నగర కీర్తిని పెంచుతున్న శిల్పాకృతులు
స్టాచ్యూ సిటీగా గుర్తింపు పొందనున్న నగరం
నగరవ్యాప్తంగా కనువిందు చేస్తున్న శిల్పాకృతులు
త్వరలో కొలువుదీరనున్న తెలంగాణ తల్లి, గాంధీ విగ్రహాలు
ఆ ఆటలో ఒకరు స్టాచ్యూ అంటే మరొకరు అలా విగ్రహంలా నిలుచుండి పోతారు. ఎప్పటిదో అయిన ఈ చిన్నారుల ఆట అందరికీ సుపరచితమే. సందర్శకుల్ని అలా బొమ్మలా నిలిచి ఉండేలా చేసే అరుదైన అద్భుత చిది్వలాస రూపాలకు నగరం చిరునామాగా మారింది. శిల్పారామం, శిల్పకళావేదిక.. వంటి అపురూప శిల్ప కేంద్రాలు, రాజీవ్‌గాం«దీ, మహాత్మా గాందీలతో పాటు పలువురు ప్రముఖ నేతల విగ్రహాలు అడుగడుగునా దర్శనమిస్తాయి. ఇక 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహంతో పాటు శివార్లలో ఉన్న సమతామూర్తి, మరికొన్ని రోజుల్లో దర్శనమివ్వనున్న తెలంగాణ తల్లి.. వీటితో నగరం సంపూర్ణ స్టాచ్యూ సిటీగా అవతరించనుంది.
నగరంలో పలు కూడళ్లలో స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరుల విగ్రహాలు ఉన్నాయి. ఇక మూడు దశాబ్దాల క్రితమే ట్యాంక్ బండ్ మీద నెలకొన్న పంచలోహ శిల్పాల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. వీటన్నింటికీ తోడుగా.. ఇటీవల ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతున్న ఆకృతులు నగర శిల్ప కళా‘భాగ్యాన్ని’పరిపుష్టం చేస్తున్నాయి. అప్పుడెప్పుడో నీటిపై నిలిచిన బుద్ధ విగ్రహం సందర్శకులకు తప్పనిసరి సందర్శనీయ స్థలం కాగా.. ఇప్పుడు మరికొన్ని దానితో సరితూగుతూ ఏర్పాటవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిటీలోని కొన్ని ఆసక్తికరమైన శిల్పాకృతుల గురించి.. ఓ రౌండప్..
కెప్టెన్‌కి సలామ్..
హబ్సిగూడలో రద్దీగా ఉండే రహదారి మధ్య దివంగత కెపె్టన్ రాపోలు వీర రాజా రెడ్డి నిలువెత్తు విగ్రహం మనకు కనిపిస్తుంది. ఆయన 25 సంవత్సరాల వయసులో జమ్మూ కాశీ్మర్‌లోని రాజౌరి జిల్లాలో జరిగిన సైనిక ఆపరేషన్‌లో వీర మరణం పొందారు. నగరానికి చెందిన ఈ అమరవీరుని స్మారక చిహ్నం ఆయన నివసించిన ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు.
వీరత్వానికి ప్రతిరూపం..
అరుదైన నేపథ్యం ఉమేష్ చంద్ర శిల్పాకృతి సొంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్స్ నిర్మూలనకు కృషి చేసిన ధైర్యసాహసాలు కలిగిన పోలీసు అధికారి చదలవాడ ఉమే‹Ùచంద్రను ‘కడప టైగర్’గా కూడా పిలుస్తారు. ఆయన నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి కూడా. గత 1999 సెపె్టంబరు 4న ఎస్‌ఆర్ నగర్ జంక్షన్‌లో నక్సలైట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అదే స్థలంలో ఆయన విగ్రహం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు.
వ్యక్తిత్వ వికాస ‘జ్ఞాన్’భూమి..
ఇది భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులరి్పంచేందుకు నిర్మించబడి చక్కటి నిర్వహణలో ఉన్న ఉద్యానవనం ఖైరతాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వివిధ వ్యక్తిత్వ లక్షణాలను ప్రదర్శించే ఆరు ప్రత్యేకమైన అందమైన శిల్పాలు ఇక్కడ ఉన్నాయి.
‘బౌద్ధ’సాగర్...
జిబ్రాల్టర్ రాక్‌పై హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న తెల్లటి గ్రానైట్‌తో రూపొందింది గౌతమ బుద్ధ విగ్రహం.. నగర పర్యాటకులు తప్పక సందర్శించి తీరాల్సిన ప్రదేశాలలో ఒకటి. సందర్శకులు ఫెర్రీ రైడ్ ద్వారా అలలపై తేలియాడుతూ ఆ ఎత్తైన విగ్రహం చేరకోవచ్చు. బుద్ధుని అందాన్ని పెంచే లైటింగ్ ఆకర్షణీయంగా ఉంటుంది. సూర్యుడు అస్తమించే సమయం సందర్శనకు ఉత్తమ సమయం.. సాగర్ ప్రక్కనే ఉన్న ట్యాంక్ బండ్ మీది విగ్రహ సముదాయం ప్రముఖులు
ఎందరినో మనకు పరిచయం చేస్తుంది.
యూనిటీ.. కేరాఫ్ సిటీ..
ప్రపంచంలోనే అతిపెద్దదైన సమతా మూర్తి ఆకృతిని ప్రధానమంత్రి ఆవిష్కరించారు. మొత్తంగా 216 అడుగుల ఎత్తైన విగ్రహం, సమానత్వం రూపంగా పేర్కొంటారు. కూర్చున్న భంగిమలో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లోహపు విగ్రహం. ప్రముఖ ఆధ్యాతి్మక వేత్త రామానుజాచార్యుల విగ్రహం రంగారెడ్డి జిల్లాలోని ముచి్చంతల్‌లో ఉంది.
భాగ్యనగరాన.. బంగారు తెలంగాణ ‘తల్లి’..
సచివాలయం ఎదురుగా అమరవీరుల స్మృతి జ్యోతిలో ఏడున్నర అడుగుల తెలంగాణ తల్లి స్వర్ణ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇంత ఎత్తయిన గోల్డెన్ స్టాచ్యూ దేశంలో మరెక్కడా లేదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే కాకుండా సందర్శకులకు కూడా ఈ విగ్రహ సందర్శన గొప్ప అనుభూతిని అందిస్తుందని శిల్పి రమణారెడ్డి అంటున్నారు. పైన పేర్కొన్నవి కాకుండా, నగరంలో మొజామ్‌జాహి మార్కెట్, మైండ్‌స్పేస్ ఇతర ప్రాంతాల్లో గుర్తించదగిన ఇతర కళాఖండాలూ ఉన్నాయి.
థాట్ ఫుల్.. ఎంప్టీ..
ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే స్టాచ్యూ ఆఫ్ ఎంప్టీనెస్.. కళాఖండం నగర శివార్లలోని ఖాజాగూడ సరస్సు సమీపంలో ఏర్పాటు చేశారు. తల కిందికి వేలాడదీసి మొండెం వద్ద బోలుగా ఉన్న వ్యక్తి విగ్రహం ఇది. ఇది రొమేనియన్ కళాకారుడు ఆల్బర్ట్ గైర్గీ నుంచి ప్రేరణ పొందిన కపిల్ కపూర్చే చేతుల మీదుగా దీని పునఃసృష్టి జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment