విమానయాన సంస్థకు పైలట్ల సంఘం షాక్ | Lufthansa Cancels Nearly 900 Flights Over Pilot Strike | Sakshi
Sakshi News home page

విమానయాన సంస్థకు పైలట్ల సంఘం షాక్

Published Wed, Nov 23 2016 12:21 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

విమానయాన సంస్థకు పైలట్ల సంఘం షాక్

విమానయాన సంస్థకు పైలట్ల సంఘం షాక్

 ఫ్రాంక్ ఫర్ట్ : జీతాల పెంపుకోసం ఆందోళనకు దిగిన పైలట్ల సంఘం జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ  లుఫ్తాన్సకి  భారీ షాక్ ఇచ్చింది.   బుధవారం అర్థరాత్రి నుంచి కాక్ పిట్ యూనియన్ సమ్మెకు దిగనుండడంతో  ఫ్లాగ్ షిప్ కారియర్ లుఫ్తాన్సా భారీ సంఖ్యలో  విమానాలను రద్దు చేసుకోవాల్సింది.  పైలట్ల సమ్మె కారణంగా   ఈ  నేపథ్యంలో  మొత్తం 3,000 షెడ్యూల్ విమానాల్లో 876 సర్వీసులను రద్దు చేశామని లుఫ్తాన్సా తెలిపింది.  తద్వారా జర్మనీ అంతటా  100,000 మంది ప్రయాణికులు ప్రభావితం కానున్నారని పేర్కొంది.  

సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వేతన చెల్లింపుల వివాదం నేపథ్యంలో  పైలట్ల సమ్మె బుధవారం  అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది.  ముందు 24 గంటల  సమ్మెకు పిలుపునిచ్చారు కానీ   గురువారం కూడా కొనసాగుతుందని నిన్న ప్రకటించడంతో సంస్థ ముందస్తు చర్యలుదిగింది. 2014 సంవ్సతరం తరువాత  పైలట్ల యూనియన్ 14 వ సమ్మె. మరోవైపు  క్యాబిన్ క్రూ ఆకస్మిక సమ్మె  లుఫ్తాన్సాకు చెందిన  తక్కువ ఖరీదు విమానయాన సంస్థ  యూరో వింగ్స్   60 విమానాలు రద్దు దారితీసింది.
కాగా  సంవత్సరానికి సగటున  3.66 శాతం చొప్పున తమ జీతాలను పెంచాలని పైలట్లు డిమాండ్ చేస్తున్నారు.  సంస్థ ఒకవైపు భారీ లాభాలను ఆర్జిస్తున్నా...తమ జీతాలు మాత్రం పెరగలేదని ఆరోపిస్తున్నారు. అధిక ద్రవ్యోల్బణం  కారణంగా తమ కొనుగోలు శక్తిని గణనీయంగా  పడిపోయిందని వాదిస్తున్నారు.  అయితే 2.5 శాతం పెంపునకు మాత్రమే  సంస్థ ప్రతిపాదించింది. కానీ  పైలట్ల యూనియన్ దీనికి ససేమిరా అంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement