
ఎయిర్ ఇండియాలో శాకాహార భోజనం
న్యూఢిల్లీ : అంతర్జాతీయ విమాన సంస్థ తమ ప్రయాణికులకు ఇక నుంచి శాకాహార భోజనాన్ని మాత్రమే అందించనుంది. కొత్త సంవత్సరం నుంచి ప్రయాణికులకు వెజ్టేరియన్ ఫుడ్ అందించేందుకు ఎయిరిండియా సిద్ధమైంది. ఈ మేరకు విమానయాన జనరల్ మేనేజర్ ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది.
కాగా విమాన ప్రయాణం నిడివి 60 నిమిషాలకు మించినప్పుడు మాత్రమే అహారం వడ్డించనున్నారు. తక్కువ నిడివి గల ప్రయాణాల్లో సర్వ్ చేయడానికి సమయం సరిపోనందున వారికి వెజిటబుల్ రిఫ్రెష్మెంట్లను ఇవ్వనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. బ్రేక్ ఫాస్ట్తో మొదలుకొని డిన్నర్ వరకు ఉదయం 5.30 నుండి రాత్రి 11.30 వరకు ఐదు కేటగిరీలలో ఎయిర్ ఇండియా తన మెనూను అమలు చేస్తోంది. కాగా ఎయిర్ ఇండియా నిర్ణయం నాన్ వెజ్ ప్రియులకు మాత్రం చేదు కబురే.