెంటనే తల్లి పద్మావతి హైదరాబాద్‌లోని బంధువుల వద్దకు వెళ్లగా, తండ్రి వెంకటరమణ హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. గాలింపు చర్యలు జరుగుతున్న బియాస్ నది వద్దే ఉంటూ కొడుకు ఆచూకీ కోసం ఎదురు చూశారు. రోజులు గడుస్తున్నా జాడ తెలియకపోవడంతో ఆయనతోపాటు మిగితా విద్యార్థుల తల్లిదండ్రులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. కిరణ్ మేనమామ నరసింహారావు మాత్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండి ఎదురు చూడసాగారు. చివరకు ఆదివారం మధ్యాహ్నం మృతదేహం లభ్యంకావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భోరున విలపించారు. నేడు ఖమ్మంలో అంత్యక్రియలు... కిరణ్‌కుమార్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ఖమ్మంలో నిర్వహించనున్నారు. మృతదేహాన్ని హిమాచల్ ప్రదేశ్ నుంచి సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొస్తారు. అక్కడినుంచి సాయంత్రానికి ఖమ్మంలోని బుర్హాన్‌పురంలో ఉన్న స్వగృహానికి తరలిస్తారు. అక్కడ కొద్దిసేపు ఉంచిన అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. దుస్తులు చూసి గుర్తుపట్టిన మేనమామ.. బియాస్ నదిలో ఆదివారం మధ్యాహ్నం కిరణ్ మృతదేహం లభించింది. అయితే కిరణ్‌కుమార్ మేనమామ నరసింహారావు బియాస్ నది వద్దనే ఉంటూ ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మృతదేహం దొరికిన సమయంలో దుస్తులను చూసిన నరసింహారావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాసేపటి తర్వాత తేరుకుని ఇది తన మేనల్లుడి మృతదేహమేనని రోదిస్తూ ధ్రువీకరించారు. తనకు ఎంతో ఇష్టమైన మేనల్లుడు ఇలా విగతజీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన నరసింహారావు హైదరాబాద్‌లోని బీహెచ్ఈఎల్లో నివాసం ఉంటున్నారు. కిరణ్ ఆయన వద్దనే ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. -
'దేశం' దాష్టీకం
కనిగిరి : జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. అధికారం ఉంది కదా.. అని ఇష్టారాజ్యంగా దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు స్వైరవిహారం చేస్తున్నారు. రేషన్ డీలర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి అంగన్వాడీల వరకూ అందరిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రశ్నించిన వారిని తెలుగు తమ్ముళ్లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. రేషన్ షాపు కోసం పదిమంది కలిసి ఓ వ్యక్తిని కర్రలు, రాళ్లతో కొట్ట్టి అతికిరాతకంగా చంపారంటే టీడీపీ నేతలు ఎంతటి దారుణాలకు వడిగడుతున్నారో అర్థమవుతోంది. పీసీపల్లి మండలం పెద అలవలపాడులో డీలర్ నర్సింహారావును టీడీపీ నాయకులు బెదిరించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినందున జూన్ నెల డీడీ కట్టవద్దని హుకుం జారీ చేశారు. ప్రశ్నించిన బాధితునిపై గోడవకు దిగి దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పుడు కేసు నమోదు చేయించారు. అసలు గోడవలో లేని తమ పేర్లను ఫిర్యాదులో ఎందుకు పేర్కొన్నారని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గోగడ శింగయ్య, సురేష్, కంచర్ల తిరపతమ్మలపై టీడీపీ నాయకులు చెన్నుపాటి వెంకటేశ్వర్లు, పువ్వాడి మల్లికార్జున, జి.వెంకట్రావ్, నాగార్జున, డి.కృష్ణతో పాటు మరి కొందరు కలిసి కర్రలు, రాళ్లతో గురువారం రాత్రి దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శింగయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం వేకువ జామున మృతి చెందాడు. తిరుపతమ్మ ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టు మిట్డాడుతోంది. సురేష్‌దీ అదే పరిస్థితి. ఎంపీపీ సీటుపైనా కుట్ర = తగినంత బలం లేకున్నా కనిగిరి ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారు. = వైఎస్సార్ సీపీ ఫ్యాను గుర్తుపై గెలిచిన చిన అలవలపాడు ఎంపీటీసీ సభ్యుడిని ప్రలోభపెట్టారు. = తన భర్తను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ ఎంపీటీసీ భార్య సంతోషమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. = తన భర్తకు హాని జరిగే అవకాశం ఉందని, టీడీపీ నేతల చెర నుంచి తన భర్తను కాపాడాలంటూ సంతోషమ్మ అనేక సార్లు ఆందోళన వ్యక్తం చేసినా టీడీపీ నాయకులు కనికరించలేదు. = ఎంపీపీ పీఠాన్ని వైఎస్సార్ సీపీకి దక్కకుండా చేసేందుకు తెలుగు తమ్ముళ్లు కుయుక్తులు పన్నుతున్నారు. = ఈ సంఘటనలు వెలుగులోకి వచ్చినవి మాత్రమే. వెలుగులోకి రాన్ని టీడీపీ అక్రమాలు ఎన్నో ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. = మొత్తంగా కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని చెప్పవచ్చు. పోలీస్ పికెట్ పెదఅలవలపాడులో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. కందుకూరు డీఎస్పీ పి.శంకర్ తన సిబ్బందితో కలిసి గ్రామానికి వచ్చారు. మృతుడు శింగయ్య బంధువులతో మాట్లాడి వివరాలు సేకరించారు. మృతుని కుమారు సురేష్ ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులు పువ్వాడి మల్లికార్జున్, పువ్వాడి వెంకటనారాయణతో పాటు మరో పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి ఎస్సై ఆరాధ్యుల సుబ్బరాజు తెలిపారు. -
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి !
రఘునాధపాలెం, న్యూస్‌లైన్: ఆభం శుభం తెలియని నాలుగు సంవత్సరాల చిన్నారిపై కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు లైగింకదాడికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునేలా ఒక వికలాంగుడు చిన్నారిని ముద్దాడుతున్నట్లు నటించి.. తన మూడుచక్రాల బండిపై చీకటి ప్రదేశంలోకి తీసుకెళ్లి ఈఘోరానికి ఒడిగట్టాడు. దారుణమైన ఈ ఘటన ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం మంచుకొండలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. మిట్టపల్లి శివ, శ్రీలత దంపతులకు ఇద్దరు సంతానం. శివ సెంట్రింగ్ పనికోసం చెన్నై వెళ్లగా.. ఇద్దరు కూతుర్లతో తల్లి మంచుకొండలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటోంది. వారి ఇంటికి సమీపంలోనే తోట నర్సింహరావు అనే వికలాంగుడు వెల్డింగ్ పని చేస్తూ ఉంటాడు. శివ కూతుర్లను తరచూ తన మూడు చక్రాల బండిపై తిప్పుతుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా పెద్ద కూతురు(4)ను బండిపై ఎక్కించుకుని ఇంటికి దూరంగా చీకటి ప్రాంతంలోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని గ్రామస్తులు చెపుతున్నారు. ఇంట్లో అడుకుంటున్న కూతురు కనిపించకపోవడంతో తల్లి ఇంటిపక్క వాళ్లను ఆరా తీసింది. నర్సింహరావు తన బండిపై చిన్నారిని తీసుకెళ్లాడని చెప్పడంతో ఆమె వెతుక్కుంటూ వెళ్తుండగా, దూరంగా పాప ఏడుపు వినిపించింది. అక్కడికి వెళ్లే సరికి మద్యం మత్తులో తన వంటిపై వస్త్రాలు లేకుండా పడిఉన్న నరిసింహరావును, పక్కనే ఏడుస్తున్న చిన్నారిని గుర్తించారు. నరిసింహరావును కొట్టి అక్కడే తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చిన్నారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోరం చూసిన తల్లి శ్రీలత పిట్స్ వచ్చి పడిపోవడంతో ఆమెను కూడా 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని ఎస్ఐ గణేష్ స్టేషన్‌కు తరలించారు. కామాంధుఢిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.