
వెలుగు చూసిన దేవాలయం
భూమిని తవ్వితే నీళ్లు లేదా ఖనిజాలు వస్తాయని తెలుసు. కానీ ఇక్కడ అద్భుత ఆలయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయం ఎన్నో వందల ఏళ్లకు చెందినదిగా భావిస్తున్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు శివారులో రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అందులో భాగంగా ఎల్లమ్మ ఆలయం వెనుక భాగంలో నాలుగు మీటర్ల లోతు తవ్వడంతో ఆలయానికి సంబంధించిన శిల్పాలు, బండరాళ్లు, స్తంభాలకు వినియోగించే చెక్కడపు రాళ్లు, శిల్పాలు వంటివి బయటపడ్డాయి. జాగ్రత్తగా తవ్వితే మరిన్ని ఆధారాలు, శిల్పాలు వెలుగు చూసే అవకాశం ఉంది. - చిన్నకోడూరు