నందిగామ(కృష్ణాజిల్లా): రాంగ్‌రూట్‌లో వస్తున్న బైక్‌ను వేగంగా వెళ్తున్న కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణాజ్లిలా నందిగామ మండలం మునగచర్ల గ్రామంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది.
చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామానికి చెందిన నరసింహరావు బైక్‌పై మునగచర్ల వెళ్తున్న సమయంలో కారు ఢీకొట్టింది. దీంతో నరసింహరావు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మనగచర్ల వద్ద సిగ్నల్ ఏర్పాటు చేయకపోవడంతో పాటు ఫైఓవర్ సదుపాయం లేకపోవడంతో చాలా మంది రాంగ్‌రూట్‌లో వాహనాలు నడుపుతున్నారు. దీంతోటే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
కారు-బైక్ ఢీ.. వ్యక్తి మృతి
Published Sun, Mar 27 2016 3:08 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM
Advertisement
Advertisement