sculptures
-
10 లక్షల పూలతో ఫ్లవర్ షో.. చూసి తీరాల్సిందే!
గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో జనవరి మూడున ప్రారంభమై అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనను మరింత ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక థీమ్‌ను రూపొందించారు. ఈ ప్రదర్శనలో అద్భుతమైన పూల శిల్పాలు, కీర్తి స్తంభం, ఒలింపిక్ టార్చ్, గర్బా నృత్యం లాంటి అందమైన దృశ్యాలు సందర్శకులను సమ్మోహనపరుస్తున్నాయి. హల్క్, డోరేమాన్ తదితర కార్టూన్ పాత్రలను పూలతో తయారు చేశారు. ఇవి పిల్లలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఫ్లవర్ షో సందర్శకులతో నిత్యం రద్దీగా ఉంటోంది.ప్రస్తుతం జరుగుతున్న ఫ్లవర్ షో(Flower Show) కోసం రికార్డు స్థాయిలో రూ.15 కోట్ల బడ్జెట్‌ను వెచ్చించారు. 4,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.3 కోట్లతో నిర్మించిన నైట్ ఫ్లవర్ పార్క్ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనిలో 54 లైటింగ్ డిస్ప్లేలు, జంతువుల బొమ్మలతో పాటు ఇతర ఇంటరాక్టివ్ ఫీచర్లున్నాయి. రాత్రిపూట ఈ పార్క్ ఎంతో సమ్మోహనంగా కనిపిస్తోంది.నెల రోజుల పాటు జరిగే ఈ ఫ్లవర్ షో ఉద్దేశ్యం కేవలం వినోదమే కాకుండా పర్యావరణంపై అవగాహన కల్పించడం. పర్యావరణ విషయంలో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Ahmedabad Municipal Corporation) చూపుతున్న చొరవకు ఈ ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది.ఫ్లవర్ షోను ఈసారి ఆరు విభాగాలుగా మలచారు. పిల్లల కోసం ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. అక్కడ చిన్నారులు పూల మధ్య ఆటలాడుకోవచ్చు. ప్రతి పూల బొమ్మకు క్యూఆర్ కోడ్ ఉంది. దానిని స్కాన్ చేసి, దానికి సంబంధించిన సమాచారాన్ని వినవచ్చు. ఈ సాంకేతికత సందర్శకులకు మంచి అనుభూతినిస్తుంది.ఈ ప్రదర్శన దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిని కూడా ఆకట్టుకుంటోంది. 12 ఏళ్ల కంటే తక్కువ వయసుగల పిల్లలకు, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. దీంతో ప్రదర్శనను తిలకించేందుకు చిన్నారులు కూడా అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.ఈ ఫ్లవర్ షో అందరినీ అమితంగా ఆకట్టుకుంతోంది. వారాంతాల్లో, సెలవు రోజుల్లో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య కొత్త రికార్డులు సృష్టిస్తున్నదని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రదర్శనను తిలకించడం సందర్శకులకు ఒక మధురానుభూతిగా మిగులుతుందని నిర్వాహకులు అంటున్నారు.అహ్మదాబాద్‌లోనే కాదు.. తమిళనాడులో కూడా ఫ్లవర్ షో జరుగుతోంది. చెన్నైలోని సెంమొళి పూంగాలో 4వ చెన్నై ఫ్లవర్ షోను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. లక్షలాది పూలతో అందాలను చిందిస్తున్న ఈ ప్రదర్శన జనవరి 11 వరకు కొనసాగనుంది.అహ్మదాబాద్, చెన్నై(Chennai)లలో జరిగే ఈ ప్రదర్శనలు సందర్శకులకు కొత్త లోకాన్ని చూపిస్తున్నాయి. ప్రకృతిపై ప్రేమను అందరిలో పెంపొందిస్తున్నాయి. ప్రతి ఏటా జరిగే ఈ ఫ్లవర్ షోలను తిలకించేందుకు పలువురు విదేశీయులు కూడా ఇక్కడికి తరలివస్తుంటారు. ఇక్కడి సుమనోహర దృశ్యాలను చూసి మైమరచిపోతుంటారు. ఇది కూడా చదవండి: భారత్‌లోని అత్యంత శీతల ప్రదేశాలు.. తలచుకోగానే వణుకు ఖాయం -
చూస్తే చెయ్యెత్తి మొక్కుతారు! (ఫొటోలు)
-
అపురూపాలు.. ఆనవాళ్లు..
ఆ ఆటలో ఒకరు స్టాచ్యూ అంటే మరొకరు అలా విగ్రహంలా నిలుచుండి పోతారు. ఎప్పటిదో అయిన ఈ చిన్నారుల ఆట అందరికీ సుపరచితమే. సందర్శకుల్ని అలా బొమ్మలా నిలిచి ఉండేలా చేసే అరుదైన అద్భుత చిది్వలాస రూపాలకు నగరం చిరునామాగా మారింది. శిల్పారామం, శిల్పకళావేదిక.. వంటి అపురూప శిల్ప కేంద్రాలు, రాజీవ్‌గాం«దీ, మహాత్మా గాందీలతో పాటు పలువురు ప్రముఖ నేతల విగ్రహాలు అడుగడుగునా దర్శనమిస్తాయి. ఇక 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహంతో పాటు శివార్లలో ఉన్న సమతామూర్తి, మరికొన్ని రోజుల్లో దర్శనమివ్వనున్న తెలంగాణ తల్లి.. వీటితో నగరం సంపూర్ణ స్టాచ్యూ సిటీగా అవతరించనుంది.నగరంలో పలు కూడళ్లలో స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరుల విగ్రహాలు ఉన్నాయి. ఇక మూడు దశాబ్దాల క్రితమే ట్యాంక్ బండ్ మీద నెలకొన్న పంచలోహ శిల్పాల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. వీటన్నింటికీ తోడుగా.. ఇటీవల ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతున్న ఆకృతులు నగర శిల్ప కళా‘భాగ్యాన్ని’పరిపుష్టం చేస్తున్నాయి. అప్పుడెప్పుడో నీటిపై నిలిచిన బుద్ధ విగ్రహం సందర్శకులకు తప్పనిసరి సందర్శనీయ స్థలం కాగా.. ఇప్పుడు మరికొన్ని దానితో సరితూగుతూ ఏర్పాటవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిటీలోని కొన్ని ఆసక్తికరమైన శిల్పాకృతుల గురించి.. ఓ రౌండప్..కెప్టెన్‌కి సలామ్.. హబ్సిగూడలో రద్దీగా ఉండే రహదారి మధ్య దివంగత కెపె్టన్ రాపోలు వీర రాజా రెడ్డి నిలువెత్తు విగ్రహం మనకు కనిపిస్తుంది. ఆయన 25 సంవత్సరాల వయసులో జమ్మూ కాశీ్మర్లోని రాజౌరి జిల్లాలో జరిగిన సైనిక ఆపరేషన్‌లో వీర మరణం పొందారు. నగరానికి చెందిన ఈ అమరవీరుని స్మారక చిహ్నం ఆయన నివసించిన ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు.వీరత్వానికి ప్రతిరూపం.. అరుదైన నేపథ్యం ఉమేష్ చంద్ర శిల్పాకృతి సొంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సల్స్ నిర్మూలనకు కృషి చేసిన ధైర్యసాహసాలు కలిగిన పోలీసు అధికారి చదలవాడ ఉమే‹Ùచంద్రను ‘కడప టైగర్’గా కూడా పిలుస్తారు. ఆయన నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి కూడా. గత 1999 సెపె్టంబరు 4న ఎస్ఆర్ నగర్ జంక్షన్లో నక్సలైట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అదే స్థలంలో ఆయన విగ్రహం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు.వ్యక్తిత్వ వికాస ‘జ్ఞాన్’భూమి..ఇది భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళులరి్పంచేందుకు నిర్మించబడి చక్కటి నిర్వహణలో ఉన్న ఉద్యానవనం ఖైరతాబాద్‌లోని నెక్లెస్ రోడ్లో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వివిధ వ్యక్తిత్వ లక్షణాలను ప్రదర్శించే ఆరు ప్రత్యేకమైన అందమైన శిల్పాలు ఇక్కడ ఉన్నాయి.‘బౌద్ధ’సాగర్... జిబ్రాల్టర్ రాక్‌పై హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న తెల్లటి గ్రానైట్‌తో రూపొందింది గౌతమ బుద్ధ విగ్రహం.. నగర పర్యాటకులు తప్పక సందర్శించి తీరాల్సిన ప్రదేశాలలో ఒకటి. సందర్శకులు ఫెర్రీ రైడ్ ద్వారా అలలపై తేలియాడుతూ ఆ ఎత్తైన విగ్రహం చేరకోవచ్చు. బుద్ధుని అందాన్ని పెంచే లైటింగ్ ఆకర్షణీయంగా ఉంటుంది. సూర్యుడు అస్తమించే సమయం సందర్శనకు ఉత్తమ సమయం.. సాగర్ ప్రక్కనే ఉన్న ట్యాంక్ బండ్ మీది విగ్రహ సముదాయం ప్రముఖులు ఎందరినో మనకు పరిచయం చేస్తుంది.యూనిటీ.. కేరాఫ్ సిటీ.. ప్రపంచంలోనే అతిపెద్దదైన సమతా మూర్తి ఆకృతిని ప్రధానమంత్రి ఆవిష్కరించారు. మొత్తంగా 216 అడుగుల ఎత్తైన విగ్రహం, సమానత్వం రూపంగా పేర్కొంటారు. కూర్చున్న భంగిమలో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లోహపు విగ్రహం. ప్రముఖ ఆధ్యాతి్మక వేత్త రామానుజాచార్యుల విగ్రహం రంగారెడ్డి జిల్లాలోని ముచి్చంతల్లో ఉంది. భాగ్యనగరాన.. బంగారు తెలంగాణ ‘తల్లి’.. సచివాలయం ఎదురుగా అమరవీరుల స్మృతి జ్యోతిలో ఏడున్నర అడుగుల తెలంగాణ తల్లి స్వర్ణ విగ్రహం ఏర్పాటు చేశారు. ఇంత ఎత్తయిన గోల్డెన్ స్టాచ్యూ దేశంలో మరెక్కడా లేదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే కాకుండా సందర్శకులకు కూడా ఈ విగ్రహ సందర్శన గొప్ప అనుభూతిని అందిస్తుందని శిల్పి రమణారెడ్డి అంటున్నారు. పైన పేర్కొన్నవి కాకుండా, నగరంలో మొజామ్జాహి మార్కెట్, మైండ్‌స్పేస్ ఇతర ప్రాంతాల్లో గుర్తించదగిన ఇతర కళాఖండాలూ ఉన్నాయి. థాట్ ఫుల్.. ఎంప్టీ.. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే స్టాచ్యూ ఆఫ్ ఎంప్టీనెస్.. కళాఖండం నగర శివార్లలోని ఖాజాగూడ సరస్సు సమీపంలో ఏర్పాటు చేశారు. తల కిందికి వేలాడదీసి మొండెం వద్ద బోలుగా ఉన్న వ్యక్తి విగ్రహం ఇది. ఇది రొమేనియన్ కళాకారుడు ఆల్బర్ట్ గైర్గీ నుంచి ప్రేరణ పొందిన కపిల్ కపూర్చే చేతుల మీదుగా దీని పునఃసృష్టి జరిగింది. -
జైన విగ్రహాలతో చెరువు తూము
సాక్షి, హైదరాబాద్: అదో చెరువు.. అంతగా సాగునీటి వనరులు లేని ఆ గ్రామంలో ఆ చెరువు నీళ్లే వ్యవసాయానికి ఆధారం.. అందుకోసం పల్లంగా ఉన్న ప్రాంతానికి నీటి నిల్వను చెరువుగా చేసి పక్కాగా కట్టకట్టి నీటి విడుదలకు తూము నిర్మించారు. ఇదంతా వందేళ్ల నాటి సంగతి. ఇప్పుడు ఆ చెరువుతో పనిలేదు. అయితే, తూము నిర్మాణానికి వినియోగించిన రాళ్లు మామూలువి కాదని, అవి ఓ జైన క్షేత్రం శిల్పాలతో కూడిన శిలలని తేలింది. వాన నీరు... చెట్టు నీడన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామ చెరువు కట్ట తూము నిర్మాణంలో రాళ్లుగా వినియోగించిన వెయ్యేళ్లనాటి జైన శిల్పాలు ఇప్పుడు వెలుగు చూశాయి. క్రీ.శ. 9–10 శతాబ్దాల నాటి జైన బసది కేంద్రంలో ఉన్న జైన చౌముఖి శిల్పాలను ఈ చెరువు తూములో వినియోగించినట్టు చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. ఔత్సాహిక పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్‌రెడ్డి ఇటీవల ఎన్కేపల్లి గ్రామానికి వెళ్లారు.ఆ సమయంలో వాన కురుస్తుండటంతో చెట్టునీడన నిలబడి ఉండగా, సమీపంలోని చెరువుకట్టలో శిల్పాలు కనిపించాయి. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆదివారం ఆ చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా, అవి జౌన చౌముఖి శిల్పాలుగా గుర్తించారు. శిలలపై ఆదినాథ, నేమినాథ, పార్శ్వనాథ, వర్ధమాన మహావీరులు ధ్యానముద్రలో ఉన్నట్టు, పైన కీర్తిముఖాలతో మలిచి ఉన్నట్లు శివనాగిరెడ్డి చెప్పారు. వాటిపై 9–10 శతాబ్దాల నాటి తెలుగు, కన్నడ లిపిలో శాసనాలు కూడా చెక్కి ఉన్నాయన్నారు. ఆ శాసనభాగాలు చెరువుగట్టు గోడలోకి చొచ్చుకుపోయి ఉన్నందున చదవటం వీలు కావటం లేదని, జైన బసదికి చెందిన దానశాసనాలు అయి ఉండే అవకాశం ఉందన్నారు. వాటిని బయటకు తీస్తే స్థానిక చరిత్రకు సంబంధించిన వివరాలు వెలుగుచూసే అవకాశం ఉందని తెలిపారు. ఆ ప్రాంతం జైన కేంద్రం.. మొయినాబాద్ ప్రాంతం ఒకప్పుడు జైన కేంద్రం. సమీపంలోని చిలుకూరు ప్రాంతం రాష్ట్రకూట, వేములవాడ చాళుక్యుల కాలంలో సుప్రసిద్ధ జైన కేంద్రమని పేర్కొంటూ ఇటీవలే ఆ ఊళ్లోని జైన దేవాలయ జాడలను వెలుగులోకి తెచ్చారు. చిలుకూరుకు అతి సమీపంలో ఉన్న ఎన్కేపల్లి గ్రామంలో కూడా జైన బసది కేంద్రం ఉండేదని, దానికి సంబంధించిన చౌముఖి శిల్పాలని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఆ జైన బసది, దాని అనుబంధ దేవాలయం ధ్వంసమైన నేపథ్యంలో, వాటి శిథిల శిల్పాలను చెరువు తూముకు వినియోగించి ఉంటారన్నారు. -
ఆంధ్రా బౌద్ధ శిల్పాలకు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: ప్రాచీన కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్‌కు మరో అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. రాష్ట్రానికి చెందిన ఆరు బౌద్ధ శిల్పాలు అమెరికా, దక్షిణ కొరియాల్లో అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఇందులో భాగంగా క్రీ.పూ. 200 ఏళ్ల నుంచి క్రీ.శ. 400 ఏళ్ల మధ్య కాలం నాటి రాష్ట్ర ప్రాచీన శిల్ప కళాసంపద ఖండాంతర ప్రజలకు కనువిందు చేయనుంది. ఈ మేరకు న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్.. ‘టీ అండ్ సర్పెంట్: ది ఎవల్యూషన్’ అనే పేరుతో అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహించనుంది. ఇందులో భాగంగా భారతదేశంలో బౌద్ధానికి పూర్వం నాటి సంస్కృతిని చాటే శిల్పాలు, బౌద్ధం తొలినాళ్లలోని అలంకారిక కళలు, చిత్రాలను ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఈ క్రమంలో మన దేశం నుంచి సున్నపురాయి, బంగారం, వెండి, కాంస్యం, రాక్ క్రిస్టల్, ఐవరీ వంటి 140 రకాల శిల్పాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించనున్నారు. అంతర్జాతీయంగా రెండు వేదికలపై.. భారతీయ బౌద్ధ శిల్పకళా రూపాల ప్రదర్శనను ముందు అమెరికాలోని న్యూయార్క్‌లో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జూలై 17 నుంచి నవంబర్ 13 వరకు నిర్వహించనున్నారు. ఈ మ్యూజియాన్ని ‘ది మెట్’ అని పిలుస్తారు. ఇది అమెరికాలో అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం. 2022లో 32,08,832 మంది దీన్ని సందర్శించారు. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే ఆర్ట్ మ్యూజియంల జాబితాలో ఇది ఎనిమిదో స్థానంలో ఉంది. యూఎస్‌లో అయితే రెండో స్థానంలో నిలుస్తోంది. అమెరికాలో ప్రదర్శన ముగిశాక తర్వాత దక్షిణ కొరియాలో నేషనల్ మ్యూజియం ఆఫ్ కొరియాలో డిసెంబర్ 22 నుంచి 2024 ఏప్రిల్ 14 వరకు శిల్పాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం మెట్రోపాలిటన్ మ్యూజియం ‘స్టార్ వరల్డ్ వైడ్’ సంస్థకు పురాతన కళా రూపాలను తరలించే బాధ్యతను అప్పగించింది. దీనికి మనదేశంలో నేషనల్ మ్యూజియం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఏపీ విగ్రహాల్లో విశిష్టతలు తొలి బౌద్ధ కళల్లో అలంకరణ ముఖ్యంగా కనిపిస్తోంది. అందమైన పువ్వులు, తీగల అల్లికలు, పూర్ణకుంభం, విజ్ఞాన, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా కొలిచే గుర్రం వంటి చిత్రాలు వంటివి శిల్పాల్లో ఉన్నాయి. ముఖ్యంగా శిల్పాలపై చెక్కిన ఆరాధకుల ముఖకవళికల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మహాపురుషుని రూపం, యక్షుల చిత్రాలు, బౌద్ధంలోని వివిధ సంఘటనలను తెలిపే స్థూపం, ఒకే శిలపై సింహం తల, మొసలి, చేప, ఏనుగు తొండం రూపంలోని వాహనంపై సవారీని ప్రతిబింబించే దృశ్యాలున్నాయి. రాష్ట్రం నుంచి ఆరు విగ్రహాలు అంతర్జాతీయ ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంవత్సరాల క్రితం నాటి ఆరు తెల్లటి పాలరాతి విగ్రహాలను ఎంపిక చేశారు. ఇందులో ఐదింటిని అమరావతి హెరిటేజ్ మ్యూజియం నుంచి, ఒకదాన్ని గుంటూరులోని బౌద్ధశ్రీ పురావస్తు మ్యూజియం నుంచి తరలించనున్నారు. ఇందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనుమతులు సైతం మంజూరు చేసింది. మన రాష్ట్రంలో అమరావతి ప్రాంతానికి అంతర్జాతీయ బుద్ధిజం కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. బుద్ధుడు తన శిష్యులకు ఇక్కడే 10 ధరణిలు (మంత్రాలు) బోధించారని.. అందుకే అమరావతి ప్రాంతం ధరణికోటగా పేరొందినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. కాలచక్ర యానం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైందని బౌద్ధులు దృఢంగా విశ్వసిస్తున్నారు. కాగా ప్రదర్శనకు తెలంగాణ నుంచి తొమ్మిది శిల్పాలను ఎంపిక చేశారు. గొప్ప కళా సంపదకు నిలయం.. బుద్ధుడి ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్నాయి. అమరావతి, నాగార్జునకొండ ప్రాంతాలు గొప్ప శిల్ప కళా సంపదను నిక్షిప్తం చేసుకున్నాయి. ఇలాంటి ఎన్నో గొప్ప, అరుదైన శిల్పాలను ఏపీ మ్యూజియాల్లో భద్రపరిచాం. వీటిని అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేయడం ఎంతో గర్వకారణం. – జి.వాణీమోహన్, కమిషనర్, ఏపీ పురావస్తు, ప్రదర్శనశాలలు -
తలనరుక్కుని.. చేతిలో పట్టుకుని..
సాక్షి, హైదరాబాద్: దేవుడిని చేరేందుకు ఆత్మార్పణ చేసుకునే వీరభక్తిని తెలిపే ఆత్మార్పణ శిల్పాలు రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూశాయి. ఆత్మార్పణ శిలలు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బయటపడినా.. ఇవి తల నరుక్కుని చేతిలో పట్టుకున్నట్టుగా ఉన్న అరుదైన శిల్పాలు కావటం విశేషం. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు యాదేశ్వర్ దండేకర్ వీటిని రాచకొండ గుట్టల్లో గుర్తించారని ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. జిల్లాలోని మంచాల మండలం లోయపల్లి సోమన్నగుట్ట వద్ద ఐదు ఆత్మాహుతి శిల్పాలు వెలుగు చూశాయని తెలిపారు. వీటిలో వీరులు అంజలిఘటిస్తూ కూర్చుని ఉండగా, వారి కీర్తి ఆచంద్రతారార్కం అని చెప్పేందుకు గుర్తుగా తలపై సూర్య, చంద్రుల చిత్రాలున్న రెండు శిల్పాలున్నాయన్నారు. ఇక తలలు నరుక్కుని చేతిలో పట్టుకున్నట్టు మరో రెండు శిల్పాలున్నాయని, అందులో ఒకటి ధ్వంసమైందని చెప్పారు. ఇవి చాళుక్యుల శైలిలో ఉన్నాయని, 14–15 శతాబ్దాలకు చెందినవై ఉంటాయని వివరించారు. -
హిందూ దేవాలయాల దీనస్థితి: మట్టితో కప్పి.. విధ్వంసకుల కళ్లుగప్పి!
ఇది యాదాద్రి భువనగిరి జిల్లా మాటూరు శివారులో విభూది గడ్డగా పిలిచే మట్టి దిబ్బ. దీని కింద మహాదేవాలయం ఉందని చరిత్ర పరిశోధకులు గుర్తించారు. దాదాపు వెయ్యేళ్ల కిందట నిర్మించిన ఆలయం భూగర్భంలో పదిలంగా ఉందన్నమాట. ఇక్కడ లభించిన శాసనం ఆధారంగా అది కళ్యాణీచాళుక్యుల కాలంలో నిర్మితమైనట్టు గుర్తించారు. ఇది వరంగల్ మట్టి కోటకు ఈశాన్యం వైపు ఉన్న ఎల్పీగండి ప్రాంతంలోని త్రికూటాలయం. ఇలా కొంత భాగం వెలుపలికి కనిపిస్తున్నా మిగతా గుడి అంతా భూగర్భంలోనే ఉండిపోయింది. 1998 ప్రాంతంలో కేంద్ర పురావస్తు శాఖ అధికారులకు అందిన సమాచారం మేరకు కొంత భాగాన్ని తవ్వగా ఇక్కడ ఆలయం వెలుగు చూసింది. అది శివాలయమని గుర్తించారు. అల్లా ఉద్దీన్ ఖిల్జీ ఓరుగల్లుపై దండయాత్ర ప్రారంభించింది ఈ దేవాలయం ఉన్న వైపు నుంచే కావటం విశేషం. ఇక్కడి గోడలను ధ్వంసం చేసి కోటలోనికి చొచ్చుకెళ్లారని పరిశోధకులు చెబుతారు. దీనికి సమీపంలో మట్టిదిబ్బ కింద మరో మూడు, మట్టిగోడ పశ్చిమ భాగంలో మరో నాలుగైదు ఆలయాలు ఇలా కూరుకుపోయి ఉన్నాయి. ఈ ఆలయాలు మట్టి కింద కప్పి ఉండటంతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ కంటపడలేదు. ఇది సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులూరులోని శివాలయం. ముస్లింరాజుల దండయాత్రల నుంచి కాపాడుకునే క్రమంలో ఇది భూగర్భంలోకి వెళ్లిపోగా కొన్నేళ్ల కింద వెలికితీశారు. ఇటీవలే కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ, వినోద్‌కుమార్ తదితరులు పరిశీలించి ఇది రాష్ట్రకూటుల కాలంలో నిర్మించిన ప్రత్యేక తరహా మందిరమని గుర్తించారు. రెండువైపులా కిటికీలు తప్ప గోడలపై శిల్పాలు లేవని, గర్భాలయంలో క్షితిజ సమాంతరంగా చతురస్రాకారపు పానవట్టంలో బాణలింగం ఉందని పేర్కొన్నారు. ఇది వరంగల్ మట్టి కోటగోడ పశ్చిమభాగంలో గోడ దిగువన మట్టిలో కూరుకుపోయి ఉన్న భారీ ఆలయం పైకప్పు భాగం. కోట లోపలి వైపు మందిరం ఉంటే, ప్రవేశం ద్వారా గోడకు అవతలి వైపు ఉంది. అంటే ఆలయాన్ని మట్టితో కప్పిన తర్వాత దానిమీద మట్టిగోడ నిర్మించినట్టు తెలుస్తోంది. సాక్షి, హైదరాబాద్: సూది మొన దూరేంతటి సూక్ష్మ నగిశీలతో చెక్కిన శిల్పాలు వరంగల్ కోటలో మైమరిపిస్తాయి. ఒకప్పుడు ఇవన్నీ అద్భుత దేవాలయ నిర్మాణంలో భాగమే. కానీ, ఇప్పుడవి ముక్కలు చెక్కలుగా మారి వరంగల్ కోటలో పడి ఉన్నాయి. వేయిస్తంభాల గుడి సహా పలు దేవాలయాల్లో ఇలానే నేటికీ కనిపిస్తాయి. ఎంతో భక్తిశ్రద్ధలతో, అద్భుత శిల్పసౌందర్యంతో నిర్మించుకున్న ఆలయాలు ముస్లిం రాజుల విధ్వంసాల బారిన పడకుండా స్థానికులు వాటిపై మట్టిని కప్పి, మట్టి లో మొక్కలు పెంచి కాపాడుకున్నారు. అలా అవి శతాబ్దాలుగా మట్టిదిబ్బల కిందే ఉండిపోయాయి. త్వరలో నాగ్‌పూర్, ఒడిశాల నుంచి ఏఎస్ఐ నిపుణులు వరంగల్ ఎల్పీగండిలో వెలుగు చూసిన ఆలయాన్ని పూర్తిస్థాయిలో బయటకు తీసే పనులను త్వరలో నాగ్‌పూర్, ఒడిశా ఏఎస్ఐ నిపుణులు ప్రారంభించ నున్నట్లు తెలుస్తోంది. దీనికి సమీపంలో ఇతర ఆల యాలను కూడా వెలుగులోకి తేనున్నట్టు సమాచా రం. తవ్వకాలపై ప్లాన్ చేసుకునేందుకు ఇటీవలే వచ్చి వాటిని పరిశీలించి వెళ్లారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు.. వర్షాలకు పైమట్టి కొంత కరిగి మట్టిదిబ్బల కింద ఆలయాల ఆనవాళ్లు వెలుగు చూసిన ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఆలయాలు పూర్తిగా బయటపడకముందే ఇలా ధ్వంసమవుతున్నాయి. వెంటనే తెలంగాణ వార సత్వ శాఖ వీటిపై దృష్టి సారించాల్సి ఉంది. -
Photo Feature: సినిమా చూపిస్త మామా!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఫిల్మ్‌నగర్ నుంచి దర్గా మార్గంలో ప్రయాణించే వారికి శుక్రవారం నుంచి కొత్తందాలు కనిపిస్తున్నాయి. దాదాపు అరకిలోమీటరు పొడవునా నాలుగు మీటర్ల వెడల్పయిన సెంట్రల్ మీడియన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లేలా వాక్‌వే సైతం ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆ మార్గంలోని నాలుగు సర్కిళ్లలో ఏర్పాటు చేసిన శిల్పాలు, వాటి చుట్టూ పెంచిన పూలమొక్కలతో ప్రత్యేకతను సంతరించుకుంది. సినీ ప్రపంచం తలపించేలా.. ఫిల్మ్‌నగర్ అంటేనే సినీమయం కావడంతో సినీప్రపంచాన్ని తలపించేలా సినీ కెమెరా.. సినిమాలో మాదిరిగా ఇద్దరి నడుమ కత్తియుద్ధం శిల్పాలతోపాటు ‘హ్యుమానిటీ’ ‘యూనిక్ లైట్ పోల్’ థీమ్స్‌తో కొలువుదీరిన మరో రెండు శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఏర్పాటు చేసిన ఈ నాలుగు శిల్పాల తెరలను శుక్రవారం తొలగించడంతో ఆ మార్గంలో వెళ్లే వారిని ఆకట్టుకుంటున్నాయి. ఈ కళాకృతుల కోసం మొత్తం రూ. 30 లక్షలు ఖర్చయింది. పచ్చందాలు.. ఫౌంటెన్లకు మరమ్మతులు మరోవైపు త్వరలో చేపట్టనున్న పట్టణప్రగతిలో భాగంగా ఖాలీగా ఉన్న అన్ని ప్రదేశాల్లోనూ మొక్కలు పెంచి పచ్చదనం పరిచేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ఫ్లై ఓవర్ల కింద స్తంభాల పైనా, రహదారుల వెంబడి ఉండే గోడలపైనా గ్రీన్ కర్టెన్స్ (వేలాడే తీగలు) తదితరమైన వాటితో పచ్చదనం పరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పాడైపోయిన ఫౌంటెన్లకు సైతం మరమ్మతులు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దే యోచనలో అధికారులున్నారు. -
కొలనుపాకలో నాలుగడుగుల జైన పాదం
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది లేదా 9వ శతాబ్దానికి చెందిన జైన తీర్థంకరులలో ఒకరిదని భావిస్తున్న భారీ పాదాన్ని కొలనుపాకలో గుర్తించారు. ఈ పాదం దాదాపు నాలుగు అడుగుల పొడవుంది. అక్కడ గతంలో ధ్వంసమై చెల్లాచెదురుగా పడి ఉన్న శిల్పాలు, విగ్రహాలను సోమేశ్వరాలయం సమీపంలోని ప్రాంగణానికి చేర్చే పని ప్రస్తుతం జరుగుతోంది. అక్కడికి వచ్చే భక్తులు, పర్యాటకులు చూసేందుకు వీలుగా వీటిని ఒకచోట ఉంచబోతున్నారు. ఈక్రమంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యులు కుమారస్వామి, సోమిరెడ్డి ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు శిథిల విగ్రహాల మధ్య ఈ పాదాన్ని గుర్తించారు. జైన తీర్థంకరులలో ఒకరికి సంబంధించిన పాదాల్లో ఎడమ పాదంగా వారు నిర్ధారణకు వచ్చారు. దీన్ని చరిత్ర పరిశోధకుడు, విశ్రాంత పురావస్తు అధికారి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కూడా ధ్రువీకరించారని హరగోపాల్ పేర్కొన్నారు. దీన్ని పాదంగా మాత్రమే ఏర్పాటు చేసినదా? లేదా భారీ విగ్రహానికి చెందిన భాగమా? అన్న విషయమై స్పష్టత రాలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా గొల్లత్తగుడి జైన మందిరం వెనక ఆరు అడుగులు, ఐదు అడుగుల పొడవున్న రెండు జతల భారీ జైన పాదాలను గుర్తించారు. నిర్మల్ జిల్లా భైంసాలో కూడా 3 భారీ పాదాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో భారీ జైన పాదాలున్న మూడో ప్రాంతంగా కొలనుపాకను గుర్తించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. పాదం మీద నూపురం, కాలివేళ్లకు అలంకారాలు కనిపిస్తున్నట్టు హరగోపాల్ వెల్లడించారు. -
ఉడ్ కార్వింగ్ కళాకారులపై సాక్షి స్పెషల్ రిపోర్ట్
-
బ్రహ్మ భైరవులు.. శివుడి ద్వారపాలకులు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం భట్టుగూడెం గ్రామ శివారులోని గుడిలో అరుదైన శిల్పాల అమరికను చరిత్ర పరిశోధకులు గుర్తించారు. శివాలయానికి ద్వారపాలకులుగా బ్రహ్మ, భైరవుల విగ్రహాలుండటాన్ని కనుగొన్నారు. దీంతో పాటు ద్వార శాఖలపై శంఖనిధి, పద్మ నిధుల శిల్పాలు స్త్రీ రూపంలో ఉన్నట్టు గుర్తించారు. చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి శుక్రవారం ఆలయాన్ని పరిశీలించి ఈ ప్రత్యేకతలు గుర్తించారు. శిల్పాల ప్రత్యేకతలపై కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యులు సువర్ణమహిలతో చర్చించి వాటి వివరాలను వెల్లడించారు. ప్రతిమా లక్షణాల ఆధారంగా ఇవి ఏడెనిమిది శతాబ్దాలకు చెందిన పల్లవ శైలిని పోలిన బాదామీ చాళుక్య శిల్పాలని, భైరవుడు త్రిభంగిమలో 4 చేతులతో ఉన్నాడని చెప్పారు. కుడి చేతిలో గద, ఎడమ చేతిలో పాత్ర, ఎగువ కుడి చేతిలో ఢమరుకం, ఎడమ చేతిలో శూలం ధరించి ఉన్నాడన్నారు. గదలతో బ్రహ్మ, భైరవులు సమపాద స్థానంలో ఉన్న బ్రహ్మ కుడిచేతో గదను ధరించాడని, ఎడమ చేతిని కటిహస్తంగా, పై చేతుల్లో అక్షమాల, గిండిలను, ఒంటిపై ఆభరణాలు ధరించినట్టు శివనాగిరెడ్డి పేర్కొన్నారు. చేతుల్లో గదలు ధరించి, ద్వారపాలకులుగా బ్రహ్మ, భైరవులుండటం అత్యంత అరుదన్నారు. భైరవకోన గుహలో మాదిరిగా భైరవుడు కోర పళ్లను కలిగి ఉన్నాడని, అక్కడ ద్వారపాలకులుగా విష్ణువు, బ్రహ్మలుంటే ఇక్కడ బ్రహ్మ భైరవులున్నారని, రాష్ట్రంలో ఇలాంటివి చూడలేదని తెలిపారు. నాగిరెడ్డి వెంట బుద్ధవనం ప్రాజెక్టు అధికారి శ్యాంసుందర్, స్థానికులు వెంకటరెడ్డి, సైదిరెడ్డి, శంకరరెడ్డి, లింగయ్య, విష్ణు, యాదగిరి తదిరులు ఉన్నారు. -
రాతి.. చిర ఖ్యాతి!
సాక్షి, హైదరాబాద్: పాత రాతి కట్టడాలు చూస్తే వాటిల్లోని శిల్పాలు అబ్బురపరుస్తాయి. వాటిని చెక్కిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ మండపాలు, ప్రాకారాలు, గోపురాలు.. ఒకటేమిటి అన్నీ కట్టిపడేస్తాయి. కారణం.. అవన్నీ రాతి నిర్మాణాలే. 17వ శతాబ్దంలో జటప్రోలు దేవాలయాల నిర్మాణాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఆ స్థాయిలో రాతి నిర్మాణాలు జరగలేదు. ఆ తర్వాత సిమెంటు వాడకం పెరిగాక నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కింది. రాతి కట్టడాలు తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు మళ్లీ అలనాటి అబ్బురాన్ని కళ్లకు కట్టేలా రెండు భారీ రాతి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇటు యాదాద్రి.. అటు శ్రీరామానుజుల సహస్రాబ్ధి ప్రాంగణం.. సనాతన సంప్రదాయ నిర్మాణ విధానానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాయి. మన శిల్పుల్లో ఆ కళ పదిలం ఎలాంటి ఆధునిక పరిజ్ఞానం లేని సమయంలో కూడా టన్నుల బరువున్న రాళ్లను పేర్చి వాటికి ప్రాణ ప్రతిష్ట చేసి శిల్పులు అద్భుతాలు çసృష్టించారు. అయితే ప్రస్తుతం ఆలయాల్లోని మూలవిరాట్టు మినహా మిగతా భాగాలకు రాతితో పని అవసరం లేని సమయంలో నేటి శిల్పుల చేతుల్లో నాటి పనితనం ఉండదన్న అనుమానాలుండేవి. కానీ ఈ రెండు మందిరాలను నిర్మించి వారు నాటి శిల్పుల వారసులేనని నిరూపించారు. యాదాద్రి, రామాను జుల సహస్రాబ్ది మందిరాల్లో దాదాపు 5 వేల మంది శిల్పులు అద్భుత పనితనాన్ని చూపారు. రామానుజుల ప్రాంగణంలో రాతి నిర్మాణాలు యాదాద్రి మందిరానికి 86 వేల టన్నుల నల్లరాయి యాదాద్రి మందిరాన్ని పూర్తిగా కృష్ణ శిలతో నిర్మించారు. ఇందుకు మేలురకమైన బ్లాక్ గ్రానైట్ కోసం వివిధ ప్రాంతాలను గాలించి ప్రకాశం జిల్లా గుర్జేపల్లి ప్రాంతంలోని క్వారీని ఎంపిక చేశారు. దాదాపు 86 వేల టన్నుల నల్లరాతిని సేకరించారు. ఇందుకు రూ. 48 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఆ రాతిని చెక్కి ఇటు శిల్పాలు, అటు నగిషీలు, ప్రాకార రాళ్లు.. ఇలా రకరకాలుగా వినియోగించారు. మొత్తంగా యాదాద్రి ఆలయానికి 10 లక్షల క్యూబిక్ ఫీట్ మేర దీన్ని వినియోగించారు. రామానుజుల సహస్రాబ్ది ప్రాంగణంలో మందిరాలకు రకరకాల రాళ్లు రామానుజుల 216 అడుగుల ఎత్తున్న విగ్రహం దిగువన ఉన్న 54 అడుగుల ఎత్తున్న భద్రపీఠానికి రాజస్తాన్‌లోని బన్సీపహాడ్‌పూర్ ప్రాంతం లోని లేత గులాబీ రంగు ఇసుక రాయిని వాడారు. మౌంట్అబూ ప్రాంతంలోని శిల్పుల చేత దాన్ని చెక్కించి తీసుకొచ్చి ఇక్కడ వినియోగించారు. సమతామూర్తి చుట్టూ విస్తరించి ఉన్న 108 దివ్యదేశ మందిరాల్లోని గర్భాలయ అంతరాలయాలకు ఏపీలోని కోటప్పకొండ, మార్టూరు పరిసరాల్లోని బ్లాక్ పెరల్ గ్రానైట్‌ను వాడారు. దివ్య మండపంలో హోయసల, కాకతీయ శైలిలో ఏర్పాటు చేసిన 468 స్తంభాలకు రాజస్తాన్‌లోని బేస్లానా బ్లాక్ మార్బుల్ (నల్ల చలువరాయి) వినియోగించారు. కాంచీపురం సమీపంలోని వాలాజా ప్రాంతంలోని కృష్ణ పురుష శిలను ఆలయాల్లోని ప్రధాన మూర్తులకు వాడారు. మరో 12 రోజుల్లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహణ జరగబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా 216 అడుగుల భారీ రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రామానుజుల సహస్రాబ్ది ప్రాంగణం 17వ శతాబ్దం తర్వాత తగ్గిన రాతి నిర్మాణాలు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఊరికెళ్లినా రాతితో నిర్మించిన చారిత్రక మందిరాలు దర్శనమిస్తాయి. శాతవాహనులు మొదలు కాకతీయులు, విజయనగర రాజుల వరకు నిర్మాణాలన్నీ రాతితోనే జరిపించారు. డంగు సున్నం మిశ్రమాన్ని నిర్మాణాలకు వినియోగించే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా రాతికి రాతికి మధ్య బైండింగ్ వరకే దాన్ని వాడారు తప్ప ఆలయాల నిర్మాణానికి అంతగా వినియోగించలేదు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని దక్కన్ సుల్తాన్‌ను ఓడించిన తర్వాత భారీ రాతి నిర్మాణాలు పెద్దగా జరగలేదు. తర్వాత సంస్థానాలు కొలువుదీరాక 17వ శతాబ్దంలో కొన్ని పెద్ద రాతి దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి. జటప్రోలు సంస్థానాధీశులు స్థానికంగా మదనగోపాల స్వామి దేవాలయం, కృష్ణా తీరంలోని మంచాలకట్ట మాధవస్వామి దేవాలయాలు నిర్మించారు. మళ్లీ 3 శతాబ్దాల తర్వాత 1910లో వనపర్తి సంస్థానాధీశులు పెబ్బేరు సమీపంలోని శ్రీరంగాపురంలో రంగనా«థ స్వామి ఆలయాన్ని రాతితో నిర్మించారు. కానీ అది చిన్నగా ఉండే ఒకే దేవాలయం. జటప్రోలు దేవాలయాల తర్వాత ఇంత కాలానికి అత్యంత భారీగా, పూర్తి రాతితో నిర్మించిన దేవాలయం యాదాద్రి. రామానుజుల సహస్రాబ్ధి మందిరాలు కూడా కొంతభాగం సిమెంటు నిర్మాణాలు పోను ప్రధాన మందిరాలను రాతితోనే నిర్మించారు. నగరం నడిబొడ్డున నౌబత్ పహాడ్‌పై పాలరాతితో నిర్మించిన బిర్లామందిరం కూడా రాతి కట్టడమే అయినా తెలుగు ప్రాంతాల సంప్రదాయ శైలికి భిన్నమైంది. -
అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తెనాలి శిల్పులు
తెనాలి: ఇనుప వ్యర్థాలతో శిల్పకళా ఖండాలను తీర్చిదిద్దుతూ అంతర్జాతీయ గుర్తింపును పొందిన తెనాలికి చెందిన కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యారు. స్థానిక సూర్య శిల్పశాల నిర్వాహకులైన ఈ తండ్రీకొడుకులు పదేళ్లుగా ఇనుప వ్యర్థాలతో అద్భుతమైన కళాకృతులను రూపొందిస్తున్నారు. వీటిలో 75 వేల ఇనుప నట్లతో మహాత్మాగాంధీ, ప్రధాని మోదీ నిలువెత్తు విగ్రహాలు ఉన్నాయి. ఇవికాకుండా జీప్, ఆటో, స్కూటర్, మహిళ, సింహంతో సహా మరెన్నో కళాఖండాలను ఇనుప నట్లతో తయారు చేశారు. ఇంతవరకు 100 టన్నుల ఇనుప వ్యర్థాలను ఇందుకోసం వినియోగించారు. ఇంత భారీ మొత్తంలో ఐరన్ స్క్రాప్‌ను వాడి, తయారైన భారీ శిల్పకళాఖండాలను దేశంలోని పలు రాష్ట్రాలతో సహా విదేశాలకు పంపారు. వీటన్నిటిని గుర్తించి వెంకటేశ్వరరావు, రవిచంద్ర పేర్లు అమెరికా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు చేసింది. ఈ మేరకు సంబంధిత సంస్థ శనివారం వీరికి అధికారిక సమాచారాన్ని పంపింది. -
కళాకారుడు, ఈ అదృశ్య శిల్పం కాస్ట్ ఎంతో తెలుసా?!
ఇక్కడ కనిపిస్తున్న శిల్పం ఖరీదు రూ. 13 లక్షలు. ఏంటీ వేళాకోళమా? లేనిది ఉన్నట్టు ఊహించుకోవాలా? అని కన్నెర్ర చేయకండి. నిజమే ఇక్కడ శిల్పం లేదు. అలాగని వేళాకోళమూ కాదు. ఎందుకంటే అది అదృశ్య శిల్పం! ఇటలీకి చెందిన సాల్వటోర్ గారౌ 150 సెం.మీ వెడల్పు, 150 సెం.మీ పొడవు ఉండే ఓ రాతిని ‘నేను’ అనే శిల్పంగా అభివర్ణించాడు. దేవుడికి రూపం లేన ట్లుగానే మనిషికి, అతని నిజమైన స్వభావానికీ రూపం ఉండదనే భావనతో దానిని రూపొందించాడు. అందుకే ఇదొక అదృశ్య శిల్పం. దీనిని ఓ ప్రత్యేక గదిలో నిర్దిష్ట వాతవరణంలో భద్రపరుస్తారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ శిల్పాన్ని ఓ వ్యక్తి పదమూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు కూడా. ఇదంతా వింటుంటే గతంలో 86 లక్షల రూపాయల విలువ చేసిన ‘గోడ మీద టేపుతో అతికించిన అరటిపండు’ కళాకృతి కంటే క్రేజీగా ఉంది కదూ! -
Basar: మట్టిదిబ్బల కింద మహత్తర శిల్పాలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ కోటలోకి అడుగుపెడితే.. కళ్లు చెదిరే శిల్పకళ మన కళ్లముందు కదలాడుతుంది. అలాంటి శిల్పాలెన్నో ముస్లిం రాజుల దాడుల్లో ధ్వంసమయ్యాయి. తెలంగాణ నలుమూలలా నాటి విధ్వంసాలకు మూగ సాక్ష్యాలు అడుగడుగునా దర్శనమిస్తాయి. దాడుల నుంచి ప్రజలు తప్పించుకుని పొలాల్లోకి వెళ్లి ప్రాణాలు దక్కించుకునేవారు. కొంతమంది అపురూప శిల్ప సంపదనూ మట్టిదిబ్బల కింద దాచి కాపాడుకున్నారు. అలా దాచినట్టుగా భావిస్తున్న కొన్ని శిల్పా లు తాజాగా వెలుగు చూశాయి. అప్పుడు శివలింగం.. ఇప్పుడు అరుదైన విగ్రహాలు నిర్మల్ జిల్లా బాసరకు అతి చేరువలో ఉన్న మైలా పూర్లో తాజాగా కొన్ని విగ్రహాలు వెలుగు చూశాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు బలగం రామ్మోహన్‌కు చెందిన పొలం లోని బావి పక్కన ముళ్ల పొదలను తొలగిస్తుండగా పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. గతంలో ఇక్కడ ఓ శివలింగం వెలుగుచూడగా స్థానికులు దానికి పూజలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అరుదైన భంగిమలో ఉన్న బుద్ధుడి విగ్రహం, రెండు అమ్మదేవతల విగ్రహాలు, ఓ అయ్యదేవర శిల్పం బయటపడ్డాయి. ఇవి 11వ శతాబ్దం మొదలు 16వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. అప్పట్లో ముస్లిం పాలకుల సైన్యంతోపాటు రోహిల్లా తెగకు చెందినవారు కూడా ఈ ప్రాంతాలపై దాడులు చేసేవారు. స్థానికుడైన మక్కాజీ పటేల్ ప్రజలతోపాటు శిల్ప సంపదను కూడా దాచి కాపాడాడని స్థానికుల కథనం. ఈ విగ్రహాలు కూడా ఆయన దాచినవే అయి ఉంటాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి కొంత దూరంలో కొన్ని శిథిల దేవాలయాలున్నాయని, దేవాలయ స్తంభాలతో నిర్మించిన ఓ అషూర్ఖానా కూడా అక్కడ ఉందన్నారు. బుద్ధుడి భంగిమే ప్రత్యేకం.. బౌద్ధ వృక్షం కింద జ్ఞానోదయమైందన్న మాటలను అనుమానిస్తూ అందుకు సాక్ష్యమేంటని కొందరు ప్రశ్నించిన సమయంలో ‘భూమే’సాక్ష్యం అని బుద్ధుడు చూపాడని చెబుతారు. అలా భూమిని చూపే ముద్రలో ఉన్న బుద్ధుడి శిల్పం ఇక్కడ వెలుగుచూసిందని హరగోపాల్ పేర్కొన్నారు. చదువుల తల్లి సరస్వతి క్షేత్రమే బాసర అయినందున ‘విద్యాశరణ సంపన్నుడై’న బుద్ధుడి విగ్రహాన్ని అప్పట్లో స్థానికంగా ఏర్పాటు చేసుకుని ఆరాధించి ఉంటారని చరిత్ర పరిశోధకుడు శివనాగిరెడ్డి అభిప్రాయపడ్డారని చెప్పారు. అయ్యదేవర విగ్రహం మైలారదేవుడిదని, విశ్వకర్మ వర్గానికి చెందినవారు కొలిచే మమ్మాయి దేవత ప్రతిరూపాలు కూడా రెండున్నాయన్నారు. ఇనుముకు ప్రతిరూపంగా ఈ దేవతను కొలుస్తారని, పక్కనే సూదులమ్మ గుడి ఉన్నందున.. సూదులంటే ఇనుముకు గుర్తే అయినందున ఇవి మమ్మాయి దేవతలే అయి ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతాన్ని ఖండేరాయుని జాగ అని పిలుస్తారని, మైలారదేవుడిని తెలంగాణ ప్రాంతంలో మల్లన్న అని, కొన్ని ఇతర ప్రాంతాల్లో ఖండోబా అని పిలుస్తారని, ఆ ఖండోబా పేరుతోనే ఈ ప్రాంతానికి ఖండేరాయుని జాగా అని పేరు వచ్చి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విగ్రహాలకు వేదిక నిర్మించనున్నట్టు తెలిపారు. చదవండి: హ్యాట్సాఫ్ ఎస్ఐ: గోడెక్కిన చదువు -
కొలకలూరులో వెయ్యేళ్లనాటి శివలింగాలు
తెనాలి: మధ్యయుగ చరిత్ర, సంస్కృతికి ప్రతీకలైన వెయ్యేళ్ల నాటి అపురూప శిల్పాలను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. తెనాలి రూరల్ మండల గ్రామం కొలకలూరు గ్రామంలోని పురాతన అగస్త్యేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో అస్తవ్యస్తంగా ఈ విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. పురావస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్‌రెడ్డి సమాచారంతో ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి శుక్రవారం దేవాలయాన్ని సందర్శించారు. అక్కడి శిల్పాలు వెయ్యేళ్ల నాటివిగా ప్రకటించారు. ♦దేవాలయం ఆవరణలో గుర్తించిన శిల్పాల్లో మహిషాసుర మర్దిని (క్రీ.శ 10వ శతాబ్దం), వెయ్యేళ్లనాటి శివలింగాలు, ఒకే శరీరంతో మూడు నాట్యభంగిమలను ప్రదర్శిస్తున్న నృత్యకారుడు (క్రీ.శ 13వ శతాబ్దం), దేవి విగ్రహం (క్రీ.శ 16వ శతాబ్దం)తోపాటు శివద్వార పాలకులు చెక్కిన ద్వారశాఖలు (క్రీ.శ 14వ శతాబ్ది తలుపు చెక్కలు) ఉన్నాయి. ♦వేంగి చాళుక్య, కాకతీయ, విజయనగర శిల్పకళలకు అద్దంపడుతున్న శిల్పాలను అదే ఆలయ ప్రాంగణంలో ఎత్తైన పీఠాలపై నిలిపి, వాటి వివరాలతో కూడిన పేరు పలకలను బిగించి, భద్రపరచాలని దేవదాయ, పురావస్తుశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ♦వీటితోపాటు అక్కడ క్రీ.శ 1241, 1242, 1318కి చెందిన నాలుగు శాసనాలను గుర్తించారు. వాటిలో అగస్తేశ్యరస్వామి ఆలయ సేవలకు నియమితులైన మహిళల కోసం అమిరినాయుడు రెండు పుట్ల భూమిని దానం చేశారు. ♦కులోత్తుంగ చోళుడి సామంతుడైన కొండపడుమాటి బేతరాజు సేవకుడైన రెంటూరి ఎక్కిటి, అదే దేవాలయ అఖండ దీపానికి 50 ఆవులను దానం చేసినట్టు ఉంది. ♦క్రీ.శ 1318 శాసనాల్లో కాకతీయ ప్రతాపరుద్రుని సకల సేనాధిపతి సోమయ లెంక కుమారుడు పోచులెంక అగస్తేశ్వరుడి సోమవార నిబంధనకు, వీరభ్రదునికి 8 పుట్ల భూమిని, పోచు లెంక కేశవ పెరుమాళ్లుకు శనివార నిబంధనకు 5 తూముల భూమిని దానం చేసినట్టు లిఖించారు. ♦శాసనాల్నింటిలోనూ కొలకలూరు గ్రామం పేరును కొలంకలూరుగా లిఖించడం విశేషం. చదవండి: పత్రికల్లో వార్తలు సేకరించి.. ఇంటెలిజెన్స్ డీఎస్పీనంటూ.. ఆర్‌ఆర్‌ఐలో అక్రమాలు: వారికి ధనార్జనే ధ్యేయం -
వెల్కటూరులో కొత్త రాతియుగం ఆనవాళ్లు
సిద్దిపేట: సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు గ్రామంలో మానవ సాంస్కృతిక వికాసాలను ప్రతిబింబించే కొత్తరాతియుగం నాటి శిల్పాలు లభించాయి. ఇంత వరకు గ్రామస్తులకు మాత్రమే తెలిసిన ఈ చరిత్రను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. గతంలో ఇక్కడ చారిత్రక పూర్వయుగం, కొత్తరాతియుగం ఆనవాళ్లు లభించినట్టు తెలిపారు. అందులో 10 నాగశిల్పాలు, రెండు వీరగల్లులు, రెండు జైన శిల్పాలు ఉన్నాయి. జైన ద్వారపాలకుల శిల్పాలు అత్యంత శిల్ప సౌందర్యంగా ఉన్నట్టు తెలిపారు. వీరు జంధ్యాలు కుడి వైపు ధరించి ఉన్నట్టు తెలిపారు. వీరశైవ భక్తుల ప్రతిమ లక్షణాలను కలిగిన రెండు విగ్రహాలు ఆత్మాహుతి చేసుకుంటున్న దృశ్యాన్ని చూపే విధంగా ఉన్నట్టు తెలిపారు. వీరశైవుల వీరభక్తికి సాక్ష్యాలుగా ఈ విగ్రహాలు ఉన్నట్టు తెలిపారు. ఇలా మరుగున పడిన చారిత్రక విశేషాలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా పరిశోధన చేస్తున్నట్టు తెలిపారు. -
నగరానికి అందం తెస్తున్న ‘ఆ నలుగురు’!
సాక్షి, బంజారాహిల్స్: రంగురంగుల శిల్పాలు.. ఆలోచనాత్మక పెయింటింగ్స్‌తో వీధులు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా బాటసారులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్లలో ఆకట్టుకునే శిల్పాలను ఏర్పాటు చేస్తూ నగరానికి మరింత వన్నె చేకూరుస్తున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ పరిధి కిందకు వచ్చే పలు ప్రాంతాల్లో జేఎన్టీయూకి చెందిన నలుగురు విద్యార్థులు ఈ కళాత్మక ఆకృతులను తీర్చిదిద్దుతూ ఆయా ప్రాంతాలకు కొత్త ఆకర్షణ తీసుకొస్తున్నారు. జేఎన్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి చెందిన సంతోష్ బుద్ది, అబ్దుల్ రహ్మాన్, మహేష్‌కుమార్ గంగనపల్లి, మురళీకృష్ణ కంపెల్లిలు గత కొద్ది రోజులుగా పలు ప్రహరీలకు కొత్త నగషిలు చెక్కుతున్నారు. కేవలం రంగులు పూసి చేతులు దులుపుకోకుండా ఆ ఆకృతులకు ఆలోచనల రూపురేఖలు తీసుకొస్తున్నారు. జీహెచ్ఎంసీ సౌజన్యంతో ఈ నలుగురు యువకులు ప్రధాన కూడళ్లతో పాటు పలు ప్రహరీలకు కొత్త రూపును సంతరించుకునేలా పెయింటింగ్స్ వేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం ఈ విషయంలో తమకు సంపూర్ణ సహకారం అందిస్తూ మరింతగా ప్రోత్సహిస్తున్నాయని, ఈ పెయింటింగ్స్, శిల్పాలు తమకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతున్నాయని ఈ సందర్భంగా వారు పేర్కొంటున్నారు. ముందుగా తాము పెయింటింగ్ వేసే ప్రాంతాన్ని లేదా శిల్పాలు తీర్చిదిద్దే చౌరస్తాలను పరిశీలించి ఆ ప్రాంతాల్లో ఏ రకమైన శిల్పాలు, పెయింటింగ్స్ ఉంటే బాగుంటుందో డిజైన్లు రూపొందించుకొని ఆ మేరకు తీర్చిదిద్దుతున్నామని అంటున్నారు. విద్య, పచ్చదనం, పూలు ఇలా వివిధ రకాల ఆలోచనలతో ఈ ఆర్ట్ వర్క్స్ ఉంటాయని వారు తెలిపారు. ఆకట్టుకునే శిల్పాలివే.. ► ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్.70 అశ్విని లేఅవుట్ చౌరస్తాలో రాష్ట్ర పక్షి పాలపిట్ట శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ►బంజారాహిల్స్‌రోడ్ నెంబర్.1/5 జీవీకే వన్ చౌరస్తాలో గులకరాళ్ల శిల్పాన్ని తీర్చిదిద్దారు. ► బంజారాహిల్స్ రోడ్ నెంబర్.45 జంక్షన్లో వాల్ ఆర్ట్‌ను వేశారు. ►లక్డీకాపూల్ రైల్వేస్టేషన్ వద్ద కూడా ఈ వాల్ ఆర్ట్ కనువిందు చేస్తున్నాయి. ►బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1/12 పెన్షన్ కార్యాలయం చౌరస్తాలో బస్టాప్‌ను వాల్ ఆర్ట్‌తో సుందరంగా తీర్చిదిద్దారు. ► ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన చిన్నారులకు విద్య తప్పనిసరి అనే కాన్సెప్ట్‌తో వాల్ ఆర్ట్ ఆకట్టుకుంటున్నది. ► ఫిలింనగర్ సీవీఆర్ న్యూస్ చౌరస్తాలో వాల్ ఆర్ట్ పాదచారులు, వాహనదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ►ఇలా ప్రధానమైన చౌరస్తాలో ఈ నలుగురు విద్యార్థులు తమలోని ప్రతిభతో నగరంలోని పలు ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దుతూ చూపరులను కట్టిపడేస్తున్నారు. -
హార్బిన్ ఐస్ అండ్ స్నో ఉత్సవం వద్ద సందర్శకుల సందడి
-
దేవుళ్ల పుట్టిల్లు
రాతికి జీవం ఉట్టిపడేలా చేయడం వారికి ఉలితో పెట్టిన విద్య. శిలలను సజీవ శిల్పాలుగా చెక్కి దేశ విదేశాల్లోని ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శిల్పులు. సుమారు 300 సంవత్సరాల కిందట నుంచీ వారు వంశపారంపర్యంగా రాతి శిల్పాలు చెక్కుతున్నట్టు చరిత్ర చెబుతోంది. ఆళ్లగడ్డ: ఏకశిల రథముపై లోకేశు వడిలోన.. ఓరచూపుల దేవి ఊరేగి వస్తుంది. శిల్పి స్పర్శ తగలగానే అక్కడి శిలలు చేతనత్వం పొంది.. సరిగమలు ఆలపిస్తాయి. కటిక రాతికి జీవకళ పోయడం వారికి ఉలితో పెట్టిన విద్య. శిలలను సజీవ శిల్పాలుగా చెక్కి దేశ విదేశాల్లోని ప్రముఖుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఆళ్లగడ్డ శిల్పులు. సుమారు 300 సంవత్సరాల క్రితం నుంచీ ఆళ్లగడ్డ శిల్పులు వంశపారంపర్యంగా రాతి శిల్పాలు చెక్కుతున్నట్టు చరిత్ర చెబుతోంది. నాడు ఒక కుటుంబం మాత్రమే ఈ వృత్తిని చేపట్టగా.. ప్రస్తుతం సుమారు 100 కుటుంబాలు ఇదే వృత్తిని జీవనాధారంగా చేపట్టి శిల్పకళా రంగంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పేరును అంతర్జాతీయ స్థాయిలో పదిలపరుస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య నగరానికి తరలించేందుకు సిద్ధంగా ఉన్న శేషపాన్పు విగ్రహం ఇలా మొదలైంది ► ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని గుంప్రామాన్ దిన్నె గ్రామానికి చెందిన దురుగడ్డ బాలాచారి, వీరాచారి పూర్వీకులు సుమారు 300 సంవత్సరాల క్రితం శిల్పాల తయారీకి శ్రీకారం చుట్టారు. ► పట్టణ ప్రాంతంలో ఆదరణ బాగుంటుందనే ఉద్దేశంతో వీరు 1950లో అక్కడి నుంచి ఆళ్లగడ్డ పట్టణానికి వలస శిల్ప శాలను ఏర్పాటు చేశారు. ► 1982 వరకు ఆ ఒక్క కుటుంబం మాత్రమే శిల్పాలు తయారు చేసేది. ఆ తరువాత ఆ కుటుంబానికి చెందిన దురుగడ్డ రామాచారి తన నలుగురు కుమారులతోపాటు మరికొందర్ని శిష్యులుగా చేర్చుకుని శిల్పకళను అభివృద్ధి చేశారు. ► ప్రస్తుతం ఆళ్లగడ్డలో సుమారు 60 శిల్ప శాలలు ఉండగా.. వాటిలో 500 మంది శిల్పులు విగ్రహాలు తయారు చేస్లూ జీవనోపాధి పొందుతున్నారు. ఆళ్లగడ్డ నుంచి అమెరికా వరకు.. ► దేవతా మూర్తుల విగ్రహాలలోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తల విగ్రహాలను జీవకళ ఉట్టి పడేలా తీర్చిదిద్దడం ఆళ్లగడ్డ శిల్పుల ప్రత్యేకత. ► వీరి చేతిలో రూపుదిద్దుకున్న అనేక విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా హిందూ ఆలయాల్లో మూలవిరాట్‌లుగా కొలువై పూజలందుకుంటున్నాయి. ► ఇక్కడి శిల్పులు అమెరికా వెళ్లి అక్కడే మూడు నెలలు ఉండి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి వచ్చారు. ► ఆళ్లగడ్డలో తయారు చేసిన విగ్రహాలు చైనా, రష్యా, శ్రీలంక, జపాన్ తదితర దేశాలకు ఓడల ద్వారా ఎగుమతి అవుతున్నాయి. మహిళలూ రాణిస్తున్నారు ► శిల్ప కళలో మహిళలు కూడా రాణిస్తున్నారు. మొదట్లో కుటుంబంలోని పురుషులు చెక్కిన విగ్రహాలకు నగిషీలు ఇవ్వటం, నునుపు చేయటం వంటి పనులు మహిళలు చేసేవారు. ► శిల్ప కళలో మెళకువలు నేర్చుకుని పురుషులతో సమానంగా పాల రాతి శిల్పాలు, గృహాలంకరణ ఉపకరణాలను తయారు చేస్తున్నారు. ► ప్రస్తుత కంప్యూటర్ యుగంలో యువకులంతా సాఫ్ట్వేర్ రంగం వైపు మొగ్గు చూపుతుంటే.. శిల్పుల కుటుంబాల్లోని యువకులు శిల్ప కళపైనే మక్కువ చూపుతున్నారు. ► ఆన్లైన్ ద్వారా విగ్రహాల ఆర్డర్లు బుక్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు. శిల్పాల తయారీలో యంత్రాల వినియోగాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కో విగ్రహానికి.. ఒక్కో శిల ► విగ్రహాలను చెక్కడం ఓ ఎత్తైతే వాటికి అవసరమైన, వినియోగదారుడి బడ్జెట్‌కు సరిపోయే రాయిని ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. ► ఏ రాయి అయితే ఏ విగ్రహం ఎలా ఉంటుంది... ఎంత బడ్జెట్లో వస్తుందో చెప్పి విగ్రహాలను తయారు చేసి ఇస్తుంటారు. ► ఇందుకోసం వైఎస్సార్ జిల్లా తలమంచి పట్నం, మల్యాల, కాంచీపురం, బెంగళూరు, కోయిరా, మైసూర్ తదితర ప్రాంతాల నుంచి గ్రానైట్, ఎర్ర రాయి, నల్ల రాయి, పాల రాయి, కోయిరా రాయి వంటి శిలలను వినియోగిస్తారు. -
ఆలయ కవాటం
కవాటం అంటే తలుపు. ఆలయరక్షణకోసం.. స్వామివారి ఏకాంతం కోసం గుడి తలుపులు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రాచీన ఆలయాల నుంచి నేటివరకూ ఆలయతలుపులు దారువు (కొయ్య)తోనే చేసి అవకాశాన్ని బట్టి దానికి ఇత్తడి, రాగి, వెండి, బంగారుతో చేసిన రేకులను బిగిస్తున్నారు. ఇలా లోహాలతోచ శిల్పాలతో తలుపులను అలంకరించడం వలన దేవతల ప్రీతి పొందుతారని ఆగమాలు చెబుతున్నాయి. ఆలయద్వారం, తలుపు చెక్కలను, వాటికి జోడించే నిలువు, అడ్డ పట్టికలను ఒకే జాతికి చెందిన కొయ్యతో నిర్మించడం చాలా మంచిది. అలా కాకుండా మిశ్రదారువులతో చేస్తే విపరీతమైన ఫలితాలు ఎదురౌతాయని ఈశాన శివగురుదేవ పద్ధతి తెలిపింది. ద్వారబంధం శిలతో నిర్మించి తలుపులు కొయ్యతో చేస్తే దోషమేమీ లేదు. ద్వారబంధానికి లోపల ఇరువైపులా రెండేసి ఇనుము కమ్మీలను ఏర్పరచి తలుపులకు గుండ్రని కమ్మీలకు తగిలించి తిరగడానికి చేసే ఏర్పాటుకు భ్రమరకాసంధి అని పేరు. దేవాలయ ద్వారానికి రెండువైపులా జోడు తలుపులు ఉండాలి. వీటిని యుగ్మకవాటం అంటారు. ఆలయాల్లో చిన్న ఆలయాలకు.. ముందున్న రెండు స్తంభాలకు కలిపి తలుపు పక్కకు జరిపి వేసే తలుపులను సంహార కవాటం అంటారు. ఆలయాల్లో గానీ.. గృహాల్లో గానీ గూడు లేదా అల్మరా నిర్మించి వాటికి ఉంచే తలుపులను ధావన కవాటం అంటారు. ప్రాచీన ఆలయాల్లో నేరుగా గర్భగుడికి తలుపులుండవు. అంతరాళ మండపం, అర్ధమండపాలకు మాత్రమే తలుపులు ఉంటాయి. కవాటాల పైన పద్మాలు, చిరుగంటలు లేదా దశావతార శిల్పాలను, అష్టలక్ష్మీ విగ్రహాలను, ఆయా దేవతాలీలల్ని లేదా తిరునామం శంఖచక్రాలు, గరుడ–హనుమ శిల్పాల్ని, అష్టదిక్పాలకులను చెక్కుతారు. అయితే కవాటాలపైన అష్టమంగళ చిహ్నాలు, లతలు, మకర, నర, నారీ, భూత, సింహాలు, గజ.. వ్యాలాది రూపాల్ని వారి వారి ఆలోచనలకు తగ్గట్టు చిత్రించాలని శ్రీప్రశ్నసంహిత సూచించింది. కవాటాలను తెరవడమంటే భగవంతుని కరుణను మనపై కురిపించడమే. ప్రకృతిసిద్ధమైన దేవతారూపాలతో నిండిన కవాటాలు భక్తులకు కటాక్ష వీక్షణా గవాక్షాలు. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
అమెరికాకు మన కళాఖండాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వెలుగు చూసిన అతి పురాతన శిల్పాలు అమెరికాలో తళుక్కుమననున్నాయి. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో జరగబోయే ప్రదర్శనలో మన కళాఖండాలు కొలువుదీరనున్నాయి. అమెరికా, యూరప్, భారత్ ల నుంచి 150 కళాఖండాలకు మాత్రమే ఈ ప్రదర్శనలో చోటు దక్కనుండగా, అందులో తెలంగాణకు చెందినవి దాదాపు 13 వరకు ఉండబోతున్నాయి. దాదాపు 100 రోజుల పాటు అవి అక్కడ ప్రదర్శనలోనే ఉంటాయి. మన దేశం నుంచి కళాఖండాల తరలింపు ప్రక్రియకు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. చాలా దేశాల్లో బౌద్ధానికి సంబంధించి సజీవ సాక్ష్యాలుగా ఉన్న అలనాటి గుర్తులతో తరచూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటారు. ఇప్పుడు న్యూయార్క్‌లోని మెట్రోపాలిట¯Œ మ్యూజియం వచ్చే ఏడాది నవంబర్ 20 నుంచి ఫిబ్రవరి 14 వరకు బుద్ధుడి జీవితంపై ఓ ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. దీని ఇతివృత్తం భారత్‌తో ముడిపడి ఉండటం విశేషం. ‘ది ట్రీ అండ్ సర్పెంట్: ఎర్లీ బుద్ధిస్ట్ ఆర్ట్ ఇ¯Œ ఇండియా’పేరుతో ఇది ఏర్పాటవుతోంది. ఎంపిక చేసిన యూఎస్ మ్యూజియం ఈ ప్రదర్శనను న్యూయార్కు మ్యూజియం నిర్వహిస్తోంది. ఏడాది నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా పర్యటించిన ఆ మ్యూజియం ప్రతినిధులు తెలంగాణలో కూడా తిరిగి 13 ప్రదర్శనాంశాలను ఎంపిక చేశారు. ఇందులో ఫణిగిరి బౌద్ధ స్థూపం వద్ద లభించిన అరుదైన తోరణాలు, తల విరిగి రెండు మీటర్ల ఎత్తున్న బుద్ధుడి సున్నపు రాయి విగ్రహం, అష్ట మంగళ చిహ్నాలు చెక్కి ఉన్న సున్నపురాయి బుద్ధ పాదాలు, బుద్ధుడి జీవితాన్ని మూడు భాగాల్లో చెక్కిన మూడున్నర అడుగుల ప్యానెల్ ఉన్నాయి. ధూళికట్టలో లభించిన గొడు గుతో కూడిన బుద్ధుడి పూజా మందిరం, బుద్ధుడికి రక్షణగా పడగవిప్పిన పాము ఉండే నాగముచిలింద తదితరాలున్నాయి. ఇవి ఫణిగిరిలోని స్టోర్ రూమ్, నగరంలోని స్టేట్ మ్యూజియం, హెరిటేజ్ తెలంగాణ ప్రధాన కార్యాలయం, కరీంనగర్ మ్యూజియాల్లో ఉన్నాయి. ఇవన్నీ క్రీ.శ. 2వ శతాబ్దానికి పూర్వమైనవి. భారీ బీమా.. ఈ కళాఖండాలను అమెరికాకు తరలించటం, తిరిగి తీసుకువచ్చే క్రమంలో దెబ్బతినటం, దోపిడీకి గురయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటికి భారీ మొత్తంలో బీమా చేయబోతున్నారు. గతంలో ముంబై, ఢిల్లీ మ్యూజియాల్లో జరిగిన ప్రదర్శనకు స్టేట్ మ్యూజియం నుంచి తరలించిన బుద్ధ ప్యానెల్‌కు రూ.2 కోట్ల బీమా చేశారు. ఇప్పుడు ఈ అన్ని విగ్రహాలకు దాదాపు రూ.25 కోట్ల మేర బీమా చేసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి పంపాం ‘అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రదర్శనకు తెలంగాణ నుంచి కూడా కొన్ని కళాఖండాలు పంపబోతున్నాం. న్యూయార్క్ మ్యూజియం ప్రతినిధులు ఎంపిక చేసిన వాటికి సంబంధించి అమెరికాకు పంపేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాం. ప్రభుత్వం నుంచి ఎన్నింటికి అనుమతి వస్తే అన్నింటిని పంపుతాం.’ – దినకర్ బాబు, ఇంచార్జి డైరెక్టర్, హెరిటేజ్ తెలంగాణ -
సింగరాయకొండలో ‘అమ్మ దేవత’
సాక్షి, హైదరాబాద్: అత్యంత పురాతన ‘మాతృ దేవత’ ప్రతిమ సిద్దిపేట సమీపంలో వెలుగు చూసింది. సంతాన సాఫల్యానికి ప్రతిరూపంగా ‘అమ్మ’ శిల్పాన్ని ఆరాధించే పద్ధతి వేల ఏళ్ల కిందటే మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విగ్రహాలు వివిధ రూపాల్లో వెలుగు చూశాయి. మన దేశంలో అమ్మ దేవత, లజ్జా గౌరీగా ఆరాధించిన ఆనవాళ్లు తేలాయి. నగ్నరూపంలో ఉండే ఈ భంగిమ అమ్మ తనానికి చిహ్నంగా భావిస్తారు. గతంలో అమరావతి ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో ఇలాంటి శిల్పాలు వెలుగు చూడగా, హైదరాబాద్ శివారులోని కీసరగుట్ట క్షేత్రం చేరువలో పురావస్తు తవ్వకాల్లో ఇలాంటి ఓ శిల్పం వెలుగు చూసింది. తాజాగా ఇదే ఆనవాళ్లతో సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని సింగరాయ కొండ గ్రామ శివారు గుట్టపై లభించింది. సున్నపు రాయిపై చెక్కింది కావటం, దాన్ని తొలగించే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో కొంత ధ్వంసమైంది. తాజాగా దాన్ని ఔత్సాహిక చరిత్రకారులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్, వేముగంటి మురళీకృష్ణ, శ్రీరామోజు హరగోపాల్ తదితరులు పరిశీలించి అమ్మదేవత ప్రతిరూప మని తేల్చారు. గతంలో లభించిన విగ్రహాల కంటే ఇది చాలా పురాతనమైందని, దాదాపు క్రీ.పూ. రెండో శతాబ్దానికి చెందినదై ఉంటుందని భావిస్తున్నట్లు హరగోపాల్ వెల్లడించారు. రూపమే విచిత్రం.. అమ్మ తనానికి ప్రతీకగా ఇలాంటి విగ్రహాలను ఏర్పాటు చేయటం గతంలో ఉండేది. తల్లి ప్రసవించేటప్పుడు ఉండే భంగిమగా దీన్ని గతంలో కొందరు చరిత్రకారులు తేల్చారు. నగ్నంగా ఉండే రూపం అయినందున ముఖం ఉండేది కాదని, తల స్థానంలో విచ్చుకున్న పద్మం చెక్కేవారని చెప్పారు. భౌతిక, మానసిక పరిపక్వతకు చిహ్నంగా వికసిత పద్మాన్ని పేర్కొంటారని చరిత్రకారులు చెబుతున్నారు. సింగరాయకొండ గుట్టపై లభించిన శిల్పానికి కూడా శిరస్సు స్థానంలో పద్మం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక్కడే గతంలో బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్లు వెలుగు చూశాయి. స్థానికంగా ఉన్న దేవాలయం దిగువన బౌద్ధ స్తూపం ఉండేదని, ఇక్కడే ఆరో శతాబ్దానికి చెందిన చతుర్ముఖ బౌద్ధ బ్రహ్మ శిల్పం, మట్టి ఒరల బావి వెలుగు చూసినట్లు హరగోపాల్ తెలిపారు. -
కాలగర్భంలో కళా వైభవం!
అద్భుత శిల్పకళా సంపద మట్టిలో కలిసిపోతోంది. నిత్యం పూజలు, అభిషేకాలతో విలసిల్లిన దేవాలయాలు, శిల్పాలు రాళ్ల కుప్పలవుతున్నాయి. గుప్త నిధుల వేటలో రాతి కట్టడాలు ధ్వంసమవుతున్నాయి. చరిత్ర కాలగర్భంలో సమాధి అవుతోంది. తెలంగాణలో గుప్తనిధుల తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పురాతన దేవాలయాల్లోని విగ్రహాల కింద బంగారం, వజ్రాలు ఉన్నాయన్న ఆశతో కొందరు దుండగులు నేరాలకు పాల్పడుతున్నారు. జంతు బలులు చేయడానికీ వెనుకాడటం లేదు. దీంతో కాకతీయులు, రాష్ట్ర కూటులు, చాళుక్యుల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న అనేక ఆలయాలు, ఉప ఆలయాలు శిథిలమైపోయాయి. తెలంగాణ సాంస్కృతిక రాజధానిగా పేర్కొనే వరంగల్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఆలయాల ప్రస్తుత పరిస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం. – సాక్షి, హైదరాబాద్ శిథిలావస్థలో రామప్ప ఆలయాలు కాకతీయుల కళావైభవానికి, ఆధ్యాత్మిక చింతనకు నిదర్శనం రామప్ప ఆలయం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాకతీయుల కాలం నాటి ప్రముఖ ఆలయాల్లో రామప్ప ఒక్కటి. రామప్ప ఆలయంతోపాటు దాని చుట్టు పక్కల కిలోమీటర్ దూరంలో 20 ఉప ఆలయాలను కాకతీయుల కాలంలో నిర్మించారు. ఇప్పుడు ఈ ఆలయాలు ఆదరణ కరువై శిథిలమవుతున్నాయి. ఘనకీర్తి గల చారిత్రక ఆలయంలోని స్తంభాలు కూలిపోతున్నాయి. కొన్ని కట్టడాలపై మొలచిన పిచ్చి మొక్కల మధ్య శిల్పాలన్నీ వెలవెలబోతున్నాయి. అప్రమత్తమవ్వాలి దేవాలయాలను పరిరక్షించుకోవడంలో ప్రజల పాత్ర ముఖ్యమైంది. గ్రామాల్లోని యువత ఆలయాల్లో తవ్వకాలు వంటి చర్యలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలి. కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా పోలీసులకు తెలియజేయాలి. అప్రమత్తంగా ఉండాలి. ఒక కమిటీగా ఏర్పడి దేవాలయాలను సంరక్షించుకోవాలి. పండుగలు, జాతరలు వచ్చినప్పుడు మాత్రమే దేవాలయాల వైపు చూడటం కాదు.. నిత్యం వాటిపై పరిశీలన ఉండాలి. పురాతన సంపద పరిరక్షణ కోసమైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, కన్వీనర్ కూలిన 36 మీటర్ల ప్రాకారం కేంద్ర పురావస్తు శాఖ అధీనంలోని రామప్ప ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయింది. కట్టడాలు కూలిపోతున్నా పురావస్తు శాఖలో చలనం కనిపించడంలేదు. దీంతో గత రెండేళ్లుగా రామప్ప ఆలయం శిథిలమవుతోందని పలువురు చరిత్రకారులు వాపోతున్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు తూర్పు ద్వారాన్ని ఆనుకుని ఉన్న ప్రాకారం 36 మీటర్ల వరకు కుప్పకూలింది. ఇటీవల సిబార (సున్నము, ఇసుక, బెల్లం, కరక్కాయల మిశ్రమం) పద్ధతిలో ప్రహరీ గోడ మరమ్మతులు చేపట్టారు. మరోవైపు చుట్టుపక్కల ఉన్న 16 ఉప ఆలయాలు కూడా పూర్తిగా శిథిలమైపోయాయి. వీటిలో కామేశ్వరాలయాన్ని పునర్నిర్మాణం కోసం కూలగొట్టి.. శిలలను కుప్పలుగా పోశారు. యాకూబ్‌సాబ్ స్థలంలో ఉన్న శివాలయం పూర్తిగా కూలిపోయింది. గుప్తనిధుల కోసం గర్భగుడిని గునపాలతో తవ్వేశారు. చాలా చోట్ల గుప్తనిధుల కోసం పురాతన ఆలయాల్లో రాత్రిళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. గ్రామాల్లో నివాసం ఉండేవారే ఇలాంటి వారికి సహకరిస్తున్నారని పలు కేసుల్లో జరిగిన విచారణలో తేలింది. శిల్ప సౌందర్యానికి ప్రతీకలు కాకతీయుల కాలంలో రామప్ప ఆలయంతోపాటు దాన్ని ఆనుకుని కాటేశ్వర, కామేశ్వర, నరసింహస్వామి, నంది మంటపం నిర్మించారు. రామప్ప చుట్టూ ఉన్న కోటగోడ లోపల గొల్లగుడి, యాకూబ్‌సాబ్ గుడి, త్రికూ ట ఆలయంతోపాటు అడవిలో మరో రెండు శివాలయాలు ఉన్నాయి. రామప్ప సరస్సు కట్టపై కల్యాణ మంటపం, కాటేజీల పక్కన త్రికూటాలయం, మరో రెండు చిన్న ఆలయాలు కనిపిస్తాయి. రామప్ప ఆలయం ఉన్న పాలంపేటలో మరో రెండు శివాలయాలు శిథిలమవుతున్నాయి. లక్ష్మీ దేవిపేట, పెద్దాపురం, రామాంజాపురం, నర్సాపురం గ్రామాల్లోని ఆలయాలు శిల్ప సౌందర్యానికి, కాకతీయుల కళా వైభవానికి అద్దం పడుతాయి. ప్రస్తుతం ఆ శిల్పాలు ఎండకు ఎండుతూ వానకు తడు స్తూ సహజత్వాన్ని కోల్పోతున్నాయి. గణపురంలోని కోటగుళ్లు, కటాక్షపూర్‌లోని ఆలయాలు శిథిలమవుతున్నాయి. -
భద్రకాళి చెరువులో గణపతి
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో అరుదైన శిల్పాలు లభ్యమయ్యాయి. ప్రసిద్ధి చెందిన భద్రకాళి చెరువులో సుమారు 1,300 ఏళ్ల నాటి గణపతి, శివలింగంతోపాటు మరికొన్ని శిల్పాలు బయల్పడ్డాయి. కాకతీయుల కాలం కంటే పూర్వం నాటి గణపతి, శివలింగం విగ్రహాలు బయటపడ్డాయి. వరంగల్ నగర మంచినీటి చెరువుగా భద్రకాళిని ఉపయోగిస్తున్నారు. లోయర్ మానేర్ డ్యామ్ నుంచి నీటిని ఇక్కడకు పంపింగ్ చేస్తారు. దీంతో ఏడాది పొడవునా భద్రకాళి చెరువులో నీరు ఉంటుంది. రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత హృదయ్ పథకంలో భాగంగా భద్రకాళి చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా ఫోర్‌షోర్ బండ్లో రోడ్డు నిర్మించడంతో పాటు చెరువులో పూడిక తీస్తున్నారు. ఈ నేప థ్యంలో ఏడాది కాలంగా చెరువును పూర్తిగా నింపడం లేదు. దీంతో చెరువు మధ్యలో ఉన్న బండరాళ్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా భద్రకాళి చెరువు సరిహద్దుగా ఉండే సిద్ధులగుట్ట వద్ద పరిశోధనలు చేస్తుండగా ఏడో శతాబ్దానికి చెందిన విగ్రహాలు వెలుగు చూశాయి. చరిత్ర క్రమంలో.. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ హరగోపాల్ ఆధ్వర్యంలో చరిత్ర పరిశోధకులు ఐదు రోజుల క్రితం సిద్ధులగుట్ట దిగువన ఉన్న భద్రకాళి చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ రెండు పెద్ద బండరాళ్లు కనిపించాయి. వీటిలో పైన ఉన్న బండరాయిపై వికసిత పద్మంలో కూర్చున్న వినాయకుడి విగ్రహం ఉంది. ఈ వినాయక విగ్రహం ఐదు అడుగుల ఎత్తుతో ఉంది. ఈ విగ్రహం కింది మరో బండరాయి ఉంది. దీనిపై శివలింగం, నంది, వినాయకుడు, సూర్యుడు, మహిషాసురమర్ధిని, విష్ణు శిల్పాలు ఉన్నాయి. ఈ రెండు బండరాళ్లపై ఉన్న శిల్పాలు సాధారణ హైందవ సంస్కృతికి కొంత భిన్నంగా ఉన్నాయి. లింగం ఆకారంలో ఉన్న శిల్పం కింద పానవట్టం స్తూప వేదిక తరహాలో ఉంది. స్తూప వేదికలను అనుసరించే పద్ధతి బౌద్ధంలో ఉంది. సాధారణంగా వినాయక విగ్రహాలు పరిశీలిస్తే ఒక చేతిలో ఉండ్రాళ్లు, మరో చేతితో దీవిస్తున్నట్లుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న వినాయక శిల్పాల్లో రెండు చేతులు నాభికి దగ్గరగా ఉన్నాయి. ఇటువంటి విగ్రహాలు జఫర్‌గఢ్ గుట్ట, ఆలేరు సమీపంలోని రఘునాథపురం దేవాలయంలో ఉన్నాయి. వినాయక విగ్రహం వికసించిన పద్మంపై చెక్కిన విధానం జైన మత ఆనవాళ్లను చూపుతోంది. బహుశా ఈ రెండు శిల్పాలు ఇతర మతాలకు చెందినవై ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని చరిత్రకారులు వ్యక్తం చేస్తున్నారు. ఏడో శతాబ్దంలో బౌద్ధ, జైన, హైందవ మతాల మధ్య తీవ్ర పోటీ ఉండేది. ఆధిపత్యం చెలాయించిన మతం ఇతర మతాల శిల్పాలను క్రమంగా తమ మతానికి అనుగుణంగా మార్పులు చేసే వారు. ఆ క్రమంలో మార్పు చెందిన విగ్రహాలే ప్రస్తుతం భద్రకాళి చెరువులో వెలుగు చూశాయని చరిత్రకారులు భావిస్తున్నారు. దీన్ని బలపరిచేలా కాకతీయులకు పూర్వం హన్మ కొండ నగరం కేంద్రంగా జైన, బౌద్ధ మతాలు వర్ధిల్లాయి. దీన్ని బలపరిచేలా బౌద్ధ, జైన సాహిత్యం, శాసనాల్లో అర్హతులకొండ, అర్మకుండం, అమ్ము కుండె పేర్లు హన్మకొండకు ఉన్నాయి. ఆ తర్వాత కాలంలో కాకతీయులు ఇక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించి శైవ మతాన్ని అవలంబించారు. ఈ క్రమంలో బౌద్ధ, జైన మతాలు కనుమరుగై శైవం పుంజుకుంది. సుమారు వెయ్యేళ్లకు పైగా జలగర్భంలో ఉండిపోయిన ఈ శిల్పాలపై పురావస్తుశాఖ పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. -
ఏరు మింగిన ఊరు
సాక్షి, హైదరాబాద్: మంచి నాగరికత వర్ధిల్లిందనడానికి చిహ్నంగా నాణ్యమైన వస్తువుల జాడ ఉందక్కడ. బాగా కాల్చి రూపొందించిన ఇటుకలు, నగిషీలద్ది తయారుచేసిన కుండలు, ఇంటి అవసరాలకు కావాల్సిన పనిముట్లు, అలంకరణకు వాడే రంగురంగుల పూసలే దీనికి నిదర్శనం. అవన్నీ ఒకటి రెండు శతాబ్దాల కాలానివిగా తెలుస్తోంది. కానీ ఇప్పుడక్కడ ఆవాసం జాడలేదు. మంచి పనిమంతుడి చేతిలో ఉలి విన్యాసం చేయటంతో రూపొందిన అద్భుత శిల్పకళాతోరణం, దానిపై ఉన్న ద్వారపాలకుల శిల్పాలు సౌందర్యంగా కనువిందు చేస్తున్నాయంటే వాటిని రూపొందించిన వారి చాతు ర్యం ఎంత గొప్పదో అవగతమవుతోంది. ఆ పనితనం కాకతీయుల కాలంది. కానీ ఆ దేవాలయంలో దేవతామూర్తులు లేరు. వెరసి శాతవాహనుల కాలం నుంచి కాకతీయుల వరకు ఆ ఊరు విలసిల్లిందని ఆధారాలతో స్పష్టంగా తెలుస్తోంది. మరి ఆ తర్వాత ఊరు ఏమైంది. ఉన్నట్టుండి కాలగర్భంలో ఎందుకు కలిసిపోయింది. జీవనాధారంగా చేసుకున్న యేరే ఆ ఊరిని మింగేసిందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. పర్యావరణంలో వచ్చిన మార్పులు, వాటి పరిణామాలపై మన దేశంలో పరిశోధనలు దాదాపు శూన్యం. భావి తరాలు మరోసారి ప్రకృతి బీభత్సాల బారిన పడకుండా గతానుభవాల నిగ్గు తేల్చేందుకు ఇప్పుడు చాలాదేశాల్లో పరిశోధనలు సాగుతున్నాయి. కానీ మనవద్ద ఇప్పటివరకు వాటి ఊసు లేదు. వానాకాలంలో మాత్రమే కాస్త నీటి జాడలుండే ఓ యేరు ఒకప్పుడు ఉగ్రరూపాన్ని చూపిందని, దాని తాకిడికి ఊళ్లకు ఊళ్లు అంతరించాయని సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట సమీపంలో ఔత్సాహిక చారిత్రక పరిశోధకులు ప్రాథమిక ఆధారాలు గుర్తించారు. వందల ఏళ్లు మనుగడ సాగించిన ఊరు అంతరించటానికి మెరుపు వరదలే కారణమన్న సంగతి అక్కడి పరిస్థితులు చెబుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని బిక్క వాగు ఒడ్డున ఉన్న గాలిపల్లి–నరసక్కపేట మధ్య అంతరించిన ఊరును కొత్త తెలంగాణ చరిత్ర బృం దం తాజాగా గుర్తించింది. బృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, కరుణాకర్, చంటిలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ అంతరించిపోయిన ఊరు జాడలు గుర్తించారు. వారు చెబుతున్న వివరాల ప్రకారం.. ఇక్కడున్న వాగును బిక్క వాగుగా పిలుస్తారు. ఒకటీ, రెండు శతాబ్దాల్లో జైనం, బౌద్ధం వర్ధిల్లింది. అప్పట్లో భిక్షువులు నీటి జాడ ఆధారంగా ఆ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుని ఉంటారు. భిక్షువుల ప్రాంతం కావటంతో అది భిక్షువుల వాగు, కాలక్రమంలో బిక్క వాగుగా మారింది. ఆలేరు సమీపంలోని బిక్కేరు కూడా ఇదేక్రమంలో పేరు సుస్థిరం చేసుకుంది. అక్కడ బౌద్ధారామాలు, స్థూపాలు వెలుగుచూశాయి. ఇదే క్రమంలో బిక్కవాగు వద్ద కూడా బౌద్ధం వర్ధిల్లి ఉంటుంది. తర్వాత కాకతీయుల కాలంలో హైందవం విలసిల్లింది. ఆ సమయంలో నిర్మితమైనట్టు భావిస్తున్న ఆలయం ఉంది. అది చిన్నగా ఉన్నా, ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన తోరణం అత్యద్భుతంగా ఉంది. చుట్టూ గోడలు శిథిలమయ్యాయి. ఆలయంలో ఎటువంటి విగ్రహాలు కనబడటం లేదు. తోరణ ద్వారానికి రెండు వైపులా ద్వారపాలకుల విగ్రహాలు, వాటికి ఇద్దరేసి చామరగ్రాహిణులు, పరిచారికల శిల్పాలున్నాయి. పైభాగంలో లలాటబింబంగా గజలక్ష్మిమూర్తి ఉంది. అది చెన్నకేశవుడి ఆలయంగా సమీపంలోని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఆలయానికి ముందువైపు ఉన్న పొలాల్లో ఊరి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎరుపు, నలుపు రంగుల్లో ఉన్న కాల్చి రూపొందించిన పెద్దపెద్ద ఇటుకలు, మట్టి కుండల ముక్కలు, పనిముట్లు, ఆయుధాల అవశేషాలు కనిపిస్తున్నాయి. వాగులో నీటి వనరు పుష్కలంగా ఉండటంతో అక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేసుకుని జీవనం సాగించారు. ఉన్నట్టుండి దానికి మెరుపు వరదలు రావటంతో ఊరు ధ్వంసమై ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం గాలిపల్లి గ్రామానికి ఇది చేరువగా ఉంది. పాత ఊరు ధ్వంసం కావటంతో ప్రస్తుత గ్రామం కాలక్రమంలో ఏర్పడింది. ఇక్కడ చారిత్రక అన్వేషణ జరిపితే వందల ఏళ్లనాటి విషయాలు, బౌద్ధ నిర్మాణాల జాడ కూడా తెలిసే అవకాశం ఉంది. -
ఫణిగిరి శిల్పాలు.. పట్టించుకోరేమి?
‘‘ప్రపంచాన్నే మెప్పించే అద్భుత శిల్పాలను మనం గౌరవించుకోలేకపోతున్నప్పుడు లండన్ మ్యూజియంలో విరాజిల్లుతున్న అమరావతి శిల్పాలను వెనక్కు ఇవ్వమని ఎలా అడగగలం?’’ ..ఓ పరిశోధకుడు సంధించిన ప్రశ్న ఇది! దీనికి ప్రభుత్వం, అధికారుల వద్ద సమాధానం ఉందా? ఫణిగిరిలో ఓ చీకటి గదిలో దుమ్ముకొట్టుకుపోతున్న ఫణిగిరి బౌద్ధారామం శిల్పరాజాలను చూస్తే లేదనే సమాధానం వస్తుంది. – సాక్షి, హైదరాబాద్ ఇది బుద్ధుడి జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టాలను సూక్ష్మంగా విశదీకరించిన అద్భుత శిల్పం. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రదర్శనలో భాగంగా ముంబయిలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. త్వరలో ఇది లండన్ మ్యూజియంలోనూ ఠీవీగా నిలవబోతోంది. ఈ శిల్పం సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో జరిగిన తవ్వకాల్లో వెలుగుచూసింది. అప్పట్లో దీంతోపాటు ఇంతకంటే ఘనమైన మరెన్నో శిల్పరాజాలు బయల్పడ్డాయి. కానీ ప్రసుతం అవన్నీ ఫణిగిరిలో ఓ చీకటి గదిలో దుమ్ము కొట్టుకుపోతున్నాయి. ఇదే విష యమై శుక్రవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ప్రారంభమైన రెండ్రోజుల అంతర్జాతీయ పురావస్తు సదస్సులో నమన్ పి.అహూజా అనే పరిశోధకుడు ఆలోచింపచేసే చర్చకు తెరతీశారు. ‘కిరీటంలో కలికితురాయి–ఫణిగిరి’పేరుతో పరిశోధన పత్రాన్ని సమర్పించిన ఆయన.. ఫణిగిరి శిల్పాల గొప్పదనాన్ని వివరించారు. బుద్ధుడిగా మారిన యువరాజు.. తలపై ఉన్న పగిడీ తొలగించి, కరవాలంతో స్వయంగా జుత్తు కోసేసి జ్ఞానబోధకు బయ ల్దేరిన తీరును కళ్లకు గట్టిన ఆ శిల్పాలు గొప్ప మ్యూజియంలో ఉండాలని ఆకాంక్షించారు. అంతెత్తు గుట్టపై బౌద్ధ స్తూపం ఉన్న తీరు స్థానికంగా మరెక్కడా కనిపించదన్నారు. ఒకదాన్ని మించింది మరొకటిగా ఉన్న శిల్పాలు ప్రదర్శనకు నోచుకోనప్పుడు లండన్ మ్యూజియంలో అమరావతి బౌద్ధ శిల్పాలు చిక్కుకుపోయాయని బాధపడటంలో అర్థమే లేదన్నారు. ఈ సదస్సులో డాక్టర్ పరుల్ పాండ్యధర్, డాక్టర్ కావూరి శ్రీనివాస్, ప్రొఫె సర్ ఆర్.లక్ష్మీరెడ్డి, ఎస్.ఉదయ్‌భాను తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా కాకతీయ హెరిటేజ్ ట్రస్టు పునర్ముద్రణ ‘కాకతీయ డైనాస్టీ’ పుస్తకం సహా రెంటినీ ఆవిష్కరించారు. నర్మెట్ట, పాల్మాకుల తవ్వకాల్లో బయల్పడిన వస్తువులు, నాణేలు, శాసనాల ప్రతుల ప్రదర్శన ఆకట్టుకుంది. న్యూయార్క్ ప్రొఫెసర్ ఆసక్తి అమెరికాలోని న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ప్రొఫెసర్ జాన్ గై చూపిన ఆసక్తి సదస్సులో పలువురిని ఆకట్టుకుంది. బౌద్ధంపై పరిశోధనలో భాగంగా ఆయన సూర్యాపేట జిల్లా ఫణిగిరి గురించి తెలుసుకున్నారు. మూడేళ్ల క్రితం ఫణిగిరి వచ్చి అక్కడి బౌద్ధ స్తూపాన్ని పరిశీలించారు. అక్కడి తవ్వకాల్లో బయల్పడిన∙శిల్ప సంపద చూసి ఆశ్చర్యపోయారు. ఇతర బౌద్ధ దేశా ల్లోని శిల్పాలతో వీటిని పోలుస్తూ పరిశోధన జరిపారు. ఆ పరిశోధన పత్రాన్ని శుక్రవారం సమర్పించారు. ‘‘ఫణిగిరి అద్భుత బౌద్ధ కేంద్రం. మూడేళ్ల క్రితం దాన్ని చూసి తరించా. అక్కడి శిల్పాలను చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది’’ అని ఆయన ‘సాక్షి’తో అన్నారు. -
ఆ ఊరి దారుబొమ్మలకు అందమెక్కువ..
దేవుడే దిగివచ్చాడా..తనకు తానే ఒదిగిపోయి ఊపిరి పోసు కున్నాడా? అనిపిస్తుంది ఆ హస్తకళా చాతుర్యాన్ని తిలకిస్తే. ఆ దారుబొమ్మలు దేనికవే దివ్య కళాదృష్టితో అపు రూపంగా దర్శనమిస్తాయి. తెల్లజిల్లేడుతో వినాయక దారుశిల్పాల తయారీకి ఆ ఊరు ఖ్యాతి గాంచింది. గంగాధరనెల్లూరు మండలం కడపగుంట దళితవాడలో వంద కుటుంబాలు దారు శిల్పాల తయారీయే వృత్తిగా జీవిస్తున్నాయి. గ్రామానికి చెందిన షణ్ముగం పొట్ట చేతపట్టుకుని చెన్నైకి వలస వెళ్లి దారు వినాయక శిల్పాల తయారీని నేర్చుకుని వచ్చాడు. అదే ఇప్పుడు గ్రామానికి ఉపాధి కల్పిస్తోంది. ప్రభుత్వం రుణాలు మంజూరు చేస్తే మరింతగా రాణిస్తామని కళాకారులు చెబుతున్నారు. మైమరిపించే సుందర కళాకృతుల తయారీ వెనుక ఉన్న శ్రమైక జీవన సౌందర్యంపై ప్రత్యేక కథనం.. తమిళనాడు వ్యాపారస్తుల నుంచి తెల్ల జిల్లేడు బెరడులను కొనుగోలు చేస్తారు. ఒక్కొక్కటి 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కొనుగోలు చేస్తారు. ఒక బెరడుతో ఆరు నుంచి ఎనిమిది బొమ్మల వరకు తయారు చేస్తారు. సైజును బట్టి 30 రూపాయల నుంచి వంద రూపాయల వరకు విక్రయిస్తారు. రోజుకు ఒక కార్మికుడు 15 బొమ్మల వరకూ తయారు చేస్తాడు. రోజుకు 300 రూపాయల నుంచి 400 వరకు ఆదాయం ఉంటుంది. తయారు చేసిన బొమ్మల్ని తమిళనాడులోని తిరుచ్చి, చెన్నై, కాణిపాకం, తిరుమల, శ్రీశైలం తదితర పుణ్యక్షేత్రాల్లో వ్యాపారాలు చేసే వారికి విక్రయిస్తుంటారు. ఇటీవల డీఆర్డీఏ శాఖ వీరికి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. గిరాకీ ఉంది తెల్లజిల్లేడుతో తయారు చేసిన బొమ్మలకు మంచి గిరాకీ ఉంది. రోజుకు 300 రూపాయల నుంచి 400 వరకు ఆదాయం వస్తుంది. ఇంట్లోనే ఉండి పని చేస్తున్నా. ఇంట్లోని మహిళలు కూడా బొమ్మల తయారీకి సహకరిస్తుంటారు. –వినాయక్,కడపగుంట రుణం ఇవ్వాలి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలి. ఒక్కోసారి తెల్లజిల్లేడు దొరకదు. ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేయాల్సి వస్తుంది. బ్యాంకు రుణం అందిస్తే అర్థికాభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. రోజుకు 300 రూపాయల ఆదాయం వస్తుంది.-ఉష, కడపగుంట సంతృప్తిగా ఉంది తెల్లజిల్లేడుతో బొమ్మలు తయారు చేసే పనిని నేను మొదట తమిళనాడులో నేర్చుకున్నాను. గ్రామంలో అందరూ నా వద్ద పని నేర్చుకున్నారు. సంతృప్తిగా ఉంది. మహిళలు సైతం బొమ్మలు తయారు చేస్తారు. ఇంట్లోనే ఉండి పని చేసుకోవచ్చు. –షణ్ముగం, కడపగంట -
ఇది మన అంగ్‌కోర్‌వాట్!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఒక శిల్పాన్ని ఒకే రాయిపై చెక్కుతారు. కానీ ఒకే శిల్పాన్ని చిన్న రాళ్లపై భాగాలుగా చెక్కి.. ఇటుకల మాదిరిగా పేర్చి పూర్తి రూపం ఇవ్వటం మాత్రం అరుదే. కాంబోడియా దేశంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత అంగ్‌కోర్‌వాట్ ఆలయంలో శిల్పాలను ఇలాగే రూపుదిద్దారు. ఇండోనేసియా సెంట్రల్ జావాలోని బోరోబుదూర్ దేవాలయం కూడా ఈ తరహా నిర్మాణ కౌశలానికి ప్రతీక. మరి అలాంటి ప్రత్యేకత ఉన్న పురాతన నిర్మాణం మన తెలంగాణలోనూ ఉంది. ఆరు అడుగుల ఎత్తు.. దాదాపు 20 దాకా ఇసుకరాతి ఇటుకలు.. ఒక్కో ఇటుకపై ఒక్కో భాగం.. అన్నీ కలిస్తే.. అజంతా చిత్రాల్లోని పద్మఫాణిని పోలిన బోధిసత్వుడు రాచకొలువులో లలితాసనంలో కూర్చున్న దృశ్యం ఆవిష్కృతం.. బుద్ధుడి జీవిత గాథలతో కూడిన ఇలాంటి ఎన్నో చిత్రాలను ఆ రాళ్లు కళ్లకు కడతాయి. చూడగానే అంగ్‌కోర్‌వాట్ ఆలయ గోడలను మరిపించే ఈ మందిరం.. అంగ్‌కోర్‌వాట్ ఆలయం కంటే దాదాపు ఐదొందల ఏళ్లకు ముందుది. ఆ మహా నిర్మాణంతో పోలిస్తే రూపులో చాలా చిన్నదే అయినా, నిర్మాణ కౌశలం పరంగా దానికి అమ్మలాంటిదే. ఇంతకూ ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలోని కొత్తూరు గ్రామ శివారులో దేవునిగుట్టపై ఠీవిగా నిలిచి ఉంది. ఇలాంటి అద్భుత దేవాలయం ఒకటి ఇక్కడ ఉందనే సంగతి స్థానికులకు మినహా ఐదారు నెలల క్రితం వరకూ బాహ్య ప్రపంచానికి తెలియదు. పురావస్తుశాఖ కూడా దాన్ని ఇంతవరకు గుర్తించలేదు. వజ్రయాన ప్రభావమే..? బౌద్ధానికి చివరిదశ వజ్రయానం. తాంత్రిక బౌద్ధమని, మంత్రయానమనీ పిలిచే ఈ విధానం తెలంగాణలోని నాగార్జున కొండ నుంచి మొదలై ఇతర దేశాలకు విస్తరించిందంటారు. కాంబోడియా సహా ఇతర ప్రాంతాలకు తెలంగాణ నుంచే వ్యాపించినందున, ఆదిలో ఇక్కడ ఆ తరహా ఆలయం నిర్మితమై ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేవునిగుట్టపై నుంచే రాతిని తొలిచి దాన్ని ఇటుకలుగా మార్చి ఆలయాన్ని నిర్మించారు. ఇసుకరాయి అంత పటుత్వంగా ఉండదు. కొనలు సులభంగా రాలిపోతాయి. అందుకనే వాటిని చిన్న ఇటుకలుగా మార్చి, అనుకున్న శిల్పాకృతిని భాగాలుగా వాటిపై ముందు చెక్కి ఆ తర్వాత వరసగా పేర్చారు. అందులోని విగ్రహాలు మాత్రం మాయం కావటంతో ఇటీవల స్థానికులు దాన్ని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంగా మార్చుకుని కాముని పున్నమి సమయంలో జాతర నిర్వహిస్తున్నారు. శతాబ్దాల క్రమంలో మార్పులు.. నలువైపులా అర్ధపద్మాలు, సింహాల బొమ్మలు చెక్కిన పాలరాతి బౌద్ధ ఆయకస్తంభం ఉండటాన్ని బట్టి ఒకటి లేదా రెండో శతాబ్దంలో ఇది బౌద్ధ స్థావరంగా ఉండేదని వారు పేర్కొంటున్నారు. వందల ఏళ్ల పరిణామక్రమంలో ఇది బౌద్ధ చైత్యాలయంగా మారి ఉంటుందని భావిస్తున్నారు. గర్భాలయం, దాని ముందు ప్రహరీ మాత్రమే ఉంది. ప్రవేశద్వారం ఎత్తు తక్కువగా ఉంది. లోనికి వెళ్తే.. గోడల్లోని రాతి ఇటుకలపై బుద్ధుడి జీవిత చరిత్రను ప్రతిబింబించే చిత్రాలెన్నో ఉన్నాయి. బౌద్ధంలోని వజ్రయానంలో బుద్ధుడిని పరమశివుడి రూపంలోనూ పూజించే పద్ధతి ఉన్నందున, ఈ ఆలయ గోడలపై అర్ధనారేశ్వర శిల్పం కూడా కనిపిస్తుండటం విశేషం. భయంకరంగా ఉన్న పెద్ద తల కలిగిన బోధిసత్వుడు(జాంభాలుడి రూపం అయి ఉంటుంది) ఎడమకాలితో మరో వ్యక్తిని వంచి ఎడమ చేతితో ఆతని మెడను వెనక్కి విరిచి పట్టుకున్న మరో దృశ్యం ఉంది. అంగ్కోర్వాట్లో పెద్ద రూపంలో ఉన్న అమితాభుని శిరస్సు రూపం ఇక్కడ చిన్న రాతిపై కనిపిస్తోంది. అన్నీ ఇసుక రాతి ఇటుకలే.. కాకతీయులు.. కళ్యాణ చాళుక్యుల కాలం.. వారి వారి నిర్మాణశైలిలో తెలంగాణలో ఎన్నో అద్భుత ఆలయాలు రూపుదిద్దుకున్నాయి. కానీ.. ఈ ఆలయం మాత్రం వాటన్నింటికీ భిన్నం. ఇప్పటి వరకూ మనం చూడని శైలి. అడుగు నుంచి నాలుగు అడుగుల మేర ఉన్న ఇసుక రాతి ఇటుకలను పేర్చి దీన్ని నిర్మించారు. రాళ్లను డంగు సున్నం మిశ్రమంతో జోడించారు. ప్రస్తుతం ఆ మందిరం ఎత్తు 24 అడుగుల వరకు ఉంది. దానిపైన శిఖరం కూడా గతంలో ఉండేదనటానికి నిదర్శనాలున్నాయి. పునాదులు లేకుండా తొమ్మిది అడుగుల మందంతో రాతి ఇటుకలతో నిర్మించారు. మధ్యలో ఖాళీ ఉండి రెండు పొరలతో నిర్మితమై ఆ గోడ వెలుపల, లోపల రాళ్లపై శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఇటీవల ఆలయం విషయం తెలిసి ‘సాక్షి’ దాన్ని వెలుగులోకి తెచ్చే క్రమంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం దృష్టికి తీసుకెళ్లింది. అప్పటికే ఆ బృందం కూడా దీని సమాచారం తెలిసి అన్వేషణలో ఉంది. తాజాగా ఔత్సాహిక పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ నేతృత్వంలో వేముగంటి మురళి, కట్టా శ్రీనివాస్, అరవింద్, సదానందం, సమీర్, కరుణాకర్, మహేశ్, చంటి, కొత్తూరు గ్రామ సర్పంచ్ రవీందర్రావు తదితరులు దీన్ని పరిశీలించి విశ్లేషించారు. కదిలిపోతున్న రాళ్లు.. కనీస నిర్వహణ లేకపోవటంతో ఈ అతిపురాతన ఆలయం చెదిరిపోతోంది. రాళ్లు కదిలిపోతూ శిల్పాల రూపం దెబ్బతింటోంది. లోపలివైపు నుంచి చూస్తే ఆలయ శిఖరం మొనదేలిన పిరమిడ్ తరహాలో కనిపిస్తోంది. కానీ పై మొన భాగం లేదు. అక్కడ పెద్ద రంధ్రం ఏర్పడి వాననీరు లోనికి వస్తోంది. అంటే శిక్షర భాగం దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది. అతి అరుదైననిర్మాణ శైలితో రూపొందిన ఈ పురాతన మందిరాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇది శిథిలమైతే ఇక ఈ తరహా నిర్మాణం అంతరించినట్టే. గుట్టపైకి రహదారి ఏర్పాటు చేసి ఆలయాన్ని పునరుద్ధరిస్తే పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. -
వెలుగు చూసిన దేవాలయం
భూమిని తవ్వితే నీళ్లు లేదా ఖనిజాలు వస్తాయని తెలుసు. కానీ ఇక్కడ అద్భుత ఆలయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయం ఎన్నో వందల ఏళ్లకు చెందినదిగా భావిస్తున్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు శివారులో రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అందులో భాగంగా ఎల్లమ్మ ఆలయం వెనుక భాగంలో నాలుగు మీటర్ల లోతు తవ్వడంతో ఆలయానికి సంబంధించిన శిల్పాలు, బండరాళ్లు, స్తంభాలకు వినియోగించే చెక్కడపు రాళ్లు, శిల్పాలు వంటివి బయటపడ్డాయి. జాగ్రత్తగా తవ్వితే మరిన్ని ఆధారాలు, శిల్పాలు వెలుగు చూసే అవకాశం ఉంది. - చిన్నకోడూరు -
హిల్ ఆఫ్ క్రాసెస్!
లిథువేనియాలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన సాయవుయైలో ఉంది ‘హిల్ ఆఫ్ క్రాసెస్’. ‘సాయవు’ అంటే లిథువేనియా భాషలో ‘సూర్యుడు’ అని అర్థం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ నగరంలో సైకిల్ మ్యూజియం, చాక్లెట్ మ్యూజియం, రేడియో అండ్ టెలివిజన్ మ్యూజియం, క్యాట్ మ్యూజియం, నేషనల్ డాల్స్ మ్యూజియం, రైల్వే మ్యూజియం వంటి ఆకర్షణలు చాలా ఉన్నాయి. అలాగే ఎక్కడ చూసినా అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. వీటన్నిటికీ తోడు ‘హిల్ ఆఫ్ క్రాసెస్’ కూడా ఉండటంతో... ప్రముఖ పర్యాటక నగరంగా వెలుగొందుతోంది. ఆ కొండకు దగ్గరవుతున్న కొద్దీ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక తీరాలకు చేరువవుతున్నట్లుగా ఉంటుంది. అభయ హస్తమేదో మనకోసం చేయి చాస్తున్నట్లు ఉంటుంది. ఇక కళాప్రేమికులకైతే అక్కడి దృశ్యాలు సర్రియలిస్ట్క్ చిత్రాల్లా కనిపిస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు గల ఆ ప్రదేశం... లిథువేనియాలో ఉంది. అదే ‘ద హిల్ ఆఫ్ క్రాసెస్’. ఈ పవిత్రకొండపై ఒక శిలువను నాటి, మనసులోని కోరికను రాసిన చీటీని ఆ శిలువకు తగిలించి, ఓ క్షణం పాటు ప్రార్థిస్తే ఆ కోరిక నెరవేరుతుందట. ‘నాన్నను మద్యపానం నుంచి దూరం చెయ్యి ప్రభూ’/‘చాలా కష్టపడి పరీక్షలకు ప్రిపేరవుతున్నాను. నీ ఆశీస్సులు కావాలి తండ్రీ’/‘అమ్మ చనిపోయిన దుఃఖం నుంచి తేరుకోకుండా ఉన్నాను... నా మనసుకు శాంతి కలిగించు దేవా.’ ‘హిల్ ఆఫ్ క్రాసెస్’పై ఉన్న లక్షలాది శిలువలకు వేళ్లాడే కాగితాలు, కాగితాలుగా మాత్రమే కనిపించవు. ఎన్నో హృదయాల స్పందనలా అనిపిస్తాయి. నిజానికి ఈ కొండ అసలు పేరేమిటి, దీని మీదికి ఇన్ని శిలువలు ఎందుకు వచ్చాయి, వాటిని పాతడం ఎప్పుడు మొదలైంది, ఎవరితో మొదలైంది అన్న విషయాలు ఎవరికీ స్పష్టంగా తెలియవు. కాకపోతే కొన్ని కథనాలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. 1831లో రష్యన్లకు వ్యతిరేకంగా పోలిష్, లిథువేనియా సైన్యాలు పోరా డాయి. యుద్ధంలో చాలామంది లిథు వేనియా సైనికులు మరణించారు. అయితే వారిలో చాలామంది మృతదేహాలు మాయమయ్యాయి. తమవాళ్లను చివరి సారిగానైనా చూసుకోలేకపోవడం ఆత్మీయులను కలచివేసింది. దాంతో మృతుల ఆత్మలకు శాంతి కలిగేందుకు ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. ఈ కొండమీదికి వెళ్లి తమవారికి గుర్తుగా శిలువలను పాతారు. వారి ఆత్మకు శాంతి కలగాలంటూ చీటీల మీద రాసి, శిలువలకు అతికించి, ప్రార్థించి వచ్చారు. అప్పటి నుంచి చనిపోయిన తమవారి ఆత్మకు శాంతి చేకూరేలా శిలువ నాటడం ఆచారంగా మారిందనేది ఒక కథనం. మరో కథనం ప్రకారం... ఒకానొక కాలంలో లిథువేనియాలో ఒక రైతు కూతురు జబ్బు పడి మృత్యువుకు చేరువయిందట. ఎందరు వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. ఒక రాత్రి అతడి కలలో తెలుపు దుస్తులు ధరించిన ఒక స్త్రీ ప్రత్యక్షమై... చెక్కతో తయారుచేసిన పెద్ద శిలువను దేశమంతా ఊరేగించి కొండపై నిలిపితే అమ్మాయి కోలుకుంటుందని చెప్పింది. రైతు అలానే చేశాడు. తర్వాత కొద్ది రోజులకే అమ్మాయి కోలుకుందట. ఇక అప్పటి నుంచి ప్రజలు తమకు సమస్య ఎదురైనప్పుడు, తమ మనసులోని మాటను దైవంతో చెప్పుకో వాలనుకున్నప్పుడు కొండపై శిలువను నాటడం ఆచారంగా మారిపోయిందట. మొదలైంది ఎప్పుడైనా ఎలాగైనా కానీ... ప్రస్తుతం ‘హిల్ ఆఫ్ క్రాసెస్’ ఓ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది. 1993లో రెండవ పోప్ జాన్ పాల్ ఈ కొండను దర్శించి, ‘హిల్ ఆఫ్ క్రాసెస్’ గురించి గొప్పగా ప్రసంగించడంతో మరింత ప్రాచుర్యం పొందింది. ప్రపంచం నలుమూలల నుంచీ లక్షలాది మంది వచ్చి, తమ కష్టాలు తొలగాలని, కోరికలు తీరాలని శిలువలు పాతి ప్రార్థిస్తున్నారు. వీరందరి కోసం కొండ సమీపంలోని చిన్న చిన్న దుకాణాలలో శిలువలు అమ్ముతారు. చీటీలు రాయడానికి పెన్నులు, కాగితాలు కూడా అందుబాటులో ఉంచుతారు. నిజానికి ఇక్కడకు వచ్చేవారిలో కేవలం క్రైస్తవులే కాకుండా అన్ని మతాల వారూ ఉంటారు. భక్తి, నమ్మకం అనేవి ఒక్క మతానికి చెందినవి కావని, సర్వమతాలూ సమానమేనని ‘హిల్ ఆఫ్ క్రాసెస్’కి వచ్చేవారి ద్వారా మరోసారి నిరూపణ అయ్యింది! -
గ్లాస్ టైల్స్.. హల్చల్
సాక్షి, హైదరాబాద్: ‘శిలలపై శిల్పాలు చెక్కినారు’ అని ఆత్రేయ ఏ టైంలో అన్నాడో కానీ, వ్యాపారులు దానికి కాస్త టెక్నాలజీ జోడించి వింతలు సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు టైల్స్ అంటే ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తాయనే వరకే మనకు తెలుసు. కానీ, డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ మాత్రం అక్కడికే పరిమితం కావట్లేదు. అద్దంలా మారుతూ అద్భుతాలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ సప్లయర్ అయిన కాచిగూడలోని హోమ్ 360 డిగ్రీ యజమాని శ్రీనాథ్ రథి ‘సాక్షి రియల్టీ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. పూర్తిగా గ్లాస్‌తో తయారవడమే డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ ప్రత్యేకత. 6 ఎంఎం, 8 ఎంఎం మందంతో ఉండి ఆధునిక టెక్నాలజీ సహాయంతో ఫినిషింగ్ కావటం మరో ప్రత్యేకత. అంతేకాదు.. మనకు నచ్చిన ఫొటోలు, చిత్రాలను ఈ టైల్స్‌పైన ప్రింట్ చేసుకోవచ్చండోయ్. వీటిని ఎక్కువగా పబ్బులు, రెస్టారెంట్లు, కార్పొరేట్ ఆఫీసుల్లో డెకొరేటివ్ కోసం వాడతుంటారు. ఇంటి విషయానికొస్తే.. చిన్నపిల్లల గది, వంట గది, లివింగ్ రూముల్లో ఉపయోగిస్తారు. చిన్న పిల్లల గదుల్లో వాడే ఈ టైల్స్‌పై స్పైడర్‌మ్యాన్, చోటా భీం, మిక్కీ మౌజ్ వంటి పిల్లలకు ఇష్టమైన బొమ్మలను ముద్రించుకోవచ్చు. అలాగే వంట గదుల్లో అయితే కూరగాయలు, పండ్ల వంటి మనకిష్టమైన ఫొటోలను ప్రింట్ చేసుకోవచ్చు. డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ ఢిల్లీ నుంచి దిగుమతి అవుతాయి. వీటిలో 300/600 ఎంఎం నుంచి 600/1,800 ఎంఎం వరకు రకరకాల సైజుల్లో, అన్ని రకాల రంగుల్లో లభ్యమవుతున్నాయి. ధర విషయానికొస్తే చ.అ.కు రూ.800-1,600 వరకు ఉంది. డీ క్రిస్టల్ గ్లాస్ టైల్స్ అన్ని రకాల వాతావరణ పరిస్థితులను, వేడిని తట్టుకుంటాయి. జీవీటీ, పీజీవీటీ వంటి టైల్స్ కూడా: సాధారణంగా చాలా మంది బేసిక్ విట్రిఫైడ్ టైల్స్‌ను వాడుతుంటారు. వీటి ధర రూ.40-50 మధ్య ఉంటుంది. అయితే వీటిని షాపింగ్ మాళ్లలో వాడలేం. ఎందుకంటే కొంతకాలానికి ఈ టైల్స్‌పై ఉండే లేయర్స్ తొలగిపోతాయి. పాదాల ముద్రలూ పడతాయి. అందుకే దీని స్థానంలో డబుల్ చార్జ్ టైల్స్‌ను వాడుతున్నారు. ఈ టైల్స్ పైన 2 ఎంఎం-3 ఎంఎం కోటింగ్ ఉంటుంది. దీంతో టైల్స్ అందంగా కనిపిస్తాయి. ప్రస్తుతం నగరంలో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ (జీవీటీ), పాలిష్డ్ విట్రిఫైడ్ టైల్స్ (పీజీవీటీ) హల్చల్ చేస్తున్నాయి. అన్ని రకాల రంగుల్లో లభ్యమయ్యే వీటిని వాణిజ్య సముదాయాలు, ఆఫీసులు, షాపింగ్ మాళ్లలో వినియోగించుకోవచ్చు. జీవీటీలో 600/600 ఎంఎం నుంచి మీటర్/ మీటర్ సైజు వరకున్నాయి. వీటి ధరలు ఆయా సైజులను బట్టి చ.అ.కు రూ.60- రూ.170 వరకున్నాయి. ఎక్కువ విస్తీర్ణం ఉండే బ్యాంక్వెట్ హాళ్లు, రెస్టారెంట్లలో వీటిని వాడతారు. బాత్రూమ్, బాల్కనీ వంటి తక్కువ విస్తీర్ణం ఉండే ప్రాంతాల్లో వాడేందుకు ప్రత్యేకమైన టైల్స్ కూడా ఉన్నాయి. వీటి ధర చ.అ.కు రూ.30-45 మధ్య ఉంది. విదేశీ టైల్స్ కూడా: స్పానిష్, ఇటాలియన్, చైనా దేశాల టైల్స్‌తో పాటు నిట్కో, సొమానీ, సింపోలో, మోటో వాల్ టైల్స్‌ను కూడా సరఫరా చేస్తున్నాం. మన దేశంలో ఉండే 600/600 ఎంఎం టైల్ బరువు సుమారుగా 7.5 కిలోలుంటే.. ఇటాలియన్ టైల్ అయితే దాదాపు 10 కిలోలుంటుంది. ఇవి బరువులోనే కాదు దృఢత్వంలోనూ పటిష్టమైనవి. గుజరాత్లో 300కు పైగా టైల్స్ తయారీ పరిశ్రమలున్నాయి. అదే మన దగ్గరైతే విజయవాడ, సామర్లకోట వంటి సుమారు 5 ప్రాంతాల్లోనే టైల్స్ తయారీ యూనిట్లున్నాయి. గతేడాది రూ.10.5 కోట్లను సాధించిన కంపెనీ వార్షిక టర్నోవర్ ఈ ఏడాది 15 కోట్లకు చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. -
చిత్తుతో చిత్తరువు
చిత్తుకాగితం అతడి చేయితగిలితే చిత్తరువుగా మారుతుంది.. జీవం ఉట్టిపడే శిల్పమవుతుంది. మహాత్ముడి ఆశ యానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. కాగితంతో కళాఖండాలు కొత్తేమీ కాకపోవచ్చు. కానీ, వాటికి ఓ అర్థాన్నిచ్చి.. స్ఫూర్తినిచ్చేలా తీర్చిదిద్దితే కచ్చితంగా అది వెలకట్టలేని ‘కళారూపం’ అవుతుంది...అచ్చంగా నరసింగరావు లక్ష్యం అవుతుంది. సమస్త వృత్తులు... చిహ్నాలు... గ్రామీణాభివృద్ధికే అని బలంగా నమ్మిన బాపూజీ ఆశయాలను ఎందరో అనుసరించారు. మరెందరో అక్షరబద్ధం చేశారు. కానీ, నరసింగరావు మాత్రం తనకు అబ్బిన కళతో మహ్మాతుడి ఆశయాలకు రూపమిచ్చారు. గచ్చిబౌలిలోని ఫాంస్కూల్‌కు వెళితే ఆయున కళ... అందులో ఓ ఆశయుం కళ్లవుుందు ఆవిష్కృతవువుతారుు. గ్రామీణం: ‘మహాత్ముడి సమతుల్య భారత్’ అంటూ అక్కడ ఓ చిన్న కుటీరం మనల్ని లోపలికి ఆహ్వానిస్తుంది. ఒక్కో శిల్పం గ్రామీణ వృత్తులను ప్రతిబింబించేలా.. మహాత్ముడి ఆశయానికి అద్దంపట్టేలా కనిపిస్తుంది. వల వేసే మత్స్యకారుడు, చెప్పులు కుట్టే మహిళ, మగ్గంపై నేతన్న... ఇలా పల్లెరూపం సాక్షాత్కరిస్తుంది. కళకు ఆకృతి: విశాఖపట్నం జిల్లా బూరుగుపాలెంకు చెందిన న రసింగరావు బాల్యం నుంచే గాంధీజీ జీవితానికి ప్రభావితమయ్యారు. అలా తన కళలో కూడా ఆయన బాపు ఆశయాలు ప్రతిబింబించేలా కాగితాలతో కళాఖండాలను వులుస్తున్నారు. చిత్తుపేపర్‌ను ఒక్కో పొరగా చుడుతూ అద్భుత కళాకృతిని సృష్టిస్తారు. పనికిరాని చెత్తకు పరమార్థాన్నిస్తాడు. ఆయున శిల్పాలు జపాన్, అమెరికా దేశాలకూ వెళ్లాయి. హెచ్‌సీయూలో స్కల్ప్చర్ ఆర్‌టలో ఎంఏ చేసిన ఆయన... ప్రస్తుతం ఓ స్కూల్లో ఆర్ట టీచర్‌గా పనిచేస్తున్నారు. సాక్షి, సిటీప్లస్