
న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సేవలు పునః ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 23 మంది కరోనా బారినపడ్డారు. లాక్‌డౌన్ కారణంగా అన్ని విమానయాన సర్వీసులు మూసివేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మే 25న అన్ని దేశీయ విమానాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న పలువురు వారి గమ్యస్థానాలకు చేరడానికి తిరుగు పయనమయ్యారు. విమానయాన సేవలు తిరిగి ప్రారంభించిన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ స్థాయిలో కేసులు పెరగడంతో తదుపరి చర్యలు ఏం తీసుకుంటారో అన్న దానిపై చర్చ మొదలైంది. (క్వారంటైన్‌లో 23 లక్షల మంది )
విమానాశ్రయాల్లో పరీక్షల అనంతరం కరోనా సోకినట్లు నిర్థారణ అయిన ప్రయాణికులను వెంటనే క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అంతేకాకుండా వారితో ప్రయాణించిన మిగతా ప్రయాణికులు, సిబ్బందిని కూడా ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్‌లో ఉంచారు. లాక్‌డౌన్ 4.0లో భారీ సడలింపులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనిలో భాగంగానే దీశీయ విమాన కార్యకలాపాలు సాగించడానికి అనుమతిచ్చింది. దీంతో దాదాపు రెండు నెలల అనంతరం దేశీయ విమానయాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. భౌతికదూరం పాటించడం, ఫేస్ మాస్క్, శానిటైజేషన్, ప్రయాణికులు రెండు గంటల ముందే విమానాశ్రయానికి చేరుకోవాలి అన్న నిబంధనలు విధిస్తూ విధించింది. అయినప్పటికీ కేవలం నాలుగు రోజుల్లోనే 23 మంది కరోనా బారిన పడ్డారు. ఇంకో ఇంకో ఆందోళనకర విషయం ఏంటంటే..వీరిలో ఎక్కువమంది ఇండిగో విమానంలోనే ప్రయాణించారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా పేరున్న ఇండిగోలో అత్యధిక కరోనా బాధితులు ఉండటం గమనార్హం. (హైదరాబాద్ సహా 13 నగరాలపై సమీక్ష )
Comments
Please login to add a commentAdd a comment