Lufthansa
-
నిలిచిపోయిన 830 విమానాలు!
జర్మనీ ఫ్లాగ్షిప్ ఎయిర్‌లైన్ లుఫ్తాన్స దాదాపు 830 దేశీయ, యూరోపియన్ విమానాలను శుక్రవారం నిలిపివేసింది. దీంతో 1,00,000 మంది ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపింది. జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పైలెట్లు చేస్తున్న సమ్మె కారణంగా విమానాలను నిలిపివేస్తున్నట్టు ఎయిర్‌లైన్ ప్రకటించింది. పైలెట్లు సమ్మె నేటికి మూడో రోజుకు చేరుకుంది. వారు సమ్మెకు దిగినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2600 విమానాలను ఆ ఎయిర్‌లైన్ రద్దుచేసింది. పైలెట్లు చేస్తున్న ఈ సమ్మె శనివారం వరకు పొడిగించనున్నట్టు పైలెట్ల యూనియన్ గురువారం ప్రకటించింది. 2014 ఏప్రిల్ నుంచి లుఫ్తాన్సలో ఈ సమ్మె జరగడం 14వ సారి. ప్రతేడాది 3.66 శాతం వేతనాలను పెంచాలని అప్పటినుంచి పైలెట్ల యూనియన్ డిమాండ్ చేస్తోంది. అయితే మేనేజ్మెంట్ కేవలం 2.5 శాతం మాత్రమే ఆఫర్ చేస్తోంది. ఆస్ట్రేలియన్ ఎయిర్‌లైన్సు, స్విస్ రెండు కూడా లుఫ్తాన్సలో భాగం. జర్మనీకి వారి సేవలు విస్తరిస్తున్న క్రమంలో పైలెట్లు ఈ సమ్మెకు దిగారు. అయితే గ్రూప్‌కు చెందిన ఇతర విమానయాన సంస్థలు జర్మన్ వింగ్స్, ఎయిర్ డోలోమిటి, బ్రూసిల్స్ ఎయిర్‌లైన్సు ఈ సమ్మెకు ప్రభావితం కాలేదు. లుఫ్తాన్సలో జరుగుతున్న ఈ సమ్మెతో రోజుకు ఆ గ్రూప్ 10 మిలియన్ యూరోలు(రూ.72కోట్లు) కోల్పోనుందని టాప్ సెల్లింగ్ డైలీ బిల్డ్ రిపోర్టుచేసింది. -
విమానయాన సంస్థకు పైలట్ల సంఘం షాక్
ఫ్రాంక్ ఫర్ట్ : జీతాల పెంపుకోసం ఆందోళనకు దిగిన పైలట్ల సంఘం జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సకి భారీ షాక్ ఇచ్చింది. బుధవారం అర్థరాత్రి నుంచి కాక్ పిట్ యూనియన్ సమ్మెకు దిగనుండడంతో ఫ్లాగ్ షిప్ కారియర్ లుఫ్తాన్సా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేసుకోవాల్సింది. పైలట్ల సమ్మె కారణంగా ఈ నేపథ్యంలో మొత్తం 3,000 షెడ్యూల్ విమానాల్లో 876 సర్వీసులను రద్దు చేశామని లుఫ్తాన్సా తెలిపింది. తద్వారా జర్మనీ అంతటా 100,000 మంది ప్రయాణికులు ప్రభావితం కానున్నారని పేర్కొంది. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వేతన చెల్లింపుల వివాదం నేపథ్యంలో పైలట్ల సమ్మె బుధవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ముందు 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చారు కానీ గురువారం కూడా కొనసాగుతుందని నిన్న ప్రకటించడంతో సంస్థ ముందస్తు చర్యలుదిగింది. 2014 సంవ్సతరం తరువాత పైలట్ల యూనియన్ 14 వ సమ్మె. మరోవైపు క్యాబిన్ క్రూ ఆకస్మిక సమ్మె లుఫ్తాన్సాకు చెందిన తక్కువ ఖరీదు విమానయాన సంస్థ యూరో వింగ్స్ 60 విమానాలు రద్దు దారితీసింది. కాగా సంవత్సరానికి సగటున 3.66 శాతం చొప్పున తమ జీతాలను పెంచాలని పైలట్లు డిమాండ్ చేస్తున్నారు. సంస్థ ఒకవైపు భారీ లాభాలను ఆర్జిస్తున్నా...తమ జీతాలు మాత్రం పెరగలేదని ఆరోపిస్తున్నారు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా తమ కొనుగోలు శక్తిని గణనీయంగా పడిపోయిందని వాదిస్తున్నారు. అయితే 2.5 శాతం పెంపునకు మాత్రమే సంస్థ ప్రతిపాదించింది. కానీ పైలట్ల యూనియన్ దీనికి ససేమిరా అంటోంది. -
చిక్కని కాఫీపై చక్కని ఫొటో
పేరున్న కాఫీ షాపుల్లో కాఫీ ఆర్డర్ చేస్తే దాని నురగపై హృదయాకారంతో పాటు వివిధ రూపాల్లో చిత్రాలను కేవ్ పెయింటింగ్ ద్వారా చిత్రీకరించడం చూస్తుంటాం..కాని సరికొత్తగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో కాఫీ నురగపై ఫొటోలు, పదాలతోపాటు కావలసిన రీతిలో గ్రాఫిక్స్నుకూడా చిత్రీకరించవచ్చు. ఇజ్రాయిల్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ స్టీమ్సీసీ తాజాగా ప్రవేశపెట్టిన రిపిల్ మే కర్ ద్వారా ఇది సాధ్యమవుతోంది. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సంస్థ తన ఫస్ట్‌క్లాస్, బిజినెస్ క్లాస్ ప్రయాణికుల లాంజ్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. -
ఇక కప్పు కాఫీతో సందేశాలు
న్యూయార్క్: మనం ప్రేమిస్తున్నవారికి మొబైల్ ఎస్సెమ్మెస్‌ల ద్వారానో, సామాజిక వెబ్సైట్ల ద్వారానో మాత్రమే సందేశాలు పంపించాల్సిన అవసరం లేదు. కప్పు కాఫీ ద్వారా కూడా మనం కోరుకున్న సందేశాలు పంపించవచ్చు. మన మనసులోని మాటలను కూడా వ్యక్తం చేయవచ్చు. కప్పు కాఫీ నురగపై మనతోసహా మనం కోరుకున్న వారి ఫొటోలను ముద్రించవచ్చు. అది ఎలాగంటారా! అమెరికాకు చెందిన ‘స్టీమ్ సీసీ’ కంపెనీ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ, ఇంక్ జెట్ వ్యవస్థలను అనుసంధానించి ‘రిపిల్ పాడ్స్’ అని సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఫొటోలు, సందేశాలతో కూడి కాఫీని అందించే పరికరాన్ని ‘రిపిల్ మేకర్’ అని పిలుస్తున్నారు. రిపిల్ మేకర్ కలిగిన కాఫీ హోటల్‌కు వెళితే అక్కడ ఫొటోలను, సందేశాలకు ఎంచుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా స్వయంగా మన ఫొటోను, మనతోపాటు వచ్చిన వారి ఫొటోలతో కప్పు కాఫీ తీసుకరమ్మంటే అప్పటికప్పుడు మొబైల్ ద్వారా హోటల్ వెయిటర్ మన ఫొటోలను తీసుకొని రిపిల్ మేకర్‌కు వైఫై టెక్నాలజీ ద్వారా పంపిస్తారు. అంతే...పది సెకడ్లతో కప్పు కాఫీ నురగపై మన ఫొటోలు ముద్రితమై వస్తాయి. కేవలం ఫొటోలే కాకుండా మనమిచ్చే సందేశాలను కూడా కాఫీ నురగపై ముద్రించి మరీ సర్వ్ చేస్తారు. ముఖ్యంగా ప్రేయసీ, ప్రేమికులకు ఈ కాఫీ సందేశం చక్కగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. గరిష్టంగా ఏడు అంగుళాల పొడవు, నాలుగున్నర అంగుళాల వెడల్పుతో ఫొటోలను, సందేశాలను రిపిల్ మేకర్ ప్రింట్ చేస్తోంది. కప్పులు అంతకన్నా చిన్నవైనా రిపిల్ మేకర్ ఫొటోలను వాటికి అనుగుణంగా సర్దుబాటుచేసి కాఫీలను అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తుంది. మనం ఎక్కడున్నా రిపిల్ యాప్ ద్వారా మనకు దగ్గర్లోవున్న కాఫీ షాప్‌కు మనం కోరుకున్న ఫొటోలను, సందేశాలను ముందుగానే పంపించే వెసులుబాటు కూడా ఉంది. వినడానికి విడ్డూరంగ ఉన్న ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతర్జాతీయ బ్రాండ్ ‘లుఫ్తాన్స’ కొనుగోలు చేసిందని స్టీమ్ సీసీ కంపెనీ సీఈవో యొస్సి మెశూలమ్ మీడియాకు తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఫొటోలు కోరుకున్న రంగుల్లో కనిపించవని, కాఫీ రంగులోనే ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం వాణిజ్యపరంగానే అందుబాటులో ఉండే రిపిల్ మేకర్ ధర 60 వేల రూపాయలని ఆయన చెప్పారు. -
భారత్‌లో అంతర్జాతీయ విమానయాన సంస్థల ఆఫర్లు
న్యూఢిల్లీ: భారత ప్రయాణికులను ఆకట్టుకునేందుకు అంతర్జాతీయ విమాన సంస్థలు విమాన చార్జీలపై డిస్కౌంట్లు... కొత్త కొత్త సౌకర్యాలను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా బ్రిటిష్ ఎయిర్వేస్ సంస్థ విమాన చార్జీల్లో 20% డిస్కౌంట్‌ను ప్రకటించింది. దక్షిణ అమెరికాకు వెళ్లే విమానాల్లో బిజినెస్ క్లాస్(క్లబ్ వరల్డ్) టికెట్లపై 20 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్‌కు నేటి నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చని, వచ్చే నెల 31లోపు ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని వివరించింది. ఇక లుఫ్తాన్సా సంస్థ బెంగళూరు-లండన్ మార్గంలో తొలిసారిగా ఈ నెల 22 నుంచి ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను పరి చయం చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను ఫ్రాంక్ఫర్ట్-బెంగళూరు మార్గంలో అంది స్తున్నామని పేర్కొంది. మలేసియా ఎయిర్‌లైన్స్ యెస్ ఆఫర్లు ఇక మలేషియా ఎయిర్‌లైన్స్ సంస్థ ఇయర్ ఎండ్ స్పెషల్ (యెస్) ఆఫర్లను అందిస్తోంది. భారత్ నుంచి మలేషియాకు ఎకానమీ క్లాస్ రాను, పోను చార్జీ రూ.11,860, ఇండోనేసియాకు రూ. 15,890, చైనాకు రూ.20,830, ఆస్ట్రేలియాకు రూ.39,660 అని కంపెనీ పేర్కొంది. వీటికి బుకింగ్స్ గురువారం నుంచే ప్రారంభమయ్యాయని, వచ్చే నెల 2 వరకూ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని వివరించింది.