రామోజీ ఫిలింసిటీలో పేలుడు.. | Blast in Ramoji Film City, Four Injured | Sakshi
Sakshi News home page

రామోజీ ఫిలింసిటీలో పేలుడు..

Published Sat, Aug 9 2014 8:45 AM | Last Updated on Sat, Sep 15 2018 8:11 PM

పేలుడులో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుండ్ల యాదయ్య - Sakshi

పేలుడులో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుండ్ల యాదయ్య

రామోజీ ఫిలింసిటీలోని స్క్రాప్ గోదాములో పాత సామాను తొలగిస్తుండగా పేలుడు సంభవించి నలుగురు గాయపడ్డారు.

* నలుగురికి గాయాలు

హైదరాబాద్: రామోజీ ఫిలింసిటీలోని స్క్రాప్ గోదాములో పాత సామాను తొలగిస్తుండగా పేలుడు సంభవించి నలుగురు గాయపడ్డారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఫిలింసిటీ యాజమాన్యం గాయపడ్డ వారిని తప్పించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఫిలింసిటీలో పాత సామాన్లు, ఇనుప చువ్వలను డీసీఎంలోకి ఎక్కించేందుకు కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు.

గోదాములో రాళ్లను పగులగొట్టేందుకు ఉపయోగించే పేలుడు పదార్థం ఉంది. ఇనుపచువ్వలు తగిలి అది పేలింది. దీంతో పనిచేస్తున్న కార్మికులలో నలుగురు గాయాల పాలయ్యారు. ముగ్గురికి ఫిలింసిటీలోనే ప్రథమ చికిత్స చేసినట్లు తెలిసింది.

గండిచెరువుకు చెందిన గుండ్ల యాదయ్య తీవ్రంగా గాయపడటంతో ఆయనను హయత్‌నగర్‌లోని కృష్ణవేణి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. లేబర్ కాంట్రాక్టర్ జంగ య్య మాత్రం డీసీఎంలో జారిపడటం వల్లే యాదయ్య గాయపడ్డాడని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement