అంతరిక్షంలో చెత్త.. ఉడుం పట్టుతో విరుగుడు! | scrap in space | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలో చెత్త.. ఉడుం పట్టుతో విరుగుడు!

Published Fri, Jun 30 2017 1:59 AM | Last Updated on Sat, Sep 15 2018 8:11 PM

అంతరిక్షంలో చెత్త..  ఉడుం పట్టుతో విరుగుడు! - Sakshi

అంతరిక్షంలో చెత్త.. ఉడుం పట్టుతో విరుగుడు!

మన ఇంటి చుట్టూ.. రోడ్లపైనే కాదు అంతరిక్షంలో కూడా చెత్త ఉంటుందని తెలుసా..? పాడైన ఉపగ్రహాలు మొదలుకొని.. ప్రయోగ సమయంలో విడిపోయిన నట్లు, బోల్ట్‌లు అంతరిక్షంలో పేరుకుపోయి ఉన్నాయి. ఈ చెత్త గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటుంది. ఇం దులో ఏ ఒక్కటైనా పనిచేస్తున్న ఉపగ్రహాలను ఢీకొట్టినా.. అవి భూమ్మీదకు జారిపడితే జరిగే నష్టం ఊహించలేం. ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఉడుం పట్టు స్ఫూర్తిగా ఓ యం త్రాన్ని రూపొందించారు.

ఇది ఓ రోబో. ఇందులో ఉడుము కాళ్లలో ఉండే పొలుసుల్లాంటి నిర్మాణా లు ఉంటాయి. ఉడుముల పాదాల్లోని పొలుసులు 200 నానోమీటర్ల పరిమాణంతో సూక్ష్మంగా ఉం టే.. ఈ రోబో గ్రిప్పర్‌ పొలుసుల సైజు 40 మైక్రోమీటర్ల వరకు ఉంటాయన్నమాట. ఏదైనా వస్తువును తాకినప్పుడు ఈ పొలుసులకు, ఆ వస్తువుకు మధ్య ఏర్పడే వాండర్‌వాల్స్‌ బలాల కారణంగా రెండు గట్టిగా అతుక్కుపోతాయి. ఆ తర్వాత ఆ వస్తువును అతితక్కువ శక్తితో కావాల్సిన చోటికి తీసుకెళ్లొచ్చు. స్టాన్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ రోబోను నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీలో విజయవంతంగా పరీక్షించారు.మన ఇంటి చుట్టూ.. రోడ్లపైనే కాదు అంతరిక్షంలో కూడా చెత్త ఉంటుందని తెలుసా..? పాడైన ఉపగ్రహాలు మొదలుకొని.. ప్రయోగ సమయంలో విడిపోయిన నట్లు, బోల్ట్‌లు అంతరిక్షంలో పేరుకుపోయి ఉన్నాయి. ఈ చెత్త గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటుంది. ఇం దులో ఏ ఒక్కటైనా పనిచేస్తున్న ఉపగ్రహాలను ఢీకొట్టినా.. అవి భూమ్మీదకు జారిపడితే జరిగే నష్టం ఊహించలేం. ఏళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అమెరికాలోని స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఉడుం పట్టు స్ఫూర్తిగా ఓ యం త్రాన్ని రూపొందించారు.

ఇది ఓ రోబో. ఇందులో ఉడుము కాళ్లలో ఉండే పొలుసుల్లాంటి నిర్మాణా లు ఉంటాయి. ఉడుముల పాదాల్లోని పొలుసులు 200 నానోమీటర్ల పరిమాణంతో సూక్ష్మంగా ఉం టే.. ఈ రోబో గ్రిప్పర్‌ పొలుసుల సైజు 40 మైక్రోమీటర్ల వరకు ఉంటాయన్నమాట. ఏదైనా వస్తువును తాకినప్పుడు ఈ పొలుసులకు, ఆ వస్తువుకు మధ్య ఏర్పడే వాండర్‌వాల్స్‌ బలాల కారణంగా రెండు గట్టిగా అతుక్కుపోతాయి. ఆ తర్వాత ఆ వస్తువును అతితక్కువ శక్తితో కావాల్సిన చోటికి తీసుకెళ్లొచ్చు. స్టాన్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ రోబోను నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీలో విజయవంతంగా పరీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement